Pages

Thursday, September 30, 2010

గుర్తుకొస్తున్నాయి

చల్ల బజారు
బందరు చెమ్మనగిరి పేటలో మా ఇంటి ఎదురుకుండా రెండు మూడు పచారు కొట్లు ఉండేవి.మధ్యలో చిన్నగదిలో ఒక తను బట్టలు విస్త్రీ చేస్తూ ఉండేవాడు.ఆకొట్లకి చాలా హుషారుగా తిరుగుతూ వుండేదాన్ని.గానుగెద్దు సర్కిల్ లాగా కొతదూరం వరకు తిరిగేందుకు మావాళ్ళు పర్మిషన్ ఇచ్చేవారు.పదేళ్ళు వచ్చేదాకా జీవితం హాయిగా గడిచిపోయింది.మనసు తేలికగా తూనీగలా వుండేది. ఆపచారుకొట్లలో అన్నీ సరుకులు దొరికేవి.ఇళ్ళల్లో నౌకర్లు చాకర్లు ఉండకపోతే ప్రతి పనికి పిల్లల్ని తోలేవాళ్ళు. పచారి కొట్టులో నాలుగు పలకలుగా వుండే గాజు సీసాలలో తినిబండారాలు పెట్టి అమ్మేవారు. అవేమిటో తెలుసా?శనగపప్పు ఉండలు,కొబ్బరి లౌజు ఉండలు, అప్పడాల పిండి ఉండలు, పాలకోవా బిళ్ళలు,వేరుశనగ పప్పు ఉండలు [ఇవిచాలా ప్రాణ ప్రదమైన ఫలహారం ఆరోజుల్లో]ఇలా రక రకాల ఉండలు.అమ్మ ఏదో తెమ్మని డబ్బులు ఇచ్చేది.ఆవుండలు చూస్తె నోరూరిపోయి అమ్మ మీద కోపం వచ్చేది.ఇన్నిరకాల తినుబండారాలుంటే అమ్మ అవేవో తెమ్మంటుంది ఏమిటబ్బా?అనిపించేది.ఆరోజుల్లో పాకెట్లు లేవు,పాకెట్ మనీసు లు లేవు.మరెలా వాటిని కొనుక్కు తినడం?పోనీ అణాఅన్నా ఉండేదికాదు.అమ్మ ఇచ్చిన డబ్బులో ఒక కానీ సొంతం చేసుకు కొనుక్కొందామంటే వెధవది ఏమికొనాలో తేలేదే కాదు. చివరికి అభిప్రాయం వేరుశనగ పప్పు ఉండల మీద నిలిచి పోయేది.అదిఆరగించిగౌను తడుపుకోకుండా మునిసిపాలిటీ పంపులో నీళ్ళు తాగి అమ్మకి ఆవస్తువు ఇస్తే "ఇదేమిటే!ఇంత తక్కువా!అనేది.ఏమో నాకేమి తెలుసు వాడిచ్చింది పట్టుకొచ్చాను,అని బుకాయించి లోపల ఆనంద పడిపోఎదాన్ని.అమ్మకి తెలుసు కాని నిలబెట్టి కూక లేసేదికాదు.ఇలావుండగా హటాత్తుగా జీవితం లోకి ఒక స్వర్ణ యుగం అడుగుపెట్టింది.ఒకరోజున నిత్య కర్మాగా కొట్టుకు వెళ్లాను.చాలా పిల్లలు గోలగా గుంపుగా నుంచున్నారు.ఎదోకొంతున్నారుకాబోలు వీళ్ళది అయాక మనం కొనుక్కోదామని వెనకనే వున్నాను.అప్పటినుంచే ఏమిటో వెనకగా వుండటం పెద్ద గొప్పగా వుండేది.పిల్లలు వెనుతిరిగి నాకు రెండువుండలు ఇప్పించారుచూసావా? అని చెప్పుకొంటున్నారు.తీరా చూస్తె అక్కడ ఒకాయన పూజారిలా వున్నారు,గావంచా కట్టుకొన్నారు,నుదుట పెద్ద నామాలు,పొట్టమీద,బుజంపైన నామాలు,వేనెక పిలక పూజారిగారని నిర్ణయం అయిపొయింది."దా తల్లి రా!అని నావంక చూసి ప్రేమగా పిలిచారు,ఆయన అలా నావంకే చూసి రెండు మార్లు పిలిచాక ఆహా నన్నే అని నమ్మకం కలిగాక వాళ్లనితోసుకొని ఒక అడుగు ముందుకు వేసా!తీసుకో తల్లి!నీకేమికావాలో తీసుకో అన్నారాయన.పక్కపిల్లలు తీసుకో వూరికేని ఇస్తున్నారు,అని డొక్కలో పొడిచి కనుసైగ చేసారు.నాలుగు నాలుగు రకాల ఉండలు తీసుకొన్నా,ఇక అదే పరుగు మా అమ్మ దగ్గర కెళ్ళి ఉదంతం అంతా చెప్పా.ఇవాళ ఏదో ఇచ్చారేమోలె!రోజు తీసుకోకుఅన్నది.చా!నీనేందుకు తీసుకొంటా!అన్నాను.సాయంత్రం పిల్లలందరం చేరినప్పుడు అన్డులోపెద్దపిల్ల "తాతగారు రోజు వస్తారట, మనందరికీ రోజు కొనిపెదతారట!ఇవాళ ఆయన వెళ్ళిపోయాక కొట్టాయన్ చెప్పాడు.అన్నది .ఉత్తిదిలే!అనుకోన్నాకాని మళ్ళి లర్నాడు అదే సమయానికి ఆయన కొట్టు దగ్గరికి రావడం పిల్ల సైన్య గుమిగూడటం మేడపై నుంచి చూసా. మా అమ్మ చూడకుండా పిల్లిలా వెనక మెట్ల మీదనుంచి దిగి బాణం దూసుకుపోయి నుంచున్నా.ఆయన ఇలాచూసారు,తీసుకో!అన్నట్లు.తీసేసుకొన్నా. అలా చాలా రోజులు గడిచాయి,ఆయన వచ్చ్సమయానికి వరండాలో నుంచిని కాపలా కాసి,ఆయన అల్లంత దూరంలో కనపడగానే అమ్మా!కోటలో ఏమన్నాకావాలంటే ఇప్పుడే చెప్పు తెచ్చ్పెదతా.తరవాత చదువుకోవాలి అని జారుకోనేదాన్ని.ఆయన ఎందుకలా తీపిని పంచిపెట్టారో తెలియదు.ఆయన తరవాత కొన్నాళ్ళకి రావడం మానేశారు.ఆయనకీ చాలా రుణ పడివున్నా అనుకొంటూ ఉంటా .చల్ల బజారు గురించి మళ్ళి వ్రాస్తా.
తాబేలు

Sunday, September 19, 2010

కృష్ణ వేణి

కృష్ణవేణి
కడలి పట్టపురాణి కల్యాణి మాకృష్ణ
ఎంత చక్కని తల్లివే మాయమ్మ ఎంత చల్లని తల్లివే
శాత వాహన రాజ్య సంపదకు మురిసి, ఈ
క్ష్వాకు నృప వైభవము చల్లగా నరసి,నీ
సరస వెలిసిన బౌధ్ధ జైనములు పాలించి
కనుతుదల ఆ స్మృతులు కదలాడ నడయాడు

మౄదు వీచికల రొదల మురళీ స్వనము లొదవ
పదగతుల మదవతుల పాదాంగదము లులియ
సదయాంతరంగమున సరసతలు పెల్లుబుక
పరవళ్ళతో కదలుమెయి సుళ్ళతోపొదలు

పసుపు కుంకుమ ముద్ద బంతి సేవంతికలు
కుసుమ మాలలు తెచ్చి పసదనము లందించి
విసవిసని నీ దారి వెంట బారులు తీర్చి
మిలమిలని కనుల ప్రజ నిలచి నిను పిలిచేరు
కడలి పట్టపు రాణి,కల్యాణి మా క్రుష్ణ
ఎంత చక్కని తల్లి వే,మాయమ్మ ఎంత చల్లని తల్లి వే

కీర్తి శేషులు కాటూరి వెంకటేశ్వర రావు గారు రచించిన "నాగార్జున కొండ"శ్రవ్య నాటిక నుంచి తీసుకొన బడినది. కృతజ్ఞతలు

Friday, September 17, 2010

మా బందరు


మా బందరు
మా బందరు అంటే నా కెంతో గర్వం గా వుంటుంది. ఎందఱో మహానుభావుల కి ఉనికి పట్టు మా బందరు. బందరు వుడిచి ఎన్నో సంవత్సరాలయినా "బందరు వాళ్ళన్నా ,బందరు కబుర్లు విన్నా "మనసు పుల్కాలా పొంగిపోతుంది. అలాటి సంఘటనే ఈమధ్య ఒకటి జరిగింది.
బెంగళూరు లో మా అబ్బాయి ఇంటి ఎదురుగా ఒక పార్క్ వుంది.పక్కనే కొత్తగా వెలిసిన చిన్న వినాయకుడి గుడి.రోజూ ప్రొద్దున్నే గణపతిని పలకరించి వాకింగ్ కి పార్క్ కి వెళ్ళడం నా దినచర్య అయిపొయింది.ఒకరోజు అలాగే వాకింగ్ చేస్తున్నాను,వెనకనుంచి సన్నగా మాటలాడుకొంటూ ఒక మగ గొంతు, ఒక ఆడ గొంతు వినిపిస్తున్నాయి.బతుకులో ఎందుకూ పనికిరాని బిడియం మనకి కొంచెం ఎక్కువ.వాళ్ళని చూడాలేదు,పలకరించాలేదు.కాని వాళ్ళూ నేను ఒకేసారి బయటికి వచ్చాము. వాళ్ళు రెండు అడుగులు ముందున్నారు . ఆయన ఎర్రగా బక్కపలచగా వున్నారు,ఆవిడ జరీ అంచు నేతచీర లో,చిక్కటి తలకట్టుతో ముద్దమందారంలా వున్నారు.ఇంతలో ఆవిడ ఒక అడుగు వెనక్కి వేసి నిలబడి"మీరు తెలుగువారా?"అన్నారు.అవునండీ!అన్నాను."మీ కట్టు బొట్టు చూసి తెలుగువారనే అనుకొన్నాను.పలకరిస్తే కదా పరిచయం అయేది.పలకరిస్తే తప్పేముంది?అని "అన్నారు.వెనకనించి ఆయన "మాది బందరు"అన్నారు.ఇంకేముంది?ప్రాణం లేచి వచ్చింది."బండరా?మీపేరు అన్నాను."పువ్వాడ తిక్కన సోమయాజి "అన్నారు.ఇంతచక్కటి పలకరింపు, ఇంత హుందా అయిన పేర్లు బందరు వారికి కాక మరేవరికుంటాయి అనుకోని ఆయన ముఖం వంక తేరిపార చూసాను."నీ తలపాగా కుచ్చు "అని శ్రీముట్నూరి కృష్ణారావుగారిమీద పద్యం వ్రాసిన శ్రీ పువ్వాడ శేషగిరి రావుగారు గుర్తుకు వచ్చారు.శేషగిరి రావుగారు మీకు బందువలా?అన్నాను."నేను వారి అబ్బాయిని "అన్నారాయన .అవునా! ఇప్పుడు పోలికలు తెలుస్తున్నాయి అన్నాను.ఆయన ,ఆవిడ ముసిముసిగా నవ్వారు.మాదీ బందరే !రావూరు అంటుంటే ,సత్యనారాయణగారు అన్నారాయన.మానాన్నగారు అన్నాను.వారిద్దరూ రోడ్డుమీదే నాకాళ్ళకి వంగి నమస్కరించబోతుంటే ఖంగారు పది నేను కాళ్ళు వెనక్కి తీసుకొన్నాను.మహానుభావుడు ఆయన ,మీకీ పద్యం ఎంత బాగా గుర్తున్నదండీ!అని వారిద్దరూ సంతోష పడిపోయారు.అలా బందరు సాహితీ ప్రియులు పరిచయం అయారు.పువ్వాడ శేషగిరి రావుగారు ,మా నాన్నగారు తరుచు కలుసు కొంటూ వుండేవారు.తిక్కన గారి భార్య పేరు ఇందిరా గారు.బందరు వదిలి బెజవాడ వచ్చేసాము.మామ గారి ఇల్లు ఇంకా బందరులో వుంది.