"ఒకసారిలా వస్తారా?"అంది భార్య.
" ఒకసారేమిటి?పదిసార్లు వస్తా,నువ్వు అస్తమానూ పిలవకుండా
వుంటే!"అన్నాడు భర్త.
* * * * *
"ఏమి చేస్తున్నావోయ్! వంటిల్లంటే అంత ప్రేమ ఏమిటి?
ఇంతకీ ఆనీటివంకాయ కూర వండుతున్నావా?
కాస్త అల్లం పచ్చి మిర్చి తగిలించు"అన్నాడు భర్త.
"అదేనండీ!వంకాయలు పెచ్చు తీస్తున్నా!అంది కొత్త పెళ్ళికూతురు.
* * * *
నవ వధువు కూరల మార్కెట్లో కూరలుకోన్నది. టమోటాలు సంచీలో వేసి ఆలుగడ్డలు పైన వేస్తూంది.దుకాణ దారుడు నొచ్చుకొని "అమ్మాయిగారు బాగా చదువుకోన్నట్లున్నారు?"అన్నాడు.
" ఏమి!పల్లెటూరి గబ్బిలాయిలా వున్నానా? బి.ఎ,పూర్తియింది,ఎం .ఎ
మొదలెట్టా!అంది.
సంచీలో టమోటాలు ముందు వేసి తరవాత ఆలుగడ్డలు పైన పడేస్తుంటే అనుకొన్నా"అని లోపల అనుకొన్నాడు.
Sunday, February 14, 2010
!
Posted by
జ్ఞాన ప్రసూన
at
Sunday, February 14, 2010
1 comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
హి హి హి
Saturday, February 13, 2010
వ్యర్ధ ప్రయత్నములు
వ్యర్ధ ప్రయత్నములు
ప్రేమతో నా తులసి మొక్కను
పెంచితిని గంగోదకముల
పసుపు కుంకుమ తోడ భక్తిని
పూజలోనరిస్తి!
ఉదయ సాయంకాలముల క
ర్పూర దీపం హారతిచ్చితి
హ్రదయ తాపము తీర లక్ష్మీ
స్తవ మొన్ర్చితిని ;
పక్కనే పొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో అనిఎన్ .
ప్రతిమ యొక్కటి మలచినా నది
ప్రతిఫలించిన దందమంతా,
తనివి తీరగా విగ్రహంబు న
లంకరించితిని;
మంచి నగలూ,మంచి గంధము
మంచి మంచి రకాలపువ్వులు
ప్రతిమకున్చితి,హృదిని నిల్పితి
తపము చేసితి ;
పక్కనేపొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో"అనిఎన్
కొత్త కొత్త రకాల విద్యలు
కొత్తాటలు,కొత్త పాటలు
ముద్దు తల్లికి నేర్పు చుంటిని
మొదమలరంగన్;
చిన్ని పాదము లెత్తి నాట్యము
చిన్ని పెదవులు కదిపి గీతము
చిన్ని చేతుల నెట్టి తాళము
తల్లి నేర్చినది;
పక్కనే పొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో"అనిఎన్
హృదయ భారము తీరునచును
మధుర భావము లేర్చి కూర్చితి
అడవి పువ్వులు గుచ్చి దండగ
ఆరుత దాల్చితిని ;
అనుభవించిన మాష్ట సుఖముల
అఖిలమును మధియించి,"సారము
తీసుకోనుదో రండు !రంద!ని
తిరుగ జొచ్చితిని;
పక్కనేపొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను ,
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో!అనిఎన్ .
పక్క మానిసి పలుకులన్నీ
పడెను నా చెవులందు ;విడిచితి
సర్వ మయ్యెడ;మౌన ముద్రను
దాల్చి కూర్చుంటిన్ ,
శిరము వంచితి ,కనులు మూసితి
మౌన ముద్ర వహించి యుంటిని ,
పక్క మానిసి పలికే మళ్ళీ
ప్రస్ఫుటము గాగన్ .
'ఎందుకో ఈ మౌనమూనుట
ఎందుకో ఈ మాన్ద్యమంతా
పోయి సాంఘిక సేవ చేస్తే
పుణ్య ముండునుగా !
రచన
చింతా దీక్షితులు గారు
ప్రేమతో నా తులసి మొక్కను
పెంచితిని గంగోదకముల
పసుపు కుంకుమ తోడ భక్తిని
పూజలోనరిస్తి!
ఉదయ సాయంకాలముల క
ర్పూర దీపం హారతిచ్చితి
హ్రదయ తాపము తీర లక్ష్మీ
స్తవ మొన్ర్చితిని ;
పక్కనే పొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో అనిఎన్ .
ప్రతిమ యొక్కటి మలచినా నది
ప్రతిఫలించిన దందమంతా,
తనివి తీరగా విగ్రహంబు న
లంకరించితిని;
మంచి నగలూ,మంచి గంధము
మంచి మంచి రకాలపువ్వులు
ప్రతిమకున్చితి,హృదిని నిల్పితి
తపము చేసితి ;
పక్కనేపొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో"అనిఎన్
కొత్త కొత్త రకాల విద్యలు
కొత్తాటలు,కొత్త పాటలు
ముద్దు తల్లికి నేర్పు చుంటిని
మొదమలరంగన్;
చిన్ని పాదము లెత్తి నాట్యము
చిన్ని పెదవులు కదిపి గీతము
చిన్ని చేతుల నెట్టి తాళము
తల్లి నేర్చినది;
పక్కనే పొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో"అనిఎన్
హృదయ భారము తీరునచును
మధుర భావము లేర్చి కూర్చితి
అడవి పువ్వులు గుచ్చి దండగ
ఆరుత దాల్చితిని ;
అనుభవించిన మాష్ట సుఖముల
అఖిలమును మధియించి,"సారము
తీసుకోనుదో రండు !రంద!ని
తిరుగ జొచ్చితిని;
పక్కనేపొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను ,
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో!అనిఎన్ .
పక్క మానిసి పలుకులన్నీ
పడెను నా చెవులందు ;విడిచితి
సర్వ మయ్యెడ;మౌన ముద్రను
దాల్చి కూర్చుంటిన్ ,
శిరము వంచితి ,కనులు మూసితి
మౌన ముద్ర వహించి యుంటిని ,
పక్క మానిసి పలికే మళ్ళీ
ప్రస్ఫుటము గాగన్ .
'ఎందుకో ఈ మౌనమూనుట
ఎందుకో ఈ మాన్ద్యమంతా
పోయి సాంఘిక సేవ చేస్తే
పుణ్య ముండునుగా !
రచన
చింతా దీక్షితులు గారు
Posted by
జ్ఞాన ప్రసూన
at
Saturday, February 13, 2010
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
వ్యర్ధ ప్రయత్నములు
Monday, February 8, 2010
గీతలతో అద్భుతాలు
ఈ మధ్య నేర్చుకున్న పెయింటింగ్ లో ఫోటో చూస్తూ వేసిన చిత్రాలివి.

కల్మషం లేని పల్లె అందాలు మరీచికలేనా?

ఆమాయకపు చేపపిల్లలు వేసే గంతులు

కుహూకుహూ అంటూ గుసగుసలాడే పక్షులు.చూపులు వేరైనా మనసు ఒకటే కదా..

కల్మషం లేని పల్లె అందాలు మరీచికలేనా?

ఆమాయకపు చేపపిల్లలు వేసే గంతులు

కుహూకుహూ అంటూ గుసగుసలాడే పక్షులు.చూపులు వేరైనా మనసు ఒకటే కదా..
Posted by
జ్ఞాన ప్రసూన
at
Monday, February 08, 2010
6
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
నా బొమ్మలు
Saturday, February 6, 2010
చిరుజల్లు
మా అన్నయ్య శ్రీ నాగేశ్వర రావు, మా వదిన స్రీమతి జయలక్ష్మిగార్ల వైవాహిక బంధం బిగిసి యాభై వసంతాలు నిండిన సందర్భంలో చెల్లాయి చిలకరించే పన్నీటి జల్లులు.
చిన్న నుదురు,ఉంగరాలు తిరిగి వత్తుగా వున్న తలకట్టు,రాజమా గింజంత చుబుకం,చురుగ్గా తిరిగే చూపులు ,కచ్చిత మైన వాక్కు, ఎర్రటి నైలాన్ ఓణీవేసుకొని కూర్చుంది ఒక కన్నెపిల్లా. నూనూగు యవ్వనం,భవిష్యత్ పై కలలు. బంగారు,రంగారు ఆశలుమదిలొంచి ఉబికి వస్తుంటే ,అవకాశం కోసం అణిచిపెట్టుకొన్న సభ్యత. పది వూళ్ళుతిరిగి,పది కాపురాలు చూసి,పది రకాల దాంపత్యాల పందిళ్ళు పరిశీలించి ఇంతకంటే గొప్పగా,ఇంతకంటే వైనంగా,ఇంతకంటే ఆదర్శంగా,దేశకాల పరిస్తితుల కనుగుణంగా ఇంతకంటేపధ్ధతిలొ సంసారం పరుగెత్తించాలని ,కోయిల పాటలు వింటూ,నీలాకాశంలో బారులుతీరి సాగిపోయే కొంగల గుంపుల్ని తిలకిస్తూ,సాహిత్యంలో,భక్తిలో,మానవసేవలోఏవో ఆదర్శాల అంచుల పయనాలు సాగించాలని ఉవ్విళ్ళూరే యుక్త వయస్కు డైన ఒక కుర్రవాడు.చీకతి,వెలుగు పడుగు పేకల్లా అల్లుకొన్న పల్చని వెలుతుర్లో ఇరవై మంది బంధువుల మధ్య ఒకరినొకరు చూసుకొన్నారు.భావాలకి పరుగులు మాటకి నియంత్రణ.
ఆ కుర్రవాడే మా అన్నయ్య.ఆ కన్నెపిల్లే మా వదిన.మా వదిన అంతరంగాన్ని అంచనా వేసేందుకు మా అన్న నాకొక ప్రశ్న పత్రం ఇచ్చి జవాబులు తెచ్చే బాధ్య్త నాపై పెట్టాడు.మావదిన నెగ్గింది,మా అన్న మురిశాడు.దేవతలు తధాస్తు అన్నారు.వీరిరువురూ ఒక గూటిలోకి చేరారు.
మా అన్నయ్య జీవితంలో ఒక్కటే విషాదం.అన్న్య్యకు రెండేళ్ళ వయసులోనె మా పెద్దమ్మ కమల స్వర్గస్థురాలయింది. తల్లి ఇచ్చే తియ్యటి మమతానురాగాల్ని అన్నయ్య అనుభవించ లేకపోయాడు. అయినా మా తాత గారు,అమ్మమ్మ అన్నయ్యకు తలితండ్రులై వారికి పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచారు.మా తాతగారు స్రీగిరిరజు రామ చంద్రయ్యగారు ఆంగ్లం బోధించేవారు.మాలో పాఠాలు చెప్పే యోగ్యత ఏదన్నా వుంటే అది మా తాతగారిచలవే! ఆయన శాంతము,కార్య దీక్ష,కఠిన పరిశ్రమ అన్నయ్యకి ఉగ్గుపాలతో అందించారు. చిన్నతనం లో మా అన్నయ్య మాకు హీరో! అందర్ని మొట్టికాయలు మొట్టి ఏడిపిస్తూ వుండేవాడు.అప్పుడు మాకేం తెలుసు?పెద్దయ్యాక వేలమంది విద్యార్ధుల మెతక బుధ్ధికి మొట్టీకాయలు కొట్టే మేష్టరవుతాడని ఎరుగున్నామా?ప్రిన్సిపాలు కుర్చీఅధిష్టిస్తాడని కలగన్నామా?
మా వదిన అయినింటి కుటుంబంలో పెరిగిన అసలైన ఆంధ్రుల ఆడపిల్ల.వాళ్ళ నాన్న గారు శ్రీ విన్నకోట మాధవరావుగారు తెల్లటి గుబురు మీసాల లోంచివెన్నెలవంటి నవ్వు నవ్వుతూ హాయిగా జీవితం గడిపిన స్వచ్చ మనస్కుడు.వారి పుట్టింటి సభ్యులు ఐకమత్యానికి ప్రతీకలు.చాకుల్లాటివారు,మెరికల్లాటివారు.అపార మైన లౌకిక జ్ఞానం కలవారు,మాటసంపన్నులు,చేత సమర్ధులు.మా వదిన అన్ని గుణాలు పుణికి పుచ్చుకొంది. మా అన్నయ్య అలుపెరుగని కృషీవలుడు."ఇంతింతై వటుడింతయై"అన్నట్లుగా పెరిగిన ప్రజ్ఞా వంతుడు.మా వదిన అన్నకు తోడై,నీడై సన్నగా సలహాలిస్తూ,సహనంతో సంసారం సాగించిన సాధ్వీమణి. .అనారోగ్యాలు ఆవరించినా,ప్రవాస జీవనం గడిపినా ఒకరికొకరై నిలిచారు.
జీవన మహాయానంలో పూల పందిళ్ళు పిల్లలు.రామకృఇష్ణ,రవి,కల్యాణిముగ్గురూ అటువంటి పూల పందిళ్ళే!తలితండ్రుల మనసు ఎరిగి నడుచుకొనే సంతానం ఐశ్వర్యాలలో ఒకటి.దాంపత్య జీవనంలో అన్నయ్య,వదిన కలసి యాభై మెట్లు ఎకారు.వారిరువురికి శక్తి,స్థిమితము,బలము,నిశ్చలమైన మనస్సు ఇవ్వాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. కృషి చేయడంలోనోఓ , ఘట్టీ నిర్ణయాలు తీసుకోవడం లోనూ,పట్టిన కార్యక్రమాన్ని ఆరు నూరైనా అనుకొన్న సమయానికి నెరవేర్చడంలోనూ"పనే విశ్రాంతి"అనే సూక్తిని అవలంబించడంలోనూ మా అన్నయ్యకి అన్నయ్యేసాటి.మాకందరికి మా అన్నయ్యే ఆదర్శం.వృత్తి రీత్యా కూడా ఎద ఎదలో విజ్ఞానపు విత్తనాలు జల్లే మా అన్నయ్యకి జోహారులు.
చెల్లాయి
టి..జ్ఞాన ప్రసూన

Saturday, February 06, 2010
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
చిరుజల్లు
Wednesday, February 3, 2010
విశ్వ నాథ వారి పద్యాలు
విశ్వనాథ వారి పద్యాలు
ఎందుకు మీ పదాబ్జములే మది నెంచెడు మేము జ్ఞప్తియన్
దుందుమె!సంతసం పడుచు నుందురుమావగు కుర్ర చేష్ట లిం
పొందగ గాంచి యా పనుల నుంతురె మీ మదిలోన మీ కివే
వందనముల్ గురో! మరల వత్తెరే!మమ్మెపుడేని గాంచగా!
ఇప్పటిలోన నియ్యెడలనేవసియించుట మాకుఎందునున్
తప్పదు,వేలు ముద్దులు ముదమ్మున నిచ్చితినంచు దమ్ముతో
జెప్పుడు వేల్నమస్కృతులు సేసితి వంచును దాత గారితో
జెప్పడు తల్లిగారికిని చెప్పడుసంగతి నంచు మ్రొక్కులన్!
ఒకడల్లాయన,క్రీస్తనున్,మరియుదా నొక్కండుగోవిందుడన్
చొక డింకొక్కడు సాంబుడంచొకడు ఓహో యడంచండ్రు
డొకడౌ యందరునొక్కరో యదియు కాదోఏమి తన్మూర్తి స
ర్వ కళాభిజ్ఞుల మిమ్ము బ్రోవగను వారన్ సర్వకాలమ్ములన్!
తిరుపతి వేంకటేశ్వరులు దేశముగైతయు గ్రుచ్చి యెత్తబన్
దరుపుర మాంగ్లపుం జదువునన్ జని వారలలోన వేంకటే
శ్వర గురురాజ మౌళిపద సంజనిత త్రిదివాపగా సుధా
ఝరములముక్కండు ఫల సంగతి సత్కవి వై మెలంగుచున్!
తన ఎద ఎల్ల మెత్తన,కృత ప్రతి పద్యము నంత కంటె మె
త్తన తన శిష్యులన్నేడదంగల పేముడి చెప్పలేనిమె
త్తన యయి శ్తృపర్వత శతారముసత్కవి చెళ్ళపిళ్ళ వేన్
కన గురువంచు చెప్పి గొప్పగా అది గొప్ప తెలుంగునాడునన్!
శిష్య వాస్తల్యంబు చెలువు దాల్చిన మూర్తి
కాకలి కంఠంబు కత్తి కోత
ఎడద మెత్తదనంబు విడిది చేసిన చోటు
వ్యర్ధ వాదములకు అగ్గి పిడుగు
భాషానుభావ పరీపాక స్వరూపము
నీరసవాది కన్నీటి ముంపు
పరమ నిర్భీకుండు పరమ సత్యవ్రతాచారుండు నున్ సత్సన్
గరుండుసమభి గమ్య త్వమప్రదుష్యత్వ మొప్ప
వరలునట్టి చెళ్ళ పిళ్ళాన్వబరం స్మదుపజ్ఞ మౌ భవ్య సృష్టి
దేర్చు ప్రధమ రాయ శశికి మూర్తికిన్ జోదుళ్ళూ పెట్టి
అలనన్నయ్యకులేదుతిక్కనకు లేదా భోగమస్మాదౄశ్న్
డలఘు స్వాదు రసావతార ధిష శాహంకార సంభారదో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయ్యాడన్నట్టి దొవ్యామ పే
శలచాంద్రీ మృదు కీర్తిచెళ్ళపిళ్ళ వంశ స్వామి కున్నట్లుగన్!
ఇందులో ఏవైనా తప్పులు కనిపిస్తే పాఠకులు దిద్దవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.
జ్ఞాన

Wednesday, February 03, 2010
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
విశ్వనాథ వారి పద్యాలు
విశ్వనాథ వారి పద్యాలు
చెళ్ళపిళ్ళ వారు బందరు నుండి వెళ్ళిపొయే ముందు విశ్వనాథ వారు వ్రాసిన పద్యాలు.
ఎవ్వారి సత్కీర్తి మృగనేత్ర చీర కొంగుల
నాల్గు నాల్గు దిక్కులుగ దనరు
ఎవ్వారి కవితా మృగేఖ్సణ నవ్వుచు
రాజుల తోడ సరాగ మాడు
ఏరి పదాంబుజాహీన మరండంబులల
శిష్య కోటి కాపోశనములు
ఎవ్వారి వాగ్వధూ నృత్యంపు ఝణఝణ
మ్రోతలు భారతి మొల్క నవ్వు
వేరి వాక్చండి కుకవుల మీరి బండుచును
గ్రుతస్నుల విహరించుసోకుమీర
నట్టి మీరలు మమువీడి యరుగుదురని
విన్న నామది బెదరెనో వెంకటేశ!
కనరా బిడ్డలపోల్కి సేవలను మీ కల్యాణ పాదమ్ములా
దునుగా మున్ను శతావధాన రమ చేతో మోద మేపారనే
లిక మీ హస్తము మా శిరమ్ములను నిల్చిన్ బుజ్జగింపంగ నే
డెనయన్ మమ్ముల వీడిపోవుటకు కాళ్ళెట్లాడు మీకున్ గురో!
ఈయూరెందుకు వత్తురింక నెచటేనీ కానుపించంగ గ
ందోయిన్ చూర్తిగ నాస తీరమొగమందున్ గాంచుటే కాని ఏ
మీ!యెచ్చోటను గానుపించుటయెలేదే యంచు నోరార న
బ్బాఈ యంచు బల్కరించు ఘనులెవ్వారింక నో దేశికా!
మాపయి కోపమా!కరుణ మాన్ర్దరా!యిది మీకు న్యాయమా!
మాపయి నిన్ని నాళ్ళనుపమానకృపంగన బర్చి నేటి కే
పాపము లేని మమ్ములను బందరు నందున దించి పోవగా
నోవుదురెట్లు మా మనము లూగెడు మీపద మిట్టూలట్టూలన్
మిగులగ విద్దెనేరిపిన మిమ్ముల వీడూటా!ఇంతవారి నింతగ
బొనరించినట్టి తలితండ్రుల వీడుట నేనెరుంగ మా
కు గురుతరంబు ముందుగన గోయియు వెంకకు నూయి యన్న
ట్లగుపడుచుండె దోచదుగ దారొకటేనియు మా మనంబులన్
కొందరు మీకడన్ చదువుకొన్న గుణాఢ్యులు ,కొందరెచ్చటో
పొందుగ చద్వి ,ప్రేమ గురువుల్ తగ మీరనిచెప్పువారలున్
కొందరు మీ మొగమ్ము గనుగొన్న కవిత్వము చెప్పు వారలీ
యందరి శీష్యులన్ విడిచియా!జనుటల్ గురునాథ తెల్పుమా!
ఆడకు బోవరాదనుచు నంద మటన్నను కాని మాకు నో
రాడదు చిన్ని తమ్మునికి నై వెస నాతని పైన జల్లి జ
ల్లెడు,పూలున్, సుహాసములు ఎంతయు వచ్చియు రాని మాటలున్
గోదిగ వేయు తప్పటడుగుల్ మురిపమ్మున జూడ నేగగా!

3
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
విశ్వనాథ వారి పద్యాలు
Tuesday, February 2, 2010
వసంత గీతి
Posted by
జ్ఞాన ప్రసూన
at
Tuesday, February 02, 2010
3
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
నా బొమ్మలు
Subscribe to:
Posts (Atom)