Pages

Thursday, August 27, 2009

గణపతి నవరాత్రులు



గణపతి నవరాత్రులు
వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా !

రంగుల ప్రపంచం

చాలా మంది లాప్ టాప్ లో గ్రీటింగ్స్ సొంతంగా తయారు చేస్తారుట కదా? రంగులతో ఎలావేస్తారురా?
అని మా అబ్బాయిని అడిగా,పెయింట్ అనే ప్రోగ్రాం కు తీసుకు వెళ్లి చూపించాడు ఇంకు స్కేపే అనేది చూపించాడు.
రెండోది చాలా హడావుడిగా వుంది,మొదటిది కొంచెం తేలిక అనిపించింది. మౌస్ తో బ్రష్ ని కదపటం ఎంత కష్టమో!
ఎ విద్య అయినా సరిగా నేర్చుకోవాలంటే శ్రద్ధ,ఏకాగ్రత,అభిలాష ,ఉత్సాహము వుండాలి.నేను సరదాగా శ్రీరామ
అనివ్రాసా.నాప్రతాపం అందరికి చెప్పాలిగదా? దేవుడు అనుకూలిస్తే సమయం వెచ్చించి మళ్ళి మరోటి.

Wednesday, August 26, 2009

గణపతి నవరాత్రులు

ప్రార్ధన
భూతాదిపం భూత గణాది సేవితం
కపిత్థ జంబూ ఫలాది పార భక్షితం
ఉమాసుతం శోక వినాశ కారకం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం

Tuesday, August 25, 2009

గణపతి నవరాత్రులు

గణపతి నవరాత్రులు
తొలుత నవిఘ్న మస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిను ప్రార్ధన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవ గణాధిప లోక నాయకా!
** శ్రీ గణనాథమ్ **
శ్రీ గణనాథమ్ భజరే!చిత్త పరాశక్తి యుతం
నాగ యజ్ఞా సూత్ర ధరం నాదలయానందకరం
ఆగమాది సన్నుతం అఖిలదేవ పూజితం
యోగాశాలి భావితం భోగిశాలి సేవితం
రాగ ద్వేషాది రహిత రమణీయ హృదయ విదితం
శ్రీగురుగుహ సన్ముదితమ్ చిన్మూల కమలాస్థితమ్







Monday, August 24, 2009

వినాయకుని చిత్రం


వినాయకుని చిత్రం
ఈవేళ మాఇంట్లో వెలసిన గణపతి

Sunday, August 23, 2009

ఆహ్వానం

ఆకాశమే పాలవెల్లిగా " ఆహ్వానమ "
పూలమడులే నీకు పీఠమ్ముగా
రావయా!రావయ్య!
ఓ!విఘ్న దేవతా!
ఓ!గణాధ్యక్షా !
అది,ఇది లేదని
అలుగబోకయ్య!
ఆశ రవ్వగా చేసి
భక్తీ బెల్లముచేర్చి
ఆపూపములు నీకు
అర్పింతుమయ్యా!
దీపాలు ,ధూపాలు
మంగళారతులు
ఆహ్లాదముగా జూప
అందుకోవయ్యా!
విద్యాప్రదాతా!
విజయ గణపతి
ఈర్శ్యల ,ద్వేషాల
పల్లేరుకాయలు
మాబ్రతుకు బాటలో
తొలగించు స్వామీ!
నరులజీవితాన
నీలాప నిందలు
నీకథా శ్రవణ మున
నివృత్తి చేయి
మాపిల్లపాపలకు
ఆ,ఆ లు అందించి
అక్షర సంపదలిచ్చి
ఆదర్శ మూర్తులుగా
అవనిలో నిలుపవా!
నీవు తలచినచాలు
బండలే కరుగును
కొండలే తరుగును
జలనిధులు దారిచ్చు
పావకుడు మన్నించు
అన్ని కార్యములందు
ఆసరాగానిలిచి
ముందుకు నడిపించు
మంచిగా మననివ్వు
గుంజీలే కానుకలు
దండాలేనగలు
పాటలే పట్టు
పీతాంబరాలయ్యా!
శాపాలు విదిలించు
పాపాలు తొలగించు
నినునమ్మి,నినుతలచి
బతికెదమయ్యా!
రచన -టి.జ్ఞానప్రసూన




Saturday, August 22, 2009

గణేష్ ప్రార్ధన


గణేష్ ప్రార్ధన
అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట తొండమున అవ్వాలి చన్ కబళింపబోయి ఆ
వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వె మృణా
ళాంకుర శంకనంటెడు గజాస్యుని కొల్తు నభీష్ట సిద్ధికిన్ !



వినాయక చవితి
తుండము నేక దంతమును
తోరపుబోజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లనిచూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ
ఓయి!గణాధిప నీకు మ్రొక్కెదన్ !

