


కృష్ణాష్టమికి కృష్ణునితో పాటు గోమాతనుకూడా పెట్టాను.ఆవిడకి జలతారు ముసుగు వేసాను
వ్రేపల్లెలో గోపికలందరి చెవులు అహరహం శ్రీ కృష్ణుని
వేణుగానం కోసం తపించిపోతూ ఉండేవి . ఒకగోపిక ఇంటికి అతిథి వచ్చాడు.అత్తగారు పొరుగూరికి వెళ్ళింది. మామగారు కోడల్ని పిలిచి "అమ్మాయి వంట జాగ్రత్త గా చేసిపెట్టు."అన్నాడట.గోపిక వంట చేసింది,అతిథి కడుపార భోజనం చేస్తున్నాడు,పెరుగు వడ్డించ బోతుంటే శ్రీకృష్ణుని వేణుగానం గాలిఅలలపై తేలివచ్చిగోపిక చెవులలో మోగింది.ఒకచేతిలో పెరుగుకుండ,చంకలో పసి వాడు,గోపిక వేణుగానానికి పరవసురాలై నిలబడలేక హడావుడిగా పిల్లవాణ్ణి ఉట్టిలో పెట్టి పెరుగుకుండతోనే వేణుగానం వస్తున్నదారిని పట్టుకు పరుగెత్తింది.
సామాన్య సంసారాల బాధలో ఈదుకొనే జీవుల్ని తన మోహన రాగంతో లాక్కుపోయే శ్రీ కృష్ణుడు అందరిని కాపాడుగాక.శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .
1 comment:
బాగున్నాడండి మీ కృష్ణుడు. ఎంతో కళ గా వున్నాడూ, కన్నయ్య రాగాలాపనకు హద్దులేమిటీ మరి. బాగుంది బాగా చేసుకున్నారా ఐతే కృష్ణాష్టమి. :-)
Post a Comment