ఇక్కడ మా అబ్బాయిలిద్దరూ వున్నారు.వేసవికాలంలో ఇక్కడకు వచ్చి ఉంటాము.అనుకోకుండా బందరు వారు మీరు కలిసారు"అన్నారు ఇందిర.అప్పుడనిపించింది అయ్యో రోడ్డుమీదే నిలబడి మాట్లాడుకొంతున్నాము,మా అబ్బాయి ఇల్లు ఇక్కడే రండి అని ఇంక్తికి తీసుకు వెళ్లి మావాళ్ళకి,మా వియ్యపురాలికి పరిచయం చేసాను.ఇంతలో ఆయన సెల్ మోగింది.ఆయన మాట్లాడి"మా మనవడు ఒక్క క్షణం వదలదు,ఆలస్యమయిందని ఫోన్ !అన్నారు .ఇందిరగారు నవ్వుతూ ఎన్నోకబుర్లుచేప్పో మధ్యాన్నం నాలుగుకాలా వస్తాను,మావాడి ఇల్లు దగ్గరే!మిమ్మల్ని పరిచయం చేస్తానని చెప్పి వెళ్లి సరిగా నాలుగులల్లా వచ్చి నన్ను,మా వియ్యపురాలిని తీసుకెళ్ళారు,మనవల్ని,ఇంటిని చూపించి,కొడుకు ,కోడల్ని పరిచయం చేసారు.వాళ్ళబ్బాయి మాకు ఫోటోలు తీసారు.అప్పటినుంచి రోజు పార్కులో కలిసేవాళ్ళం .వాకింగ్ అయాక నుంచుని కాసేపు కబుర్లు,ఇంకా అవకపోతే బెంచీమీదకూర్చుని కబుర్లు .వాళ్ళ పెద్దబ్బాయి కుటుంబం కూడా చూపించాలని ఇందిరాగారికి తహతహ.అది మాకు చాలా దూరం. ఇక కుదరదులే అనుకొన్నాం. ఇంతలో మా అన్నయ్య బెంగళూరు వచ్చి వాళ్ళబ్బాయి ఇంట్లో దిగాడు.వాని చూడటానికి వెడితే ఇందిరగారి పెద్దబ్బాయి ఇల్లు అటువేపే అని వదినగారు గుర్తు చేసారు.అక్కడినుంచి ఫోన్ చేస్తే "పదినిముశాలుపడుతుంది,రండి రండి అని ఇందిర చెప్పారు.నేను వదినగారు వెళ్ళాము.వాళ్ళ పెద్దబ్బాయి ఎంతో వినయంగా ,వాళ్ళ కోడలు ఎంతో సరదాగా పలకరించారు.పది నిముషాలు కూర్చుని వచ్చేసాము.ఇందిరాగారికి మారాక తృప్తి నిచ్చింది.పెద్దతనం లో మన పిల్లల్ని పరిచయం చేయడం, వారి అభి వృద్ధిని గురించి గర్వంగా చెప్పుకోవడం ఒక కాల క్షేపం. అందులో ఒక ఆప్యాయతా ఆనందము వున్నాయి.సరే ఇంతకీ పువ్వాడ వారిని గురించి చెప్పనేలేదు. "వంద చందా మామలు" అనే పుస్తకం లో మా నాన్నగారు పువ్వాడ వారిని గురించి వ్రాసిన వ్యాసం చూడండి.
పువ్వాడ వారు విజయ వాడ లో ఉండగానే కృష్ణా పత్రిక,ఆంద్ర పత్రిక సంపాదకులకు ఘన సన్మానం జరిగింది.ఆ సమయంలో యువకుడైన పువ్వాడ వేదిక మీద నిలిచి చదివిన పద్యాలు మరపురానివి.ఆనాడు ముట్నూరి వారి మీద చదివిన పద్యాలలో ఒకటి ఎంతో ప్రచారం లోకి వచ్చింది.అవును,అది కృష్ణా రావుగారి మూర్తి వంతాన్ని ముక్త సరిగా వర్ణించింది."నీతలపాగ కుచ్చు తవనిన్చేడుతీవియే ఠీవి ఏ మహీ,నేతకుచేత కాదుగద నీ నడకన్ గల సోయగమ్ము కృ,ష్ణా తరనామ్బు సంభవ నినాదము పొండుడు గాదె తద్వ చ ,స్రీతతరంగ నాద వివ శీకృత సర్వ జానాను మోదమున్.