స్నేహాన్ని కోమలమైన పూల తీగలాగా పెంచాలి.నమ్మకం అనే పందిరివేసి ,ఎడబాటు అనే ఎండ తగలకుండా,స్వార్ధం అనేబురద పేరుకు పోకుండా,ఓర్వలేనివారనే మేకలకి అందకుండా ,పెంచాలి.ఎందఱో స్నేహితులని చెప్పుకొన్నా కొందరే నిజమైన "హితులు"గా నిలబడతారు.స్కూలు స్నేహం,కాలేజి స్నేహం,ఆఫీసు స్నేహం,ప్లేగ్రౌండ్ స్నేహం,వాకింగ్ స్నేహం,రైలు ప్రయాణం లో స్నేహం,ఇలా జీవితం లో ఎన్నో తారస పడతాయి.ఇవన్ని జల్లిస్తే చివరికి వ్రేళ్ళపై లేఖక్ పెట్టగలవి మిగిలితెగోప్ప!నిటు జీవితం లో స్నేహాలు నిరాఘాటంగా సాగిపోతూనేవుంటాయి.అవుసరం వచ్చినప్పుడు వెన్ను దట్టి నిలబడ్డస్నేహితులే స్నేహితులు.వీరికోసమ్ వారు,వారి కోసం వీరు ఎన్నో త్యాగాలు చేస్తారు,ఒకరికోసం ఒకరు సమయము , ఖర్చు చేస్తారు, ఒకరు పైకి రావాలని మరొకరు గాధముగా వాన్చిస్తారు ఒకరి ఉదాసినతను మరొకరు భరించలేరు,విన్న కబుర్లువారికి చెప్పాలని,తిన్న తీపి వీరికి తినిపిన్చాలనితహతః లాడుతారు,రెండు శరీరాలు ఒకే ప్రాణంగా జీవిస్తారు,ఇరువురి మధ్య దాపరికాలు,తెరలు వుండవు,ఎన్ని మెట్లెక్కితే అలాటి స్థితికి రాగలరు?
అలాటిది,చిత్రంగా పెళ్లి కాగానే దూరమయిపోతూ వుంటారు.ఎందుకిలా జరుగుతాయి?
భార్యా భర్తలు అన్నాక ఒకరివేపు బంధువుల్ని ఒకరు గౌరవించడం ,ఒకరి స్నేహితుల్ని ఒకరు భరించడం తగ్గిపోతున్నది.వయస్సు పెరిగాక వివాహాలు కావడం,ఆర్ధికంగా ఇరువురు సర్వ స్రతంత్రులు కావడం,స్వార్ధం కారణాలు కావచ్చు.సుఖ సంసారానికి పరస్పర అవగాహన గౌరవం పునాది రాళ్ళు.స్త్రీకి తన భర్త ప్రతిక్షణం తనకే చెందాలని,ఆటను సంపాదించే ప్రతి పైసా తనకే కావాలని అనుకోవడం సహజమే!కాని "ఇందమ్మా!అంటే అందమ్మా!"అనే సూక్తి మర్చిపోతున్నారు.వివాహన్ అయాక ప్రాణ స్నేహితుల్ని చిన్న చూపు చూడటం,అసలు చూడక పోవడం కూడా కద్దు.భార్యా భర్తల మధ్య ఎలాటి ప్రేమ వుంటుందో -స్నేహితుల మధ్య అలాటి ప్రేమే వుంటుంది-కాక పొతే స్నేహితుల మధ్య ప్రేమ ఏమి ఆశించనిది .
పెళ్లి అయాక స్నేహితులు ఇంటికి వస్తే భార్యగాని,భార్తకాని వారు తమకూ స్నేహితులేనని భావించి ఆదారంగా ఆహ్వానించి స్నేహితులిద్దరూకబుర్లు చెప్పుకొంటూ ప్రాశాంతంగా గడిపేందుకు దోహదం చెయ్యాలి,అంతేకాని భార్య స్నేహితురాలు రాగానే"వచ్చిందా!తీతువు పిట్టలాగా కూస్తూ అస్తమానం తయారవుతుందేమిటి?వేళాపాళా లేదా?అని భర్త విసుక్కొంతెభార్య మ్లాన వదనం తో స్నేహితురాలికి స్వాగతం చెప్పగలదా?భర్త స్నేహితుడు రాగానేఆవిడ"తయారయాడా?జిడ్డులా వదలడు.ఇవతల పెళ్ళాం ,బిద్దలున్నారని జ్ఞానమేలేదు .పకపకలు,వికవికలు.కబుర్లల్లో పడ్డారంటే కాలమేతెలియదు.వీరందరికి నేను వండి వార్చ లేనుబాబూ!అని భార్య ఈసడిన్చుకొన్టే భర్త తన స్నేహితుడిని నవ్వుతూ పలకరించ గలడా?
ఇద్దరు ఇరువేపులా స్నేహాలు వడులుకొంటే-జీవితాలు సహారాఎడారుల్లా తయారవుతాయి. సంశయాలు, ఉద్వేగాలు, మానావమానాలు భయాలు, ఊహలు,సంతోషాలుఒలక బోసుకోడానికి ప్రతి మనిషికి అందుకొనే మనసొకటి కావాలి. ఎంత వయసు వచ్చిన వారైనా ఆ మనసు కోసం,తమ మాటలు ఓర్పుగా వినే చేవికోసం వెతుక్కొంతూనే వుంటారు. ఒకరి స్నేహుతుల పై ఒకరు కామెంట్లు వడులుతూంటే , తమ స్నేహం భాగస్వామికి నచ్చలేదని తెలిశాక మౌనంగా స్నేహానికి తిలోదకాలిస్తారు సంస్కారులు.ఎదురు మాట్లాడలేక స్నేహితుల్నిమర్చిపోవడానికి ప్రయత్నిస్తారు.వారి స్థితి తలచుకొంటే ఎంతో జాలి వేస్తుంది.
Tuesday, September 29, 2009
Saturday, September 26, 2009
కృష్ణా పత్రికలో రావూరు కురిపించిన వడగళ్ళు

కృష్ణా పత్రికలో చాలా సంవత్సరాలు వారం వారం రావూరుగారి హాస్య ప్రధాన మైన "వడగళ్ళు" కురిసేవి.శ్రీ ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయం చదవాలని,వడగళ్ళు చదివి నవ్వుకోవాలని పాఠకులందరూ శుక్రవారం విడుదల అయ్యే కృష్ణా పత్రిక కోసం ఎదురుచూసేవారు.హాస్యం అందరికి ఇష్టమే!హాస్యంగా వ్రాయడం సులువైన పనికాదు.రావూరు అందులో కృత క్రుత్యు లయారు.వడగళ్ళే
కాక కప్పుకాఫీ ,ఆషామాషీ ,గులాబిముళ్ళు,పిల్లన గ్రోవి ఇలాఎన్నో హాస్యరచనల పరంపర వారి కలం నుండి వెలువడ్డాయి .
ఎవరితోనో మాట్లాడుతుంటేనో ,పేపర్లో ఏదో వార్త చదివో ,చుట్టు
పక్కల జరిగిన ఏసంఘతనో ,మనుషుల బలహీనతలను,అలవాట్లు ,ఊతపదాలు,రాజకీయాలు,సినిమాలు,ధరలు ఎన్నో ఈ వడగళ్ళలో చోటు చేసుకొనేవి.ఇంతేకాక వడగళ్ళ పందిరికింద ముసిముసి నవ్వులు నవ్వుతూ కధానాయకుడు మల్లినాధసూరిగారు వారం వారం కనిపించేవారు.
చాలాకాలం క్రితం యువభారతి సంస్థ వారు "వడగళ్ళు" చిన్న పొత్తం అచ్చు వేసారు.ఛి వంశీ తనసైటులో"వ్యాసావళి " శీర్షిక లో ఆ వడగల్లనికురిపిస్తున్నాడు.ఒకదానివేనక ఒకటి ధారావాహికంగా వస్తున్నాయి.మాగంటి .ఆర్గ్ లోకి వెళ్లి హాస్య ప్రియులు చదివి ఆనందించి,ఆ ఆనందాన్ని వంశీకి అందించండి.
జ్ఞాన ప్రసూన

Friday, September 25, 2009
ఎస్.వరలక్ష్మి
ఎస్.వరలక్ష్మి
ఒకప్పుడు దగ్గరగా మెలిగిన వ్యక్తులు -నదిలో కలప లాగా ఎటో కొట్టుకు పోయి విడిపోతారు.మళ్ళి కలవరు.ఎందుకని కారణ మేమిటి?
