Tuesday, September 27, 2011
dasaraa shubhaakaankshalua
Posted by
జ్ఞాన ప్రసూన
at
Tuesday, September 27, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
dasaraa shubhaa kaankshalu
Sunday, September 18, 2011
vyaasaalu takilee
తకిలీ
తకిలీ అంటే ఏమిటో నీకు తెలుసా? అన్నాను మా వాడిని. తకిలీఫ్ అంటే కష్టం అన్నాడు.
తకిలీఫ్ కాదు,తకిలీ అన్నాను. ఒక అక్షరం డిలీట్ చేసారేమో! అన్నాడు.ఈమాట విని కొన్ని ఏళ్లయింది.
మొన్న మా మేనల్లుడు వచ్చి "అత్తయ్యా! నేను గాంధీగారి వేషం వేస్తున్నాను, తకిలీ కావాలి
ఉందా? నీదగ్గర లేకపోతె ఇంకా ఎవరి దగ్గరా వుండదు. నేను బజారున పడాల్సిందే! అక్కడమాత్రం
దొరుకుతుందా? అని బేలగా మొఖం పెట్టాడు. వాడు తకిలీ అడగగానే నా మనస్సు పొంగిపోయింది."బీరువాలో ఓమూల దాచానురా! చూస్తావుండు,అని వెళ్లి చూస్తె పిచ్చిది పాపం అక్కడే వుంది. తీసుకొచ్చి వాడికిచ్చి " మళ్లి జాగ్రత్తగా పట్రా తెకపోయావో జాగ్రత్త ! అన్నా. తకిలీ చూడగానే వాడు ఊపిరి తీసుకొన్నాడు. రెండు అంగల్లో బయట పడ్డాడు. వాడు వెళ్ళాక తలుపు వేయడం కూడా మర్చి పోయి ఆలోచనలో పడ్డా!
తకిలీ అన్న మాట ఇన్నాళ్ళకి గుర్తు వచ్చింది? ఒకనాడు తకిలీ ఒక ఆయుధం.
ఈరోజుల్లో టి.వి లు ,సోఫాసెట్లు లేకపోతె ఎంత చిన్నతనంగా ,భావిస్తున్నారో! మా చిన్నతనం లో తకిలీ రాట్నము, చిలపలు ఇంట్లో లేకపోతే అంతచిన్నతనం గా భావించేవారు. ఖద్దరు కట్టడం, నూలు వడకటం, హిందీ నేర్చుకోవడం కనీస బాధ్యతలుగా ఉండేవి. మహిళలు చిన్నాపెద్దా అని లేకుండా రోజూ తీరికి చేసుకొని రాట్నం వడికే వారు. చిలపలు తయారు చేసి పట్టుకెళ్ళి ఖద్దరు బట్టలు తెచ్చుకోనేవారు.
మా ఇంట్లో చేతిరుమాలా కూడా ఖద్దరు దే వుండేది. మా అమ్మ గారు చాలా పీలగా ,సన్నంగా వుండే వారు ,అయినాసరే! ముతక ఖద్దరు చీరలే కట్టేవారు. అవి వుతుక్కోవాలంటే రెండు సేర్ల బియ్యం వండుకు తినాలి. మేము బందరు వదిలి మద్రాసు వెళ్ళాక మా ఇంట్లో ఆధునికత అడుగు పెట్టి నూలు బట్టల్లోకి దిగాము.
మద్రాసు లో వున్న దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలలో పాసయిన వారికి ఇచ్చే సర్టి ఫికేట్ల పై గాంధీ గారి సంతకం వుండేది. బెజవాడ లో హిందీ చదివే టప్పుడు శుక్ర వారం నాడు మాకు ఏకులతో{పత్తి తో జానెడు పొడుగున వత్తిలా వుండేది.} తకిలీతో దారం తీయడం, భగవద్గీత శ్లోకాలు చదవడం ,దేశ భక్తీ గీతాలు నేర్చుకొని పాడటం మొదలైన కార్యక్రమాలున్దేవి. ఆరోజు తప్పని సరిగా నీలం బద్దీ అంచులున్న ఖద్దరు చీరలు కట్టుకు రావాలని నియమం. నేను నా స్నేహితురాలు జయలక్ష్మి ఇద్దరం జోడీగా చదివాము. ఒకేపేటలో వుండే వారం ఇల్లు కూడా దగ్గరే! పొద్దున్నే రోడ్లు శు భ్ర పరిచే వాళ్ళ కంటే ముందుగా హిందీ విద్యాలయానికి వెళ్ళే వాళ్ళం. మా ఇంటినుంచి వాళ్ళింటికి వెళ్లి దాన్ని తీసుకు వెళ్ళే దాన్ని. నే వెళ్ళే సరికి అది దువ్వెన జుట్టు ముడిలో పెట్టుకొని వాళ్లమ్మాయి కి జడవేస్తూ టేబిల్ మీద హిందీ నోట్స్ తెరిచి పెట్టుకొని కళ్ళు దానిమీద పరుగెట్టిస్తూ వుండేది. దాన్నిచోచో జాజ అని బయలు దేరే వాళ్ళం. మమ్మల్ని చూసి చాలా మంది ఏదో ఆస్పత్రిలో పనిచేస్తున్నాం అనుకొనేవాళ్ళు. ఈ తకిలీ అప్పటిది. మా మేనల్లుడు వచ్చి తకిలీ అడగడం వల్ల ఇన్ని జ్ఞాపకాలు కళ్ళముందు కొచ్చాయి.వస్తువులు వాడకపోతే వాటి పేర్లు కూడా మర్చి పోతాము.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Sunday, September 18, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Friday, September 16, 2011
okkamaaTa
ఒక్కమాట
సుందరం,సావిత్రి, కూతురు ఉష ఆదివారం ఉదయం తీరుబడిగా కూర్చుని కాఫీ తాగుతున్నారు.సిగరెట్టు ముట్టించి పొగ గాలిలోకి వలయాలుగా వదిలాడు సుందరం. ఉష అదిచూచి నిట్టూర్చింది. తాతయ్యలు,అమ్మమ్మలు, బామ్మలు అంటే పిల్లలకి ఇష్టం కదు నాన్నా! వాళ్ళు మనమలకి కధలు చెపుతారు,లాలిస్తారు, ప్రేమిస్తారు,క్షమిస్తారు, ముద్దులాడతారు అంది. అవునమ్మా!మనమలంటే ప్రతిబింబాలు, వంశానికి నిచ్చెన మెట్లు అన్నాడు సుందరం . ప్చ్! నా పిల్లలకి ఆ అదృష్టం వుందో!లేదోE అంది తలవంచుకొని . అలా ఎందుకు అనుకొంటూ న్నావంమా!మేము లేమూ! నెత్తిన పెట్టుకొని చూస్తామమ్మా!మీరేమి చూస్తారు నాన్నా! మీరిలాచైన్ స్మోకింగ్ చే స్తుంటే నాకు పిల్లలు పుట్టే దాకా బ్రతుకుతారా? అంది. అంతే! సుందరం మనస్సు మెలికలు తిరిగిపోయింది. సి గరెట్టు పెట్టె లైటర్ డస్ట్ బిన్
లోకి విసిరేశాడు. మళ్లి సిగరెట్ ముట్టుకోలా. నిజంగా చెప్పుకోతగ్గ తాతగారు కదూ!
