శ్రీవిరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు
విరోధినామ సంవత్సరం
విరుల సౌరభాలందించి
విశిష్ట మైన సంపదలందించి
విస్త్రుత మైన భావాల నిచ్చి
విమల మైన మనసు నిచ్చి
విశ్వశాంతి నందించి
వీరత్వం,ధీరత్వం
విశాల సేవా భావం
వినిమయ దాత్రుత్వం నేర్పి
వివరంగా బతుకు నడిపే
విద్యకు ప్రాధాన్యమిచ్చి
విల్లువంచి బాణమేసి
విషపు కోరల విరగ గొట్ట్తి
వివేకానికి పట్టంకట్టి
విఘ్నాలను పారద్రోలి
వికృతినామ సంవత్సరం
విజయానికి సంకేతంగా
విలాసానికి చిరునామాలా
వినూత్నంగా నడపాలని
వినాయకునిప్రార్ధిద్దాం
Monday, March 15, 2010
Monday, March 8, 2010
మరుజన్మ అంటూ ఉంటే ...

మరుజన్మ అంటూ వుంటే
అనవసరపు విప్లవాలను అణచి వేసే
శాంతి సం దేశాన్నవుతాను
అనవసరపు విప్లవాలను అణచి వేసే
శాంతి సం దేశాన్నవుతాను
పాలు పొంగే పయ్యెద పై
పమిట వెయ్యని చిత్రానికి
రంగుల ఓణీ నవుతాను
చీకటిలో గుండె గుప్పిట పట్టుకొని
ఒంటరిగా నడిచి పోయే
కన్నెపిల్ల నడుముపై పడిన
చేతికి చురకత్తి నవుతాను
మమకారాన్ని,ప్రేమని డబ్బుతో తూచే
సమాజపు త్రాసుకు ముల్లునై
డబ్బు సిబ్బిని పై పై కి లేపుతాను
దేశ భక్తి రంగుపూసుకొని
పదవిని మారణా యుధం గా మార్చి
భవిష్యత్ పై విషం చల్లె దుర్మార్గులకు
మరణ శిక్ష నౌతాను
మంచి,మానవత్వాన్ని
రక్తం ధార పోసి పెంచే
మహనీయుల పాదాలపై
పువ్వునై నవ్వుతాను
అమాయికపు ప్రాణుల్ని
చివురుల్లా గిల్లి పారవేసే
కసాయి చేతులకు
సంకెళ్ళ నవుతాను
ఎడారిలోని పాంధులకు
నీరు నింపిన మృణ్మయ పాత్రలో
దాహం తీర్చే ధార నౌతాను
రచన
టి.జ్ఞాన ప్రసూన
Subscribe to:
Posts (Atom)