Pages

Wednesday, October 29, 2008

పేరు

పేరు
వూరునుంచి మాపిన్ని వచ్చింది.దానితో మాట్లాడదామంటే కుదరడంలేదు.
అది నేను ఒకేఈడు వాళ్ళం.ఒకేవుయ్యాలాలో పెరిగాం.పెద్దవాళ్ళం
చుట్టరికం ఎటు పోయిందో ఇద్దరం జిగరి దోస్తులమయాము.చెరో వూరు పోయి
బాధ్యతలు మీద పడికబుర్లు చెప్పుకొనే టైము దొరకడం లేదు.
"తను తిన్న తినకున్నా తనకున్న పని వదలదు"అని పనులు చక్క
బెట్టుకోవడం ముఖ్య కార్యక్రమం.నా అసిష్టెంట్ ఇంకా రాలేదుపైన
వాళ్ళింట్లో వుందేమోనని వెళ్ళాను.పిట్ట దొరికింది.వెంట బెట్టుకు వచ్చాను,
తలుపు తాళం తీసి
వెనక్కి తిరిగేసరికి లేదు,వస్తుంది కదా అని టీ.వీ పెట్టుకొని
చూస్తూ కూర్చున్నా.అదిరాలేదు కాని నిద్ర ముంచుకొచ్చింది.
అలాగె కల్లుతెరుస్తూ మూస్తూ ఎదురు చూస్తున్నా.ఒక అమ్మాయిని
వెంట బెట్టు కొచ్చింది.నా"ఫ్రెండమ్మా!చాన దినాలాయె కలవక
పక్కనె కనిపించింది,కాసింత ఊసులాడుకొందామని డాబా మీదికి
పోయుంటిమి అంది.మొఖం కళకళా వెలిగిపోతూంది. గర్వంగా
లొపలికి వచ్చింది.ఇంకా కబుర్లు మిగిలాయి కాబోలు గబగబా
పని చేసి వేడదామనె తొందర నడకలో చూపిస్తూ. ఆమ్మాయి
సాయం చెసి నిలబడి పోయింది."నీపేరేమిటీ?అన్నాను." నా పేరు
"ద్రాక్షావళి " అన్నది.

1 comment:

శ్రీసత్య... said...

చాలా బాగుంది..ఇలనే ముందుకు సాగండి.........!

మీ శ్రీసత్య...