Pages

Monday, March 30, 2009

నన్నెందుకు వదిలావు

నన్నెందుకు వదిలావు?
మధ్యాన్నం మూడయింది
కళ్లు,వేళ్ళు ఫోన్ మీదకి వెళ్ళాయి
మళ్ళీ గుర్తొచ్చింది
ఊళ్ళో నువ్వు లేవని
ఊహోచ్చినప్పుడల్లా
నీతో చెప్పడం
ఊపు వచ్చినపుడల్లా
నీదగ్గరికి రావడం
మప్పిన మనసుకు
మాన్పడం కష్టం గా వుంది
మనిద్దరం కలిసి
తెగ తిరుగుతాం
మధ్యలో నిన్నెవరో
లాక్కుపోతారు
అప్పుడు నీకళ్ళల్లో
కనిపించే బేలతనం
అర్ధం చెపుతుంది
మన అమర స్నేహానికి
దూరమవుతూ దగ్గరవుతూ
ఏటిలోని కలప ముక్కల్లా
ఎన్నాళ్ళో జరుగుతున్నా
ఎందు ఆశ చిగురిస్తుంటుంది
ఇన్ని పనులున్నా ఏపనీ
చేయ్యలనిపించాడు
నన్నెందుకు వదిలావని
నువ్వెందుకు వెళ్ళావని
మనసులో ఒక ప్రశ్న
మల్లి మల్లి పలకరిస్తుంది
నన్ను నువ్వు కష్ట పెట్టాలా
నిన్ను నేను కష్ట పెట్టాను
కష్టాలకు "ఇష్టం"లో తిష్ట
వేసే "దమ్ము"లేదు
సైరన్ లా ఒకూత కూసి
చల్లగా జారుకొంతాయ్
వాన వెలిసిన ఆకాశం లా
నీ మనసు,నామనసు
అన్నం తిన్నావా?దగ్గుతున్నావెం
కల్లెర్రబద్దాయ్nidra pOlEdaa ?
మొహం వేలాదేశావెం?
ఎవరేం కూసారు?
అని నువ్వు తప్ప
పట్టించుకొనే వాళ్ళెవరు?

moham vELLaaDEshaa

Monday, March 16, 2009

తాంబూల చర్వణం

తాంబూలం
తాంబూల చర్వణం ఆరోగ్యానికి మంచిది.జాజికాయ,జాపత్రి,లవంగం,ఏలకులు,కాసు,ఒకింత కలకండ
గుల్లసున్నం,వక్కపొడి తగుమాత్రంగా వేసుకొని తాంబూలం సేవించాలి.తమలపాకులు నీటితో కడిగి ,తుడిచి వాటికోసలు తుంచి, కాడలు తుంచి ,ఆకుని వెనకకు మడిచి మధ్యనున్న ఈనె తీసి అప్పుడు ఆకులకి సున్నం రాసి తాంబూలం సేవించాలి.
ఈపద్యం చూడండి-
పత్ర మూలంబునను రోగపటలమున్డు
అగ్రమది పాపములకెల్ల అతి ప్రియమ్బు
నడిమి ఈనియి బుద్ది వినాశ కరము
వీని వర్జించి తగచేయు వీడియంబు

పాటలు

ఉగాది
మధుమాసం ఎదురొస్తే
ఏకోకిల పాడకుండు
ఆకాశం చెమరిస్తే
ఏమయూరి ఆడకుండు
మరుమల్లియ కవ్విస్తే
ఏ మధుపము వూరకుండు
అరుణ బాల హసియిస్తే
ఎకుక్కుటి కూయకుండు
చిరుగాలి చిటికేస్తే
ఏ పరువము దాగియుండు
సెలయేరు శ్రుతి చేస్తే
ఏశిల ఎద కదలకుండు
కొమ్మ పండు చూపిస్తే
ఏపక్షి మెదలకుండు
శశి వెన్నెల కురిపిస్తే
ఏచకోరి ఎగరకుండు
ఈపాటల రచయితలపేర్లునాకు తెలియవు.వారికి ధన్యవాదాలతో

