తస్మాత్ జాగ్రత్త!
జీన్స్ గానీ,మామూలు పాంట్స్ గానీ అంచులు చిరిగిపోతే వాటిని మోకాళ్ళ వరకు గానీ లేదా నిక్కరు లాగా కానీ కత్తిరించి వాడుకొవచ్చు,కానీ జీన్స్ కత్తిరించేటప్పుడు రెన్ డు కాళ్ళ కొలత సరిగావుండేలా చూసుకొని మరీ కత్తిరించండి.
మీ అంతట మీరే హయిర్ కట్ చేసుకోకండి.
తలకి రంగు వేసుకొనేటప్పుడు కొంచెం మేర వేసుకొని చూసుకొని తరువాత పూర్తిగా వేసుకోండి.
కూర వండాక ఉప్పు తక్కువ వేసావేమో అనే అనుమానం వచ్చి మళ్ళీ ఉప్పు వేసే టప్పుడు ఉప్పు సీసాకున్న చిల్లుల మూత ఘట్టిగావుందో లేదో చూసుకోండి.
ఫొన్ చేసి అవతల వేపు మీరనుకొన్న మనిషి వున్నారో లేదో నిర్ధారణ చేసుకోకుండా వాగడం మొదలెట్టకండి.
బట్టల పై "డ్రై క్లీనింగ్ ఒన్లీ"అని లేబుళ్ళు వుంటాయి అవికొన్ని డ్రైక్లీనర్లను ధనవంతులు చేయడానికే! కొన్ని ఇంట్లో వుతికినా ఏమీ కావు.
చాకలేట్లు,ఐస్ క్రీములు పిల్లల్ని కారులో తిన నియ్యకండి.
ప్లైన్ గా వున్న గాజు తలుపుల నుంచి బయటికి వెళ్ళాలంటే అవి తెరచి వున్నాయో లేదో చూచి మరీ అడుగెయ్యండి.
ప్రతి వారం సరుకులన్నీ ఒక్కసారే తేవాలని పది సంచులు మోసుకురాకండి,ఎగ్సన్నాపగిలిపోతాయి,ఆరెంజ్లు దొర్లి పోతాయి, పాలసంచులు పగిలి నేలపాలవుతాయి.
Sunday, January 31, 2010
Friday, January 29, 2010
కంప్యూటర్ భాష

ఈమధ్య నేను,అచ్యుతం ఎవరింటికో వెళ్ళాము ఆ ఇంటావిడ అచ్యుతం బంధువు. అచ్యుతం చాలా కాలానికి కనపడటంతో ఆమె తన ఈతి బాధలు చెప్పుకొని విచార పడింది.మా అచ్యుతం చాలా ఈజీగా -"పోదూ!ఎవరెలా పోతే మనకెందుకు? ఇలాటి వాళ్ళ మాటలన్నీ మనసులో పెట్టుకు కుళ్ళిపోకు, అన్ని "డిలీట్" చేసిపారెయ్యి, మనస్సు క్లియర్ గా వుంటుంది అంది.
ధరలన్నీ పెరిగిపోయాయి. సంసారాల్లో అవసరాలకి సంచులతో డబ్బు గుమ్మరించినా ఇంటి గుర్రాలు కుంటుతూనే వున్నాయి. కూరల ధరలు చూస్తే కను గుడ్లు బయటికి వస్తున్నాయి. చెప్పా పెట్టకుండా బంధువులు వచ్చేస్తూ వుంటే మొన్న ఒకాయన అంటున్నాడు, "డెస్క్ టాప్ మీద యాడ్స్ లాగా వద్దంటే వచ్చేస్తున్నారండీ! పిల్లల నోళ్ళూ కట్టి వీరికి పెట్టాల్సి వస్తూంది.అని.
సాయంత్రం పార్కులో బెంచీ మీద వుసూరు మంటూ కూర్చున్నాడు జగన్నాధం.'ఏమిటి కధ?" అన్నాను."ఒక్కళ్ళకి కోఆపరేట్ చేద్దామని లేదండీ! పోనీ ఆఫీసులో వాళ్ళ పని వాళ్ళన్నా చేసుకుపోతారాంటే అదీలేదు. మేనేజరు పొస్టంత దిక్కుమాలిందీంకోటి లేదనుకోండి .గడ్డం పుచ్చుకు బతిమాలి ఇలా చెయ్యండయ్యా అని చెప్పినా రెండు రోజుల్లో అంతా మామూలే! వీళ్ళందర్నీకొత్త "ఫోల్డర్ లో" పెట్టి ఏ రేణిగుంటకో తోసిపారేస్తే బాగుండును"అని వాపోయాడు.
కాఫీ - అంటే చాలు వికీపీడియాలాగా పొడి అని అర్ధం చేసుకొని మా ఆయన సైకిలెక్కి క్షణం లో కాఫీ పొడి తెచ్చి ఇంట్లో పడేస్తారు, ఎంతహాయో! అంది ఒకావిడ.మావాడికి హటాత్తుగా రేపే వడుగు చెయ్యాల్సి వచ్చిందిరా ! అని ఒకమాట అన్నానో లేదో మా తమ్ముడు గూగుల్ లాగా చిక్కడపల్లి నుంచి ఉధ్ధరిణె అరివాణం , కోటి నుంచి దీక్షావస్త్రాలు, మొజాంజాహి మార్కెట్ నుంచి నవధాన్యాలు, జంఝాలు, అరిటాకులు పూలు తెచ్చి పడేసాడు అంది ఒక సోదరి. ".నాలుగు నెలలుగా బాంక్ పాస్ బుక్ కంపించడంలేదు, పాస్ వర్డ్ మర్చిపోయిన బ్లాగ్ లాగా ఎక్కడుందో వెతకలేక చస్తున్నాను " అన్నారొకరు.
మొన్న ఒకరికి ఈమైల్ పంపితే మూడుసార్లు వెనక్కి వచ్చింది.అప్పుడు వినాయకునికి దణ్ణం పెట్టుకొని సదరు మనిషికి ఫొన్ చేసాను. "అయ్యా! మీకు పంపిన మైల్ మూడుసార్లు వెనక్కి వచ్చింది, దీని భావమేమి తిరుమలేశా! అంటే అరే! మీకు చెప్పడం మర్చిపొయాను, నా ఐడిలో వెంకట్ అని వుందికదా! అన్ని చిన్న అక్షరాలే కానీ "కె" కాపిటల్ లెటర్ కొట్టాలండీ! అన్నాడు.
"ఫలానా పని చేసుకురారా! అని మావాణ్ణి పంపి అయిదుగంటలయింది . డబ్బుకూడా ఇచ్చి అది "సెంట్"లో వుంటుంది కానీ మెయిలర్ డెమన్ వచ్చేదాక మనం సరిగా పంపలేదని తెలియదు. బారసాలకి బట్టలుతేరా! అని పంపిస్తే అక్షరాభ్యాసానికి పలకలు తెస్తారు కొందరు. మీరు ఏ పనికి పంపారో, అదిఎంత విలువైనదో, ఎంత అర్జెంట్ గా కావాలో, అది పుచ్చుకు మీరు ఎంతదూరం వెళ్ళి ఆ పని పూర్తి చేసుకోవాలో, దాని గడువు ఈ రోజుతో అయిపోతుంది నాయనా! అని వివరించక పోవడం మీ తప్పు.అన్నాడతని స్నేహితుడు. ప్రతి కొత్త ఉపకరణానికి ఒక భాష తయారయి అది జీవితాల్లో అల్లుకు పోతుంది చిత్రంగా.
Thursday, January 28, 2010
Sunday, January 24, 2010
చలి
స్వెట్టర్ ,మఫ్లర్ , రగ్గూ అన్నీ ఇచ్చినా ఇంకా గజగజలాడుతూ "చలి,చలి"అని గోల చేసే ఒక కుమారున్ని చూసి తండ్రి
"చలి అని మళ్లీ అన్నావంటే ఆ స్వెట్టర్, మఫ్లర్ , రగ్గూ లాక్కుని రాత్రి బస్సులో హైదరాబాదు పంపిస్తా నిన్ను. ఎస్కిమోలకు వేసినన్ని దుస్తులు వేస్తే ఇంకా చలిట !ఇది బెజవాడ అనుకొన్నావా?డార్జిలింగ్ అనుకొన్నావా” అని !
నిజానికి ఈ సంవత్సరం విజయవాడలో కూడా చలి దేవత ఒళ్ళు విరుచుకొంది. స్వైర విహారం ప్రారంభించింది.ఎండలకే ప్రసిద్ది చెందిన ఈ పట్టణం చలిలో కూడా అగ్ర తాంబూలం అందుకోవాలని ప్రయత్నిస్తోందేమోననిపిస్తోంది.వెనకటికి ఎవరో ఒక పెద్ద మనిషి హిమాలయ పర్వతాలను గురించి ప్రసంగిస్తూ "హిమాలయాలు గొప్పవి కావచ్చు, మనం చూసామా! ఏమన్నానా! వ్యాసాల్లో చదివితే వాటి సంగతి ఏమి తెలుస్తుంది?అందుకని మా వూళ్ళో కొండలనే మేము హిమాలయాలనుకొంటాము.తప్పేముంది? అని.ఆయన అనడం మాట అలావుంచి ఈ కొండలు ఎందుకనో శీతాకాలంలో ఇదివరకటి కంటే ఎక్కువగా చల్ల బడుతున్నాయి.ప్రజల్ని వణికిస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో మన సంస్కృతీ సభ్యతలు మారినట్లే కొండల స్వభావాలు కూడా మారిపోతున్నాయి.మంచిదే!
పోనీ ఉత్తరాది సోదరులతోపాటు మనము కూడా చలికి వణుకుదాం! ఎన్నింటికి వణకడంలేదు?.ప్రకృతికి వణికితే వచ్చే ప్రమాద మేమిటి?ఆంద్ర ప్రాంతంలో కూడా చలికొంచెం అధిక మైనదని అనుకొంటున్నా -హైదరాబాద్ చలికి దూరంగా వున్నందుకు సంతోషిస్తున్నారు. అక్కడ ఇటీవల ఎనిమిది డిగ్రీల వరకు పడిపోయిందట ధర్మామీటర్ .వెనుక ఒకసారి ఏడు డిగ్రీల వరకు పడిపోయినప్పుడు నేను అక్కడ వున్నాను.రగ్గులు కప్పితే చలి ఆగుతుందని భ్రమ పడతాము. అసలు రగ్గుల్లో ఉన్నంత చలి బయట వుండదు. రగ్గుల్లో వాళ్ళు రగ్గుల్లో మాట్లాడలేక పడిపోవడంకూడా కద్దు. ఉదయం పది గంటల దాకా ఈ చలి అలాగే వుంటుంది. ఈలోపల ఎవరినన్నా పలకరిద్దామంటే మాటరాదు.ఒకవేళ ఖర్మం చాలక పలకరిస్తే అవతల వాళ్ళు జవాబు చెప్పలేరు.పళ్ళు మాత్రం టకటక కొట్టుకోవడం వినిపిస్తుంది. ఇంటిల్లిపాదీ అలా పళ్లు కొట్టుకొంటూ కూర్చుంటే ఏమి తోస్తుంది?
ఒక గృహస్తు భార్యని కాఫీ కాచావా? అని సౌజ్ఞ చేసాడు. ఆమె ప్రతి సౌజ్ఞ చేస్తే బాగుండదని ఏదో చెప్పబోయింది.పాత టైపు మిషను చప్పుడు మాత్రం వస్తూంది. భర్త ఆ మోత భరించలేక "గడ్డం కింద అరిచేత్తో నొక్కుకో .....మాట్లాడక పొతే మానెయ్యి "అని ఆవిణ్ణి దబాయించాడు .చలికి వణుకుతూ ఒక ఇల్లాలు తలొక దిండుమీద వంకరగా పెట్టుకొని నిద్రపోయింది. తెల్లవారి లేచి చూస్తే ఆతల ఆ వైపే బిగుసుకుపోయింది. ఎంతప్రయత్నించినా రాలేదు.మీరు హైదరాబాదు విడిచి వెళ్ళడం మంచిదని అక్కడి వాళ్ళు సలహా చెప్పారు.
మర్నాడు బస్సులో ఆవిడ బయలుదేరింది ఆ వంకర మెడ తోనే! సూర్యాపేట వచ్చేసరికి కొంచెం సరిగా వచ్చిందట. పాపమావిడ జగ్గయ్య పేటలో చూసుకొంటే మెడ సరిగ్గానే ఉందిట.అది హైదరాబాద్ చలి మహాత్మ్య మని ఆవిడ ఇప్పటికి చెప్పుకొంటూనే వుంటుంది.ఎవరన్నా ఆవూరు వెళ్ళ వలసి వచ్చినా"మార్చి దాటేదాకా ఆమాట ఎత్తకండిబాబూ ! ఫిబ్రవరిలో నా మెడకా ఇబ్బంది వచ్చింది" అని అంటూ వుంటుంది. ఇటీవల ఒకాయన పాల మనిషితో అన్నాడట -చలితో బిగుసుకు చచ్చిపోతున్నాము.పాలుకొంచెం పెందరాలేతీసుకు వస్తే ఇన్ని వెచ్చటి కాఫీ నీళ్ళన్నా గొంతుకలో పోసుకొంటాం. కాస్త అయిదు అయిడున్నరకల్లా వస్తూ వుండు నీకు పుణ్యం ఉంటుంది"అని .దానికతడు వెంటనే ఇలా జవాబు చెప్పాడట."ఇళ్ళల్లో దుప్పటీలు కప్పుకొని, కిటికీలు మూసుకొని పడుకొనే మనుష్యులే బిగుసుకు పోతుంటే -పాకల్లో పడివుండే బర్రెలు బిగుసుకుపోవూ! చలిలో ఎంత బాదినా అవి లేవడం లేదు. లేచినా ఫెళ్ళున తంతున్నాయి. సూర్యున్ని చూడందే చుక్కపాలు ఇవ్వడం లేదు.
అవును మరి చలి అనేది అన్నీ జీవులకు ఒక్కటేగా! మానవుడు తన బాధ తను చెప్పుకొంటాడు కానీ ఇతరుల బాధ తలుచుకోడు. సౌకర్యాలున్నకొద్దీ సణుగుతూనే ఉంటాడు.చలికాలానికి సంబంధించిన సరసాలూ, తమాషాలూ కొన్ని వుంటాయి. మొన్న ఒక గృహస్తు అంటున్నాడు,"ఎంత చలి వేసినా రాత్రిపూట కొంచెం షికారు వెళ్లి రావాలనిపిస్తున్నదండీ!అని. "రాత్రిపూట షికారేమిటి? పులిలాగా చలి మీద పది కొరుకుతూంటే! అంటే- కోరికే మాట నిజమే ననుకొండీ. ఒక మంచికోసం బాధ పడటం అవుసరం అవుతూ ఉంటుంది."అన్నాడాయన. అయితే ఆ మంచేమిటి? చెప్పండి. చెపితే నేనూ రోజూ కాస్త తిరిగి వస్తాను."అన్నాను. "చెప్పమంటారా! కొంచెం సేపు తిరిగి ఇంటికి వెడతామనుకొండీ. ఆడవాళ్ళు కొంచెం నిద్ర పోతూ వుంటారు.మనం వెళ్లి తలుపులు కొట్టగానే గజగాజలాడుతూ తలుపు తీస్తారు.అది చాలదు టండీ!' అని ఆయన ముసిముసి నవ్వులు నవ్వారు.
"వణికేది చలికే గానీ మీకు కాదుగా!'అంటే "అలా వివరించి చెప్పకండి!భర్త తలుపుకోట్టడం, భార్య గజగజలాడుతూ తలుపు తియ్యడం జరుగుతుందా లేదా?మన మీరోజుల్లో చూసేది "ఫేసు వాల్యూ" "మైండ్ వాల్యూకాదు. డూ యూ అండర్ స్టాండ్ ? అని ఆయన ఇంగ్లీషులో ఉద్ఘాటించారు.
చలిలో సరసం తో పాటు కొంత వైరాగ్యము కూడా వస్తుంది.దుప్పటిలోనో, రగ్గులోనో తనకు తానే మూట కట్టుకొని పడుకొన్న వ్యక్తీ ఒక్కసారి తల బైట పెట్టడానికి కూడా ఇష్ట పడడు. అందులో తల దాచుకొని పరుండగా ఎంత వేదాంతం వస్తుందో చెప్పలేము. ఆత్మకి అతనికి ఎంతో సంవాదం జరుగుతుంది.
ఆత్మ -ఎక్కడో చప్పుడవుతోంది,దొంగలేమో ఒక్కసారి లేచి చూడు.
తను -చూచి మాత్రమేమిలాభం? మనమేమన్నా వాళ్ళని కొట్టగలమా? ఏమన్నానా? ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది.పడుకోవడమే మంచిది.
ఆత్మ - తీరా నష్ట పోయేది నువ్వేగా?
తను - నష్టమయితే అయిందిగానీ! కష్టపడలేను. ఈ దుప్పటి తీసి ఈ సుఖం పోగొట్టుకోలేను.
తెల్లవారిన తర్వాత లేవనివారికీ ఆత్మకూ సంవాదం ఇలా ఉంటుంది-
ఆత్మ - ఏమిటా బద్ధకం?.............లే....ఎంత పోద్దెక్కిందో చూడు.
తను - నే చూడలేను.నన్ను వేధించకు.
ఆత్మ - ఆఫీసుకు వెళ్లక్కరలేదా?.....ఒళ్ళు అమ్ముకున్నానని జ్ఞాపకం ఉందా?
తను - అమ్మకం మాటేమోగానీ ఈ రగ్గుకు తాకట్టు పేట్టేశా ! ఇది వదిలించుకో లేకుండా వున్నా.
ఆత్మ - జాగ్రత్తగా ఆలోచించుకో ......జీవిత మంటే ఆషామాషీ కాదు.అనేక బాధ్యతలున్నాయి.నిద్ర లేచిన తరువాత నిజరూపం బయట పడుతుంది.
తను - పడితే పడిందిలే! నన్ను పలకరించకు.
ఆత్మ - నే చెప్పేది నగ్న సత్యం.
తను - నగ్న సత్యాలు నాకక్కర్లా!...స్వప్నాలే కావాలి. వాటిలో సుఖమే కావాలి. కాసేపు పలక రించకు.
ఇలాటి కొత్తరకం వేదాంతం చాలా బయలుదేరుతుంది చలిలోంచి.ఈ వేదాంతాలలో వ్యక్తికి ప్రాధాన్యం ఎక్కువ లభిస్తుంది.
మన వ్యక్తిత్వాలను నిలబెట్టడం కోసమే కాబోలు దేశంలో లేని చోట్ల చలి గాలులు ఎక్కువకావడం. [తెలుగువాణి సౌజన్యంతో]

Thursday, January 14, 2010
శుభాకాంక్షలు
శుభాకాంక్షలు
ఐకమత్యము,అనురాగము,సేవా భావము ప్రతి ప్రాణి,ప్రాణికి
మధ్య వ్రుద్దికావాలని,సర్వులు సుఖ సంతోషాలతో,ఆరోగ్యంగా వుండాలని
మకర సంక్రమణ శుభ సమయంలో "సురుచి"ఆకాంక్ష .
టి.జ్ఞాన ప్రసూన

Subscribe to:
Posts (Atom)