Pages

Tuesday, January 30, 2007

విన్నపము

సాహితీ ప్రపంచం లోని సహృదయులకు స్వాగతం సుస్వాగతం

తెల్లవారి లేస్తే ఎన్నో భావాలు మస్తిష్కం లో మొలకెత్తుతూ వుంటాయి, వడిలి పోతూ వుంటాయి.
ఈ విద్యుత్స్చ క్తి  పలక  మీద వ్రాస్తే నలుగురూ పంచుకొంటారని ఆశ .మీకూ బాగు న్నవ ని పించేవి ఈపలక పై వ్రాయ వచ్చు. భాష శుద్ధం గా సుందరంగా స్వచ్చంగా వుండటం చాలాచాలా అవసరం.గేయాలు ,వ్యాసాలు, కథలు,హాస్యోక్తులు
అన్నిటికి చోటుంది. భక్తీ,ముక్తి,రక్తి,సూక్తి,శక్తి అన్ని జీవితానికి కావలసినవే.

క ళ లేని మనిషి  లేడు.కాని తమలో నూ కళ   నిద్రాణమైవున్నదని   తెలుసుకోవాలి. ఆ చైతన్యమే సాహిత్యం అందించాలి.గురువుగా తల్లిగా,అధినేతగా,స్నేహంగా పలకరిస్తూ,చేతి కర్రలా సహాయ పడుతూ,ఓదారుస్తూ ఉత్సాహ పరుస్తూ ముందుకు తీసుకు వెళ్ళేది సాహిత్యం.మంచి భాష వ్రాయడం, మంచిభాష చదవడం,మంచి భాష మాట్లాడటం తెలుగు వారి కర్తవ్యంగా సాగుదాం.
జ్ఞానప్రసూన
కవిత
ఎండకి ఎండా,చలికి   చలి
ఏదో ఒకటి ఉంటూనే  వుంటుంది
ప్రకృతి  తన విధి తాను  నిర్వర్తిస్తుంటే
మనిషెందుకు మత్తుగా పడి వుంటాడు
కాళ్ళు జాపి కూర్చుంటే
గంజి చుక్క దొరుకుతుందా?
కంటి నీరు ఇంకుతుందా?

జ్ఞానప్రసూన

No comments: