Pages

Thursday, September 4, 2008

వినాయకుణ్ణి చంకనెత్తుకొని.........
అమెరికా చుట్టం చూపుగా వెళ్ళాలంటే ఎన్నొ వస్తువులు తీసుకెళ్ళాలి. బారిష్టర్ పార్వతీసం కచ్చికలు తీసుకెళ్ళాడని వేళాకోళం చేస్తాంగాని, మనం మాత్రం? మనం వాడే టూత్ పేస్ట్ బ్రాండ్ అక్కడదొరుకుతుందోలేదోనని,మళ్ళిబ్రాండ్ మారిస్టే పళ్ళుకదిలిపోతాయని ఆరు ట్యూబ్లు పట్టుకుపోతాం,చలికాలం అసలె అక్కడ పళ్ళబాధలు,డాక్టర్లు దొరకరు,దగ్గు వస్తే బుగ్గన పెట్టుకోడానికి కరక్కాయలు దొరుకుతాయో లేదోనని తెఛ్ఛుకొంటాము.వినాయక చవితి వచ్చింది.
ఇక్కడ వాళ్ళంతా ఉద్యోగం విషయం లో అర్జనుణ్ణి అనుకరిస్తారు. ఉద్యోగం మీదే ఏకాగ్రత.తరువాతే అన్నం నీళ్ళు,నిద్ర.వాళ్ళతో ఏదైనా మాట్లాడుదామంటే రాత్రిళ్ళు అలసిపోయి వుంటారు, పొద్దునలేచేసరికి బూట్లుతగిలిస్తూ వుంటారు.అందుకని ఒకరోజు ముందుమావాడితో అన్నా.ఒరేయ్!ఎల్లుండి వినాయక చవితి తెలుసా!అని చెప్పావుగా తెలిసింది,ఏమికావాలో చెప్పు రేపు మాల్ కి వెళ్ళి తెచ్చుకొందాము అన్నాడు.హమ్మయ్య రేపు త్వరగా వస్తాడన్నమాట!అని హాయిగా నిద్రపోయాను.మర్నాడు మధ్యాన్నం ఫొన్ చేస్తే" ఏమిటమ్మా!"కన్నెకాటుకకళ్ళు" రెండో చరణం గుర్తు వచ్చిందా!అన్నాడు. కాదురా త్వరగా వస్తావుగా మాల్ కి వెళ్ళాలిగా! పెందరాళే వచ్చాడు వెళుతూ పూజకి ఏమేమికావాలో మననం చేసుకొంటున్నా. బెండకాయలు ఏరుతూ ఇక్కడ అరటి పిలకలు దొరుకుతాయా!అన్న అరటిపిల్లలా? నీకు తెలియదులే!అరటి చెట్లు దొరుకుతాయా? అరటిచెట్లా?ఇంకానయం తాటి చెట్లు తెమ్మన్నావుకాదు.పూజకి మండపం స్థంభాలకి కడతాముకదా? స్థంభాలెక్కడే? అదేరా!చెక్కలతో గళ్ళుగళ్ళూగా నలచదరంగా పాలవెల్లికడతారుగదా! ఏమిటొ చెపుతావమ్మా! అవన్ని ఎలా దొరుకుతాయి? దేముడికి ఆచ్చాదనగా పాలవెల్లిపై మామిడాకులు గన్నేరుకొమ్మలు,తామరపువ్వులు,వెలక్కాయలు,మొక్కజొన్నపొత్తులు, మారేడుకాయలు కడతాముగా. జామకాయలు కడతాము.అవునవును,ఒకసారి నువ్వు చూడకుండా ఆజామకాయ తిన్నానే! అఘోరించావులే చెంపలేసుకో!అయినా మీ అన్న కంటే నువ్వు నయమే!వాడిని పూజచేయరా అంటే అమ్మా!ముందు ఉండృఆళ్ళూ తిని తరవాత పూజ చేద్దామే1అనేవాడు.పోని కాస్త పత్రి తెచ్చాడేమోఅడగరా? అమ్మా!పత్రి పత్తి దొరకవే అన్నాడు.వాకిట్లో చెట్టు ఆకులు రావి ఆకుల్లా వున్నాయి రెండుకోసుకొంటే సరి,చాల్లే!వాకిలి చెట్లు వాడివికావు. ఇన్ని సరుకులు కొంటున్నాముగా!అడగరా! షాపు అద్దె ఇస్తాడు అంతే బయట వాడిదికాదు,చోద్యంగా వుందిరా?అవును బయట వాళ్ళే మైంటైన్ చెస్తారు.అసలు మారేడుకి,పారిజాతానికి, తులసికి వడిలినా కిందపడినా తప్పులేదుట పూజ చెయ్యొచ్చు,ఇంకాఎవొ రెండుచెప్తారు.ఈమాతు అవన్ని తేస్తావా?నువ్వు వెళ్ళేలోపున ఒక రావిచెట్టు,ఒక జామ చెట్టు పాతిపెట్టివెళ్ళు కాయలువస్తాయి,ఆకులు వస్తాయి. బెల్లంకొనాలిరా? సరేఅని బెల్లంవెతికి పట్టుకొచ్చాడు,అది గుమ్మడికాయంత గడ్డ వుంది.ఇంతెందుకురా? కాస్త పానకానికి కాస్త పరవాన్నానికి ఇక్కడమనకి కావలిసినంత చిన్నముక్కలియ్యరు ,ఉప్పుడురవ్వకావాలన్నా,సగ్గుబియ్యం కావాలన్నా కిలోలుకిలోలు కొనుక్కోవడమే
!కొనేస్కో అన్నాడు.ఇది నేను ఇండియా వెళ్ళివచ్చినాఇలాగేవుంటుంది అనుకొన్నా.తప్పదుగదా? లొపం చేయకూడదు.అసలు ఈదేవతలందరికి లింకు.వినాయకుడికి పూజ చేయకపోతే గౌరీ దేవికి కొపం వస్తుంది, ఆవిడకి కోపం వస్తే మన విన్నపాలు శివుడికి విన్నవించదు, గౌరిని పూజిస్తే శివుడు ఆనందిస్తాడు.అందుకు గణపతిని ముందు పూజిస్తే ఈపనులన్ని నిర్విఘ్నం గా జరిగిపోతాయి.ఇంకా ఏమికావాలి? కొబ్బరికాయ. ఇదేమిటి దీనికి పీచులేదురా!
అబ్బ! పీచేమి చేస్తావే1కొబ్బరిలోపలవుంది, నీళ్ళున్నాయి తీసుకో అన్నాడు.ఏమొగుడు లేకపోతే అక్క మొగుడే గతి.అన్నట్లుగా వుంది.అన్నిపట్టుకు ఇంటికి వచ్చాము. రేపు పూజ చేసుకు వెడతారుగా!అన్నాను.

No comments: