Pages

Sunday, April 3, 2011

ఉగాది





విశ్వ విజేతలం అయ్యామనే సంతోషాన్ని వెంట బెట్టుకు వచ్చింది "ఖర" నామ సంవత్సర ఉగాది. అరుణారుణ కిరణాలతో బంగారు కాంతులు కలబోసుకుని ఆకాశం మీద ఆరబోసుకొంటూ వస్తుంది ఉషస్సు ప్రతిరొజూ.




నియమ బద్ధుడయిన సూర్యుడు మానవాళిని మేల్కొల్పి చైతన్య వంతులు కండి అని హెచ్చరికలు చేస్తాడు. రోజుకు ఉషస్సు మొదలయితే , సంవత్సరానికి ఉగాది మొదలు . ప్రకృతి వసంత శోభతో వయ్యారాలుపోతూ కోకిలను ఆస్థానగాయనిగా వెంటతెచ్చుకొని మనసులలో ఆహ్లాదం నింపుతుంది. మనం కూడా మన కర్తవ్యాలని గుర్తు చేసుకొంటూ రాళ్ళ బాటయినా, ముళ్ళబాటయినా ఆశని , మానవత్వాన్నివెంట తీసుకొని ముందుకు నడుద్దాం .

Saturday, April 2, 2011

నీకోసం..



నీ కోసం
వెన్నెల్లో  నీకోసం
ఏటి గట్టున నీకోసం
ఎన్నెన్నో తలపులున్న
కన్నులతో నీకోసం
అరుదెంచ వా ప్రియా?
అందాల రాజువై !
మది నింపవా ప్రియా!
మాలతీల సౌరభాలు
నీవు లేని వెన్నెల  నాకేలా?
నేను లేని బ్రతుకు నీకేలా?