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, September 16, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
okkamaaTa
Wednesday, September 14, 2011
cheti panulu
ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు పని హడావుడిలో సెల్ ఫోన్ తాళాలు మర్చి పోతారు, మగవాళ్ళు ఆలోచనలలో పడి మర్చిపోతారు. అందుచేత ఇలాగ చేసి వీధిలోకి వెళ్ళే తలుపు పక్కన గోడకి
పెట్టుకొంటే బాగుంటుందని తయారు చేసాను. మాటి బట్ట లాగా గళ్ళు గళ్ళు గా వున్న ప్లాస్టిక్ షీట్లు
బజారులో దొరుకుతాయి .అవి తెచ్చి గళ్ళు లెక్కపెట్టుకొంటు రంగు ఊలు తో కుడితే ధాటీగా కనపడుతూ వుంటాయి. రంగులు ,పక్క వేసిన పువ్వులు మీ ఇష్ట ప్రకారం మార్చుకోవచ్చు.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Wednesday, September 14, 2011
1 comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
chetipanulu
Friday, September 9, 2011
vyaasaalu
కంప్యూటర్ సంసారాలు
ఏదైనా నవీన మైన ఉపకరణాలు తయారయినప్పుడు వాటిని కొనుక్కోవాలని,
వాడుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటాము. అవి మన ఆర్ధిక స్థితికి అందుబాటులో లేకపోతె కొనుక్కొన్న వారిదగ్గర చూచి సంబర పడిపోతాం. ఏదైనా వస్తువు కొనుక్కొంటే దానిలో నష్టాలేమిటి?కష్టాలేమిటి?లాభాలేమిటి? ఉపయోగమేమిటి? దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇవన్ని చాలా మంది ఆలోచించకుండానే కొనేస్తారు. మొత్తానికి చాలా మంది కొంటారు. ఇప్పుడు కంప్యూటర్ ,లేక లాప్టాప్ అందరికి అందు బాటులో వున్నా ధరలకే దొరుకుతున్నాయి. ఇవి ఆఫీసుల్లో ,నిత్య జీవితంలో అల్లుకు పోయాయి. నోరెత్తకుండా దీనితో పనులు చేసుకు పోవచ్చు.
మావదిన అన్నయ్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు.డబ్బు బాగానే సంపాదిస్తారు. మా వదిన కొన్ని రోజులు ఇంట్లోంచే పని చేస్తుంది. ఆరోజుల్లో తెల్లవారు ఝామునే వండి పెట్టేస్తుంది. మొన్న వాళ్ళింటికి వెళ్లాను. అన్నయ్య పైన కూర్చున్నాడు, లంచ్ టయిం అయింది. భోజనం చెయ్యండి అని మెయిల్ పెట్టింది. పైనుంచి అన్నయ్య దిగివచ్చి నాకు, తనకి టేబుల్ సెట్ చేసాడు.భోజనం మర్నాడు ఆదివారం అప్పుడు కూడా మా వదిన అన్నయ్యని భోజనానికి మెయిల్ లోనే పిలిచింది. "అదేమిటి వదినా అంటే " ఇవ్వా ళేగా పర్సనల్ మెయిల్స్ అవి చూసుకొనేది.అందుకని "అంది. కాలిక్యు లెటర్స్ వచ్చాక ఎక్కాలు గుర్తు పెట్టుకొనే పనే పోయింది. కంప్యూటర్స్ వచ్చాక పిలుపులు కూడా పోయాయి.
మొన్న వినాయక చవితికి కావలిసిన సరుకులన్నీ ఇంటావిడ భర్తకి మెయిల్ చేసింది ఆయన తెస్తాడు కదా అని ధైర్యంగా వుంది ,భర్త పొద్దుపోయాక చేతు లూపుకొంటూ ఇంటికి వచ్చాడు. "సరుకులేవి?' అంటే ఏమి సరుకులు ?అన్నాడాయన . మీరెప్పుడూ ఇంతే
పూజకి కావలసిన సరుకులు లిష్ట్ మెయిల్ చేసాకదా?మిమ్మల్ని నమ్ముకొని ఇండియన్ స్టోర్ కి
వెళ్ళకుండా వచ్చా.నాకేమి తెలుసు ?మెయిల్ పెట్టానని ఒక ఫోన్ చెయ్యలేకపోయావా? "బాగానే వుంది
సౌదిబ్యం అక్కడ ఈమధ్య అరటి పిలకలు కూడా పెడుతున్నాడట. తమలపాకులు వుంటాయి కదా పత్రీ మాట ఎలావున్నా ఇవైనా తెస్తారనుకొన్నా, వీదినిండా మొక్కలు చెట్లు అయినా లాభమేమిటి? ఒక్కటి ముట్టుకో కూడదు. పైగా అన్ని పేరుకూడా తెలియని క్రోటన్సు ఇలా విసుగుతో ప్రారంభ మయింది .ఇవన్ని విని వినాయకుడు జాలి పడి ఏదో విధంగా తల్చుకొంటున్నారు చాలు. అని సరిపెట్టుకుని ఉంటాడు.
వట్టి పిలుపు లేమిటి? పెళ్లి పిలుపులు కూడా మెయిల్ లోనేజరుగుతున్నాయి. అమెరికాలో వున్న సుజాత కూతురు పెళ్ళికి ఇండియా లోవున్న సుభద్రని రమ్మని శుభ లేఖ
మెయిల్ చేసింది సుజాత. సుభద్ర తప్పకుండా వస్తానన్నది ."నువ్వు వచ్చేటప్పుడు వీలయినంత చిన్నవి రెండు మంగళ సూత్రాలు పట్టుకురా అని మెయిల్ చేసింది. ప్రయాణం హడావుడిలో ఆ మెయిల్
సుభద్ర చూసుకోలా. రాత్రికి పెళ్లి అనగా అమెరికాలో దిగింది. స్నేహితురాలు వచ్చింది కదా మధుర మైన ఈపెళ్ళి వేడుక ఇద్దరం కలిసి ఆస్వాదించ వచ్చు అని ఉబ్బి తబ్బిబ్బయిపోయింది సుజాత. వీడియో కోసం ముఖ్య మైన విధులు జరపాలికదా బ్రాహ్మణుడు మంగళ సూత్రాలుతెమ్మన్నాడు. సుజాత సుభద్రని "మంగళ సూత్రాలియ్యి "అందిట. సుభద్ర నా మంగళ సూత్రాలివ్వ మంటా వేమిటే? అంది ఛాచా నీవికాదే నేను తెమ్మన్నవి! నాకెప్పుడు చెప్పావే! మెయిల్
పెట్టగా? అయ్యో!నే వచ్చేటప్పుడు మెయిల్ మెయిలే చూడలేదు .ఇప్పుడెలా?ఎలా? అనుకొంటుంటే పెళ్లి కొడుకు తల్లి పెద్దకోడలు మేళ్లోవి అడిగి తీసుకొని "మా ఇంటి పేరి వాళ్ళు కట్టినవేగా దీనితో తంతు
జరిపించండి అందిట.
ఇలాటి తమాషాలు జరుగుతూ వుంటాయి మొత్తానికి అమ్మో కంప్యూటర్ లేకపోతె ఎలాగా?
అని అందరు చింతా క్రాంతు లయ్యే టట్లు ఎదిగి పోయింది కంప్యూటర్ .
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, September 09, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
vyaasaalu
chetipanulu
పైన పెట్టిన నాలుగు ఫోటోలలో నేను తయారు చేసిన వస్తువులు చూసారు కదా! వీటన్నిటికి
మెటీరియల్ మాశీమా నాకోసం దాచి పెట్టి ఇచ్చింది. ఇవన్ని పనికిరాని కట్ పీసెస్. ఇందులో
మొదటిది చిన్న టేబుల్ మాట్! చీరల పమిట అంచులు జిగ్ జాగ్ చేసే తప్పుడు సంనపీలిక కత్తిరిస్తారు. వాటితో తయారు చేసాను. అవింని పొడవు ప్రకారం,రంగుల ప్రకారం విడదీసుకొని మూడు ముక్కలు కలిపి జడ లాగా అల్లాలి. దీన్ని ఎంతైనా పొడిగించుకోవచ్చు. పీలిక అయిపోయిన చోటల్లా మరో పీలిక కలిపిఅల్లుకు పోవడమే! అల్లాక గుండ్రం గా కావాలంటే గుండ్రంగా ,నలచదరం గా, కోడి గుడ్డు ఆకారం గా కావాలం టే ఘట్టిగా కుట్లు వేసుకోవాలి.
రెండవది చిన్న పర్స్ . సిల్క్ బట్టలోపల స్పాంజ్ పెట్టి చుట్టూ కాజా కుట్టు కుట్టాలి.అలాటివి రెండు చేసి పర్స్ చేసాను దీనికి ప్రెస్ బట్టన్స్ కుట్టుకో వచ్చు లేకపోతె జిప్ పెట్టుకోవచ్చు.చిల్లర వేసుకొని హాండ్ బాగ్ లో పెట్టుకోటానికి బాగుంటుంది. కత్తిరింపు ముక్కలలో పనికి వచ్చేవి తీసుకొని చేశా.
మూడవది మఖుమల్ బట్టతో చేసాను.నల్లది ఒకటి ,తెల్లది ఒకటి.తెల్లది అందంగా వుంది, నల్లది ధాటీగా వుంది దానికీద జరీ తో ఎంబ్రాయిడరీ చేసివుంది. తెల్లదానిమీద తెల్లటి వెండి పూసలతో ఎంబ్రాయిడరీ వుంది, అలాటిదే రెండు అంచులు వుంటే సంచి పట్టుకోడానికి కుట్టాను.
అవి కుట్టగానే డాక్టర్ .వసు సెల్ ఫోన్ పెట్టుకొంటానని తీసుకెళ్ళింది.
నాలుగోది కూడా చిన్న . పర్స్. తెల్లటి సిల్క్ బట్ట పై మెరుస్తూ సెల్ఫ్ డిజైన్ వున్నది రుమాలు కుట్టాను.మాశీమా ఇచ్చిన వాటిని బీరు పోకుండా సొమ్ము చెయ్యాలని తాపత్రయం.
ఇంకా కొన్ని చేయాలి. చేసాక సురుచిలో పెడతాను. కాదేదీ కవిత కనర్హం అన్నట్లు,ఎంత చిన్న బట్టయనా
ఏదో ఒకటి చెయ్యొచ్చు.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, September 09, 2011
2
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
chetipanulu
Wednesday, September 7, 2011
Posted by
జ్ఞాన ప్రసూన
at
Wednesday, September 07, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Tuesday, September 6, 2011
అమెరికా వచ్చిన అమ్మమ్మ తాతయ్య కొన్నాళ్ళు వుండి ఇండియా వెళ్ళిపోయారు.
వాళ్ళ మనుమరాలితో -
" అమ్మమ్మ వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారా" అని అడిగింది పక్కింటి ఆవిడ .
ఆపిల్ల - మరి వాళ్ళ వూళ్ళో వాళ్లకి కొన్ని థింగ్స్ ఉంటాయిగా! ఆ థింగ్స్ చేసుకోడానికి
వెళ్లి పోవాలికదా? అంది.
అయితే వాళ్ళు ఇండియా లో ఆ థింగ్స్ చేసు కొంటున్నారా? అంటే
ఆ థింగ్స్ వాళ్ళు చేసుకొంటూ న్నారో లేదో తెలియదు,ఎందుకంటే మనం ఇండియా వెళ్ళ లెం కదా!అంది
చేతులు ఊపుకొంటూ .
ఈకాలం పిల్లల కబుర్లు ఇలా ఉంటున్నాయి.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Tuesday, September 06, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Friday, September 2, 2011
maa intlo velisina ganapati
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, September 02, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Labels:
poojalu
light house
లైట్ హౌస్
సముద్రంలో ప్రయాణం చేసే నావికులకు దోవ చూపేందుకు లైట్ హౌస్ లు ఉపయోగ పడతాయి.
అమెరికాలో "బ్రూస్టర్ "అనే చిన్న ద్వీపం మీద మొట్ట మొదటి లైట్ హౌస్ #1716 లో నిర్మించారు.
ఇది బోస్టన్ లోవుంది.
Posted by
జ్ఞాన ప్రసూన
at
Friday, September 02, 2011
0
comments
Email ThisBlogThis!Share to TwitterShare to Facebook
Subscribe to:
Posts (Atom)
