Pages

Wednesday, June 29, 2011

maa peratlo poolu






                                        మా పెరట్లో   పూసిన   పూలు 


బజారు వెళ్లి  కూరలు,పళ్ళు,  పూలు కొంటె     కొట్టువాళ్ళు చెప్పిన  ధరకి    సగం తగ్గించి  బేరం 
మొదలు పెడతాము .అవన్నీ వాళ్లకి ఆకాశం నుంచి జారి పడ్డట్టుగా   వారిని ఉద్ధరించడానికి   కొంటున్నట్లుగా  
మొహం పెడతాము.  ఇల్లు కట్టి చూడు ,పెళ్లి చేసి చూడు  అన్నట్లుగా  మొక్కపెంచి  చూడు అంటాను నేను.
విత్తనం భూమిలో   పాతిన  మరుక్షణం నుండి    మనసు రాబోయే   అంకురాన్నే  తలుచుకొంటూ  వుంటుంది.
భూమిని  చీల్చుకొని మొక్క అంకురించి,మారాకు వెయ్యగానే   అది ఎప్పుడు ఎదుగుతుందా! ఎప్పుడు పూలు,పళ్ళు ఇస్తుందా?అని వేయి కళ్ళతో ఎదురు చూస్తాము.ఒక్క పువ్వు పూస్తే,ఒక్క కాయ  కాస్తే అపురూపంగా చూసుకొంటాము.

పెంచిన  ప్రేమలోని  తియ్యదనం  అట్లాంటిది.  మా అబ్బాయి  అమెరికాలో మంచి పెరడు వాకిలి వున్నా ఇంట్లో ఉంటాడు. కిందటి సంవత్సరం నేను అమెరికా   రాలేదు. మా అబ్బాయి  నాలుగు రోజుల కొకసారి  ఫోన్ చేసి    ఎండా  బాగా వుంది.నువ్వు రాలేదు వస్తే మంచి మొక్కలు  పెట్టె వాళ్ళం , మేమే ఏవో  టమోటా అవి పెట్టాము.అనేవాడు. ఈమాటు అన్ని అనుకూలించి అబ్బాయి  దగ్గరికి వచ్చాను. రాగానే కొన్ని మొక్కలు,కొన్ని విత్తనాలు తెచ్చాము.
పాతది  ఒక పొద లాటిది వుంది.ఆకులు మొగలి రేకుల్లా వుంటాయి. దానికి పూలు,కాయలు ఏమిరానట్లున్నాయి,పీకి పారవేస్తే సరి అంది మా కోడలు. కొన్నాళ్ళు చూదాము అన్నాను,నేను ఇక్కడనుంచి ఇండియా  వచ్చాక మా అబ్బాయి మెయిల్ లో ఒక ఫోటో పెట్టాడు.  ఆపొద  పెద్ద గుత్తి వేసి  విరగబూసింది.నయం పీకి పారవేసాముకాదు  అనుకొన్నా. ఎండలు మొదలెట్టాక  దానికి  నీళ్ళు పోయడం మొదలెట్టాను.ఒక్క వారం లో  ఆపొద   లో  మూడు    మూడ  పెద్ద కాడలు వచ్చాయి చిన్నగా తరిలాకులాగా ఆకుపచ్చాదనం,దానిపై  చారలా  ఆకు పచ్చ రంగు  వచ్చాయి.మరో వారంలో   తక్కిన రెండు కాడలు పున్జుకోన్నాయి.   ఇవాళ నీళ్ళు   పోయడానికి  వెడితే మొదటి కాడకు రెండు మోగ్గలునిమ్మకాతంతవి  వచ్చాయి.  మొగ్గ తొడిగిన  మొక్కను  చూస్తె  నాకు సూలింతరాలులా     అనిపిస్తుంది    నాకు.అవే  ఫోటోలు    పెట్టాను.  గులాబీలు అలాగే  విరగబూసి బరువుకు ఒరిగిపోయాయి.ఈతెల్లపూల  పొద  పక్కన సుకుమారంగా    ఒక మొక్క  పెరిగింది.  నిండా  మొగ్గలు వచ్చాయి. మొక్క సుకుమారం  పూలూ సుకుమారమే   లేత  గులాబి  రంగులో   పూసాయి.మొన్న గాలివాన  వచ్చి ఒక కొమ్మ్క నేలకొరిగింది.  దాన్ని దారంతో  పక్క ఫెన్సింగ్ కు  కట్టాను. అందులోనే ఒక మొక్కకి    చంద్ర  కాంత  పువ్వు రంగులో రెండు పూలు  పూసాయి.ముద్దుగా వున్నాయి.
           
 ఎండాకాలం పూసే పువ్వుల విత్తనాలు    వాకిట్లో బుష్ ల పక్కగా వేసాను.  అవి మొలకెత్తాయి.
పక్క వేపు టమోటా మొక్కలు,కాబేజీ,కాలి ఫ్లవరు,ఏవో రకాల పచ్చి మిర్చి మొక్కలు వేసాము. టమాటోబుద్ధిగా పూలు పూసింది.  వాటి  పెరుగుదల తరవాత వ్రాస్తాను.   మొక్కల  మధ్య తిరు గాడితే  ఎంతొ హాయిగా వుంటుంది.      

Saturday, June 25, 2011

ఆలోచన 

Wednesday, June 22, 2011

nivuru gappinakaLa



                                         నివురు గప్పిన కళ

మినీ వాళ్ళింట్లో లలిత చదువుతున్నాము. వస్తారా బామ్మగారు తీసుకు వెళతా అని రేఖ ఫోన్ చేసింది.  తప్పకుండా అని వెళ్లాను.  మినీ ఇల్లంతా చక్కగా సర్ది లలితా సహస్రనామం పారాయనకి అన్నీ సిద్ధం చేసింది. ఇంకా ఒకరిద్దరు రావాలని ఎదురు చూస్తున్నారు. మినీకి, రేఖకి సమాన వయస్కులైన (నాలుగు ఏళ్ళ)అబ్బాయిలు వున్నారు. వారిద్దరికి చెరో సైకిలు వుంది. వాళ్ళు ఎక్కడికెళ్ళినా సైకిల్తో సహా వెళ్తారు. వాళ్ళిద్దరూ హాల్లో సైకిల్ రేస్ మొదలుపెట్టారు.

నేను గోడమీద వున్నచిత్రాలు చూస్తున్నాను. అక్కడ సీతారామలక్ష్మణహనుమలున్న రేఖా చిత్రం ఒకటున్నది. పెన్సిల్ స్కెచ్ అది.  ముఖాలు కళ కళలాడుతున్నాయి. రూపురేఖలు స్పష్టంగా వున్నాయి.  సన్నంటిరేఖలతో చిత్రం సుకుమారంగా వుంది.  కింద మినీ అని సంతకం వుంది.
"ఇది నువ్వు వేసావా?" అన్నాను. అవునండీ అన్నది మినీ.
ఇంకా ఏమి వేసావు అన్నాను.  వినాయకుడు అని చూపించింది. నాట్య గణపతి, అల్లానే సన్నని కోమలమైన రేఖలతో సుకుమారంగా చిత్రించి వుంది.  మినీ దేవుని మండపం వెనుక గోడని అలంకరించింది.  మూడు దేవతల బొమ్మలు పెట్టింది.   వాటిచుట్టూ జిలుగు పేపర్ ముక్కలు అంటించింది.  ఇవన్నీఎలా చేసావు అన్నాను??

జిలుగు పేపర్లని సన్నగా కత్తిరించి మూడు అంగుళాల వెడల్పు సెలో టేప్ మీద జిగిరు వున్నవేపు జల్ల్లితే అవి అతుక్కుపోయాయి! అని చెప్పింది.ఆ టేపులు గులాబి,నీలం,జలతారు రంగులతో ఫోటోలకు అంచులుగా అమరిచింది.  మరోచోట వెంకన్నబాబు ఫోటోకి ఇరువైపులా రంగుల పెరుపుకాగితాలతో రింగులు రింగులుగా చేసి, గొలుసులుగా వేలాడతీసింది.  ఆకుపచ్చని గ్లేజ్ పేపర్ కత్తిరించి మామిడాకుల తోరణంలా కట్టింది.

చిత్రలేఖనం కోర్స్ చేసావా అని అడిగాను. లేదండీ, సరదాగా వేస్తుంటాను.  ఒక పండగకి ఒక బొమ్మ వేయాలని అనుకుని వేస్తున్నానండీ అంది.  మినీ "క్లే" తో కూడా బొమ్మలు చేసింది.  చదువు విషయానికొస్తే MCA చదివింది. వంటవిషయానికొస్తే, బేకింగ్ ల నుంచి జిలేబీల లాంటి మన పిండివంటలు కూడా సునాయాసంగా, ఇనుమడించిన ఉత్సాహంతో చేస్తుంది.  సరే పూజలు, వ్రతాల సంగతి ముందే చెప్పానుకదా!

మామూలుగా కాకుండా తన ఇంటిని ప్రత్యేకంగా వుంచుకోవాలనే తపన మినీ ఇంటిని చూస్తే కనిపించింది.  ఇలాగే సృజనాత్మక శక్తి వున్నా ఎంతోమంది బయటకి మామూలు గృహిణిగా కనిపిస్తారు. కానీ నలుగురిలో వున్నా వారిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది.  ఏదో చేయాలనే తపనే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.  వయస్సులో వున్న పిల్లలు ఇలా కళా సృజన చేస్తుంటే వాళ్ళని మెచ్చుకోవడం నాకు చాలా ఇష్టం.  వత్తిని పైకి తీస్తే, వెలుగునిస్తుంది.  మొగ్గని నీటిలో వేస్తే వికసిస్తుంది. చిన్న పొగడ్త మనసును ఉత్తేజ పరుస్తుంది. నివురును తొలగిస్తే నిప్పు వేడినిస్తుంది. ఒక చిరునవ్వు, ఒక ప్రశంసా మనిషినీ మనసునూ ఎంత మారుస్తాయో!! 

Sunday, June 5, 2011

krushna patrika



                 అందరికి శుభోదయం
   పైన ఇచ్చిన మూడు బొమ్మలు     కృష్ణా పత్రికలోని వి.    మొదటిది మా  నాన్నగారు  వారం వారం వ్రాసే "వడగళ్ళు" హాస్యప్రధానమైన    వ్యాసానికి వేసేవారు.రెండవది  మానాన్నగారు కృష్ణా పత్రికలో    "పాలవెల్లి ' అనే  నవలకు వేసిన బొమ్మ .ఇక మూడవది పూజ్యులు శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు వ్రాసే  సంపాదకీయానికి వేసే బొమ్మ.ఈమధ్య ఎక్కడో   పంతొమ్మిది వందల యాభై లోని కృష్ణా  పత్రిక దొరికింది. ఈబోమ్మలు అందరికి చూపిద్దామని పెట్టాను.కృష్ణాపత్రికలో తోట వెంకటేశ్వర రావు గారు  చిత్ర కారుడుగా  వుండేవారు,ఎంత అందమైన బొమ్మలు వేసేవారో!ఉత్తమ కళాకారులని తలుచుకొంటే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఇక ముట్నూరివారు
గగన వీధిలో మబ్బుల రధంపై ఎంత  ఠీవిగా చేతికర్ర పుచ్చుకొని  కూర్చున్నారో,అంట థీ వి గాను  ఆఫీసులో వుండేవారు.నా చిన్నతనంలో క్రిష్ణాపత్రికే  నా ప్రపంచం.అది మాకుటుంబానికి    స్వర్ణ యుగం ఇప్పటికి  బందరు,కృష్ణా పత్రిక తలుచుకోగానే నా మనసు ముద్దయిపోతుంది.కళ్ళు చిప్పిలుతాయి.