పాటలు

యశోధర
లేపనైనా లేపలేదే!మోము
చూపనైనా చూపలేదే !
కోపకారణమేమో ఏపాప మెరుగనే
హృదయ తల్పము పైన
సొదమరచి హాయిగా
నిదురదోగేనన్ను
మబ్బు కన్నెల కింత
ఉబ్బు తబ్బిబ్బేలో
ఆకాశామునకింత
ఆనందమెందుకో
మాధవీ లతకింక
మట్టి కౌగిలిఏనా!
మాపతింతల నింట
దీపమిక వెలిగేనా!
ద్వారమా!నాధుడేదారి పోయెనో
కన్ని బాబా నీకు కలనైన రాలేదా
కైక,యశోధర,ఊర్మిళ ఉపేక్షిత నాయికలు. హిందీ కవిశ్రీ మైథిలీ శరణ్ గుప్త తమ కావ్యాలలో వీరు ముగ్గురిని వెలుగులోకి తెచ్చారు.యశోధర కావ్యంలో యశోధర పాత్ర రమ్యమ్గా దీనంగా వుంటుంది.బుద్ధుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన బాధ కంటే ,చెప్పకుండా వెళ్ళిపోయినందుకు యశోధర కృంగిపోతుంది.

Sunday, March 8, 2009

భూదేవి స్తుతి

భూదేవి స్తుతి
విష్ణు శక్తి సముత్పన్నే శాఖా వర్ణ మహీతలే
అనేకరత్న సంభూతే!భూమిదేవి నమోస్తుతే!
తులసీస్తుతి
మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే
అగ్రత్ శ్శివ రూపాయ వృక్ష రాజాయతే నమః
జ్యోతి స్తుతి
శుభం భవతు కళ్యాణీ ఆరోగ్యం ధన సంపదం
మమ శత్రు వినాశాయ సాయం జ్య్తోతి నమోస్తుతే!
ధన్వంతరి స్తుతి
ధన్వంతరం గరుత్వంతం ఫణిరాజన్చ కౌస్తుభం
అచ్యుతం చామృతం చంద్రం స్మరేద్ ఔషద కర్మణే
చంద్రస్తుతి
క్షీర సాగర సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర
హిరణ్య మకుతాన్ భాస్వతే బాలచంద్ర నమోస్తుతే
సూర్య స్తుతి
ఉదయే బ్రహ్మ రూపశ్చ మధ్యాన్నేతు మహేశ్వరః
అష్ట కాలే స్వయం విష్ణు త్రిమూర్తిశ్చ దివాకరః

పుష్కరం

పుష్కరం
పోషతీయతి పుష్కరం -జలానికి పుష్కరమని పేరు.జలం మనిషిని పోషిస్తుంది. తున్దిలుడనే ధర్మాత్మునికి పుష్కరుడనే పేరు వచ్చింది. ఇతడు ఈశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేసి ,""ఈశ్వరా! నేను నిన్నెప్పుడూ వదలకుండా వుండేటట్టు" వరమడిగాడు.శివుని ఎనిమిది రూపాలలో జలం కూడా ఒక రూపం ఇతనికి జల రూపం ఇచ్చి మూడున్నర కోట్ల పుణ్య తీర్ధాలకు అధికారిగా,జలరాజుగా వరమిచ్చాడు. బ్రహ్మ సృష్టి చేసే టప్పుడు నీరు కావాల్సి పుష్కరున్ని తన కమండలంలో నిలిచేలా వరం పొందాడు.బృహస్పతి బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ పుష్కరున్ని పంపమని బ్రహ్మను అడిగాడు.పుష్కరుడికి అది ఇష్టం లేక బ్రహ్మను కూడా రమ్మన్నాడు.బృహస్పతి పన్నెండు రోజులు ,సంవత్సరం లో అన్ని రోజులలో మధ్యాన్న సమయంలో రెండు ముహూర్తాలకాలం పుష్కరుడు బృహస్పతితో వుండాలని ఆసమయాలలో తానూ సమస్త దేవతలతో బృహస్పతి వున్నా రాశి కి అధిష్టానమైన పుణ్య నదికి వస్తూన్తానని ఒప్పించాడు.పుష్కరంలో నదీజలాలు పవిత్రము లై దర్శన ,స్పర్శన,స్నాన,పాన మాత్రమున పంచ మహా పాఠక ,ఉప పాతకముల పో గొట్టు కొనడానికి లేక శారీరిక,మానసిక,కఫా,వాత,పైత్య,శ్లేష్మాది ప్రారబ్ధ జన్య వ్యాధులను కూడా నిర్మూలనం చేస్తాయి.
కృత యుగంలో రాదా కృష్ణులు ఒకసారి ప్రణయ కోపావేశం లో గంగాది పుణ్య నదుల పేర్లతో వున్నా గోపికలను శపించి భూలోకంలో పుట్టండి అన్నారట.వాళ్లు దీనంగా ప్రార్ధిస్తే మనుష్య లోకంలో భారత ఖండం లో మీరు మీపెర్లతో పుష్కర మహానదులై అందరిని ఉద్ధరించమని ఆశీర్వదించారు. పుష్కర నదులు పన్నెండు.
గంగ
నర్మదా
సరస్వతి
యమునా
గోదావరి
కృష్ణవేణి
కావేరి
భీమరథి
పుష్కర వాహిని
తుంగ భద్ర
సింధునది
ప్రణీత
గోదావరిని దక్షిణ గంగ అంటారు. సీతారాములు ఈ నదీ తీరంలో పంచ వాటిలో నివసించారు. లక్ష్మణుడు సూర్ఫణఖ ముక్కు, చెవులు ఇక్కడే కోసాడు.అదే నాసికా తీర్ధం అయింది.దశరథుని మరణ వార్తా విన్న రాముడు ఈ నదిలోనే స్నానం చేసాడు. ఆత్మీయుల మరణ వార్త విన్న తరువాత స్నానం చేయడం హిందువుల ఆచారం. గొహత్యా నివారణ చేయమని గౌతముడు శివుణ్ణి ప్రార్ధిస్తే శివుడు జట నొకదానిని తెచ్చి పిండగా ఆజాలం చేత గోవు జీవిస్తుంది. అందు చేత అది గౌతమ అయింది.నిస్సంతువులు స్నానం చేస్తే సంతాన వతులవుతారు .కుష్టు,రక్త పోటు ,అజీర్ణ వ్యాధులు పోతాయి.అరణ్య వాస సమయంలో ధర్మ రాజు కూడా గోదావరిని సేవించాడట.
గోదావరిని నాసికకు ఇరవై మైళ్ళ దూరంలో త్రయమ్బక గ్రామానికి చేరువగా వున్న బ్రహ్మ గిరిలో గోముఖంలోంచి ఉదయించింది. ఇదిమనకొక గొప్ప నది.పశ్చిమ సముద్ర తీరానికి యాభై మైళ్ళ దూరం లో పుట్టిన తూర్పుగా తొమ్మిది వందల మైళ్ళు ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తుంది.గౌతమీగంగ అంటారు దీన్ని.జ్యోతిర్లిన్గామయిన త్రయంబకం రాజమండ్రి ,దాక్షారామం,భద్రాచలందీని ఒడ్డున వున్నాయి. ఇది సముద్రం లో కలిసేముందు ఏడు పాయలుగా చీలుతుంది. ఈపాయలకి సప్త ఋషుల పేర్లు పెట్టారు. సాతవాహన రాజ దాని ప్రతిష్టాన పురందీనిఒడ్డునే వుంది. రామదాసు నమ్మిన దైవం శ్రీరాముడు భద్రుడి కోరికపై స్వయంగా వెలిసాడు.ఇక్కడ సంవస్తరానికి ఒకసారి శ్రీరామనవమికి కల్యాణం జరుగుతుంది.
పుష్కర స్నాన మహిమ
జన్మ ప్రభృతి యత్సావం స్త్రియా వా పురుశేణవా
పుష్కరే స్నాన మాత్రస్య సర్వ మేవ ప్రణస్యతి
ఎందఱో మహా భక్తులు కొండల పైనా నదీ తీరాలలో గొప్ప గొప్ప తపస్సులు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది ఆరూపం లోనే భగవంతుణ్ణి అక్కడే స్థిర పాడమని ప్రార్ధించేవాళ్ళు .కనుక పుణ్య క్షేత్రాలు నదుల ఒడ్డున వెలిశాయి. నదులు కొండలనుండి అరణ్యాల నుండి ప్రవహిస్తాయి. అచ్చట ఔషధాలు వాటితో కలసి వచ్చి అందులో స్నానం చేసిన వారి దేహాలను పవిత్రం చేస్తాయి. నది అంటే శబ్దిన్చునది అని అర్ధం .
అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మ రాజునకు పుణ్య తీర్దాల విశేషాలు వివరిస్తూ -కనఖలనమునాను,గంగా ద్వారమునను,కుశావర్త మున్ను, బిల్వకమున సుస్నాతుడైన నరుడు పాపములు తొలగి స్వర్గ లోక విహారము కావించును అని చెప్పాడు.
గోదావరిని నన్నయ భట్టు దక్షినగంగా అని ప్రశంసించెను. సామాజికంగాయిక మత్యానికి పునాది.కన్యాకుమారిలో వున్న భారతీయుడు దక్షిణ భారతంలో వున్న గోదావరి,కృష్ణా, కావేరి మొదలగు మహా నదుల్లో స్నానం చేసి ,రామేశ్వరం లో సేతు స్నానం చెయ్యడం అలవాటు. ఇలాటి తీర్ధ యాత్రల మధ్యలో ఎన్నో పుణ్య క్షేత్రాలను ,దివ్య స్థలాలను,పీఠాలను ,మఠాలను ,మహా పురుషులనుసందర్శించి సాంస్కృతికంగా,ఆధ్యాత్మికంగా వైజ్ఞానికం గా మాత్రమేకాక దార్మికంగా నూతన చైతన్యాన్ని సంపాదిన్చుకొంతున్నారు.తీర్ధ స్నానం చేస్తే ఉన్మాదం,మనోవ్యాధి తగ్గుతాయి. నిస్సంతులకు సంతుకలుగుతుంది.దైవం,గురువు,వైద్యడు తీర్ధం మొదలైన వాటి విషయంలో మన భావన ఏప్రమాణమ్ లో వుంటుందో సిద్ది ఆప్రామాణమ్లోనే వుంటుందంటారు.భారతీయులు చాలామంది తీర్దాడులలో దైవత్వాన్ని దర్శించి సేవిస్తూ వుంటారు.వారి వారి ప్రమానాన్ననుసరిమ్చి ఫలితాలను పొందుతూ వుంటారు.తీర్ధ స్థలాలలో దాన ధర్మాలు చేస్తేపున్యం అని చేస్తూ వుంటారు.ఆకలితో వున్నవారికి ,అంగ వైకల్యులకు ,దీన జనావళికి ఇంట భుక్తి లభిస్తుంది.
రాముడు,బాల రాముడు,ధర్మ రాజు, అర్జునుడు కూడా విస్తృతంగా తీర్ధ యాత్రలు చేసారనిభారతంలో వుంది.

