గంగావతరణం అనగానే పార్వతీ దేవి నందిని ఆనుకొని నిలబడటం , పైనుంచి గంగా ఉధృతంగా శివుని తల పైకి ఉరకటం శివుడు స్థిరంగా నేలమీద కాళ్ళూని నిటారుగా నిలబడి పైకి చూస్తూ వుండటం పార్వతీదేవి పైకి చూస్తూ వుండటం గుర్తుకు వస్తాయి .
దీని వర్ణిస్తూ కీర్తి శేషులు నరసింహులు గారు రచించిన గద్యం మీకందిస్తున్నాము .
శ్రీ శెట్టి నరసింహం గారు విశాఖపట్టణ మండల వాస్తవ్యులు . వీరు రచించిన దంతయు మొత్తము నొకే ప్రాస నుపయోగించి ముగించుట ఇందు గమనార్హము .
గంగావతరణం
రంగ త్తుంగ
తరంగ సంఘములు తోరంబై చెలంగన్ గడుం పొంగం బారుచు , జారుచున్ దొరలుచున్ బొంగారుచున్ వెనవేల్ , వంగల్పెంచుచు చెంగలించుచును బైపై లేచుచున్ దేరుకొంచున్ గార్కాంచు భ్రమించుచున్ నురుగు జూపట్టుచున్ బుద్బుదాళిన్ గల్గించుచున్ బెల్లుగాజలకణాలిన్ రేపుచున్ హోరుమంచున్ గాలాబ్జము లీల
గర్జించు నీ క్షోణీతలం బంతయున్ గ్రున్గంజేయగా జాలుజాలు నారతియు సంక్షోభంబు గావించుచున్ నింగిన్ వీడి మహాప్రవాహామయి
క్షోనించేరగావచ్చి నీగంగన్ నిల్పగా శక్తులె వ్వరు ?భవత్ఖన్ఠమ్బునన్ కాలాగ్ని
ధరిన్చ్గినట్లది సిరంబందున్ ధరింపంగా నీవన్గీకార మొనర్పుమయ్య పరమీశా గంగా పయసంగాత్యమ్బున నాడు పూర్వులకు మోక్షంబీయవయ్యా యటన్చున్ గెల్మోడ్చి భాగీరదుండు శివునిన్ స్త్రోత్రంబులన్ చేయగా బెన్గన్బొందకుమయ్య రాజ తావక మనోభీశ్టన్బు తంబు దీర్టు నన్చం గం బుబ్బగా , బోరయున్విరిచి , కేశానీకమున్ విప్పి కాలున్ , గేలున్ బిగియించి మింటి దెసకాలొకిన్చుచు
జెట్టి రీతిన్ గొన్కొన్దక శంక్యరుండు హిమవత్సృన్గంబు పై నిలవగా , భంగంబుల్ వలులై ,తూవాల్ కనులునై ,పద్మంబు నేమ్మోమునై ,భ్రున్గుల్ ముంగురులై , మ్రిణాలి నిచయమ్బే బాహులై ,సైవలంబున్ కేశావలియై , చేలంగా సతియై పోల్పారుచున్ సౌరుతో సింగారంబులతో నోయ్యారములతో జేల్వంబుతో , గంగీ భంగిన్ దిగ్గుట ఈశ నెత్తి పయి నిల్వంకోరి కాబోలు నంచున్ గాన్తారాము తోడగౌరీ నందిపై కోరగిల్లన్గా గంగ దిగన్ దొరగే భువికిన్ లావపూ ణ్య వల్లియై .
ఇందులో ఎవయినా తప్పులుంటే క్షమించి దిద్దుకోవలసినదిగా ప్రార్ధన .
జ్ఞాన ప్రసూన
1 comment:
GANGA...the most sacred river in our country(INDIA,The Great).Ganga nadhi lo snanam chesthe manaki chala punyam untundhani peddalu chepthe nammi,guddi ga,bollantha dabbulu kharchu petti ,ganga nadhi pravahisthunna choti ki velli snanam chesi vachestaamu...Kaani,ganga endhuku specialo manam enadaina alochinchama????ledu..alantidhi prasuna garu manaki GANGA nadhi gurinchi,aa nadhi yokka prathyekamu ento manaki chibichharu...
nijam cheppalante naaku kuda adhi chadhive varaku endhulo theliyadhu...
Well Done GNANA garu...we want u to post many such mythological facts of our HINDU culture...GO ON!!
Post a Comment