దసరా శుభాకాంక్షలు
సురుచి సుపరిచితులందరికి దసరా శుభాకాంక్షలు.అమ్మలగన్నయమ్మ
మీకందరికి జీవనమార్గంలొ సకల సౌకర్యాలు కలిగించి
అన్నివిధాలాతోడ్పడాలని కోరుకొంటున్నాను.
దేవీ స్తుతి
అమ్మలువచ్చారుముగ్గురు
దుర్గాలక్ష్మి సరస్వతి
దివినుండి భువికి
ఈదీనురాలి గుడిసెకి
శాంతిని తెచ్చారు ఇంటికి
శుభములుతెచ్చారు
ఒడిలో చేర్చారు మనసుకు
గడియలువేసారు
శమదమాదులణచి ఈషణ
త్రయాలు త్రుంచారు
నశ్వర మైన దేహముతో
శాశ్వత ముక్తిని పొందన్నారు
పూజా ,ధ్యానం,తపము,జపము
నిధిధ్యాసకే మెట్లన్నారు
అంతర్ముఖివై ఆత్మగతినెరిగి
నిత్యానందం పొందన్నారు
నవరాత్రిపొద్దులునవ్వుతుగడిపి
నవవిధ భక్తినిపొందన్నారు
No comments:
Post a Comment