గేయం

నవ యుగం
అన్యాయం-అక్రమం
హింస-విధ్వంస
జుట్టు విరియ బోసుకు నట్టిన్టో
పిశాచాల్లా పిచ్చి గంతులు వేస్తున్నాయి
ధర్మం, శాంతి, సత్యమ, సమత
మూల మూలలకు నక్కి
ఎలా తప్పుకు పోదామా అని
ఎద పట్టుకు విలపిస్తున్నాయి
మానవుడు గృహ ప్రవేశం చేసాడు
పిశాచాల పిచ్చి గొంతుకలకు
గొంతుకలిపి, కాల్లుకదిపి
మమేకమై ఆడుతున్నాడు
వంట పాడుతున్నాడు
చిన్తలేదతనికి
శాంతి,సమతా ఏమయ్యారని
తండ్రి చేయి పట్టుకొన్న
వంశాంకురము మొలక వాడికి
కనిపించారు ధర్మం, శాంతి
మన సంస్కృతికి మూల విరాట్టులు
తండ్రికంటే వీళ్ళే నయమని
వాళ్ల చేయి పట్టుకొని వేగంగా నడిచాడు

నవ్వుల భోషాణం

పొగాకు స్తుతి
క. మీరుం పొగ త్రాగుదురా
వారిజ భవ :వామదేవ: వైకుంఠ :హరీ:
ఓరీ:నారద:వినురా
ఈ రేడు జగంబులకును నిది ముఖ్యమురా:
భుగ భుగ మని పొగ లెగయగ
నగణితముగ నాజ్య ధార లాహుతిగాగా
నిగమాది మంత్ర యుతముగ
పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్.
పొగ క్రోవికి సతి మోవికి
అగణితముగ నూరబావి కమృతంబునకున్
దగ నుచ్చిష్టత లేదని
ఖగ వాహను తోడ కాల కంతుడు పల్కెన్.
రచయిత పేరు తెలియదు

Saturday, March 7, 2009

రత్న మాణిక్యాలు

డా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు
కొందరు వ్యక్తుల గురించి తలచుకొంటే నమస్కరించ బుద్ది వేస్తుంది.
వారిని చూస్తె వారిముఖం లోని తేజస్సుకు తలవంచ బుద్ది వేస్తుంది.వారు
మాట్లాడినప్పుడు మేధాశక్తి శెభాష్ అనిపిస్తుంది.అటువంటి వారిలో సర్వేపల్లి రాదా కృష్ణ గారొకరు. భారత మాట కీర్తి కాంతులను దేశ దేశాలలో
ప్రసరింపచేసిన ప్రజ్ఞా వంతులువారు. రాదా కృష్ణ గారి రచనలు రవీంద్రనాథ్ ఠాగోర్ తత్వ విచారం, సమకాలినతత్వ విచారంలోమత ధర్మ ప్రాబల్యం ,భారత తత్వ శాస్త్రమ్,హిందూ జీవిత దృక్పధం, మనకు కావలసిన మత ధర్మం, కల్కి-లేక భావి నాగరికత,ఆదర్శ వాది జీవితదృక్పధం ,మత ధర్మంలో ప్రాక్పశ్చిమాలు ,హిందూస్తాన్ హృదయం,నా సత్యాన్వేషణ ప్రాచ్య మత ధర్మాలుపాశ్చాత్య తత్వ విచారం,మహాత్మా గాంధి,విద్య-రాజకీయాలు,యుద్ధం,ఇండియా చైనా,ఇదేనాశాంతి, మత ధర్మం సమాజం,భగవద్గితభారత, మహామహులు , దమ్మ పదం, ముఖ్య మైనఉపనిషత్తులు, ఆస్తిక్య పునరుజ్జీవనం ,ప్రాతీ ప్రతీచులు, బ్రహ్మ సూత్రాలు, కొన్ని ప్రసంగాలు,రచనలు.
వీరికి డి. లిట్.ప్రసాదించిన యూనివెర్సిటీలు, ఆగ్రా,అలహాబాద్,ఆంధ్రా,అన్నామలై, లక్నో,పాట్నా, సాగర్,తిరుపతి, విశ్వ భారతి, క్రేంబ్రిడ్జి యూనివెర్సిటీలు.
ఎల్.ఎల్.డి .బెనారస్,జబల్పూర్,మద్రాస్,మైసూర్,అండీస్ ,బ్రేస్సేల్స్, బుడాపెశ్ట్ బ్యూనో, ఐరిష్, సిలోన్,కొలంబియా,హవాయ్, మేవారాద్, లండన్, మెయింజ్ ,మేక్జిల్,మెక్సికో, ఒబర్లిన్ ,ఫ్రాన్స్, సోఫియా, వార్సా,ఉట్రే.
డి.ఎల్. కలకత్తా,డి.ఎస్.సి. రూర్కీ ,డి.సి.ఎల్ ఆక్స్ ఫర్డ్ .
ఇతర బిరుదావళి
విద్యా చక్రవర్తి,ఫెల్లో ఆఫ్ బ్రిటీష్ అకాడెమీ,ఆనరరీ ఫెల్లో ఆఫ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ రుమేనియా,మంగోలియా ఆనరరీ ప్రొఫెసర్, మాస్కో యూనివెర్సిటీ ప్రొఫెసర్ ఏమిరతాస్ ,ఆక్స్ ఫర్డ్ ఆనరరీ ప్రొఫెసర్ ఆఫ్ ఆల్ సోల్స్ కాలేజ్ ఆక్స్ఫర్డ్,సర్వాగమ సార్వ భౌమ కలకత్తా సంస్కృత కళాశాల ,గొత్ ప్లేగ్ మాస్టర్ ఆఫ్ విజడం,భారత భూశామని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇందోలజీ,ద్వారక మొదలైనవి.
సర్వేపల్లి రాదా కృష్ణ గారు తమిళ నాడులోని తిరుత్తని లో జన్మించారు. ఆయన తన ఇరవై మూడవ ఏట మద్రాసులో వేదాంత శాఖ లో
అసిస్టెంట్ గా శాఖ లో ప్రొఫెసర్ గా వున్నారు.తత్వ వేత్తగా రాదా కృష్ణ తొలిసారి పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు.ఆయన అక్కడ మన మతం గుఱించి cheputoo
"ఇతర మతాలకు బుద్ది వాదం తో ఏర్పడిన విశ్వాశాలకు పరిమితి అన్తూవుంది.హిందూమతం అలాటి పరిమితులను విధించక పోవడం దాని ప్రత్యేకత.బుద్ధికంటే సహజ జ్ఞానానికి ,గతాకుగాతిక మైన సిద్ధాంతం కంటే అనుభవానికి,బాహ్య జ్ఞానానికంటే ఆత్మా జ్ఞానానికి ,హిందూ మతం ప్రాధాన్య మిచ్చింది.మత గ్రంధాలలో ధర్మ సూత్రాలను,విశ్వాశాలను ఆమోదిన్చడమేమతమనిపిన్చుకోదు.ఏవో కొన్ని సాంప్రదాయక మైన కర్మలనుఆచరిన్చినన్త మాత్రమున మతమని భావించరాదు.మతమంటే అదొక అనుభవం.జీవిత వుధానం,మతమనేదిదర్శనం అనుభవం కూడా.
తన దృక్పధానికి చెందని ఇతరుల అభిప్రాయాలువిశ్వాశాలుకూడా సత్య మైన వాణి తత్వజ్ను డైన హిందువు అంగీకరిస్తాడు. అన్నిమతాలు ఒకే లక్ష్యాన్ని చేరుకోవడానికి విభిన్న మార్గాలలో పయనించడం ఉత్తమమని హిందువైన వాడు విశ్వసిస్తాడు.విభిన్నమతాల మధ్య సమైక్యతాసాధనకి దే మార్గమని హిందూ మతం విశ్వసిస్తున్నది.అంతేకాని అన్నిమతాలను కలిపి వేసి ఒకేమార్గంలో ,పద్ధతిలో నడపాలనిహిందూమతం చెప్పాడు."అన్నారాయన.
"విద్వాన్ సర్వత్రా పూజ్యతే"
రాజకీయ నాయకుడుగా గానీ ,సేనాపతి కానీ కాకుండానే అత్యున్నత పదవికి తన దేశీయుల చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ గౌరవం చరిత్రలో ఒకేఒక వ్యక్తికి దక్కింది.ఆ అపూర్వ గౌరవ పాత్రు డైన మహా వ్యక్తీ డా.సర్వేపల్లి రాదా కృష్ణ గారు.తత్వ వేత్తగా,విద్యా వేత్తగా,డా. రాధాకృష్ణ యువతరం వారికి నైతిక,ఆధ్యాత్మిక మూల మర్యాదలు బోధించడంలోనే తమబ్ జీవితం గడిపారు.అందుకనే అద్వితీయమైన గురుస్థానం ఆయనకీ దక్కింది.భారత జాతికే ఆచార్యు డైనాడు.ఆయన గ్రంధాలు భవిష్యత్తుకు బాటచూపే కరదీపికలు.

Thursday, March 5, 2009

తిరణాలు

మనదేశం లోనే వున్నా ఉద్యోగాలకోసం దూరం పోయాక పండగలకి సంబరాలకి దూరం అయిపోతాము.

చాలా ఏళ్ళక్రితం మా పెద్దబ్బాయి చిన్నబ్బాయిగా వుండేటప్పుడు మా తాతమ్మ తో కలిసి తిరణాలకు వెళ్ళాము.నులక మంచాల మీద బెల్లపు కొమ్ములు, బెల్లపు బూందీ ,జీడీలు అమ్మితే .కొనుక్కుని తిన్నాము. పిల్లలు ఆదుకొనే డమడమాలబండీ లుండేవి ,వాటికి ఒక డ్రమ్ము కట్టివుండేది. బండి లాక్కువెడుతూంటే దానిమీద రెండు పుల్లలు డమ డమ శబ్దం చేసేవి. పిల్లలకి ఆశబ్దం సరదాగా వుండి ఆబండి లాక్కుంటూ ఆడుకొనే వాళ్ళు.బండికి తాడు కట్టాలి.అక్కడ తాడు దొరక లేదు మా అబ్బాయి గొడవ చేసాడు .తరవాత బ్రహ్మాస్త్రం ఏడుపు మొదలేట్టాడు.తాతమ్మ తొమ్మిది గజాల తెల్ల వాయిల్ కట్టుకొనేది,చెట్టు చాటుకు వెళ్ళి చీర వదులుచేసి కొంగు పెద్దగా లాగి బండికి కట్టింది,ఆకొంగుతొ బండి కొంచెం దూరం నడిచింది. తాతమ్మ వుపాయంతో మావాడి మొఖం వికసించింది.గాజులు పూలు కొనుక్కొని ఎద్దుబండి మీద ఇంటికి చేరాము.

మొన్న శివ రాత్రికి నూజివీడులో వున్నా.అందరూఒకఘంట దూర ప్రయాణం లొ వున్న శివాలయం దర్సించడానికి,తిరణాలకి బయలు దేరారు.వారి ఆస్థాన ఆటో లోఎక్కి ఎనిమిదిమంది మంది వెళ్ళాము.అది సెవెన్ సీటరులెండి.ఇక్కడె ఇక్కడే అంటూ ఘంటన్నరకి చెర్చాడు.గుడికి రెండు మైళ్ళ దూరంలోదూరంలోఆటో ఆపేసారు.అసలు గుడికి వెళ్ళాలంటే ప్రొద్దున్నే వెడితే ప్రశాంతం గా వుంటుంది.మావాళ్ళన్నారు,ఇది చాలా పురాతనమైన శివుని గుడి,ఎక్కడెక్కడినుంచో భక్తులు అర్ధ రాత్రికే వచ్చి చేర్తారు,మధ్యాన్నానికి వాళ్ళంతా వెనక్కి బయలుదేరతారు, మనం మధ్యాన్నం బయలు దేరి వెడితే గుడి ఖాళీగా వుంటుంది,హాయిగా చూడొచ్చు అన్నారు, ఒంటిగంటన్నరకి బయలుదేరాము.ఎండ బాగావుండి.ఆటొ దిగాము.అక్కడినుంచి గుడిదాకా ఉచిత బస్సులు నడుస్తున్నాయి.అందులో ఎక్కాలంటే రెండేళ్ళన్నా కరాటే నేర్చుకోవాలి. నేర్చుకొని ఎక్కినా సీటులేదు.పాటక జనం ఎక్కువగా వున్నారు.నడుద్దామంటె వాహనాల మధ్య ధైర్యంచాలలేదు. మావాళ్ళలో,కాలు ఫ్రాక్చరు అయి తగ్గినవాళ్ళు,లో బీ.పి వున్నవాళ్ళు వున్నారు.""పెద్దవాళ్ళూ నడవలేనివాళ్ళు వున్నారు,ఆటొ గుడిదగ్గర దిగి వెంటనే వెనక్కి పంపేస్తాము అని వాలంటీర్లను బ్రతిమాలాము,వాళ్ళు ససేమిరా ఒప్పుకొనలేదు.భక్తులారా రండి,చక్కని సదుపాయములు,వుచిత బస్సు సర్వీసు అన్నివున్నాయి అని అడుగడుగునా పోస్టర్లు పెట్టారు.ఇక వెనక్కి వెళ్ళిపోవాల్సిందేనా?అనుకొన్నాము.



ఒక పోలీసాయన మా విషణ్ణ వదనాలను చూసివెనక దారినవెళ్ళి గుడికి అరకిలో మీటరు దూరంలో బడ్డికొట్టు దగ్గర మమ్మల్ని దింపి వెంటనె వెనక్కి ఆటో పంపండి అని అనుమతి ఇచ్చాడు.గుడిదగ్గర రష్ ఎలావుందండి అంటే బాగా వుందమ్మా!అక్కడ నుంచి లోపలికి వెళ్ళడం మీవంతే అన్నాడు.కనీసం గుడి గోపురమైనా దర్శించుకు వద్దాము అని వెళ్ళాము.సెల్ ఫొన్లు ఇలాటి సమయాల్లొ దేవతలే! మానెంబరు అతనికి చెప్పి,అతని నెంబరు మేము తీసుకొని అతన్ని వెనక్కి పంపాము.ఎక్కడికక్కడ కంబారుతాళ్ళతో కట్టీ క్యూలు ఏర్పాటు చేసారు, అన్ని నిండుగా వున్నాయి.బయట పెద్ద మైదానమే వుంది.ఒక దారి డొంకా ఏమిలేవు.దైవ దర్శనం చేసుకొని వచ్చినవాళ్ళు అక్కడ బైఠాయించి తినడం,తాగడం ఖాళి గ్లాసులు కాగితాలు పక్కనే పడేస్తున్నారు. అన్నాలుతిని కూచున్న చోటే పళ్ళాలుకడిగి తుక్కు నీళ్ళూ పారబోస్తున్నారు.క్యూ లో నిలబడి వెళ్ళడం న్యాయమే! కానీ అందులోనిలబడి వెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయి పొతుంది. సాయంత్రం కుర్రకారు అంతా వస్తారు, ట్రాఫిక్ పెరిగి పోతుంది,ఎట్టి పరిస్థితిలోనూ నాలుగయ్యెసరికి మీరు ఆటో ఎక్కాలి అని ఇంటి దగ్గర మామయ్య వార్నింగ్ ఇచ్చాడు. అక్కడవాళ్ళకి వుపాయము, ధైర్యము ఎక్కువే!


