Pages

Wednesday, September 3, 2008

శ్రీ విఘ్న దేవతా

ఆకాశమే పాలవెల్లి గా పూల మడులే నీకు పీథమ్ముగా
రావయ్య ,రావయ్య ! ఓ విఘ్న దేవతా !

ఓ ! గణాధ్యక్షా ! అది ఇది లేదని అలుగబోకయ్యా !
ఆశ రవ్వగ చేసి భక్తి బెల్లము చేర్చి
ఆపూపములు నీకు అర్పింతుమయ్యా !

దీపాలు ,ధూపాలు మంగళారతులు
ఆహ్లాదముగ జూప అవకాశ మేది

విద్యాప్రదాతా ! ఓ విజయ గణపతీ !
ఇఇర్శ్యాల ద్వేషాల పల్లేరుకాయలు మాబ్రతుకు బాటలో తొలగించు స్వామీ !
నిజమైన మనసుకు నీలాప నిందలు నీ కథా శ్రవనమున నివృత్తి చేయవా !

మా పిల్ల పాపలకు "అ" "ఆ" లు అందించి అక్షర సంపదలిచ్చి
ఆదర్శ మూర్తులుగా అవని లో నిలుపవా !

నీవు తలచిన చాలు బండలీ కరుగును కొండలే తరుగును
జలనిధులు దారిచ్చు పావకుడు మన్నించు
అన్ని కార్యములందు ఆసరాగా నిలిచి ముందుకు నడిపించు
మంచిగా మననివ్వు గుంజీలే కానుకలు దండాలే నగలు
స్తోత్రాలే పట్టు పీతాంబరాలయా !

పాపాలు తొలగించు శాపాలు విదిలించు
నిను నమ్మి నిను తలచి బ్రతకమని దీవించు !!

1 comment:

విహారి(KBL) said...

మీకు వినాయక చవితి శుభాకాంక్షలు