Pages

Thursday, October 29, 2009

అరుదైన గౌరవం

అరుదైన గౌరవం
ప్రొద్దున్నే పేపర్ తిరగేస్తుంటే " హైదరాబాదు మహిళకు అరుదైన గౌరవం "అని కనపడింది . అహా! మనవూరే! ఎవరికి? అని చదివాను. "కల్పలత "అనివుంది.ఇంకేమి? మా కల్పలతే అయివుంటుంది అనుకొన్నాను. కల్పలత ఫొటో వుంది. నెను తనని చూసి ఎన్నో ఏళ్ళయింది. చిన్నప్పటి కల్పలతే నా స్మ్రుతి పధం లో వుంది. తన చలాకి తనం, తెలివి తేటలు,
మర్యాద అయిన ప్రవర్తన ఏమిటో తను ప్రత్యేకం గా అనిపించేది. ఫోటోలో చూస్తే ఆకళ్ళు, ఆనవ్వు మన కల్పలతే అనుకొన్నాను.
చాలా కాలం కింద మా అక్కా,బావగారూ,దోమలగూడాలో వుండే వాళ్ళు.
మెము పక్క భాగంలో వుండే వాళ్ళము. కల్పలత వాళ్ళూ మాఇంటికి దగ్గరలోనే వుండే వారు.వాళ్ళింట్లో అందరమ్మాయిల పేర్లు లతలే! వాళ్ళ ఇంటికి "లతా నికుంజం" అని పేరు వుండేది. కల్పలత మా అక్కయ్య గారి అమ్మాయి ఉమ మంచి జిగరీ దోస్తులు. రోజు కలిసేవాళ్ళు.కల్పలత మాడపాటి హనుమంత రావు గారి స్కూలులో చదివింది. ఆ తరవాత
నేనా స్కూలు లో పని చెస్తానని ఎన్నడూ వూహించలేదు.ఇప్పుడు కల్ప లత "అమెరికన్ చష్ట్ ఫిజీషియన్స్ కాలేజీకి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. నవెంబెర్ 1స్ట్ న బాధ్యతలు స్వీకరిస్తుంది. కల్ప లతకి "అరుదైన గౌరవం అందిందంటే మా వూరు అమ్మాయి, మా ఉమ స్నేహితురాలు,ఒకేవీధిలో వుండే వాళ్ళము,మా స్కూలు విద్యార్ధిని ఇన్ని కారణాలుగా
కల్పలత గురించి విని నా మనస్సు పొంగి పోయింది.
ఆర్భాటం గా అమెరికా వచ్చి ఆర్ధికంగా నిలదొక్కుకున్న వాళ్ళున్నారు.
ఈగడ్డ పై ప్రత్యేక గౌరవం అందుకొడంలో ఎంతో గర్వంగా వుంది. కల్ప్ లత చెసిన భ్రుహత్ కార్యక్రమాలు వ్యాసం లో పొందు పరిచారు,కల్పలత సాధించిన విజయం చదివి "ఆయురారోగ్యాభి వ్రుధ్ధిగ్గా ఆశీర్వ దిస్తున్నాను.
జ్ఞాన ప్రసూన {సచిత}
28-10- 09 అంధ్ర జ్యోతి దినపత్రికలో ఈమె పై ప్రచురించిన వ్యాసం చదవండి.

Tuesday, October 20, 2009

బాణసంచా విన్యాసం



హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో లో దీపావళి నాడు బాణసంచా
విన్యాసాలు. క్లిక్ చేసి చూడండి.



Saturday, October 17, 2009

దీపావళి

దీపావళి
పండగ లన్ని కాగితాల మీద పండగ చేసుకొంటున్నాయి
పిండివంటలన్నీ మిఠాయి దుకాణాల ఆదాయం పెంచుతున్నాయి
కల్తీ మందు కూరిన చిచ్చు బుడ్లు వెలుగు పూలు రాల్చలేక వెలాతెలా పోతున్నాయ్
కళ్ళ నీళ్ళతో నిలబడ్డ వరద బాధితులకు
కాలే కడుపుకు మండే గంజి దొరకడం లేదు
విద్యుద్దీపాల కాంతికి విర్రవీగే జనాన్ని చూసి
కాంతులు పంచే ప్రమిదలు చీకటి చిమ్ముతున్నాయి
పయోముఖ విష కుంభాల వంటి మనుష్యులు
ప్రేమని ,స్నేహాన్ని రేటు పెంచి దాచేశారు
తీపి భరించలేని మనుషులు
వేప చిగుళ్ళ విందు ఆరగిస్తున్నారు
నీరసంగా నడిచేమనిషిని లారీ హారనులా
పండగలు భయపెడుతున్నాయి
నూనె చాలని దీపం ,నూనె లేని పిండివంట
నెయ్యి లేని భోజనం
పండగ నాడు కొత్త చీర గడివిప్పి కట్టని ఇల్లాలు
పక్కింటి వారు కాల్చేటపాకాయలని
కళ్ళార్పకుండా చూసే బుడతడు
లక్ష్మి పూజ చేస్తే వస్తుంది ధనం
డాబుగా చేస్తారు సంబరం
లక్ష్మి పూజ చేసినా ధనం రాని కొందరు
చీకటి పడితే దీపం పెట్టాలని దిగులు పడుతున్నారు
ఇవాళ పండగా?ఇదా పండగ?
అయినా అతిధుల్ని ఆహ్వానించడం మన ఆచారం
రండి రండి దీపావళి గారూ!
కలిసొచ్చిన రెండు తిదుల్లా
కలిసొచ్చే కష్ట సుఖాలను
చేదుతీపికలిపి ,చేయి చేయి కలిపి
ఓరిమితో అడుగువేసి ,కూరిమి తో మాట కలిపి
పడిపోయే భారతీయతను పడకుండా నిలబెడదాం
రాబోయే తరాలు పండగంటే,పబ్బమంటే
డిక్ష్ణరీలు తిరగేయ్యకుండా
స్మృతి పదం లో నిలిపి పోదాం



తటవర్తి వారి దీపావళి శుభాకాంక్షలు


తటవర్తి వారి దీపావళి శుభాకాంక్షలు 




Monday, October 12, 2009

బుక్ మార్కర్ల గురించి బుక్ bukmarkarla

బుక్ మార్కర్ల గురించి బుక్
నిన్న బుక్ మార్కర్ల గురించి కొంత తెలుసుకొన్నాము.
కలక్షన్ బుక్ మార్కర్స్ పుస్తకం ఆర్.డబ్ల్యు .కోయిష్ అనేఆయన వ్రాసాడు.
బుక్ మార్క్స్ సేకరించడం ఆయన హాబీ .వీటిని సేకరించడం లో ఒక ఆనందం ,ఒక సౌకర్యం వున్నాయి,అంటారీయన.బుక్ మార్కర్లు సైజు చిన్నది కనుక వాటిని భద్ర పరచడం సులభం.బుక్ మార్క్ ఒకటి దొరికితే దాని వెనుక పెద్ద రిసెర్చి మొదలవుతుంది.ఒక ప్రశ్న పత్రం అవుతుంది.పేజి గుర్తు పెట్టుకోనేందుకే కాక ఇది ఇంకా ఎందుకైనా ఉపయోగ పడుతుందా?దీనిని ఎవరు తయారు చేసారు?డిజైను ఎవరు వేసారు?ఎక్కడ తయారైంది?వివరాలు తెలుసుకోడానికి వాస్తు శాస్త్రము ,చరిత్ర,ముద్రలు,పద్ధతులు ఇంకా ఎన్నో క్షేత్రాలు పరిశో దిస్తేకాని జవాబులు దొరకవు౧౭౮౫ లో తయారైన బుక్మర్క్దోరికింది.అది గొర్రె చర్మం తో తయారు చేసారు.దాని కొసన సీలు గొర్రె పోట్టీలు చర్మం తో తయారు అయింది.ఇది డిక్షనరీ తో పాటు వుండి.ఎందఱో మేధావుల్ని సంప్రదిస్తేగాని ఈవిషయం నిర్ధారణ చేయలేకపోయాడట రచయిత.ఇది ఫ్రాన్స్ లో తయారయిందని ,ఇంగ్లాండ్ కు ఒక సావొనిర్ గా తేబడిందని,మ్యూజియం ఆఫ్ లూధర్ క్రాఫ్ట్ లో ఇప్పటికి వుందని రచయిత చెప్పాడు.బుక్ మార్కర్లు ఈ రకాలు ,ప్రింటెడ్ రిబ్బన్,సిల్క్ బుక్ మార్కర్లు ,గ్రంధాలయాలు,ఆధ్యాత్మిక మైనవి,వరల్డ్ వార్లు రెండు ప్రచారానికి బుక్ మార్కర్లు ,విక్టోరియా కాలంలో చేతిపనులవి,పబ్లిక్ సర్విస్ ఇన్ఫర్మేషన్ బుక్ మార్కర్లు,క్రిస్మస్ ,ఎస్ టి .వాలెంటైన్స్ డే కార్డ్ బుక్ మార్కర్లు,టూరిస్ట్ సోవెనీర్ లు సోపులు వగైరా వస్తువుల వ్యాపార ప్రకటనలు ,సినిమాలు,నాటకాల ప్రదర్శన వివరాలు తెలిపేవి. ఇన్ని రకాలు వున్నాయి. ఈయన సేకరించిన వాటిని ఫోటోలు తీసి వివరాలతో పుస్తకం లో పొందుపరచారు.
"ఐ షెల్ పాస్ థ్రూ థిస్ వరల్ద్ బట్ ఒన్స్,ఎనీ గుడ్ తింగ్ దేర్ ఫోర్
ఐ కెన్ డు,ఆర్ ఎనీ కైండ్నెస్ దట్ ఐ కెన్ షో టుఎనీ హ్యూమన్ బీయింగ్ ,ఆర్ డంబ్ ఆనిమల్ ,లెట్ మీ డు ఇట్ నౌ ,లెట్ మీ నాట్ డిఫర్
ఇట్ ,ఆర్ నెగ్లెక్ట్ ఇట్ ,ఫర్ ఐ షెల్ నాట్ పాస్ థిస్ వే అగైన్ .
ఇలాటివి వున్నాయి. తెలుగులో కూడా వీటిని సంపాదించి ఎవరేనా వ్రాస్తే బాగుంటుంది.ట్రాఫిక్ నియమాలు పాటించమని,పుస్తకాల లిష్టులు సోపులు,పెన్నుల ప్రకటనలు వున్నాయి.
రచయితకి కృతజ్ఞతలతో

Sunday, October 11, 2009

బుక్ మార్కర్ల గురించి బుక్

ఇదంటే నాకిష్టం
ఇదంటే నాకిష్టం
నేను దీన్ని ప్రేమిస్తున్నా
నేను దీన్ని ప్రేమిస్తున్నా
ఎవరడ్డగలరు నా ప్రేమని
భగవంతుడిచ్చిన వరం లాటి
పాత వాలు కుర్చిని
నెప్రెమిస్తున్నా ప్రెమిస్తున్నా
ఉషోదయపు మంచు ముత్యాలతో
అలంకరించాను దీన్ని
నా నిట్టుఉర్పులతో దాన్ని
కప్పి వెసాను
నా హ్రుదయాన్ని దానికి
కప్పివెసాను
ఈ బంధమెవరూ
చెరపలేడు
ఇందులొ ఒక్క
దారం తెంప లేరు
అది మా అమ్మ కూర్చున్న
పవిత్ర సిమ్హాసనం
ఆపాత వాలు కుర్చి
వరం లాటి వాలు కుర్చి
వాలు కుర్చిలొ అమ్మని
దూరంగా కూర్చుని చూస్తున్నా
ఎన్నొ రొజులు గడిచాయి
పుస్తకం లొంచి తలెత్తి
నన్ను ఆశి ర్వదించింది
వాలు కుర్చిలొనె వాలిపొయింది
ఎంత దుఖం భరిస్తుంది
నా చిన్ని గుండె
ఆమె కళ్లు మూసుకు పొయాయి
గుండె కదిలిక ఆగిపొయింది
అమ్మ ఆ వాలు కుర్చి లొ
అసువులు బాసింది
అమ్మ ఆ పాత వాలు కుర్చిలో
చనిపోవడం నా కళ్ళారా చూసా
ఈ గేయము ౧౮౭౧ వ సంవత్సరం నాటి సిల్క్ బుక్ మార్కర్ పట్టుదారాలు ఎరుపు,నీలం,ఆకుపచ్చ,పసుపు పచ్చ ,ముక్కుపోడుం రంగులతో థామస్ స్టివెన్స్ అనే ఆయన నేసాడట.రచన -ఎలిజా కుక్ .
దీంట్లోనే సంగీతపు స్వరాలు కూడా పొందు పరిచాడు.ఒక వాలు కుర్చీ బొమ్మ బుక్ మార్కర్ కి పై భాగంలో వుండి.కుర్చీ చేతిపై చిన్న చేతి రుమాలు వుంది.గేయం కింద డైమండ్ షేపులో డిజైన్ వేసి వుంది.కుర్చిలో బైబిల్ పుస్తకం పెట్టివుంది.
ఈమధ్య బుక్ మార్కెర్ల మీద ఒక పుస్తకం చూసాను.మనం అనుకొంటాము పుస్తకం వ్రాయాలనేవుందికాని దేనిమీదవ్రాయాలో తోచక వ్రాయడం లేదు అని.ఈ పుస్తకం చూసాక అనిపించింది,చదివించేలా పుస్తకం వ్రాయాలేగాని విషయ మీదైతే నేమి?
౧౮౫౪ లో అమెరికా లో బుక్ మార్కర్ మొదటి సారి దర్శన
మిచ్చిందట.క్రిష్టఫర్ బారార్ అనే ఆయన సిల్క్ బట్టకి అంచులు కుట్టించి క్విన్ ఎలిజ్ బెత్ కి బహుకరించాడట. పూర్వం పెద్దపెద్ద బౌండ్ బుక్లు చదువుతూ మధ్యలో ఆపాలంటే పుస్తకం బోర్లా వేసి పెట్టె వారట.దానిమూలంగా బైండ్ లో బిగి సడలి పోఎదిట . కొందరు పేజి పై భాగంలో కుడివేపు కొస ముక్కొణాకారమ్ గా మడిచేవారు .ఇప్పటి ఇది
వాడుకలో వుంది.దీని వలన పేజీలు ముడుచుకుపోయి వికారంగా తయారవుతాయి. ఈ బుక్ మార్కర్లు అమెరికా నుంచే మనకి వచ్చాయేమో నాకు తెలియదు.౧౬౩౨ లో ఫారిన్ బైబిల్ సొసైటి వాళ్లు ఈ బుక్ మార్కులు సిల్క్ బట్టతో తయారు చేసి,కింద సిల్క్ దారాలతో కుచ్చులు కట్టి వాడే వారట.కుచ్చులు పుస్తకం బయట వ్రేలాడుతూ వుండేవి. తరువాత సన్నని సిల్క్ రిబ్బన్ బుక్ మార్క్ కింద తయారు చేసారు.పుస్తకం బైండ్ చేసే టప్పుడు పుస్తకం పై భాగం లో దీనిని అతికిన్చేవారు.౧౮౦౦ సంవత్సర ము నాటికి ఇవి బాగా వాడుక లోకి వచ్చాయి.౧౮౫౦ నాటికి కార్డుల వంటి బుక్ మార్కర్ లు వేరే తీసి పెట్టుకోనేలాగా వెలుగు లోకి వచ్చాయి.వీటి సంగతి రేపు తెలుసుకొందాము.




Saturday, October 10, 2009

ఫాల్


ఫాల్
ఆకురాలు కాలము, శరదృతువు లను ఫాల్ అంటారు.ఆటం ,సమ్మర్ ,ఫాల్ ,వింటర్ .అమెరికా ,కెనడా దేశాలలో ఈ ఋతువులన్ని
వేటికవే ప్రత్యేకమైన ఆర్భాటాలతో నడుస్తూ వుంటాయి.ఇక్కడి మనుష్యులు జీవితాన్ని ప్రక్రుతి తో ముడివేసుకొని నడుస్తూ వుంటారు.
మన వేపు పండగలకి బంగారం అమ్మే వ్యాపారస్తులు ,బట్టల వర్తకులు
రాయితీలు ,బహుమానాలూ ప్రకటించి వస్తువులు అమ్మి సోమ్ము చేసుకొంటారు.ఇక్కడ ఎ ఋతువుకు తగ్గట్టు ఆ ఋతువుకి కావలసిన
వస్తువులు అందుబాటులో రకరకాల ధరలలో అమ్మకానికి పెట్టి "మీ సౌకర్యం కోసమే మేము వ్యాపారం చేస్తున్నామంటారు."
సమ్మర్ లో ఇక్కడ ఎన్ని రకాల పూలు పూయిస్తారో!రెండు మూడు పూల జాతుల చెట్లని కలిపి అంటుకట్టి విచిత్రంగా పూయిస్తారు.
ఆకు కనపడకుండా పూలు పూస్తాయి.చిన్న చిన్న పూల కుండిలలో మొక్కలుపెట్టి నిడుగా పూలు పూయిస్తారు.వాటికి ఏమి ఎరువులు వేస్తారోగాని విరగ బూస్తాయి.శాన్ఫ్రాన్సిస్కో లో రోడ్లకి రెండువేపులా గన్నేరులు.పూల బరువుకి నేలమీదకి ఒరిగి పోతూ వుంటాయి.మందారాలు,పొద్దు తిరుగుడుపూలు,కనిపిస్తాయిఅన్ని చోట్లా
నంది వర్ధనాలు ఎర్రగా వుంటాయి,చిలక ముక్కు పూలు నీలంగా వుంటాయి.సన్నగా నాజూకుగా వున్న యువతి నిటారుగా నిలబడి ఆకాశానికి పుష్పాంజలి అన్దిస్తోన్దా అన్నట్లుంటాయి పూల మొక్కలుఎక్కడ చూసినా పూలు.రంగు రంగు తివాచీలు పరచినట్లుగా వుంటాయి.పోష్ట్ డబ్బాకి పూలు,వాకిలి గుమ్మానికి పూలు.మల్లెలు,కరివేపాకు,తులసి ఇండియాని గుర్తు చేస్తుంటాయి.
ఇంతలొ ఫాల్ రానే వస్తుంది.గ్రీన్ ఇజ్ హీట్' అంటారు.ప్రక్రుతి అంతా ఆకుపచ్చగా కల కల లాడుతున్నది సరే!వేడి మాటేమిటి అంటారు.ఆకుపచ్చని ఆకుల లో ఎక్కడో ఒక ఆకు పసుపురంగుకు మారుతుంది.ఫాల్ వస్తోందని సంకేతం.పూలు తగ్గిపోతాయి.వాయు దేవుడు చేతులు జాచి చెట్టు చెట్టుని తాకుతూ పరుగేట్టుతాడు.చల్లనిగాలి.చెట్లు నీరస పడతాయి.ఒక్క వారంలో ఆకులు అక్కడొకటి అక్కడొకటి మారుతాయి.ఆకుపచ్చని ఆకులతో వున్న చెట్టు మధ్యలో గుట్టుగా కొన్ని ఆకులు పసుపు రంగుకు మారాయి.పచ్చని పూల గుత్తి పెట్టినట్లుంది.కొన్ని కొమ్మల చివరల ఆకులు తోపురంగుల్లో మారతాయి.ఆకుపచ్చని చెట్టుకు తోపు రంగు టోపీ పెట్టినట్లుంటుంది.
ఒకచెట్టు వడలిపోయి కలావిహినన్గా అయిపోతుంది.దాని పక్క చెట్టు ఇంకా పచ్చగావుంటే గర్వంగా చూస్తూ వుంటుంది.వదిలిన చెట్టు సిగ్గు పడుతూ వుంటుంది. మా సోకు చూడండి అని చెట్ల ఆకులు రంగులు మారి పువ్వులేమోనని భరం కల్గిస్తాయి.ఒక వూరునుంచి మరొక ఊరికి వెడుతుంటే దట్టంగా,దగ్గరగా వున్నచెట్ల రంగులు అబ్బుర పరుస్తాయి.
అసలు చెట్లని అంట క్రమ బద్ధంగా,కట్టు దిట్టంగా ,వరుసగా ఎలా పెంచుతారా?అని ఆశ్చర్యం వేస్తుంది.
మా ఇంటికి పక్కన పెద్ద లేక్ వుంది.లేక్ పక్కన ఇల్లంటే
ఇక్కడివాళ్ళకి పెద్ద క్రేజ్ ,గొప్ప,ఇష్టం,ఖరీదు కూడా ఎక్కువే!సమ్మర్ వస్తే
చెట్లనిండా ఆకులువస్తే లేక్ కనపడదని ఉసూరుమంటారు.లేక్ చుట్టూ
చెట్లున్నాయి,కొన్ని చిన్నవి వాటి వెనక పెద్దవి.చిన్న చెట్లకి కింద ఆకులు సింధూరం రంగులో మారాయి. క్రమేపీ ఆసిందూరం రంగు పైకి ఆకులపైకి ప్రాకింది.ఆకుపచ్చ సింధూరం రంగు ఆకులు ఎంత ఆకర్శణీయమ్ గావున్నాయో!తెల్ల వారంగానే లేక్ లేచి లేక్ చూస్తె
తమాషాగా వుంటుంది.ఫ్రిజ్ లోపల ఏదైనా పదార్ధం మూతలేకుండా రెండు మూడు రోజులు పెడితే దానిపై అయిస్ పోరా కడుతుంది.అలా లేక్ నిదా పొగ మంచు పరచుకొంతుంది.లేక్ నిద్ర పోతున్నట్లున్తుంది.అడుగున నీళ్ళు లేవేమో అనిపిస్తుంది.కాస్త పొద్దెక్కాక ఆమంచు ఆవిరాయి నీటి మీద మేఘాల్లా తేలి పైకి పోతుంది.
అత్తింటికి వచ్చిన కొత్త పెల్లికొడుకులా సూర్యుడు ఎప్పటికో దర్శన