ఎలాగోలా క్యూలో దూరిపోతున్నారు. ఒకసారి అక్రమ మార్గంలో రెండు బాచిలు దూరిపోయాయి.అప్పుడు మేము కాస్త గొంతు పెంచి పోలీసాయనతో వాళ్ళు వెళ్ళారుగా,మమ్మల్ని వెళ్ళనీయండీన్నాము, ఏమనుకొన్నాడొ వదిలాడు.వెళ్ళీ దైవ దర్శనం చేసుకొన్నాము.శివరాత్రి వుపవాసం సఫలమైంది.బయటికి వచ్చాము, పదండి ఇంటికి పోదాము అంటే మాతో వచ్చిన కుర్ర పిల్లలు"ఒక్కరౌండ్ తిరిగి ఒక్కలుక్కు వేసివస్తాము,రాలేనివాళ్ళు ఆనీలం గట్టు దగ్గర కూర్చోండి అని గుంపులో అంతర్ధానమయారు.నాతో వున్న వాళ్ళు అక్కడ నేల పై చతికిల బడ్డారు,పక్కన సాంబారు నేలమీద పారుతోంది.ప్లాస్టిక్ గ్లాసులు కుప్పలు పడేసారు. తిండి తిన్న ఆకులు ఎగురుతున్నాయి.ఇంతలో పదిమంది చీపుళ్ళూ పట్టుకు వచ్చారు,వూడ్పు మొదలెట్టేసరికి దుమ్ము తుఫానులా లేచింది,కళ్ళుముక్కు ఏకమయాయి,ఊపిరి అందలేదు. ఒకరికి నీరసం వచ్చింది. మంచినీళ్ళ సీసాలు కుర్రకారు మోస్తున్నారు.ఐస్ క్రీం ఇప్పిద్దామని బండీవాణ్ణి పిలిస్తే బారెడు దూరం పోయి "రండమ్మా!" అన్నాడు. అయుదు రూపాయలకి ఉసిరికాయంత ఐస్ గడ్డ కప్పులొ పెట్టి ఇచ్చాడు. అదితెచ్చి ఆవిడ నోరుతడిపితే కళ్ళు తెరిచింది.పక్కస్టాలులొ ఒక కుర్చిచూసి కూర్చోపెట్టాము. గంట సేపటికి వాళ్ళంతా వూసురోమంటూవచ్చి కొనుక్కొడానికి ఏమీ లేవని ఒక పర్సు , ఒక కత్తి కొనుక్కొచ్చారు. ఆటో వానికి ఫోన్ చేసి ,ఆనీరసం వచ్చినావిణ్ణి చెరోరెక్కాపుచ్చుకొని బడ్డికొట్టు దాకతెచ్చెసరికి ఆటో వచ్చింది, అందులో స్థిరపడ్డాము.


వెళ్ళేవారికి వెళ్ళెతొందర, వచ్చేవారికి వచ్చేతొందర.మోటారు సైకిళ్ళపై రయ్యిమని పోతున్నారు,బస్సులు, ఆటోలయితే చెప్పక్కర్లా,వున్నవాళ్ళని దింపి మళ్ళివస్తామని అక్కడ జనాల్ని కూర్చోపెట్టారులావుంది, ఆఘమేఘాల మీద నడుపుతున్నారు. కొంత దూరం వచ్చాము,బళ్ళన్నీ ఆగిపోయాయి. దిగి చూస్తే ముస్సలి అమ్మాయి రోడ్డు నడిమధ్యలో నెత్తుటి మడుగులో వుంది,ఒకరు పట్టుకు కూర్చున్నారు,ఆటో ముళ్ళపొదలో పడిపొయివుంది.కళ్ళవెంట నీళ్ళూవచ్చాయి."శివరాత్రి నాడు పోయింది,ముక్తి పొందింది అంటున్నారు జనం. ఈవిషాదం మోసుకొని ఇంటికి బయలుదేరాము.తిరణాలు సంవత్సరానికి ఒక్కసారి చేస్తారట. ఆరోజే డబ్బు చేసుకోవాలని అందరికి ఆరాటం. ఉత్తిరోజులలో గుడి కి సందడె వుండదుట. ఈ ఆత్రం ప్రమాదాలకి దారి తీసింది.ఇటువంటి చోట బందోబస్తు జాగ్రత్తలు ఎక్కువతీసుకొంటె మంచిది.