అనుకోని వసంతం

అనుకోని వసంతం
చెట్లంటే నాకు పూల చెట్లే చెట్లనిపిస్తాయి.మళ్ళి కిచెన్ గార్డెన్ అంటే ఇష్టమే !
మావాడు కొత్తగా ఇల్లు మారాడు.అప్పటినుంచీ "ఇక్కడ చాలా పెద్ద పెరడువుంది .నువ్వు వస్తే బోలెడు కాలక్షేపం "అని గొడవ చేసాడు.వచ్చి చూస్తె నిజమే!పెరడు పెద్దదే!చెట్లకి నీళ్లు పోసుకోడానికి పంపు,ట్యూబ్ రెడీగా వున్నాయి.మా కోడలుఅంది "ఎదురింటి ఆవిడ గార్డెనింగ్ బాగా చేస్తుంది,పరిచయం చేస్తా"అని.ఆవిడే ఎందుకో మాఇంటికి వచ్చింది.పరిచయాలయ్యాయి.ఇద్దరి సరదాలు ఒకటయ్యాయి.ఒకరోజు ఆవిడతో కలసి నర్సరీ కి వెళ్దాము,మీకుకావలసిన మొక్కలు ఆవిడ సెలెక్ట్ చేస్తుంది,కొనుక్కువద్దాముఅంది.పెరట్లో రెండు మొక్కలు మాత్రం వున్నాయి.ఇవేమిటో తెలియదు పీకి పారేద్దాము,అంది మాకోడలు,ఎదురిన్టావిడతొ అంటే ఒకటి మందారం జాతిని,ఇంకోటి మొగలిపోదలావున్నది కూడా పూలు పూస్తుందని చెప్పింది.ఆరెండింటికి పాడు చేద్దామని అట్లకాడ పట్టుకు వెళ్లాను.వాళ్ళంతా చెమటలు పట్టింది కానీ మట్టి కాస్త కదల లేదు.రెండు రోజులు నీళ్ళుపోసి తరవాత ప్రయత్నిద్దామని వూరుకొన్నా.ఒక శుభముహూర్తాన ముగ్గురం కలసి నర్సరీ కి వెళ్ళాము.ఇద్దరం చెరో ట్రాలీ పుచ్చుకోన్నాము.మాకోడలు పెద్దగా గావుకేక పెట్టి ఒక చోట ఆగిపోయింది.ఏమిటో అని దగ్గరికి వెళ్లాను."అత్తయ్య గారూ!హంగేరీ మిర్చి ఈమొక్క చూసారా!కొనుక్కొందాము,అని ట్రాలీలో పెట్టింది.అక్కడ పెద్దపెద్ద ఆర్చీలలో
పూల మొక్కలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాయి.ఈ దేశం వాళ్లు ఏజాతి పూలను ఆ జాతిపూల లాగా పెంచారు.రెండు మూడు రకాలు కలిపి వింత అందాలు తెస్తారు.ఒకవేపు చేమంతి బిల్లలాగా తోపురంగు పసుపురంగు కలిసిన పూలు,ఒకవేపు డార్క్ వైలెట్ గోట్టాలవంటి పూలు,
ఒకవేపు పసుపు ఆరెంజి రంగుల్లో బిళ్ళ గన్నేరుపూలు, గులాబీరంగులో సీతామ్మవారి జడలపూలు ,ఎవికోనాలి?ఏవి వదలాలీ?ఎంతయినా పరిచయం వున్నా రకాల మీదకే మనసు పోతుంది.నేను తేల్చుకోలేక ఎదురింతావిదని సలహా అడిగా.ఆవిడ ఫలానా పూలకి ఇన్ని ఘంటల ఎండా కావాలని,ఫలానా పూలమొక్కకి ఇన్ని ఘంటల నీడ కావాలనీ
ఫలానా పూలని ఇన్నిరోజుల కొకసారి ఎండలో పెట్టాలని,ఆంధ్రా కేఫ్ లో సర్వర్ ఏమి టిఫిన్స్ వున్నాయో చెప్పినట్లు గడగడా చెప్పింది.మీరు మొక్కని ఎక్కడ పెట్టదలుచుకొన్నారో ప్లాన్ చెపుతే ఏమికోనాలో చేపుతానన్నది.నేను మాకోడలు ఒకరిమోఖాలోకరు చూసుకోన్నాము.
అంత ప్లాను చేస్తేగా! వట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేక మావాకిట్లో వున్నా
బుష్ ల చుట్టూ వరసగా పెట్టాలి,అక్కడిఎండ ఎంతసేపు వస్తుందో నీకు తెలుసుగదా?అక్కడికి పనికొచ్చేవి చెప్పు,అన్నాము.ఆరు రకాల పూలమొక్కలుకొన్నాము,నేనో టమాటో మొక్కకూడా తీసుకొచ్చా.ఇక భూమి తల్లిని తవ్వేదేట్లా?ఎదురింటి ఆపద్భాన్దవురాలు"మామూలుగా తవ్వలేవు,నాదగ్గర కరెంట్ తో పాడులుచేసేందుకు ఉపకరణం వుందితెస్తానని హామీ ఇచ్చింది.ఆమర్నాడునుంచి ఆవిడ కనపడలేదు.
మా అబ్బాయిని అడిగా కాస్త తవ్విపెడతావురా!అని,సండే చేద్దాంలే తొందరేమి వుంది అన్నాడు.రెండు రోజులు ఆమొక్కలు లోపల బయట మార్చాను.మూడో రోజున ఒక పదునైన ఆయుధంతీసుకొని మొక్కలుపాతా.రంగులు మార్చి వరసగా బుష్ లపక్కనే పూలమొక్కలు పాతా.వాకిట్లో లైట్ స్థంభం చుట్టూ తెలుపు,గులాబి రంగులవి పెట్టాను.
పెరట్లో పచ్చి మిర్చి ,తమతో పెట్టాను.తులసి విత్తనాలు ఇండియా నుంచి ఎన్నాళ్ళో అయింది అత్తయ్యగారూ!పనిలోపని అవీ ఒకుండీలో వెయ్యండి
అంది మాకోడలు.క్రిష్ణక్రిష్ణ అనుకొంటూ అవి వేసా.తెల్లవారంగానే వాటిని చూస్తేనేకానీ కళ్లు తెరిపిడి పడేవి కావు,ఇంతలొ ఒక ఉపద్రవం, "౨౦న
ఇండియా వెళ్ళిపోతున్నా ఇంకోమ్మా!త్వరగా వచ్చెయ్యి"అని రాధిక ఫోను.నెలాఖరుకి మరిదికోడుక్కి నిశ్చితార్ధం వెళ్ళాక తప్పిందికాదు.వేల్లానన్నమాటే గానీ మొక్కలేమయి పోయాయోఅని బెంగా .మొగలిపొద మధ్యలో ఘట్టికాడవచ్చి కణుపులు కనుపులుగా వచ్చాయి.మొగ్గలు,కానీ ఎరంగోతెలియలేదు,నేవేల్లెదాకా రంగు బయట పడలా ,ఇంకో మొక్కలేవో కాయలుగుండ్రంగా వచ్చాయి.నేవేల్లిన పదహారు రోజులకి మా అబ్బాయి మెయిల్ లో ఒక ఫోటో పంపించాడు.మొగలిపొద కి ఇంకా ఎన్ని కాడలు వచ్చి పొడనిండా పూలు విరగ బూసాయి.ఆపూలు పుయ్యడంకాదు,మావాడు శ్రద్ధగా ఫోటో తీసినందుకు పంపినందుకు తెగ
మురిసిపోయా.పూలుమనసుల్ని కదుపుతాయి.అయిడువారాలకి మళ్ళి ఇంటికి చేరా.వెంటనే పెరట్లోకి వెళ్లి చూస్తె ఏముంది?పచ్చిమిర్చి మూడు కాయలు కాసింది.టమాటో నేలమీద పాక్కుంటూపోయి ఒఇరవై కాయలు ఆకులకింద దాచుకొంది. తులసి కుండీనిండా అంగుళం ఎత్తున ఎదిగింది.
"ఎన్తానన్దమ్బాయెనహా,మదికెన్తానన్దమ్బాయెనహా!ఇలా అప్పుడప్పుడూ అనుకోని వసంతాలు పూసి,మదిలో మౌనరాగాలు పలికిస్తాయి.

