Pages

Monday, July 2, 2007

శ్రీ దాసుశ్రీరాములుగారు

''అనల్పజల్పితా కల్పవల్లీ అనేమాస పత్రిక నడిపేవారు. అభినవ గద్య ప్రబంధమురచించారు.ఏలూరులో ప్లీడరీ చేసి ఒకచేత్తో కీర్తి,ఒక చేత్తో ధనం సంపాదించారు.పెక్కు కౄతులు,పదములు,జావళీలురచించి,తోట్ల వల్లూరు లోని వేణుగోపాల స్వామికి అంకితం చేసారు.ఉబుసుపోకకి రచనలు చేయడం కాక ఈయన సమాజంలోని వైరుధ్యాలను,అవకతవకలనుచూచి స్పందించి,యుక్తాయుక్తములు ఆలోచించి,చర్చించి,సమాధానములు, ఉపాయములు రచించిసమాజ శ్రేయస్సుకు పాటు పడ్డారు.సంగీతం,సాహిత్యం, నౄత్యం వీరి ఇంట త్రివేణీ సంగమంలాగా ప్రవహిస్తూ వుండేవి.
తమ పుత్రిక శారదా దేవికి చదువు నేర్పించి, శ్త్రీవిద్యా ప్రాముఖ్యతకు ఇంటినుండి శ్రీకారం చుట్టారు.సమర్ధుడైన ఒక అధ్యాపకుడికి ఉద్యోగం దొరకలేదని ఆయనకోసం ఒక స్కూల్ పెట్టి ఆయన్ని పోషించారట అంతటి ఉదార స్వభావంవీరిది.ఉద్యోగం చేసుకొంటూ వీరు ఎన్నోశతకాలు,కావ్యాలు, నాటకాలు వ్రాసారు.''దేవీ భాగవతం వీరి రచనలలో తల మాణిక్యంలాటిది.''

No comments: