Pages

Sunday, March 23, 2008

ఇదే తంతు
అవసరానికి సిం హాసనం వేసి
నీతిని నిజాయితీని
చెలికత్తెలుగాచేసి
వింజామ్రలు వీయిస్తున్నాడు
నేటి మానవుడు
కనపడని దానవుడు
తనకోరిక తన న్యాయం
తనుచెసింది,తనకుచట్టం
దీపమార్పిచీకటింట
సిరిదోస్తున్నాడు
పట్టపగలు నగరంలో
నట్టనడుమప్రాణం తీస్తున్నాడు
నేటి మానవుడు,కనపడని
దానవుడు
నేతలెవరు? దాతలెవరు?
కోతి సిమ్హమొకటేజాతి
ఆకలంటూవుంటేఅన్నమెవరి దైతేఅనె
రూకకోసం పీకతీసి
నాకమిదే అంటున్నాడు
నేటి మానవుడు
కనిపించని దానవుడు
ఘాంధీతాతా!
కదలిరావా?
బుధ్ధ భగవాన్ భువిని మరచావా?
ఏసు ప్రభువాఏదిదారి?
రామా,కృష్ణా రావలయ్యా
గుండె విరిచి గూడుకట్టిధర్మానికి నీడపట్టి
మారణ హోమం వద్దని
మొరపెట్టే మరో ఆత్మ
రావాలయ్యా రావాలి
దానవత్వం నశించాలి
మానవత్వం వికసించాలి
టీ. జ్ఞానప్రసూన

No comments: