సమస్త కళలకు పుట్టినిల్లు,సమస్త ఆచారాల హరివిల్లుభారత దేశం.ఇక్కడి సూర్య కిరణాలు మంచుకొండలమీంచి జారి మానవుడికి కర్తవ్యబోధ చేస్తాయి ప్రతిదినము.సముద్రపు టలల పై ఊగి విదేశాలకు పయనమౌతాయి.వేదఘోషలు పర్వత సానువుల్లోని తపోవనాలలో మార్మ్రోగి మలయమారుతంతో కలసి నాలుగు వెపులా విదేశాలలో వెల్లివిరిశాయి.మన ప్రతి విధికి ఒక కథ.ప్రథి సామెత చుట్టూ ఒక గాధ ప్రతిపండుగకు ఒక ఆచారం.ప్రతి పర్వానికి ఒక ఆధారం.సంక్రాంతి పండుగ వచ్చింది.కంకుల బరువుతో వంగిన ధాన్య లక్ష్మికినమస్కరించి వేడికోళ్ళతోఇంటికి తెచ్చు కొన్నాడు రైతు. రైతుల స్వేదబిందువులు ముత్యాలై,ఆముత్యాలే ముంగిట ధాన్యపు గంపలైనాయి.కుటుంబ సభ్యులందరి ముఖాలు చేమంతి మడులైనాయి.
ఈదేశం లో బిక్షకి ఒక పరమార్ధం వుంది.అతిథి స్వయం విష్ణు-చేయి జాచిన వాడు పుణ్యదాత.పండుగ మూన్నాళ్ళూ రైతులు ధాన్యం అరుగుల మీదపెట్టుకొని దోసిళ్ళతొ దానం చెస్తూ వుంటారు.రామ భక్తుడు,రామ నామాను రక్తుడు త్యాగయ్యైంటి వీధి వరండాలోకూర్చున్నాడు.పక్కింటికి,ఎదురింటికి బీదలు తండోపతండాలు గా వస్తున్నారు.తమ జోలెలు నింపుకు వెళ్తున్నారు.త్యాగరాజు ఉచితంగా నమస్కారాలు అందుకో లెక పొతున్నాడు.భార్య గడపనానుకొని నిలబడివుంది. ఈవేళ పొయ్యిలో పిల్లిని లేపగలనా !లేనా!అని ఆలోచిస్తూ.త్యాగయ్య మనసు వికలమయింది."నా తంబురా తీసుకురా!"అన్నాడు భార్యతో.ఆమె తంబురా తెచ్చి భర్త పక్కన పెట్టి తంబురాకు,పతి పాదాలకు నమస్కరించి వెనక్కి నడిచింది.
త్యాగయ్య తంబురా సవరించాడు.అందులోంచి సుధలు జారి అమృత తరంగాలై పెల్లుబికాయి.ప్రయత్న రహితంగానే గొంతు పంచమ స్వరమాలాపించింది.ఎదురుగా ఒక బీదవాడు ఒంటి కాలిపై నిలచి జాలిగా చూస్తూ జోలె చాపి బక్ష కోరుతున్నాడు.త్యాగయ్యని రెప్పవాల్చకుండా చూస్తున్నాడు.రామనామం సుళ్ళు తిరిగి అక్కడున్న వాళ్ళందరి ఆత్మల్ని పల్కరిస్తోంది.త్యాగయ్య అరగంటకి కళ్ళు తెరిచాడు.ఎదురుగా బిక్షకుడు. త్యాగయ్య తంబురా తీగ ఒకటి తీసి బిచ్చగాని జోలెలో వేసాడు.అది చూసి మరో బిచ్చగాడు వచ్చాడు.త్యాగయ్య మరో తీగ తీసి వేసాడు.తీగ జోలెలో పడగానే బిచ్చగాని మొఖంలొనవ్వు,గళంలో నాదం పుట్టాయి.జోలెలో తీగ తనంతట తనే సరిగమలు పలుకుతోంది.మరో బిచ్చగాడు వచ్చ్చాడు.మరోతీగ తీసి వేసాడు.తంబురానుండి ఒక తీగ తీయగానె మరో తీగ పుట్టుకు వస్తోంది.సంధ్యా సమయందాకా తీగల దానం జరుగుతూనే
వుంది.గ్రామంలోని ప్రజలంతాతలలు వంచి"మేమిచ్చే ధాన్యపు గింజలు ఒకపూటకి సరిపోయేను,రెండుపూటలకి సరిపోయేనుకానీ మీరిచ్చే తీగల దానం జీవితానికి సరిపోయేది."అని చేతులు జోడించారు.త్యాగయ్య వారి చేతులు పట్టుకొని గోడమీదవున్నసరస్వతి,సీతారాముల పటాల వైపు తిప్పారు.ఆమరునాటినుంచి తీగ దానం తీసుకొన్నవాడల్లా పాటకుడయ్యాడు.కర్రకో,మంచానికో,వీణకో,తంబురాకొ,ఆతీగ కట్టిరాగాలు వాయిస్తూనె వున్నారు.భోగాలు అనుభవిస్తూనేవున్నారు.ఖజానాలో ధనం తరిగింది కాని త్యాగయ్య తీగలు తరగ లేదు.
సప్త స్వరాలను దానం చేసిన త్యాగయ్య మహానుభావుడా?ధాన్యం దానం చేసిన రాజు మహానుభావుడా?జవాబుగా ప్రతి తీగ సంగీతం పాడుతూ జవాబు చెపుతూనేవుంది.ఈనాటిదాకా త్యాగయ్యకి జోహారులంటూనే వుంది.
{పునర్ముద్రితం]
No comments:
Post a Comment