ఓ మానవుడా!
సోదరమానవుడా!
చనిపోయినవాణ్ణి స్మరించడం కంటే
బ్రతికున్నవాణ్ణి బ్రతికేలాచెయ్యి
మనిషి నరాల్లో రక్తంపొంగి
పారుతున్నపుడే
మనిషి ముఖంలో నవ్వు వికసించినప్పుడే
మనిషి మస్తిష్కంలోభావాలు
దిశాంతాలు తకేటప్పుద్డే
మనిషి ఎదుటి మనిషి లోంచి
మానవత్వాన్ని చూడగలిగి నప్పుడే
మనిషిని గౌరవించు
అర్ధం చేసుకో, ఆదరించు
ప్రేమించు,కరుణ కురిపించు
కుంటివాణ్ణి పరుగెత్తించు,మూగవాణ్ణి నవ్వించు
బ్రద్దలయిన గునదెల్నిపోగుచేసి పోతపోయి
కారే కన్నీటిని,దోసిటపట్టి
దీపం వెలిగించు
మనిషిని గుర్తించేందుకు
మరణందాకా వేచివుండకు
No comments:
Post a Comment