Friday, August 21, 2009

గణేష్ చాలీసా

గణేష్ చాలీసా
జయ గణపతి సద్గుణ సదన -కవివర బదన క్రుపాలా
విఘ్న హరణ మంగళ కరణ -జయజయ గిరిజాలాలా
జయజయజయ గణపతి రాజా -మంగళ భరణ కరణ శుభకాజూ
జయ గజ బదన సదన సుఖదాతా -విశ్వ వినాయక బుద్ది ప్రదాతా
వక్రతుండ శుచి శుభ్ర సుహావన -తిలక త్రిపుండ భాల మన భావన
రాజిత మని ముక్తా వర మాలా -స్వర్ణ ముకుట శిర నయన విశాలా
పుస్తక పాణి కుఠార త్రిశూలం -మోదక భోగ సుగంధిత ఫూలం
సుందర పీతాంబర తన సాజిత -చరణ పాదుకా ముని మన రాజిత
దని శివ సువన షడా నన భ్రాతా -గౌరీ లాలన విశ్వ విధాతా
రిద్ది,సిద్ది తవ చరణ సిదారే -మూషక వాహన సోహత ద్వారే
కహౌన జనం సుధా కథా తుమ్హారీ -అతి శుచి పావన మంగలకారీ
ఏక సమయ గిరి రాజ కుమారీ -పుత్ర హేతు తప కీన్హా భారీ
భయో యగ్య జబ పూర్ణ అనూపా -తబ్ పహుంచ్యో తుం ధరి ద్విజ రూపా
అతిథి జానికే గౌరీ సుఖారీ -బహు విధి సేవా కరీతుమ్హారీ
అతి ప్రసన్న హవై తుం వర దీనా -మాటు పుత్ర హిత జో తప కీన్హా
మిల్లీ పుత్ర తుహి బుద్ది విశాలా -బినా గర్భ ధారణ యహి కాలా
గుణ నాయక గుణ గ్యాన నిధానా -పూజిత ప్రధమ రూప భాగావానా
ఆస కహి అంతర్ధాన రూప హాయ్ -పాలనా పర బాలక స్వరూప హాయ్
బని శిశు రుదన జబ హాయ్ తుం దానా -లఖి ముఖ సుఖ నహి గౌరీ సమాన
శంభు ఉమా బహు దాన లుటావహి -సుర ముని జన సుత దేఖనా ఆవహి
లఖి అతి ఆనంద మంగళ సాజా -దేఖనా భీ ఆయే శని రాజా
నిజ అవగున గని శని మన మాహీ -బాలక దేఖనా చాహత నాహీ
గిరజా కచు మన బెద బధాఏ -ఉత్స్వవ మారణ శని తుహి భాయో
కహనా లగేషని మన సకుచాయీ -కాకరిహా!శిశు మొర దిఖాయే
నహి విశ్వాస ఉమా కర భయవూ -శని సో బాలక దేఖనా కహివు
పడతహి శని ద్రుగా కోన ప్రకాశా-బాలక శిర ఉడి గయో ఆకాశా
గిరిజా గిరీ వికల హాయ్ ధరణీ -సో దుఃఖ దశా గయో నహి బరనీ
హాహాకార మచ్యో కైలాశా -శని కీన్యా లఖి సుత కో నాసా
తురత గరుడ చడి విష్ణు సిదాయే -కాటి చక్ర సో గజ శిర లాయే
బాల్ కే దడ ఊపర్ దార్యో -ప్రాణ మంత్ర పఢ శంకర దారాయో
నామ గణేష్ శంభు తబ కీన్హా -పృథ్వీ కీ ప్రదక్షిణా లీన్హీ
చలే స్డానన భరణి భులాయే -రబీ బైట్ తుమి బుద్ది ఉపాయా
చరణ మాతు,పితు కే ధర లీన్హే -తినకే సాత్ ప్రదక్షిణ కీన్హే
దని నగేష్ కహి శివ హియ హరషే -నభ తే సురన సుమన బహు బరసే
తుమ్హారీ మహిమా బుద్ది బఢాయె -శేష సహస ముఖ సకి న గాయే
మయి మతి హీన మాలిన దుఖారీ -కరహున కోన బిది బినయ తుమ్హారీ
భజత రామ సుందర ప్రభు దాసా -లఖ ప్రయాగ కకారా దుర్వాసా
అబ ప్రభు దయా కీన ప్రభు కీజై -అపనీ శక్తి భక్తీ కుఛ దీజై
సమాప్తము

గణేష్ ప్రార్ధన


గణేష్ ప్రార్ధన
అంకము చేరి శైల తనయాస్తన దుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట తొండమున అవ్వాలి చన్ కబళింపబోయి ఆ
వంక కుచంబు గానకహి వల్లభ హారము గాంచి వె మృణా
ళాంకుర శంకనంటెడు గజాస్యుని కొల్తు నభీష్ట సిద్ధికిన్ !


వినాయక చవితి
తుండము నేక దంతమును
తోరపుబోజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును
మెల్లనిచూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున
కోరిన విద్యల కెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ
ఓయి!గణాధిప నీకు మ్రొక్కెదన్ !

Thursday, August 20, 2009

వరండా

వరండా
మీ ఇంటికి ఓ వరండా వుందా?
లేకపోతె ఒకటి కట్టించు కొండి
అపరిచితులకు ఆశ్రయం ఇవ్వవచ్చు
ఆత్మీయులకుఆతిధ్యం ఇవ్వ వచ్చు
ఇంటికి,వాకిలికి మధ్య వర్తి వరండా
నిజానికి ఇది ఇల్లుకాదు,వాకిలి కాదు
ఇది ఇల్లు,వాకిలి రెండూకూడా
స్నేహితులతో వరండాలో కూర్చుని
కాఫీయో,టీయో ,బిస్కేట్లతోనూ
కారప్పూసతోనూ
కొంచెం,కొంచెం చప్పరిస్తుంటే
ఎన్ని భావాలూ!ఎన్ని కబుర్లూ!
ఊరి,వూరిస్తాయో!
అదే కొంచెం అందంగా వుంటే
వరండా కప్పు అంచున
చిన్ని నీలం పూల లత అల్లుకొంటే
సూర్యోదయం-సూర్యాస్తమయం
చంద్రోదయం ఫ్రీ గా చూడొచ్చు
వరండా గోడలకి
రంగులతో కుట్టిన చిలకలు
కిల కిల లాడుతుంటే
పక్కన -మామిడితోపో-తాటి తోపో
చిత్రించిన చిత్రంచిన్నతనాన్ని గుర్తు చేస్తూ
చిరుగాలికి కదలుతూంటే
వయసు మరిచి,వేదన తుడిచి
రేపుని,ఆ పై రేపుని
ఆహ్వానించ లేమా?
వరండా లేకపోతె
మనసునే వరండా చేసుకు
భావాలనే అతిథులు చేసుకు కాలాన్ని హాయిగా
అవుపోసన పట్టండి
టి.జ్ఞాన ప్రసూన

అప్పాలు

అప్పాలు
అప్పాలు చెయ్యాలంటే ఎప్పుడూ బాగా కుదరవు.మా అత్తయ్య అనేది "అప్పాలకేముంది?డబ్బాడు బియ్యపుపిండి,చారెడు గోధుమపిండి వేడినీళ్ళలో ,బెల్లంవేసికాచి ఉప్పి,నూనెలో వేగించడమే!అని.ఎప్పుడు చేసినా
రొట్టెముక్కలా ఘట్టిగా రావడమో లేకపోతె ఉడికి ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉండటమో వాటిని తినలేక పారేయ్యలేక అవస్థ పడటమో
జరుగుతుంది.తేలికగా చేసే ఉపాయం ఏమన్నా వుందా!అని ఆలోచించాను.ఒక ఐడియా వచ్చింది.అలాచేసా,బాగానేవచ్చాయి.
గోధుమపిండి,పంచదార కాస్త నెయ్యి వేగించడానికి నూనె కావాలి.
కప్పు గోధుమపిండి అయితే కప్పు పంచదార.పంచదారలో కాసిని నీళ్లు పోసి
పంచదార కరగ గానే గోదుమపిందిపోసి బాగాకలిపి కాస్త నెయ్యి వేయాలి.
చాల్లరుతుండగా వుండలుచేసి ప్లాస్టిక్ పేపర్ మీదగుంద్రంగావట్టి నూనేలోవేగించాలి.కొంచెం చేసి చూడండి.బాగుంటే మళ్ళి చెయ్యండి,బాగుండకపోతే ఏమీ అనుకోకండి.పొట్టుతో వున్న గోదుమపిండిఅయితే బాగుంటాయి.

Monday, August 17, 2009

ఉత్క్రుష్టపు జీవితాలు,ఉద్ధరించే ఉపాయాలు

ఉత్క్రుష్టపు జీవితాలు

ఉద్ధరించే ఉపాయాలు
"ఏమిటో జ్ఞానా ఈమధ్య జీవితం మరీ ఉత్కుష్ట మైపోతూంది "
అంది అచ్యుతం .ఏమి ఏమైయిందేమిటి?అన్నా.నిన్న ఆదివారం అనుకోకుండా ఆపద వచ్చి పడింది.చుట్టలోచ్చారా? బియ్యంనిండుకొన్నాయా?అబ్బే అదేంకాదు,మామరిది సినిమా టికెట్ కొన్నాడటతనకి స్నేహితుడికి తీరా ఆ అబ్బాయికి రావడానికి వీలు లేకపోయిందిట.పోనీ ఇంకేవరినయినా తీసుకు పోవచ్చా!అన్నయ్యా వస్తావా?టికెట్ వూరికేపోతుంది,అన్నాడు అంతే"ఏమేవ్! రొట్టి చెయ్యి త్వరగా సినిమాటైమవుతూంది "అని ఓ పొలికేక వేసారు.వంట కాలేదేమిటి?వంటకేమి భాగ్యం తల్లి! ఆరునూరైనా సరే ఆయన అడిగే సరికి అత్తెసరు,ఆధరువులు రెడీ గా లేకపోతె ఆక్షణంలో చెల్లు చీటీ వ్రాస్తారుగా!నీకు తెలియనిదేముంది? రొట్టెలు చేద్దామంటే సమయానికి
అప్పడాలకర్ర కనపడలేదు.డబ్బాల వెనక గాస్ స్టౌ కింద ,సిలేన్దర్ పక్కన
అంతా వెతికా!ఎక్కడ పోయిందబ్బా!అని బుర్ర బద్దలుకోట్టుకొన్నా!డిష్ వాషర్ శబ్దానికి జ్ఞానోదయమయింది.ఓహో!మాతోటికోడలు అప్పడాల కర్రని డిష్ వాషర్లోపడేసి వుండాలి,లేకపోతె రోజు మొద్దులా ఎదురుగా పది వుండేది ఇవాళ ఏమయిపోతుంది? ఈరోజుల్లో మనుషులకి ఎంత బద్ధకాలనుకోన్నావుజ్ఞానా !కత్తులు,కత్తెరలు,కూడా డిష్ వాషర్ లో పడేస్తున్నారు.ఏమన్నా అంటె!ఆ!అవన్నీ ఎవరు కడుగుతూ కూర్చుంటారు,విసుగు అని సమాధానం.మరేమిచేసావు?ఏమిచేస్తాను? అప్పటికే మీ బావగారు అప్పులవాడిలా ఆరుసార్లు వంటింట్లోకి సావిట్లోకి
తిరిగారు,ఇక అస్టోత్తరమె తరువాయి.ఎలాగో అలా రొట్టి చేయాలి.చెంబు విస్త్రీ చేసినట్టు బట్టపరచి రొట్టె పిండి వుండ దానిమీద పెట్టి పైన మళ్ళి తడిబట్ట వేసి మంచి నీళ్ళ చెంబుతో నొక్కితే రొట్టి సాగలేదు.అప్పుడు చెంబు పడుకో బెట్టి అప్పడాలకర్రలా ఉపయోగించా!రొట్టె సాగింది.కాకపొతే మాటిమాటికి పొడి పిండి వెయ్యాలి.ఉపాయం బాగా పని చేసింది జ్ఞానా !తిట్లు తినకుండా నా రొట్టి విరిగి నేతిలో పడింది.నువ్వుకూడా ప్రయత్నించి చూడు.వెధవ అప్పడాల కర్ర లేకపోతె ఏమాయే! ఇంతకీ అప్పడాలకర్ర దొరికిందా? డిష్ వాషర్ లోనే కూర్చుంది.అందుకే నాకు డిష్ వాషర్ అంటె
ఒళ్ళు మంట .అది నిండే దాకా ఆన్ చెయ్యలేము.చేసాక ఘంటలువదిలేయ్యాలి.హాయిగా ఎప్పటికప్పుడు కడిగి అవతలపారేస్తే బాధ వదిలిపోతుందిజ్ఞానా!ఇవ్వాళా మా తోటి కోడలికి ఘట్టిగా చెప్పా,నాకు చెప్పకుండా నువ్వు కనిపించినవన్ని అందులో పారేసి ఆన్ చెయ్యకుఅని.
భగవంతుడు ఈబుర్రకి కాసిని ఉపాయాలు అందించాడుకాని లేకపోతె ఈ ఉత్క్రుష్టపు బతుకు ద్ధరించుకోలేక చచ్చే వాళ్ళం జ్ఞానా!ఇంతకీ ! ఏమిటంటావు జ్ఞానా!డిష్ వాషర్లో కత్తులు,అప్పడాలకర్రలు వెయ్యోచ్చా !
అంది అచ్యుతం .

Thursday, August 13, 2009

శ్రీ కృష్ణభగవాన్

శ్రీ కృష్ణ భగవాన్
ఒకోకసారి మన అలవాట్లు, మన ఆలోచనలు కలిసిన వారు తటస్థ పడితే దగ్గిరయిపోతారు ఒకబాంక్ కి
నేను మా ఆయనా వెళ్ళాము . బ్యాంకు పని అయి వచ్చేస్తూవుంటే ఆ మానేజర్గారు "మీరెప్పుడైనా కాత్యాయని గుడికి వెళ్ళారా?అని అడిగారు.గుడిమీదుగా చక్రవర్తిగారిరోజ్ గార్డెన్ కి చాలాసార్లు వెళ్ళాము కాని గుడి కివెళ్ళ లేదు,అన్నాను. మిమ్మల్ని చూస్తె అడగాలనిపించింది ,మీకు దైవ భక్తీ ఉన్నట్టు అనిపించి అడుగుతున్నాను,మా ఆవిడ ప్రతి శుక్రవారం వెడుతుంది. నాకేమో ఆఫీసు ,పిల్లలకి స్కూలు ,ఒక్కతే వెడుతుంది.మీరు వస్తారంటే వచ్చి తీసుకు వెడుతుంది.అన్నాడు.అంతకంటేనా?తప్పకుందారమ్మనమని చెప్పండి.అన్నాను. అప్పటి నుంచి తను నేను క్రమం తప్పకుండా గుడికివెళ్ళే వాళ్లము .ఆగుడితో తరువాత చెప్పలేని అనుబంధం ఏర్పడింది.సుజాత వాళ్ళకి బొంబాయి
బదిలీ అయాక కల్పకం,సుశీల,ఉషారాణి కలిసి ప్రతి పౌర్ణమికి వెళ్ళే వాళ్లము. అది వేరే కథ.
ఒకరోజు సుజాత దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది.ఉడిపిలో కృష్ణ మందిరం వుండి.అక్కడే లక్ష గీతాలేఖన యజ్ఞ మందిరం కడుతున్నారు.అందులో భగవద్గీత వ్రాతప్రతులు పెడతారుట. భగవద్గీత ౧౮ అధ్యాయాలు శ్లోకాలు,తాత్పర్యంతో సహా ఏభాషలో నైనా వ్రాసి త్వరగా వారికి పంపుతే మంచిది.మీకు ఇలాటివి ఇష్టం గనుక వ్రాస్తున్నాను,అని ఉడిపి కృష్ణ మందిరం చిరునామా కూడా పంపింది.అలాగే వ్రాస్తానని జవాబు వ్రాసాను.కొత్త పుస్తకం తెప్పించి గీత దగ్గర పెట్టుకొని ఒక నెలలోపే ౧౮ అధ్యాయాలు వ్రాసి పోష్ట్ లో పంపాను.
మా ఇంటికి ఒక బంధువు వచ్చాడు.ఒక గోనె సంచి వెంట తెచ్చాడు.రోజు ఆయన బయటికి వెళ్ళే టప్పుడు న్యూస్ పేపర్లో ఏవో చుట్టి తీసుకెళ్ళే వాడు. ఆయన వూరువేల్లిపోతూ టాక్సీ ఎక్కుతుంటే గెస్ట్ రూంలోకి తొంగి చూచా.అక్కడొక పాకెట్ వుండి.ఏదో మర్చిపోయారు,తీసికేల్లండి అని పరుగెత్తు కెళ్ళి చెప్పా. "అది మేకేనన్డీ!అన్నాడాయన.మాకా!అని పేపర్తిఇసి చూస్తె అది ఒక కృష్ణ విగ్రహం.గన్మెటల్డి .సావిట్లోవీధి గుమ్మం ఎదురుగా ఒక కిటి కీ
లో పెట్టాను.పూలు పెట్టడం,బట్టలు కట్టడం ,గొలుసులు అలంకరించడం అలవాటయింది. వస్తూపోతూ ఆయన్నోకసారి పలకరించడం అలవాటయింది. కృష్ణాష్టమికి భగవద్గీత అంతా పారాయణ చేయడం మామూలయింది.మాకు ఐదో
అబ్బాయిలా అతుక్కు పోయాడు.
పిల్లలు విదేశాలకి వెళ్ళాకా వాళ్ళకి పంపుదామని నాలుగయిదు సార్లు పాక్ చేయడం, చోటు చాలక పోవడం మల్లి పాకెట్ విప్పి అలంకారం చేసి కితికిఇలో పెట్టడం ,ఇక ఈయనకి మనల్ని వదలడం ఇష్టం లేదు.ఎక్కడికో పంపాలన్నా ఆలోచనకి స్వస్తి చెప్పాము.మంచి,చెడు ఆయనతో ముచ్చ తించుకోవడం అలవాటయింది.మమ్మల్ని
చూచే భారం నిదె అని చెప్పుకొంటూ,కొద్దిరోజులు ఆయన్ని చూడకపోతే ఎలావున్నదో ఏమో !అని దిగులుగా వుంటుంది.వేదనా హరుడు ,పరిపాలకుడు,కరుణామయుడు,మాక్రుష్ణుడు.

Tuesday, August 11, 2009

గాజు పూసలు





గాజుపూసలు
"ఇందులోగాజుపూసలు ,గంటలు,అద్దాలు,టికిలీలు వున్నాయి అత్తయ్యగారూ వీటితో మీరేమైనా
చేస్తారా?అని ఒక ప్లాస్టిక్ సంచి ఇచ్చింది మాకోడలు,తీసుకొన్నాను.చూస్తె అందులో మెరిసే చిన్న చిన్న పూసలు వున్నాయి.మా చిన్నతనంలో ఇలాటి పూసలు జాకెట్లపై కుట్టుకోనేవారు. చేతిఅంచులకు
వ్రేలాడేలా ఆర్చీలు కుట్టే వారు.ఆతర్వాత ఎప్పుడు ఈపూసల వూసేరాలేదు.ఇంకా అందులో ప్లాస్టిక్ పూసలున్నాయి ఓమోస్తరు పెద్దవే.గోదుమగింజ ఆకారంలో ప్లాస్టిక్ పూసలు తెల్లవీ వున్నాయి.
ఆరోజుల్లో ఇలాటివే ఎరుపు,ఆకుపచ్చ,పసుపు పచ్చ ,నీలంకోటింగ్ కొట్టినట్లుగా గాజు పూసలు
వచ్చేవి.వాటితో పర్సులు కుట్టేవాళ్ళు. రంగురంగులుగా వుండి ఆకర్షణీయంగా వుండేవి.ఈ పూసలు
తెల్లగావున్నా వెండివాటిలా మెరుస్తున్నాయి. వాటితో ఏమన్నా చేద్దామని మొదలెట్టాను.*ఈ చుక్క
లాగా ఆరుపూసలు ఆరు కోణాలు గా గుచాలి,తరువాత రెండు కోణాల మధ్య ఒక పూస
వచ్చేలా గుచ్చాలి.ఆరుకోణాల మధ్య అయిదు పూసలు పడతాయి ఇలాగుచ్చితే పువ్వులా
వస్తుంది,ఆపువ్వుని ఆధారం చేసుకొని ముందుకు విస్తరించుకోవాలి మనకు కావలసిన కొలతలలో.
కాని అది గుర్తు రాదే! ఎన్నిసార్లు గుచ్చి తీసిపారేసానో! రెండు రాత్రులు నిద్ర లేదు.తెల్లారగానే మళ్ళి
శోధన ప్రారంభం .మనః ఫలకంపై ఆడిజైను వుండి,చేద్దామంటే రావడంలా.జయని అడిగాను "ఎలాగుచ్చాలే!నీకుతెలుసా!అని."ఆతెలుసు అంది. గళ్ళు గళ్ళు గా వచ్చేటట్లు గుచ్చినది,కాని
అదికాదు నాకు కావలసింది.హఠాత్తుగా ఒకరోజు నే కోరుకొన్న డిజైను వచ్చేసింది.ఎప్పటెప్పటి
విషయాలు మనసులో నిక్షిప్తమై వుంటాయికాబోలు! సాధన చేస్తే సంవత్సరాల పొరలు చీల్చుకొని
బయట పడతాయేమో!ఆడిజైను చూస్తె ఎంత ఆనందం వచ్చిందో! పాత స్నేహితురాల్ని చూసినట్లే!
వాల్ హాన్గార్స్ గంటలు ,పూసలతో తయారుచేసా.చిన్నపూసలుయ్యాల తయారుచేసా ,కత్తెరలు,దారాలు,హుక్కులు సేకరించి మొదలెట్టా .మంచి కాలక్షేపం తయారయింది.
రాధిక దగ్గరికి వెళ్ళినప్పుడు వాల్ హాన్గింగ్ గంటలది,సహనకి నెక్లెస్ ఇచ్చాను.
రాధిక అంది "ఇంకోమ్మా!ఇక్కడ జోఆన్ అనేశోపువుంది,నిన్నుతీసుకు వెళతా !నీకుకావలసినన్ని
దొరుకుతాయి అని తీసుకెళ్ళింది ,ఆ షాపులో ఎమేజింగ్,ఎన్నోరకాల పూసలు,సామగ్రి వున్నాయో
చెప్పలేను.ఆ షాప్ ఎంతో నచ్చేసింది.చెవులకి హాన్గింగ్లు తయారు చేయడానికి చిన్నకోక్కాలు,నేక్లేస్లకి
పెట్టె హుక్స్, నైలాంత్రేడ్ ,నైలాన్ వైరు ,కాపెర్ వైరు, కొనుక్కొన్నాను.పూసలతో కాంబినేషన్స్ పెట్టి
నెక్లెస్,బ్రేస్లేట్ ,హన్గింగ్స్ తయారుచేసా.సహన కూర్చుని"కెన్ఐ హెల్ప్ యు అమ్మమ్మా!అనేది.ఓకే అంటే
చెప్పిన ఆర్డర్ లో పూసలు అందించేది.గొలుసు పూర్తవగానే"ఈజ్ ఇట్ ఫర్ మీ అమ్మమ్మా!అని అవును
అంటే మెడలో పెట్టుకు "అమ్మా ,నాన్నా ! సీ మై నెక్లెస్ అని ఆనందంతో గంతులు వేసింది.చిన్న వస్తువుతో దాని కళ్ళు వెలిగిపోయాయి.నే వెళ్ళిన చోటల్లా ఆడ పిల్లలు నాకు దోస్తులయిపోయారు.జోఆన్ కు ప్రదక్షిణాలు చేస్తూనేవున్నా ! జో ఆన్లో డబ్బు పెట్టినకొద్దీ ఖరీదైన్ రాళ్ళు,పూసలు,పెండేంట్లురకరకాలు .
జోఆన్ లో ఫాబ్రిక్స్ అమ్ముతారు.వరలక్ష్మి వ్రతం వస్తున్నదికదా!జిగేల్ మనే
బట్ట కొని అమ్మవారికి పరికిణాలుకుట్టి ఇచ్చాను.సాయిబాబా విగ్రాహాలకి
శాలువాలు ,కృష్ణాష్టమి అని కృష్ణుడికి చొక్కాలు కుట్టాను.శానిఫ్రసిస్కో
జోఆన్ లోకోన్నబొంగారాల వంటి ప్లాస్టిక్ పూసలు రంగురంగులలో
మెరిసిపోతూ,మిడిసి పడిపోతూ వుంటాయి.వాటిముందు పచ్చలు,కెంపులు
ఎందుకనిపించింది.
మనం అనుకొంటాము ఒకేపేరుగల షాప్ కదా!అన్నిచోట్లా చూడటం ఎందుకులే!
అని.కొన్ని వేరుగావుంటాయి,కొన్ని రకాలు అసలు వుండనే వుండవు. శాన్ఫ్రాన్సిస్కో
లోకొన్న మెరిసే పూసలు అట్లాంటాలో లేవు.డాలస్ లో వున్నాయిగాని,అట్లాంటాలో
కొందాములే అని బద్ధకించాను. ఇక కేనక్తికట్ లో షాపే కన పడలేదింకా! నలుగురిని
వాకబు చెయ్యాలి.రాణికి పూసలుచూపిస్తే అది వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ కి రకరకాలు కొనేసింది.
ఒక పూటల్లా సెలెక్ట్ చేసాము.తమాషా కదా !చీరలు అంతే!బాగున్నచీరలన్ని ఎవరు
కొనలేరు.వాటిని మనప్రక్క వాళ్ళు కొనుక్కొంటే మనంకోన్నట్లే సంతోషం.ఆడబుద్ది,అందరు
అందంగా వుండాలని కోరిక.బగున్నయనుకోన్నకొన్ని పూసలుచూస్తేమేడ్ ఇన్ ఇండియా
అనివున్నాయి.అక్కడ అలాటివి చూడనేలేదు.ఎగుమతికోసంమంచివి పంపివుంటారు.
దేశ ప్రతిష్ట నిలబెడుతున్నారని గర్వపడ్డా .పిల్ల రాణీలు అనఘ,అనన్యలకు ఎ పట్టు పరికిణీ
మీదకి ఆరంగు గొలుసులు కావాలి.అవి వేసుకు గుడికి వెళ్ళాలి.వాళ్ళమ్మ పండగలప్పుడు
హడావుడి అవుతుందని ఈమాచింగ్లు అన్ని చూసి వేటికవి పూసలనగలతోసహా ఒక
పెట్టెలో సర్దిపేట్టెస్తుంది.దండ గుచ్చగానే పిల్లలు"అమ్మమ్మనాన {జ్ఞాన}చేసింది అని మురిసిపోయి
ఆరంగు పరికిణా లో దాచేసేది.ఒకరిదండలు ఒకరుముట్టుకో కూడదు కావాలని అడగకూడదు,
ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా!అమితి దండ కట్టేదాకా మర్యాదగా పూసలందిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ అవగానే "మమ్మమ్మా!ఫర్ మీ? అని ఇచ్చాక చిన్నగవ్వలు గుప్పెడు గిలకరించి పారబోసినట్లు కిలకిలా నవ్వేది.ఇకేవ్వరికైన దండ గుచ్చుతానేమోనని పూసలన్ని డబ్బాలో పెట్టి
మరీ ఇంటికి వెళ్ళేది.సిరి,సుమ పెద్ద వాళ్ళు గనక సిగ్గు పడుతూ ,సంకోచిస్తూ తీసుకోన్నారుగాని
వారిచిరునవ్వు వికసించడం నాకుత్రుప్తినిచ్చింది. ఈ పూసలమూలంగా చిన్నతల్లులందరూ ఎంతో
దగ్గరయారు.ఈసంబరం విలువేంటో చెప్పగలరా!