మిస్తాడు, మళ్ళి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మబ్బుల్లో దూరి పోతాడు.
గాలికి రాలిపోయిన ఆకులన్ని తెట్టు కట్టినట్లు చెరువులో ఎమూలకో ప్రయాణం చేస్తున్నాయి.బాతుల గుంపులు స్వేచ్చగా నీటిపై అలల వరుసలో కవిత్వం వ్రాస్తూ విహరిస్తున్నాయి.అవి ఎప్పుడూ గుంపులు గుంపులు గానే బయలుదేరతాయి .గాలి దేవుడు పలకరించగానే వాళ్ళు గగుర్పోడిచిన చెరువు చిన్న చిన్న కెరటాలుగా ముక్కలయి ఎటో వెళ్ళిపోవాలని వెళ్లి చెరువు గట్టుకు కొట్టుకొని నిస్పృహగా వెనక్కి వస్తున్నాయి.షికారుకు తీసుకుపోయే చిన్న కారుపిల్లల కోసం ఎదురు చూస్తూ ఓమూల పసుపు పచ్చని బోటు కునికి పాట్లు పడుతూంది.గాలి దేవుడి ఈలకి వదిలిపోయిన ఆకులన్ని జలజల రాలిఎతో కొట్టుకుపోతున్నాయి.కడిగి తుడిచి నట్లుండె రోడ్లపై ఎండుటాకులు పరుగు పందాలు వేసుకొంటున్నాయి.ఏరుతువులోవున్నఅందాలు ఆ
ఋతువులో కొట్టొచ్చినట్లు కనపడుతూ మనుషుల్ని,మనసుల్ని కట్టి పడేస్తున్నాయి.ఆటంలో ఒక అందం,ఫాల్ లో మరో సోకు, వింటర్ లో
మంచు జాతర.