Pages

Wednesday, August 31, 2011

చేతిపనులు


చేతిపనులు 




                                        చేతిపనులు 
                    అమెరికా     లో  వ్యాపారస్తులు      తాము తయారు చేసే   వస్తువులను   అమ్ముకోడానికి ఎన్నో   ఉపాయాలు  పన్ని,  అవస్థ పడుతుంటారు.   మా దగ్గర   ఈవాస్తువులున్నాయి,ఆ  వస్తువులున్నాయి, అంత  బాగుంటాయి,ఇంత బాగుంటాయి,   చచ్చు   చవకగా  ఇస్తున్నాం   అని  వివరాలతో  విన్నపాలు   ఇంటికి పోస్ట్ 
చేస్తుంటారు.కంపెని    తాహతుని  పట్టి     కాగితాలుగా పుస్తకాలుగా    ఈ కే ట లాగులు    వుంటాయి .మొన్న పోస్ట్
లో    ఇంత     కట్ట   వచ్చింది.    సాయంత్రం మాకోడలు   రాగానే    ఇచ్చాను.   వాటిని  అటు ఇటు చూసి   కావాల్సిన 
ఉత్తరాలు రెండు తీసుకొని 'మీరు   చూస్తారా?     ఇవిచూడను,      ట్రాష్ లో పడేస్తా  !అని   ఇచ్చింది. అందులో   రెండు    పుస్తకాలు   మెరుస్తూ   నునుపైన   పేపరుతో కొ ట్ట   వచ్చిన రంగులతో   వున్నాయి.ఉత్తినే వీటిని ట్రాష్ లో పడేయ్యడమా?  నాకు ఉసూరుమనిపించింది.
వీటితో ఏమైనా చేస్తే!అనిపించింది. కత్తెర.గ్లూ  సిద్ధం చేసుకు కూర్చున్నాను.  ఈరంగుల  కాగితాలతో   చాప లా అల్లితే ఎలావుంటుంది అనిపించి    ఒక్కొక్క పేపర్ని   సమాన  మైనచతురస్రాకారం  గా  చేసి  ముక్కలుగా  క త్తి రించాను.
వెడల్పు మూడు అంగుళాలు ,పొడుగు ఎనిమిది అంగుళాలు   ఉండేలా కత్తిరిన్చాను .  మూడు  అంగుళాల కాగితాన్ని సగం మడిచి గుర్తు పెట్టుకోవాలి.  ఒకవేపు సగంలో సగం   లోపలి కి మడిచి  రెండో వేపు సగం  లోపలికి  మడవాలి రెండింటిని కలిపి మధ్యలో గుర్తు  పెట్టిన  చోట  మడవాలి   అప్పుడు   ఎనమిది  అంగుళాల  పొడవు   ముప్పావు
అంగుళం  వెడల్పున్న   బద్దీలు  తయారవుతాయి.  సమానమైనముక్కలు  తీసుకొని నవ్వారు  అల్లికలా ఒకటి కిందకి ఒకటి పైకి వచ్చేలా  దగ్గరగా  కూర్చాలి.నాలుగు వేపులా   కొసలు  కనిపించకుండా నాలుగుముక్కలు          బార్దార్లా   అతికించాలి.ముక్కోనా కారంగా   ముక్కలు  కత్తిరించి  నాలుగుమూలలా   అతికించాలి.వీటికి రంగుల  కలయిక మనయిష్టం.  రెండు రంగులు వెయ్యవచ్చు,ముదురు లేత రంగులు కలపవచ్చు. దీనికి  వెనక  ముందు  వుండదు.రెండువేపులా     ఫోటోలు కాని,   చిత్రాలు   కానిపెట్టి   హాలులో   వేలాద  తీయవచ్చు.ఇలాటి ఫ్రేములు ఎక్కువగా చేసిపుట్టిన రోజులప్పుడు అలంకరించ వచ్చు.  వెనకచిన్న స్టాండ్ పెట్టిటేబిల్   మీద  పెట్టుకో  వచ్చు  నాలుగువేపులా   సన్ననివెదురు   బద్దతో  ఫ్రేం చేసి  గోడకి    తగిలించుకోవచ్చు.  ఫోన్  కింద  పెట్టుకో  వచ్చు.
మీ ఇష్టం .

Tuesday, August 30, 2011

#
           మొన్న   బంధువుల ఇంటికి  వెడితే      ఈ చిత్రం     హాలులో అలంకరించి వుంది.    నాకు  చాలా  నచ్చింది.
ఇది ఎక్కడకోన్నావు?  అని     సూరిబాబుని     అడిగితె    వివరాలు   చెప్పాడు.   చైనా  నుంచి తెచ్చాడట.  చైనాలో"క్లోసన్నే "    అని   ఈచిత్ర కళకి   పేరు.   ఎనామిల్  మీదకాని, రాగి  మీదకాని ఈ   చిత్రాలను   నగిషీ   పని చేస్తారు. బీజింగ్    లో     ఈక్లోసన్నే    కళ      జింగ్   తాయ్     కాలంలో   మింగ్ డైనాస్తి   లో  {#1450-1456#}ఈ చిత్ర కళ    పెరిగి   అభి వృ  ద్ధి      పొందింది.ఈచిత్ర కళలో    నీలం ఎనామిల్కి    గొప్ప  స్థానం వుంది.అందువలన   కళని  " నీలం   జింగ్ తాయ్"   అని కూడా    అంటారు.    క్లోసంనే     కళకి       పాత్రలు ఎరుపు రంగు రాగిని    ఉపయోగించి తయారు చేస్తారు.సన్నటి    ఇత్తడి తీగను     తయారు    చేసి    రాగి పాత్రపై  వున్నా  డిజైను పై   ఈతీగాను అతికిస్తారు.
ఆతరవాత ఆ  డిజైను     పట్టి రకరకాల  ఎనామిల్  రంగులు వేస్తారు.ఆ   పాత్రని    కొలిమిలో   కాల్చి ,చల్లారాక  పాలిష్ పెట్టి మెరుపులు   అద్దుతారు.
                                    ఈ   చిత్రకళ    లోహం మీదే    కాక క్రాఫ్ట్స్ లాగా   బట్టలపై   కూడా   చిత్రిస్తారు.ప్రోక్లైన్  అంటారు.   సంప్రదాయ సిద్ధమైన కళ ను ఎంతో    ఆకర్షణీయ మైన    డిజైన్లు  తయారు  చేసి    చైనా  వారు  వారి   కళను   ప్రాచుర్యం లోకి   తెచ్చారూ.    బీజింగ్ లోని    గోల్డెన్ పాలెస్  క్లోసంనే    చైనాలో    కల్లా పెద్ద ఫాక్టరీ ఈ  వస్తువులని  తయారు   చేస్తుంది.    ఎంతో    ఎంతోమంది   గొప్ప   గొప్ప    కళా కారుల చేతుల్లో  ఈవస్తువులు
ఆవిర్భ వీస్తున్నాయి.చైనా     లోని    చేతి కళలలో     ప్రసిద్ధ మైన    కళా  కౌశాలతను   ఆధారం  చేసుకొని తయారుచేస్తున్నారు.వస్తువు యొక్క   పరిశుద్ధత  గాని    ,వైవిధ్యం గాని క్లోసేన్నో కళలో    ఉత్తమోత్తమంగా వుంటుంది.చైనా   వారి   ఈ  కళ    తమ  దేశం లోనే  గాక  విదేశాలలో కూడా   ఎంతో   పేరు సంపాదించింది.క్లోసంనే
ఫాక్టరీకి వెళ్లి  చూస్తె   ఈ   వస్తువులు    కొనకుండా వెనక్కి రాలేరు.  
                              ఈ    ఫాక్టరీ    వారు   విందు భోజనాలు,  సమావేశాలు   కూడా   ఏర్పరుచుకోడానికి   సౌకర్యం  
  ఆ  ప్రాంగణం లో   కల్పించారు.ఈ  మెయిల్ ద్వారా ఆర్డర్   ఇస్తే   వస్తువులు  పంపుతారు.ఏదేశ మేగినా   కళా  పోషణ 
మర్చిపోకుండా   గుర్తుగా ఒక   కళా  ఖండము   వెంట తెచ్చుకోవడం    సురిబాబుకు    అలవాటు.  మా బోటి   వాళ్లము 
చూసి   ముగ్ధులవుతాము. 


Monday, August 29, 2011

గణేష్ శరణం

గణేష్      శరణం 
శరణం గణేశ 
మంచికి దోహదం చెయ్యి 
                                                                                        చెడుకి విఘ్నం కల్పించు 


Sunday, August 14, 2011

గుండెకోత

                                             గుండెకోత 
    అయిదు ప్రాణాలు    గొంతులోకోచ్చి 
    కళ్ళు    రెండు జలపాతాలై 
    చీకటి   గోళం లో   ఈడులాడిన   రోజు 
              
     ప్రియమైన  ప్రాణి    కళ్ళు   కూసుకొని 
    మంచు ముద్దలా    పడివుంటే 
    చైతన్యాన్ని   ప్రసాదించమని 
    వెయ్యి చేతులతో,    వెయ్యినోళ్ళతో
    భగవంతుణ్ణి    వేడుకొన్న   ఆ రోజు 
    నా  ఆయుష్షు    నా  బంగారానికియ్యమని 
   బ్రహ్మ దేవుణ్ణి    బతిమాలుకొన్న ఆ  రోజు
   పిచ్చి చూపులతో    ఆసుపత్రి గోడల్ని
   చిల్లులు పొడిచిన   ఆరోజు 
   బ్లాక్ డే   బ్లాక్    డే
   "పిలుపులో   లోపం  లేకపొతే   పరమాత్ముడు 
   తప్పక   పలుకుతాడు"
   అనే  సత్యాన్ని నిజం చేస్తూ 
  పరమాత్మ   కరుణించాడు 
ప్రియమైన   ప్రాణం కళ్ళువిప్పింది 
"అమ్మా!  అని  పోలిచింది 
 ఆకాశాన్ని,సముద్రాన్ని,భూమిని 
కొలవలేనట్లే 
నా    ఆనందాన్ని కొలవలేము 
ఆ    క్షణం 
నేను బతికా!  నేను  బతికా