Pages

Monday, May 2, 2011

చిలకమర్తి వారి వర్ణన

                     చిలకమర్తి వారి వర్ణన
ప్రకాశం గారు,చిలకమర్తివారు   సహాధ్యాయులు.టంగుటూరి వారికి  వల్లెవాటు అలవాటు  చిన్నతనం నుండి ఉండేదట .ఆరోజుల్లో ధవళే స్వరంలో జరిగే ఉత్సవానికి ఇద్దరూ వెడుతూ వుండేవారట .ఒకసారి ఆ యాత్రలో టంగుటూరి వారిని వర్ణించారు చిలక మర్తివారు.ఆ పద్యం ఇది-
          సీ-ఈగ వ్రాలిన గాని వగా జారేడు నట్లు
                         మవ్వంపు కురులను దువ్వినాడు
               వరలలాటమునండు తిరు చూర్ణ రేఖను
                         ముద్దుగారేడు భంగి దిద్దినాడు
                అరుణ పల్లవ మట్లు  కరము రంజిల్లు,చెం 
                         గావి వస్త్రంబును గట్టినాడు 
                 చారలన్గారఖాను జక్కగా ధరియించి 
                         వలె వాటు కండువా వైచినాడు 
                    చెవుల సందున గిరజాలు చిందులాడ 
                     మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త 
                     టంగుటూరి ప్రకాశము రంగు మెరయ 
                       ధవళ గిరి తీర్ధము నకును  తరలివచ్చే!    
            





Sunday, May 1, 2011

రావూరు రచనలు

                           రావూరు  రచనలు 
 నవలలు
నెలవంక -ఆంద్ర రాష్ట్ర  హిందీ ప్రచార సభ ప్రచురణ .ప్రధమ,ద్వితీయ ముద్రణలు.
పాలవెల్లి -రవీంద్ర పబ్లికేషన్స్ ,మచిలీ పట్నం
బాటసారి -దేశి కవితామండలి ,విజయ వాడ .
ప్రత్యూషం -{అముద్రితం]
పాలకడలి -{అముద్రితం ]
సావిరహే!{అముద్రితం}
నాటకాలు
ఏరువాక
తలంబ్రాలు
పరితాపం
కీర్తి
ఎడారి
దండగలో పండగ
తెరచాప
నాదేశం
నాటికలు
మన జెండా
కళ
విరహవీణ
యాక్సిడెంట్
ఆరుమెట్లు
రిహార్సల్స్ 
పరిణయం 
టీషాప్ 
జాగారం 
పార్క్ బెంచ్ 
కనపడటం లేదు 
నే చెయ్యలేని సంసారం 
చుట్టా లోచ్చారు 
సరిహద్దు 
వార్షికోత్సవం 
రేడియో   నాటకాలు,నాటికలు 

చిడిముడులు  
నూర్జహాన్
పులోమ
కారుణి 
రాయల కాలంలో
విషాద వలయాలు
ఏరువాక
పరితాపం
నెలవంక
వేపపువ్వు
కొత్త ఇల్లు
తక్కింది తర్వాత
అపక్వహారం
పూల బాట
నాగలి-నక్షత్రాలు
ఆత్మబంధువులు
షాజహాన్
కరుణ
అదుగో రాముడు వస్తున్నాడు
అంకితం
లవర్స్ జిందాబాద్
మూడు ముత్యాలు
ప్రవాసి
బిల్హణుడు 
మల్హనుడు 
పొడి పస్తులు 
కధలు 
మధుపర్కాలు 
రోడ్డుమూల 
అంకితం  
సినిమాలు

లక్ష్మి
చక్రపాణి
వరుడుకావాలి
చింతామణి

శ్రీ కృష్ణ తులాభారం
విష్ణు మాయ
సతి సక్కుబాయి
సతి  సావిత్రి
నాగపంచమి
చేర పకురా చెడెవు
సొంతవూరు

ఇవికాక ఎన్నో  వ్యాసాలూ,గేయాలు,రేడియో ప్రసంగాలు,పద్యాలు ,సినిమా నాటకాల సమీక్షలు నాకు గుర్తు వున్నవి వ్రాసాను.