అని ప్రశ్నిస్తే కారణం ఎమీ దొరకదు.ఎస్.వరలక్ష్మి గారు చనిపోయారనగానే నాకు అలానే అనిపించింది. కాని వారిని గురించిన జ్ఞాపకాలు ఒక్కసారి కళ్ళ ముందు తిరుగుతాయి.మా నాన్న గారు సినిమాలకి వ్రాసేటప్పుడు మాకు రెండు సంస్థలవారితో పరిచయం వుండేది.ఒకటి భరణి,రెండు రాజ రాజేస్వరిసంస్థ .కన్నాంబ గారు,కడారు నాగభూషణం గారు రాజ రాజేశ్వరి సంస్థ అధిపతులు.ఎస్.వరలక్ష్మిగారు
వారి సినిమాలలో నటించేవారు.నాన్నగారు వ్రాసిన "సతి సక్కుబాయి "సతీ సావిత్రి"సినిమాలలో వరలక్ష్మి గారు ప్రధాన పాత్రలు పోషించారు.
వీటికి సంభాషణలు నాన్న గారే వ్రాసారు.
మద్రాసుకు బంధువులు వచ్చినా,స్నేహితులు వచ్చినా సినిమా షూటింగులు చూడాలని సరదా పడేవారు. వారితో పాటు నేను వెళ్ళేదాన్ని.ఒకసారి అలా వెళ్ళినప్పుడు కన్నాంబ గారు, వరలక్ష్మిగారు, జిక్కి గారు అక్కడ వున్నారు. షూటింగ్ విరామంలో బయట కూర్చున్నారు,నేను కూర్చున్నాను.జిక్కి గారు అందరికి గొంతు దానమిస్తే,కన్నాంబగారు,వరలక్ష్మిగారు తమ పాటలు తామే పాడుకొనేవారు."మేము ఎన్నో సినిమాలలో పాడాము,మాకు సంగీతం అంతా కొట్టిన పిండి "అనుకోనేవారుకాదు.ఒకవేపు నటిస్తూ,పాడుతూ
నిత్యమూ గురువుల వద్ద సంగీత సాధన చేసేవారు.కన్నాంబగారయితే
నాటకాలలో ఎంతో పెరుతెచ్చుకొన్నారు.ముగ్గురు కూర్చుని రాగాలుసంగతులు వేసుకొంటూ పాడుకొంటున్నారు.కన్నాంబగారంటే అందరికి తల్లిలాటి గౌరవం.ఆమె అన్నారు"నేనొక సంగతి పాడతా విని మీరూ పాడాలి." అని.పాడారు.జిక్కిగారు,వరలక్ష్మిగారు ప్రయత్నించారు కాని ముందుకు వెళ్లలేకపోయారు,వారిద్దరూ కన్నాంబ గారికి దణ్ణం పెట్టి
"అమ్మా!ఇలాటి సంగతులుపాడి మమ్మల్ని పరీక్ష పెట్టకమ్మా!మీలా మావల్లకాడు.అన్నారు.నవ్వుకొంటూ ముగ్గురూ లేచి వెళ్లిపోయారు.ఆనాటి వారిలో రాదనీ చెప్పగాలిగేనిజాయితీ,ఇంకా నేర్చుకోవాలనే అభిలాషా ,స్వచ్చతా ముచ్చట వేసింది.వారు నిత్యోపాసకులు.
మా పెద్దబ్బాయి పుట్టినపుడు వరలక్ష్మిగారు పురుటిలోనే బాబును చూడటానికి వచ్చి వెండిదికోలకంచం ఇచ్చారు."అబ్బో!ఇంతదా!"అన్నాను నేను ఆమె నవ్వి"అన్నం తినే కంచం ఇప్పుడే ఇచ్చారేమిటి?అనుకొంటున్నావా?మీ అబ్బాయి నేనిచ్చిన కన్చంలోనే తినాలి.ఈలోపల తాతగారు చేయిస్తారేమోనని పట్టుకు వచ్చా "అన్నారు.అలాగే మా అబ్బాయి ౧౨ ఏళ్ళు వచ్చేదాకా ఆ కంచం లోనే భోజనం చేసాడు.
నవ్వుమొహంతో నిండుగా తెలుగు పడతిలా వుండి తన మధుర గానంతో ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకొన్నారు వరలక్ష్మిగారు.ఆమె ఆత్మకు శాంతి నియ్యలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.వరికుటుంబానికి నా సానుభూతి అందజేస్తున్నాను.

Saturday, September 19, 2009
Saturday, September 12, 2009
సూప్
సూప్
సూప్ తయారు చేయడం కొంచెం టైమె పట్టినా తొందరగా జీర్ణమవుతుంది. బలహీనంగా వున్నవాళ్ళకి ,పెద్దవాళ్ళకి ఇది సులువుగా జీర్ణమయ్యె ఆహారం .ఇందులొ కూరగాయలు ఎక్కువ్ వెస్తారుగనుక వంటికి మంచిది.
ఒక బంగాళాదుంప,ఒక ఉల్లిపాయ, రెండు కారెట్ దుంపలు, వంద గ్రాములు కాబెజి ,చిన్నసొరకాయముక్క వీటిని తరిగి తగినన్ని నీళ్ళుపొసి ఉడికించాలి. స్టౌ మీంచి దింపి చల్లారాక నీళ్ళువిడిగావుంచి ముక్కలు మిక్సీలొ వెసి మెత్తగా తయారు చేసుకొవాలి. అప్పుడు ఇందాక పక్కన పెట్టిన నీళ్ళు అందులొ పోసి,తగిన ఉప్పు ,చిటికెడు పసుపు,తినగలిగెవారు చిటికెదు కారం,మసాలా ఇష్టముంటె కాస్త వేసి ఒకసారి స్టౌ మీదపెట్టి వేడి చెసుకొని దింపి బౌల్ లొ పొసి పైన తరిగిన కొత్తిమీర వేసి, కాస్త జీలకర్ర,సొంపు నెతిలొ వేగించి అందులొ వేసుకొని తాగితె బాగుంటుంది. బ్రెడ్ ముక్కలు చిన్నవి నూనెలొ వేయించి దీనిలొ వేసుకు తింటె రుచి బాగుంటుంది.

Saturday, September 5, 2009
గురుభ్యోనమః:
గురుభ్యోనమః:
గురువు అనే పదం వినగానే ఎంత వాళ్ళయినా కొంత
కుంచించుకు పోతారు. గౌరవం తో ,భయంతో మనసు మూగది అయిపోతుంది.పుట్టి కళ్లు తెరిచాక అమ్మ ఇచ్చిన అమృత తుల్య మైన
చను బాలు రెండు చుక్కలు గొంతులో దిగినప్పటినుంచి పసి హృదయానికి సర్వ జగత్తు విచిత్రంగా వుంటుంది.గురువులా భాసిస్తుంది.
ఇక క్షణ క్షణము నేర్చుకోడమే జీవిత ధ్యేయ మయిపోతుంది.అమ్మ,నాన్న కుటుంబ సభ్యులు వీరే గురువులుకాని గురువులై ఎన్నో మాటలు,చేష్టలు మేధలో ముద్రిస్తారు.
నిజంగా బడికి వెళ్ళాకా మొదటి గురువు కి మనసు సింహాసనం వేస్తుంది.జీవితాంతము ఆ గురువును తలచుకోగానే మనః ఫలకం పై
లీలగా వారి రూపం కనిపించి బరువైన మొగ్గ తలవాల్చినట్లుఒరిగిపోతుంది.
నా చిన్నతనంలో మేము బందరులో వుండే వాళ్ళం ఖోజ్జిలి పేటలో ,కొంచెం దూరంలో కోటవారి తుళ్లు అని కూడలి వుండేది.మా ఇంటి నుంచి సరాసరి వెళ్లి ఎడం చేతి వేపుకు తిరిగితే ఆక్కడ తాడేపల్లి హయగ్రీవ రావు గారి మేడ వుండేది .ఆ ప్రాంతాలలో మా బడి.అంటే ఒక్కటే హాలు,వెనక చిన్న పెరడు.అక్కడజామ చెట్టు వుండేది ఆ చెట్టు కొమ్మ కిందగా వుండేది.దానిమీద కూర్చుని స్నేహితురాలితో "మామిడి కొమ్మలు చిగురించేన్ ,ఒక మారిటు చూడవే కోకిలా" అని పాడుకొన్న దృశ్యం కళ్ళల్లో వుండి. మా టీచరుగారి పేరు కృష్ణ వేణి .జుట్టు తెల్లబడిపోయి ,నేత చీర కట్టుకొని ,చేతిలో బెత్తం పట్టుకొని ,స్థూలకాయంతో నిర్లిప్తంగా మాకు అక్షరాలు,పాటలు,ఆటలు నేర్పేవారు.
ఆవిడతో మాట్లాడటం కాదు ఆవిడ వంక చూడాలంటే భయం.నా మొదటి గురువు ఆవిడే!ఆమె ఆత్మకో నమస్కారం.
బడిలో నుంచి బయట పది హమ్మయ్య అనుకొందామంటే వేరే
స్కూలులో హెడ్మాస్టర్ చేస్తున్న రాజమ్మగారు మా పక్క వాటాలో వుండే వారు.మా వంటింటికి వాళ్ల వంటింటికి మధ్య తడికె అడ్డం.వెదురు పెళ్లతో
అల్లి కాంతలు కంతలుగా వుంటుంది.మాటలు ఒకరివి ఒకరికి స్పష్టముగా వినిపించేవి.ఎప్పుడన్నా అన్నం వద్దంటే ,పెరుగు వద్దంటే ఆవిడ వాళ్ల వంటింట్లో నుచి హూ అని ఘట్టిగా అనేవారు,అంటే పిల్లిలా అమ్మ పెట్టినది తిని బయట పడేదాన్ని.ఆమెకి ఇద్దరు చెల్లెళ్ళు వుండేవారు,వారు నన్ను
భయపెడుతూవుండేవారు.రాజమ్మ టీచరుగారంటే నెత్తిమీద దేవత ,మాట వేద వాక్కు.ఆవిడ ఎర్రగా ,పొట్టిగా ,వత్తరిగా వుండేవారు.చేతికి వాచీ ,ఖద్దరు చీర ,గంభీర మైన వాక్కు.మారాలు చెయ్యకూడదు,టైం కి అన్ని పనులు చెయ్యాలి అని ఆమె నేర్పారు.వారింట్లో హిందీ క్లాసులు జరిగేవి.అందరూ,ఆఖరికి మా అమ్మ కూడా,హిందీ టీచరు కూడా ఆవిడ
మాట వింటుంటే నాకు ఆవిడంటే అభిమానం ఇంకా పెరిగి పోయింది.నాకు
టీచరు కాక పోయినా పరోక్షంగా బుద్ధులు నేర్పించిన గురువుఆమే.ఆమె
ఆత్మకు నమససులు.
గురుజాడ రాఘవ శర్మగారు వుండేవారు.మానాన్న గారు
ఆయనా తరుచు కలుసుకొనే వారు.మేము చేమ్మనగిరి పేటలోవుండగా
మా ఇంటి వెనక "చల్ల బజారు "వుండేది.చుట్టూ పక్కల పల్లెటూర్ల నుంచి
పెరుగు పిడతలలో తోడు పెట్టి తెచ్చి అమ్మేవారు.మనకి ఎంత ఖరీదుకి ఎంత చిన్న పిదతతో కావాలన్నా పెరుగు దొరికేది.చాలా మంది పెరుగు
కోసం చల్ల బజారుకి వచ్చి మా ఇంటి మీదుగానే వెళ్ళేవారు .రాఘవ శ్ర్మగారుకూడా రోజు వచ్చేవారు.నాన్నగారి దగ్గరికి వచ్చి "అక్కడ పెరుగు కొనుక్కోడం,ఇక్కడ మీగడ తరకలు ఆస్వాదించడం .అనేవారు.ఆయన పద్యం ఎలా చదవాలో చెప్పేవారు.ముందే భాగవతం లోని సరస్వతీ ప్రార్ధన "శారద నీరదేందు "చెప్పారు.ఆపద్యం అంతా ఒకేసారి చదవాలిఆపకుండా,మదిగానగ నేన్నెడు గొల్తు భారతీ !నాలుగోపాదంలో మది దగ్గర కాస్త ఆపవచ్చు .ముందు అలా చదవడం నేర్చుకో అన్నారు.
ఎంత కష్ట మయ్యేదో!ఒకోసారి రోడ్డు మీదనుంచి కేకవేసి "ఏమి అమ్మాయీ !వచ్చిందా!అనేవారు.నేను పైనుంచి వెర్రి మొఖం వేసి నిలబడే దాన్ని. రేపు చెప్పు అని వెళ్ళేవారు.పద్యం విరవకుండా చదవడం నేర్చుకొన్నా.వారి ఆత్మకి నమస్సులు.
ముట్నూరి కృష్ణారావుగారి భార్య పేరు "రుక్మిణమ్మ గారు .ఆమె చాలా విశాల హృదయురాలు.మనిషిని చూస్తె నమస్కరించా లనిపించేది.వారిద్దరి పేర్లు ఎంత బాగా కలిసాయో! ఆమె సంక్రాంతి పండగకి ఇంట్లో కుంకుమ తయారు చేసి ,గుర్రపు బండి మీద కొందరి ఇళ్ళకు వెళ్లి వారిని పిలచి బండీలోంచే బొట్టు పెట్టి కుంకుమ అందించేవారు.వారు ఆమె పాదాలకు నమస్కరించేవారు.ఈద్రుశ్యం నా కళ్ళలో వుంది. అందరికి ఒక వట వృక్షం లా వుండేవారామే.ఒకసారి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు శతకాలు బాగా చదివి కంఠస్థం చేయాలని చెప్పి పద్యం చదివే టప్పుడు భావం చెడకుండా ఎక్కడ ఎలా ఆపి ఆపి చదవాలో చెప్పారు.అది మర్చిపోలేను.తరవాత నేను నేర్చుకొన్న పద్యాలు చదివించుకొని విని ఆశీర్వదించేవారు.ఆమెనాకొక గురువే!ఆమె ఆత్మకు నమస్సులు.
మానాన్న గారి బాల్య మిత్రుడు దాలిపర్తి నారాయణరావు అని వుండేవారు.మానాన్నగారి స్నేహితులందరినీ నేను "బాబాయి "అని పిల్చేదాన్ని.ఆయన దగ్గర టీచింగ్ కెపాసిటీ ఎక్కువ వుండేది.తరవాత ఆయన నిజంగా టీచెరు అయి ఫాక్టరీలో లాగా విద్యార్ధులను డిగ్రీ కళాసాలలనుడి బయటికి విడుదల చేసారు.ఆయన పద్యం చదివి" వీణలు మ్రోగగా "అని వున్దెదనుకొన్ది.ఆయన రెండు చేతులతో వీణ వాయిస్తూ టుం టుం అని వీణ శబ్దం చేసింది అని చెప్పేవారు. శబ్దానికి ధ్వని తో అర్ధం అయేలా చెప్పాలని ప్రయత్నించేవారు.ఏదైనా చెప్పమంటే అరటి పండు వలిచి చేతులో పెట్టినట్లుగా చెప్పే సామర్ధ్యం ఆయనకీ చాలా వుంది.పద్యాలు హ్రుద్యమంగాచదివేవారు.ఎన్నిసార్లు మళ్ళి మళ్ళి అడిగినా విసుగు లేకుండా పద్యాలు చదివి వినిపించేవారు.ఆయన నాకొక గురువే!ఆయన ఆత్మకి నమస్సులు.వీరందరి చలవతో నా మనస్సనే హంస సారస్వత మనే తటాకంలో షికార్లు చేసింది.తియ్య తియ్యని లడ్డూలు అందించే బందరులోని ఆ బాల్యపు మధుర స్మ్రుతులివి . అందుకే కబీరు అంటాడు, గురువే దేవుడని.

Thursday, September 3, 2009
నివాళి
నివాళి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి గారి
ఆకస్మిక మరణానికి చింతిస్తూ నివాళి
అర్పిస్తున్నాము.జీవితానికి మరణానికి
మధ్య వుండే ఆ వెంట్రుక వాసి తేడాని
విచిత్రంగా దర్శింప చేసే ఈ హతాన్మరణాలు
కాల పురుషుని చాతుర్యాలు.

Tuesday, September 1, 2009
దసరా నెల
దసరా నెల
దసరాని కొంచెం అటు ఇటు తిప్పితే సరదా నెల అనికూడా అనుకోవచ్చు.దసరా మనకి పెద్ద పండగ కింద లెఖ్ఖ .ఈ పండగ తొమ్మిదిరోజులు గడుపుకొంటాము.పౌర్ణమి దాకా కొందరు అమ్మవారిని పూజిస్తారు,ఓపిక,అవకాశమూ .ఎన్నిరోజులు పూజించినా అమ్మ కాదనదు.మేము శరన్నవరాత్రులు చేయడం ౧౯౬౨ లో ప్రారంభించాము.
అప్పటినుంచి అప్రతిహతంగా నడుస్తూనే వున్నాయి.ఏదో పెద్ద అవాంతరం వస్తే ఒకటి రెండు సార్లు చేయలేదు అంతే!నవరాత్రి పూజలు
మొదలు పెట్టె వరకు అమ్మ మమ్మల్ని నీరసంలో ముంచి, పరిస్థితులు
అనానుకూలం చేసి ,ఆదాయపు దారులు మూసి ఏమిటి మీ సంగతి?
అని ప్రశ్నిస్తుంది.మానవ మాత్రులం,చేతకాని వాళ్లము, నీడయపై ఆధార పది వున్నాము, నీకన్న మాకు దిక్కెవరు తల్లీ!అని చేతులు జోడించి ప్రార్ధిస్తూ కూర్చుంటే,అమావాస్య నాడు వెన్నెల కురిపిస్తుంది.మా మనసులు నాట్యం చేసి పూజా సామగ్రి తేవడానికి పరుగెత్తుతాము.
చిత్రము తొమ్మిది రోజులు తొమ్మిది క్షణాలుగా దోర్లిపోతాయి.అంగ రంగ వైభవముగా సేవలు చేయించుకొంటుంది.కళ్ళనిండా రోజుకొక తేజో మూర్తియై మా కు పండగ చేస్తుంది. తన రూపాలుగా ఎంతో మంది ముత్తైదువలని రప్పిస్తుంది.మా నాన్నగారు నవరాత్రులు తొమ్మిది రోజులు ఏరోజు వంటకాలు,పప్పు,కూర,పచ్చడి,పులుసు, పిండివంట
ఏమి చెయ్యాలో వ్రాసి పెట్టేవారు, దానికి తగినట్టుగా రోజూ కూరలు
తెప్పించేవారు.పొద్దున్న పూజ అయాక,మహానివేదన చేసాక ఒక పద్యం వ్రాసేవారు,ఆ పద్యం అమ్మవారికి వినిపించి భోజనం చేసే వారము.నవరాత్రులలో నాగమల్లి పూలతో ,పారిజాతం పూలతో సహస్రనామాలు పూజ చేస్తే ఆ పూల పీఠము పై అమ్మవారు ఎంత సొగసుగా వుండేదో!ఇల్లంతా ఆ పరిమళాలు వ్యాపించి ఆ తల్లి నేనిక్కడే వున్నా!అని చెపుతున్న ట్లుండేది . ఆ తొమ్మిది రోజులు ఎంత
ఓపిక వచ్చేదో! విజయ దశమి నాడు అమ్మవారికి ఉద్వాసన చెపుతుంటే
కంటికి మింటికి ఏకధారగా మాకందరికీ ఆనంద భాష్పాలు దొర్లేవి.ఇల్లంతా
బోసిపోఎది,వంట్లో సత్తువంతా పోయి నీల్లుకారిపోయే వాళ్లము.అయినా
ఆ తొమ్మిదిరోజులు అమ్మకి సేవ చేసి ఆశిస్సులు మూట కట్టుకొంటే సంవత్సర మంతా బలంగా వుండేది. మా అమ్మగారింట్లో బొమ్మలు పెట్టె ఆచారం లేదు,ఒకసారి పెడితే ఏదో అనర్ధం జరిగింది.అప్పటినుంచి మాని వేసారు.బొమ్మలు కూడా పెడితే ఎంత హదావుడో! ఈతరం వాళ్ళకి పూజలు ,కొలువులు వట్టి ఖర్చుకిందా,వృధా శ్రమ కిందా అనిపిస్తున్నాయి.మన చుట్టూ వున్నా సంస్కృతిని ,కళలని విశ్వాసాలని
తామర తూల్లలా వెనక్కి నెట్టేసి దేనికో ఎక్కడికో ఈదుకుపోతున్నారు.

Subscribe to:
Posts (Atom)