పువ్వాడ వారికి కవిత్వం పేరు చెపుతే పులకరిస్తుంది శరీరం .ఆయన వ్రాసిన "గోవస్తం"కావ్యం కరుణకు నిదర్సనం .ఇది చాలా సున్నిత మైన ఒక చిన్న సంఘటన.ఒక లేగా దూడ మీద కలిగిన సానుభూతి కావ్యం గా మారింది.కరుణ ప్రసరించక ఏమి చేస్తుంది?పువ్వాడ వారు పిమ్మట వ్రాసిన గ్రంధం"దారా"ముస్లిం ఇతి వృత్తం మీదకు పోయింది వారి కలం.అక్కడ శృంగారం ,సౌర్యం రెండూ అందినాయి వారికి."దారా"లో కట్టి దూసినట్లుగా వ్రాసారు కవిత్వం.ఇక ఆయన చదువుతూంటే వినాలి.ఎంతో సౌర్యం,క్రోధం వారిలో గోచరించేవి.పాత్ర తానె అయినట్లుగా భావించి చదివేవారు.ఆయన గారు అంత ఉద్రేకం తో వ్రాసిన కావ్యం కావడం వల్ల మరొకరికి వినిపించేతప్పుడు,ఆఉద్రేకం ద్విగుణీకృత మయ్యేది.అందువల్ల వారి గ్రంధం వారి చేతనే చదివించుకొని వినేవారు,చాలామంది.శేషగిరి రావుగారు బందరు హిందూ కాలేజిలో ,నేషనల్ కాలేజిలో పండితులుగా పని చేసారు.అంతకుమున్డుకొంతకాలం విజయనగరం కాలేజిలో కూడా వుంది వచ్చారు.ఎక్కడ పని చేసినా అన్నీ ఇతర శాఖలతో పాటు తెలుగు శాఖకు గౌరవ ప్రతిష్టలు కలిగించ గలిగారు."ఆయన పద్యం వినాలి,ఆయన పాఠం వినాలి.లేకపోతె ఏదో సంపద పోగొట్టు కొన్న ట్లు వుంటుంది ."అని విద్యార్ధులు అనుకొంటూ వుండటం నేను విన్నాను.పూర్వ కవుల మీద పువ్వాడ వారికి ఎనలేని గౌరవం.ఎన్నో లోతులు వెతికి ముత్యాలు వెలికి తెచ్చేవారు.ఇంకా ఏదో అందలేదనే భావం ఆయనలో గోచరించేది.అలాటి తితీక్షా,సమీక్షా వుండటం వల్లనే వారి బోధనలు విద్యార్ధులను అరి కట్టేవి.ఆయనగారు కొన్నాళ్ళు ముని మాణిక్యం వారి ఇంట్లో తిక్కన భారతం చదివి అర్ధం చెప్పారు. నేను తప్పకుండా హాజరయ్యే వాణ్ని.చెప్పడం లో ఆయన ప్రదర్శించే నేర్పు,తీర్పు ఎంతో గొప్పగా ఉండేవి.అసలు పద్యం కనపడితేనే పరవశించే స్వభావం ఆయనది.ఛందస్సు పేరు చెపుతే ఎప్పుడూ ముందడుగే! అందులో కవిత్వం అంటే మరీ గౌరవం.తిక్కన అంటే మరింత మక్కువ .అందువల్లనే కాబోలు వారి కుమారునకు "తిక్కన సోమయాజి" అని పేరు పెట్టుకొన్నారు.ఎరచన చేసినా కవిగా పెరిగివీరునిగా కాలాన్ని నడపటం ఆయన కలవాటు .అసక్తత,నిస్సారంసాదారణ భావం వారిలో మృగ్యం.ఏదో సందేశంఅందించడం కోసమే కవిత్వం అనే భావం వీరిలో వుండేది.నడకలో, నవ్వులోఎంతో ఉత్సాహపు ఊపు కనబడేది.మెల్లగా నడవడం,మెల్లగా మాట్లాడటం నే నెప్పుడూ చూడ లేడు.ఏదైనా కొత్త విషయం విన్నపుడు వీపుమీద కొత్తిఎమితిది?అని కేక పెట్టినట్లుగా ప్రశ్నించడం జరుగుతూ వుండేది.

Friday, September 10, 2010

శ్రీ వినాయక

శ్రీ వినాయక
శ్రీ వినాయకం విఘ్న నాశనం
గజాననం గణాధిపం
లంబోదరం ఏకదంతం
ప్రమ ధాధిపం ప్రమోద వరదం
అంబాప్రియ సుతం అమరవినుతం
మూషిక వాహనం మోదక ప్రియం
పాశ అంకుశ ధరం లయనాట్య విశార దమ్
కుమారాగ్రజం కుండలి బంధితం
సిద్ది బుద్ది సంసేవిత సకలం
లక్ష్మి గణ పతిం నిత్యం పూజితం
రచన శ్రీమతి అక్కమాంబా దేవి

Saturday, September 4, 2010

కృతజ్ఞత

video



ఒక అడవిలో సింహం చిత్తుగా దెబ్బలుతిని చావడానికి సిద్దంగావుంది.

ఒకామె జాలిపడి సింహాన్ని తనతో తీసుకు వెళ్లి మందులు వేసి, సేవ చేసింది.కొన్నాళ్ళకి సింహం వెనుకటిలా ఆరోగ్యంగా తయారయింది.

తర్వాత ఆమె జూ వాళ్లకి కాల్ చేసి ఈ సింహాన్ని వాళ్ళు తీసుకు వెళ్లి రక్షణ కల్పించాలని కోరిందట. వాళ్ళు వచ్చి సింహాన్ని తీసుకు వెళ్లి, జూ లో పెట్టి కాపాడారు.

కొన్నాళ్ళు గడిచాక ఆమె సింహం ఎలావుందో! చూద్దామని జూకి వెళ్ళింది.బోను కటకటాలకి ఇద్దరు చెరో వైపు వున్నారు. సింహం ఆమెను చూడగానే ముందుకాళ్ళు రెండూ బయటకు చాపి ఆమె భుజాలపై వేసి ఆమె తలను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకొంది.ఆమె తలని తన మెడ దగ్గరగా చేర్చుకొని,తన తలను ఆమె తలపై పెట్టి ప్రేమను,కృతజ్ఞతను వెల్లడించింది . ఇది వింటే నాకనిపించింది-


ప్రేమకి లొంగని దెవరు?
ప్రేమించడం తెలిస్తే
సేవకు మురియని దెవరు?
సేవ చేసే దోవ తెలిస్తే!
పశువులో మానవత్వం
పశుత్వం లో మానవత్వం
ప్రేమా సేవల -కలిమి-లేములే!

Friday, September 3, 2010

వరలక్ష్మి పూజ



ఇదుగోనండీ మావరలక్ష్మి దేవి





వరలక్ష్మికి రూపాయలతో,పూలతో,పసుపు ,కుంకుమలతో అక్షతలతో అష్టోత్తర శత నామావళి పూజ.పూలు తెచ్చేఅబ్బాయి బిల్వ పత్రాలు తెచ్చాడు,శివునికి అష్టోత్తరం చేసాను.ఆ పూజాశోభ.

Thursday, September 2, 2010

కృష్ణప్రేమ

కృష్ణాష్టమి నాడు మా కృష్ణుని సింగారం


ముఖారవిందం ,ఆభరణాలు చూసారా !




కృష్ణాష్టమికి కృష్ణునితో పాటు గోమాతనుకూడా పెట్టాను.ఆవిడకి జలతారు ముసుగు వేసాను



వ్రేపల్లెలో గోపికలందరి చెవులు అహరహం శ్రీ కృష్ణుని
వేణుగానం కోసం తపించిపోతూ ఉండేవి . ఒకగోపిక ఇంటికి అతిథి వచ్చాడు.అత్తగారు పొరుగూరికి వెళ్ళింది. మామగారు కోడల్ని పిలిచి "అమ్మాయి వంట జాగ్రత్త గా చేసిపెట్టు."అన్నాడట.గోపిక వంట చేసింది,అతిథి కడుపార భోజనం చేస్తున్నాడు,పెరుగు వడ్డించ బోతుంటే శ్రీకృష్ణుని వేణుగానం గాలిఅలలపై తేలివచ్చిగోపిక చెవులలో మోగింది.ఒకచేతిలో పెరుగుకుండ,చంకలో పసి వాడు,గోపిక వేణుగానానికి పరవసురాలై నిలబడలేక హడావుడిగా పిల్లవాణ్ణి ఉట్టిలో పెట్టి పెరుగుకుండతోనే వేణుగానం వస్తున్నదారిని పట్టుకు పరుగెత్తింది.

సామాన్య సంసారాల బాధలో ఈదుకొనే జీవుల్ని తన మోహన రాగంతో లాక్కుపోయే శ్రీ కృష్ణుడు అందరిని కాపాడుగాక.శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .