Tuesday, May 26, 2009
పని చేయడం ఎలా?
పనిచెయ్యాలన్నా చెడిపోయిన వస్తువు బాగు చెయ్యాలన్నా
వాటికి తగిన వుపకరణాలు చాలా అవుసరం. ఉపాయాలు కూడా కావాలి.సులువుకోసం చే సే ప్రయత్నంలోంచే కొత్త కొత్త ఉపాయాలు, ఉపకరణాలు పుట్టుకువస్తాయి.డబల్ కాట్ మంచంమీద డన్లప్ పరుపులు
వేస్తె మంచానికి తలాపు దిక్కున ,కాళ్ళ వేపు వుండే చేక్కకి డన్లప్ పరుపుకి మధ్య చెయ్యి దూరే సందు వుండదు.పక్క ముడతలు లేకుండా వెయ్యాలంటే దుప్పటిని పరుపుకిన్డకి మడిస్తేనేగాని అవదు.పరుపుఎత్తి
దుప్పటి కిందకి మడవాలంటే అదోపెద్ద ప్రయత్నం,మంచం చుట్టూ నాలుగైదు ప్రదక్షిణాలు చేస్తే గాని పని అవదు.మాచేల్లెలు వచ్చింది.ఎవరూలేకపోతే మనమే చేసుకొంటాముగాని,ఎవరేనా వుంటే సాయం అడగాలనిపిస్తుంది."పక్క మారుద్దాం రావే!"అన్నాను.అది అట్లకాడ పట్టుకువచ్చింది."ఇదేందుకే చంద్రా "అన్నా. చెపుతా అంది,దుప్పటి పరిచాక తలవేపు కాళ్ళవేపు దుప్పటిని అట్లకాడతో లోపలికి తోసింది.పని ఇట్టే అయిపొయింది.బాగుందే అన్నాను.
యు.ఎస్.లో మొన్న మా అబ్బాయి వాళ్లు ఫర్నిచర్ కొన్నారు.మావాడి ఫ్రెండ్ కొత్తగా అన్ని కొనుక్కొన్నాడు,తండ్రికి బాగాలేదని ఇండియా వచ్చేయమని అంటే వెళ్ళిపోతూ సామాను అమ్మేశాడు.వాళ్ళిల్లు మాఇంటికి దగ్గరే అవన్నీ వూడదీయాడ మెందుకని అలానే తెచ్చుకొండానికి వర్కేర్ని పిలిచారు.వస్తువులు బరువుగా అద్దాలతో వున్నాయి.ట్రక్కు తెచ్చాడతను.ఎలాతెస్తాడా?అద్దాలు పగులుతాఎమో?అనుకొన్నాను.రెండు చక్రాలున్న చేటంత చెక్కలు తెచ్చాడు,అద్దాల బీరువాని దానిమీద పడుకోపెట్టి చిన్నపిల్లలు బండీ లాక్కువచ్చినట్లు వాల్లిన్టినుంచి మా ఇంటి దాకా లాక్కువచ్చాడు.ఇంటి గుమ్మం లోపల ఒక రోజాయి లాటిది పరిచి అందరు సాయం పట్టి దానిమీద నుంచోపెట్టి మెల్లాగా ఆరోజాయిని తోసుకొంటూ లోపలికి తెచ్చాడు.రోజాయి పరవడం మూలాన చెక్కనేలమీద గీతాలు పడవు,లాగడం సులభమయింది. చిన్న వస్తువులకి కుషనులు వున్న
ప్లాస్టిక్ ప్లేట్లవంటివి తెచ్చి నాలుగుకోళ్ళ కింద పెట్టి లాక్కు వచ్చాడు.
ఒక్క వస్తువు పాడవకుండా ఉపాయం గా సులువుగా పనిచేసాడు.
హైదరాబాదులో జరిగిన సంఘటన గుర్తుకువచ్చింది.మాఇంట్లో పుష్కలం గా వుండేవి,పుస్తకాలు, పేపర్లు,సూదులు,దారాలు,కత్తిరించిన బట్టల ముక్కలు,పూసలు,చిన్న చిన్న ఖాళి సీసాలు,డబ్బాలు,ఫాబ్రిక్ పెయింట్స్
"వున్నది పుష్టి మానవులకు" అన్నట్లు దాస్తూ వుంటాను.పుస్తకాలు ప్రతి నెలా దులిపి సర్డుకోకపోతే బాగుండవు.అన్ని చదువుకోవచ్చని దాచాను.ఓపిక తగ్గిపోయిందని పుస్తకాలు పంపిణి చేస్తేమంచిదని,ఎవరికీ ఏమి పుస్తకాలు కావాలో అడిగి ఇచ్చేసినాక ఇంకాకొన్ని పుస్తకాలు ఒక వృద్ధ ఆశ్రమానికి ఇచ్చాను.అవి పెట్టుకునేందుకు అడ్డలున్న స్టీలు షెల్ఫ్
కూడా ఇస్తానన్నాను.పాపం వాళ్లు నన్నే తీసుకురమ్మనకుండా మనిషిని ట్రక్కు ఇచ్చి పంపారు.మేము సెకండ్ ఫ్లోర్ లో వుంటాము.షెల్ఫ్ లిఫ్ట్ లో
పట్టలేదు,మెట్లమీద నుంచి తీసుకెళ్ళారు.ఫస్టుఫ్లోర్ దగ్గర వంపుతిప్పుతూ ఒక అద్దం కాస్తా పగలకొట్టాడు. ప్రాణం ఉసూరు మంది. ఇచ్చిన వస్తువు వాళ్ళకి అందకుండానే పోయిందే?అని.కాని ఇక్కడవాల్లకి వున్నన్ని పనిముట్లు మనకి లేవేమో?
ఒక పని చేయాలంటే దానికి కావలసిన ఉపకరణాలు లేకుండానే వస్తారు.చెంబుఇయ్యండి,పాత బట్ట ఇయ్యండి, సోపుఇయ్యండి,బకెట్ ఇయ్యండి,కొబ్బరినూనె ఇయ్యండి,స్క్రూడ్రైవరు ఇవ్వండి,ఇలా అడుగుతూ వుంటారు.రిపేరు చేస్తే రెండురోజుల్లో మళ్ళి తయారు.
Wednesday, May 20, 2009
Tuesday, May 19, 2009
ఏమి చేయకుండా కొన్ని జీవితాలు వెళ్ళిపోతే ,ఏదో చేస్తున్నాననుకొంటూ
కొన్ని జీవితాలు వెళ్లి పోతాయి,ఏమి చేయనట్లు వుంటూ ఏంటో చేసి సమాజానికి ,దేశానికి అర్పించిన జీవితాలు ధ్రువతారలై తర తరాలు ఆకాశ పదాన మెరిసి పోతుంటాయి.అవి ఎందరికో ప్రేరణాత్మకమై ఉత్సాహాన్నిచ్చి ముందుకు నడిపిస్తాయి.వారి సృజనాత్మక శక్తి గురించి
విని,చదివి,చూచినప్పుడు ఆశ్చర్యపోతాము.వీరిమున్దు మనమెంత? మనమేమి చేశాము ,ఏమిచేస్తున్నాము అన్న ప్రశ్న రాక మానదు.అప్పుడు తెలుస్తూంది మనమెంత అల్పులమో!
హోమేస్తేడ్ అనే వూరిలో "మిల్టన్ ఎస్ హర్శీస్" అనేఅయన జన్మించాడు.ఆయన భార్య పేరు "కాతరిన్ హర్శీస్ "హర్శీస్ ఒక పెద్ద చాకలేట్ వరల్డ్ పిల్లలకోసం నిర్మించాడు.దానికి అనుబంధంగా ఎన్నో విభాగాలున్నాయి.దారుణం ఏమిటంటే పిల్లలమీద అంత మక్కువవున్న హర్శీస్ కి పిల్లలు లేరు.ప్రతి మానవునికి ఒక బలీయమైన కోర్కె,అనుబంధం వుంటాయి.భగవంతుడు ఏమిఆలోచిస్తాడో తెలియదుకాని -వాటిని దూరం చేసి ఆవ్యక్తులకి భక్తీ పదం అన్నా చూపిస్తాడు,లేకపోతె సమాజ సేవ చేయడానికి కొత్త ద్వారాలు తెరుస్తాడు.హరీస్ పెట్టిన చాకలేట్ ఇండస్ట్రీలో చాలా లాభాలు వచ్చాయి.హర్శీస్ తన ఆదాయంలో కొంత భాగం వెచ్చించి ౧౯౦౯లొ హర్శీస్ ఇండస్ట్రియల్ స్కూల్ పిల్లలకోసం ప్రారంభించాడు నలుగురు వాళ్ల వూరిలోని బీద పిల్లలతో . అంతవరకు తోడుగా వున్నా భార్యకాతరిన్ హర్శీస్ ౧౯౧౮లొ చనిపోయింది.ఇక హర్శీస్ తన ఆస్తినంతా స్కూల్ అ భి వృద్ధికి ,చిరకాలం కొనసాగడానికి ఉపయోగించాడు.కే జి నుండి పన్నెండు క్లాసులదాకా ఆస్కూల్ పెరిగి ఒకవెయ్యి ఎనిమిది వందలమంది అబ్బాయిలు,అమ్మాయిలూ చదువుతున్నారు.యు .ఎస్ లో పుట్టినవారికే ఇందులో ప్రవేశం.ఆదాయం తక్కువగా వుండి ,వెనక ఆస్తిపాస్తులు లేనివారి పిల్లలనే ఏరి సీటు ఇస్తారు.కంప్యూటరు,వ్యవసాయము,వాతావరణం,ఆర్ట్స్,క్రీడలు వీరి సిలబస్ లో వున్నాయి.ఫౌందెర్స్ హాల్ ఎంత అన్డంగావుందో!అదేస్కూల్
దాని డొమ్ గుండ్రంగావుంది.ఇది దీభ్భాయి అదుగులఎత్తు. ప్రపంచంలో గుండ్రని ఆకారంలో వుడ్ డొమ్ లలో ఇది రెండవది.
చాకలేట్ టూర్
రైన్ ఫోరేస్తాల్లోకోకో గిజలు పండుతాయి.సముద్రాలు
దాటి స్వీటెస్ట్ ప్లేస్ ఆన్-హర్శీస్ పెన్సిల్వేనియా ఫాక్టరీ కి చేరతాయి.కోకోలో పాలు పంచదార,కొన్ని విశేష వస్తువులు కలుపుతారు.అచ్చులులా చాకలెట్లు వచ్చి రంగుల కాగితాల వస్త్రాలు చుట్టుకొని మిలమిల మంటూ బైటికి వస్తాయి.కిస్స్ అని చిన్న ఉల్లిపాయల వంటి చాకలెట్లు,బారులు
చాకలేట్ సాస్ ల్ ఎన్ని రకాలో తయారవుతాయి.ఫాక్టరీలో తక్కువ ధరకి తాజాగా లభిస్తాయి.ఎన్నిరకాలో చెప్పలేము.చాకలేట్లో కోకో ఎక్కువ వుండి డార్క్ బ్రౌంగా వుంటే వంటికి మంచిదిట,ఈతయారీ అంటావిజిటేర్స్ని రైల్ బండీ లాటి దాంట్లో కూర్చోపెట్టి ఫాక్టరీ మధ్యనుంచి నడిపి చూపిస్తారు.చాక్లెట్ పేస్ట్ డ్రమ్ము లలో చూస్తూంటే ,సాస్ సీసాలు పరుగెత్తడం చూస్తె ఎవయసు వారికైనా నోరూరక మానదు.మన టూర్ అయాక ఒక చాకేలేటు తిని విజిటర్లు కాగితాలు పారేస్తారని అడుగడుగికి నాలుగు డస్తే బిన్స్ పెట్టారు.
చాక్లెట్ వరల్డ్
దీనికి టికెట్ . లోపలికి వెడితే ఒకగ్లాసులో చాక్లెట్ సాస్
నాలుగురకాల చాకలేట్స్,మంచినీళ్ళ సీసా,టిష్యూ పేపర్ బాగ్ లో ఇస్తారు. ఒక్కొక్క చాకేలేట్ గురించి చెపుతూ అది తినేటప్పుడు మీనాలికకి ఏమిరుచి తెలుస్తూంది?అని అడుగుతారు.మనం చెప్పాలి.పిల్లలని స్టేజి మీదకిపిలిచి ప్రస్నాలడుగుతారు.కోకోతోతలు అవి స్క్రీన్ మీద చూపించి చాక్లెట్ల తయారీ గురించి చెప్తారు.వస్తూంటే మాకందరికీ మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్ లు ఇచ్చారు.
మనం ఫోటో తిఇయిన్చుకొంటే వెంటనే దాన్ని ప్రింట్ చేసి కాగితంపై అరచేయ్యంత చాక్లెట్ మీద ఆ ఫోటో కాగితం చుట్టి ఇస్తారు.
అది తరువాత మనం ఫోతోకట్టించుకోవచ్చు.
టూర్లో ఫోటోచాకలేట్ టూర్లో రైల్లో వెళుతూంటే ఫోటోలు తీస్తారు,ఫ్రేమ్కూడా కట్టి ఇస్తారు.ఇరవై డాలర్లు అనుకొంటా.జ్ఞాపకార్ధం ఇలాటివి ఏంటో బాగుంటాయి.కిట్-కాట్ చాక్లెట్లు వీళ్ళే తయారు చేస్తారు.
త్రీ -డి షో
దీంట్లో చాకలేట్ కారెక్టర్లు తెరపై గంతులు వేస్తాయి.అన్ని వయసుల వాళ్లు చూచి ఆనందించ వచ్చు.
చిల్డ్రన్స్ గార్డెన్
హర్శీస్ ౧౯౩౭ లో మూడున్నర ఎకరాల లో గులాబి తోటలు పెంచి దీనిని
ప్రారంభించాడు.అది ఇప్పుడు ఇరవై మూడు ఎకరాల గులాబి తోటఅయింది. ౭,౫౦౦ రకాలగులాబిలు వున్నాయిట.సీతాకోకచిలుకల ఇల్లు నిర్మించాడు.౩౨రకాల గార్డెన్స్ వున్నాయి.రకరకాల చెట్లు,వందల కొద్ది సీతాకోక చిలుకలు.గొంగళి పురుగునుంచి సీతాకోక చిలుక ఎలాతయారవుతుందో చూపిస్తాడు.కేటర్ పిల్లర్ తన్నలు,చాకలేట్ వాసనలు వేసే చెట్లు.మే నుంచి సెప్టెంబర్ దాకాతెరిచి వుంటుంది.వింటర్ లో కొన్ని మూసివేస్తారు.గిఫ్ట్ శాపుల్లోచాకలేట్ వరల్డ్ ముద్రలు వేసి టిషర్ట్లు
కాఫీ మగ్స్ ,కిచైన్స్ ,టోపీలు, బెల్ట్లుఎన్నోఅమ్ముతారు.మదర్స్ డే కి ,ఫాదర్స్ డే కి పేరెంట్స్ కి ఫ్రీ .
ఆంటిక్ ఆటో మ్యూజియం
ఇందులో పాత పాత కార్లు ట్రక్కులు బస్సులు మోటారు సైకిళ్ళు చూపిస్తారు.
హర్శీస్ పార్క్
హర్శీస్ పార్క్ లో పదకొండు వరల్డ్ క్లాస్ రోలర్ కోస్టర్లు,ఇరవై కిడ్డి రైడ్స్ ,పదకొండు ఎకరాల అమెరికన్ జూ,హోటల్లు,మూడువందలడేభ్భయి
ఎనిమిది వేళ గాలన్ల నీరున్న వేవ్ పూల్ ,తొమ్మిదిరకాల నీటి ఆటలు,లాకర్ రూం వున్నాయి.మే ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఏడు
దాకా తెరచి వుంటుంది.ఇక్కడికి వెళ్ళాలంటే బాల్టి మోర్నుంచి తొంభయి
నిముషాలు,వాషింగ్ టన్ నించి రెండు ఘంటలు, ఫిలడల్ఫియా నుంచి రెండు ఘంటలు,న్యూయార్క్ నుంచి మూడు ఘంటలు పడుతుంది.
ఇండియా నుంచి యు.ఎస్ వచ్చి రెండురోజులకే వెళ్లాను.మనవాళ్ళతో కలిసి తిరగాలనే ఆశతో అలసట లెక్క చేయకుండా
వెళ్లాను.బాగా ఎంజాయి చేసాము.మీరు తప్పక చూడండి.
Sunday, May 10, 2009
అమ్మ...
అమ్మా అనేది అందరికి దొరికిన వరం. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లికి మమతానురాగాలు ఉండడం సహజం. కాని జీవితంలో అదృష్టం ఉంటె అమ్మలు కాని అమ్మలు దొరుకుతారు. కనదాలు పెంచాదాలు లేకుండానే ఆ మాత్రు వాత్సల్యం మదిలో మొలకెత్తడం అంటే ఎంతో విచిత్రంగా ఉంటుంది. సొంత అమ్మ ఉన్నవారికి కూడా ఇలాంటి అమ్మ తారసపడతారు. నా జీవితంలో అలాంటి అమ్మే నాకు దొరికి నన్ను విస్మయ పరిచింది.
మన ఊరు కాదు , మన బాష కాదు. అప్పుడే పరిచయమై అప్పుడే అమ్మలా ఆదరించింది. కెనడా వెళ్ళినప్పుడు పిచ్చి చలిలో కూడా మేము సాయిబాబా బహాజనకు వెళ్ళే వాళ్లము. పిల్లలకి క్లాసులు జరిగేవి. మా కోడలు పిల్లలకు క్లాసులు నడిపేది.నేను ఇంట్లో ఒక్కదాన్ని ఎం చేస్తానని నేను కూడా వెళ్ళే దాన్ని. నాలాగే మాశిమా అని ఒకామె వచ్చేవారు .ఆమెకు మా అమ్మ వయసు ఉండేది. మొదటిరోజు మాశిమాని చూసినప్పుడు మా అమ్మ కట్టుకున్న చీర లాంటిది కట్టుకుంది. నా కళ్ళు మెరిసాయి.మా అమ్మ దిగి వచ్చి అక్కడ కూర్చుందేమో అనిపించింది. నా పక్కనే కూర్చునేది. ఆప్యాయత నిండిన కళ్ళతో సుతారంగా నవ్వుతూ హిందీలో ఎక్కడినుండి వచ్చావు? అంది. చెప్పాను. నీకు రంగోలి వాచా అంది. వచ్చు అన్నా. ఆరోజునుండి మేమిద్దరం చాలా దగ్గర అయిపోయాము. ప్రతి వారం కలిసేవాళ్ళం. ప్రతిసారి నాకోసం జేబురుమాల్లో చుట్టి ఏదో ఒక స్వీట్ తెచ్చేది. నీకోసమే తెచ్చాను అని అది ఎలా చేసిందో చేపి నాతొ తినిపించేది. హృదయ కమలం ముగ్గు వేసి ఇచ్చాను. ఒకే గీతతో ఆ ముగ్గు పూర్తీ చేయాలి. ఎంత ప్రయత్నించినా తనకు వచ్చేది కాదు. ఎక్కడో తప్పిపోఎది. నేను వేసి చూపిస్తే. నీకెలా వస్తుంది నాకు రాదే అనేది.ఒక్కోరోజు పుస్తకాలు తెచ్చి చదివి వినిపించేదాన్ని. సంశయం వస్తే అడుగుతూ , మంచి వాక్యం వస్తే మళ్ళీ చదవమనేది. నాకు కూడా అక్కడ తోచేది కాదు. బయట ఒకటే చలి. బయటకు వెళ్ళలేము. ఒకసారి పాత బట్ట మూడు చీలికలు చేసి జడలా అల్లి ఒక చేతిసంచీకి టాగ్ లా కత్తి తీసికెల్లాను. అరె ఇదెలా చేసావు అని ఆశ్చర్యపోయింది మాశిమా. ఇలాగే చేతిసంచులు, టేబిల్ క్లాతులు చేయగలను అని చెప్పాను. అలాగా అని ఆ మరునాడు ఒక చేతి సంచి నిండా కొత్త బట్ట ముక్కలు తీసుకొచ్చి వీటితో ఏమన్నా చేస్తావా అంది. ఇన్ని ముక్కలు ఎక్కడివి అంటే నేను బట్టలు కుడతాను చీర కొంగులు జిగ్ జాగ చేస్తాను అనిచెప్పింది.
మాశిమా తన దగ్గరున్న చీరలు చివరలు కత్తిరించి అట్టే పెట్టిందంట, ఇంకా బోలెడు జరీ ముక్కలు, సిల్క్ ముక్కలు . ఎంతో కాలంగా దాచిపెట్టడం వల్ల అవి గట్టిగా అతుక్కుపోయాయి. అవన్నీ కష్టపడి విడదీసేసరికి వారం రోజులు పట్టింది. అక్కడ ఇల్లంతా తివాచీలు. ఈ దారాలు ఆ తివాచీల మీద పడి బయటకు రానంటే రానని మొరాయించేవి. వాటినంతాశుభ్రం చేసేసరికి కనీసం గంట పట్టేది. ఆ తర్వాత అల్లడం మొదలు.. సిల్క్ బట్ట కనుక జడలా అల్లేసరికి సన్నగా వచ్చేది. తొందరగా తెమిలేది కాదు. ఎలాగైతేనేమి అది పూర్తి చెసి గుండ్రంగా చేసి దారంతో కుట్టాను. ఒక నెలరోజులు మంచికాలక్షేపం ఐంది.. కొత్త వ్యాపకం నేర్చుకున్నట్టు ఐందీ, పనికొచ్చే వస్తువూ తయారైంది. దీనికి మాషిమాకి ఎన్నికృతజ్ఞతలు చెప్పుకున్నానో..
మాషిమాకి ఎన్నో పనులు వచ్చు. మనసు విప్పి ఎటువంటి అహంభావం లేకుండా అందరికీ సహాయం చేయడం, సలహాలు ఇవ్వడం, సేవ చేయడం ఆమెలోని ప్రత్యేకత. అందులో మరీ ప్రత్యేకమైంది . పుల్కాలు చేయడం. ఆమెపుల్కాలు చేస్తే మస్లిన్ గుడ్డ మడత పెట్టినట్టుండేవి. అక్కడ ఏ పండగైనా , పబ్బమైనా నేను పుల్కాలు చేసుకొస్తా అనివందల కొద్దీ చేసుకొచ్చేది. ఎన్ని చేసినా అన్ని ఒకేలా ఉండేవి. రుచి కూడా ఒకేలా ఉండేది. ఒకసారి కృష్ణాష్టమికి ఒక స్వీట్చేసింది. మినప్పప్పు నానబెట్టకుండా రుబ్బి, పాకం పెట్టి చేసేది. అది ఉడికేటప్పుడు గరిటతో తిప్పి తిప్పి చెయ్యినొప్పిపుట్టేది.ఐనా అద్భుతమైన వాటి రుచి కోసం ఆ కష్టం ఏపాటిది అనిపించేది.
నేను కెనడా నుండి వచ్చేస్తుంటే "హృదయ కమలం" ఒక పేపర్ మీద గీసి ఇవ్వమంది. నన్ను ప్రొసన్నా అని పిలిచేది. అదేంటి తన పేరు ప్రసూన కదా అని ఎవరన్నా అంటే చిన్నగా నవ్వేసి .. నన్ను ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుతుంది కనుకప్రొసన్నా అనే పిలుస్తాను అనేది. పల్చటి నవ్వు ముఖం., సన్నటి శరీరం., నాజూకైన మాట..పలుకు పలుకులొ కలకండముక్కలు అందించేది. మేము కలవడానికి ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లం. ఇద్దరం కలిసి బాబాసెంటర్ లో పండగలు ఉంటే క్లీనింగ్ కి వెళ్లేవాళ్లం. తను ఎప్పుడూ ముందుగా తయారయ్యి అందరినీ వెనక్కి నెట్టేది. తక్కువ తినడం, తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం, అందరి సుఖమూ కోరుకోవడం మాషిమా ఆదర్శాలు. గిన్నెలో పాలమీది మీగడ తరకలమీద వేలితో సుతారంగా ఇలా అంటే పాలు కదిలినట్టే...తన జీవితం బాధాపరితప్తహృదయంతో గడిపినా పైన మీగడ తరక మాత్రమే మనకు తినిపించి విందు చేసేది మాషిమా..
కెనడా వదిలి వచ్చేముందు నా పిల్లలను వదిలిరావడం కంటె మాషిమాను వదిలిరావడం కష్టమైంది నాకు. మాషిమాకిబెంగాలి తప్ప వేరే బాష రాదు. నాకేమో బెంగాలీ చదవడం రాదు. ఎలా మనం కబుర్లు రాసుకోవడం అనేది. అన్నిబాషలకు అతీతమైన ప్రేమైక హృదయం నీకుంది. నువ్వు మనసులో ఏదన్నా అనుకో...తప్పకుండా అది నాకందుతుందిఅన్నాను .. గాంభీర్యంగా అన్నాను కాని తనకు తెలుగు వస్తే ఎంత బాగుండు అని లోలోపల వాపోయాను. ఇప్పటికీ మాపిల్లలను మాషిమా కబుర్లు అడుగుతూనే ఉంటాను. కలవడం మాత్రం కుదరలేదు. కాస్త వడలిన జాజిపూవులా అమ్మకాని అమ్మ మాషిమా నా మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.










