Pages

Sunday, January 3, 2021

 ఊగింది నామనసు ఉయ్యాలా.             ఊయల 


నీలి గగనంకింద

పచ్చని. తొటలో



మావూరి కొసలో 

మామిడి. తోపులో

మల్లెల తావివంటి

మనసొకటి ఖలిస్జ్



ఆకాశాన్నంటుతూ

భూమిని. ముద్దాడుతూ

తెల్లనినావలె వాటుని

జెండాలా ఎగరేస్తూ 



తానెచటో , నేనెచటో

కలవలేదు  పదేళ్ళూగా 

అయినా ఆ స్నేహ పాశం  

నిలిచిందొక వంతెనలా 



విరబోసిన కురులు పాత 

కథలెన్నో చెప్పాయి

కలిసి తిరిగిన ఘడియలు 

కట్టెదుట నిలిచాయి 



స్నేహం చులకన కాదు 

నూరేళ్ళ పంట 

పరమాత్ముడు దయతో 

మన.    కిచ్చిన వరమిది కదా!

రచన -టి .జ్ఞాన ప్రసూన ,,ల్.

Wednesday, August 5, 2020

నేనెంత

నేనెంత 
         ఒకరోజు నాన్నగారు అలవాటు ప్రకారం  కృష్ణా పత్రిక ఆఫీసుకువెళ్లారు . సాయంత్రం అయింది. నీరెండలు సాగుతున్నాయి. కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరు కృష్ణారావుగారు ఆఫీసులో వున్నా చిన్న తోటలో   పచార్లు చేసే సమయం .  నాన్నగారు రోజూ లాగానే నిశ్శబ్దంగా ఆయన వెనకే నడుస్తూ, ఆయన ఆగితే ఆగుతూ నడుస్తున్నారు. ఆతోటలో చక్కటి రాతి శిల్పాలు ఉండేవి. సీతాకోక చిలుకలు తిరుగుతూ ఉండేవి. కొత్తగా పూలు వికసిస్తూ ఉండేవి .రోజూ చూస్తున్నా ఒకొరోజు వాటిలో ఎదో కొత్తదనం ఆయనకీ కనిపించేదేమో!అలా నిలబడి కొంచెం సేపు చూసి!మళ్ళీ తిరిగేవారు, ఆరోజూ అలాగే ఓ అరగంట గడిచింది, నడుస్తున్న వారాల్లా ఆయన గిరుక్కున వెనక్కి తిరిగి“రేపటినుంచి రండి“ అన్నారట  .!  అంతే   మానాన్నగారు మబ్బుల్లో తేలిపోయారట.ఏమిచెయ్య అంటారు?ఎన్నింటికి రానూ?ఎంత జీతం ఇస్తారు అని ఏమీ అడగలేదుట. అలాగే అని నమస్కారం చేసి ఆఘ మేఘాల మీద ఇంటికి వఛ్చి  మా అమ్మతో “నా జన్మ తరించింది, నా జన్మ ధన్యమైంది. నాకలనిజమైంది .అని సంతోషం తో  ఉక్కిరి బిక్కిరిఅయిపోయి చెప్పారట. 
                   మర్నాటినుంచి ఆఫీసుకు రోజూ వెళ్లడం ప్రారంభించారు. ఏముహూర్తాన ప్రారం భించారో గానీ కృష్ణాపత్రిక ఆయన జీవితం అయిపొయింది. 
              బందరుకి ఒక ప్రత్యేకత వుంది, ఒక హోదావుంది,లలితా కళా భూయిష్ట మైన ఒక వాతావరణం వుంది,స్వాతంత్ర సమర పోరాటానికి సిధ్దముగా వున్నప్రజా సమూహం వుంది. 


Thursday, October 24, 2019

నేనెంత

నేనెంత 
       కంపోజ్ చేసిన మెటర్ని కాలం సైజులో కుదింఛి మూడుకాలంస్ ఒక పేజీగా ఒక మోల్డ్లో పెట్టి అలాటి పేజీలు ఎనిమిది తయారు చేసి,నాలుగు పేజీలు  ముందు వెనకా ప్రింట్ అయేలా చేసిమిషను చేత్తోనే తిప్పేవారు. పెద్ద రోలర్ లాటిది తిరుగుతుంటే  దానిని మిషన్ లో పెట్టేవారు. ,ఆఫారమ్స్ బయటికి వస్తుంటే ఎంత చిత్రం గా ఉండేదో  అనుభ వజ్ను లైన కంపోజిటర్స్  పర్య వీక్షణ చేస్తూ ఉండేవారు. ముందు  ప్రూఫులు పొడుగాటి  కాగితాలపై తయారు చేసి ఇచ్ఛేవారు. ఆ మే తారు వ్రాసిన వారయితే ప్రూఫులు దిద్దడం తేలిక. బయట వారు వ్రాసినవి,చాలా జాగ్రత్తగా దిద్దాలి. ప్రూఫ్ రీడింగు అదీ ఒక కళే !అదొక భాష. చాలా ఓర్పుఉండాలి . ప్రూఫులు దిద్దడానికి ఇంటికి పట్టుకొచ్చ్చేవారు.  కూర్చో పెట్టి నాన్నగారు దిద్ది ఇచ్ఛేవారు. అప్పుడు నీకూడా కొంచెం నేర్చుకున్నా. 
                              కృష్ణా పత్రిక  వరండాలోంచి  మెట్లు ఉండేవి. పైన ఒక  గది .గాలి వెల్తురు,కిటికీలోంచి చూస్తేకింద పూల చెట్లు శిల్పాలు. కృష్ణాపత్రిక ఆస్థాన చిత్ర కారుడు తోట వెంకటేశ్వర రావు గారు బొమ్మలు వస్తూవుండేవారు.మెట్ల పక్కనేఒక పూల తీగ ఉండేది. దానికి "బాతుపూలు పూసేవి. అంటే కొమ్మచివర పువ్వు పూసేది.దానీరెక్కల పై మచ్చ్చలుండేవి .రంగు డార్క్ వైలెట్ ,దానిపై పసుపు చుక్కలు ,ఎందుకో నాకా  పువ్వులు  విచిత్రంగా ఉండేవి.ఆఫీసులో కాగితపు సంచీతీసుకొని దాంట్లో పూలు కోసుకు తెచ్చుకొనేదాన్ని. 
                                అకౌంటెంట్ మల్లినాథ సూరి గారికి నత్తి ఉండేది. అంచేతనో ఏమోబిడియ   పడుతూ ఎవరితో కలిసేవారు కాదు. మానాన్న   గారు ఆయనికి ధైర్యం చెప్పి ,ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లేవారు. హాస్య ప్రియుడు. బహు సంతానం,చాలీ చాలని జీతాలు. అయినా ఛలోక్తులు విసురుతూ  ఉండేవారు.  మా నాన్నగారు కృష్ణా పత్రికలో వారం వారం వ్రాసే హాస్య వ్యంగ రచన "వడగళ్ళకు ఆయనే హీరో!
ఆయనేదో ఒక చేనుకు విసిరితే ఆదిపుచ్చూకు నాన్నగారు సాగదీసి,చిలవలు  పలవలు తీసి వ్రాసేవారు. ఆవ్యాసాలు నాన్నగారికి,కృష్ణా పత్రికకు కూడా మంచి పేరు తెచ్చ్చిపెట్టాయి. కృష్ణా పత్రిక శుక్ర వారం సాయంత్రం విడుదల అయేది. కిల్లె కోట్లలో  ఆయా పేజీ విప్పి తాడుపై క్లిప్పులు పెట్టి వ్రేలాడదీసేవారు  . కొనుగోలు దారులు,వచ్ఛేపోయెజనం కొననక్కర లేకుండా నిలబడి చదువుకునేవారు.