పుష్కరం
పోషతీయతి పుష్కరం -జలానికి పుష్కరమని పేరు.జలం మనిషిని పోషిస్తుంది. తున్దిలుడనే ధర్మాత్మునికి పుష్కరుడనే పేరు వచ్చింది. ఇతడు ఈశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేసి ,""ఈశ్వరా! నేను నిన్నెప్పుడూ వదలకుండా వుండేటట్టు" వరమడిగాడు.శివుని ఎనిమిది రూపాలలో జలం కూడా ఒక రూపం ఇతనికి జల రూపం ఇచ్చి మూడున్నర కోట్ల పుణ్య తీర్ధాలకు అధికారిగా,జలరాజుగా వరమిచ్చాడు. బ్రహ్మ సృష్టి చేసే టప్పుడు నీరు కావాల్సి పుష్కరున్ని తన కమండలంలో నిలిచేలా వరం పొందాడు.బృహస్పతి బ్రహ్మను గురించి తపస్సు చేస్తూ పుష్కరున్ని పంపమని బ్రహ్మను అడిగాడు.పుష్కరుడికి అది ఇష్టం లేక బ్రహ్మను కూడా రమ్మన్నాడు.బృహస్పతి పన్నెండు రోజులు ,సంవత్సరం లో అన్ని రోజులలో మధ్యాన్న సమయంలో రెండు ముహూర్తాలకాలం పుష్కరుడు బృహస్పతితో వుండాలని ఆసమయాలలో తానూ సమస్త దేవతలతో బృహస్పతి వున్నా రాశి కి అధిష్టానమైన పుణ్య నదికి వస్తూన్తానని ఒప్పించాడు.పుష్కరంలో నదీజలాలు పవిత్రము లై దర్శన ,స్పర్శన,స్నాన,పాన మాత్రమున పంచ మహా పాఠక ,ఉప పాతకముల పో గొట్టు కొనడానికి లేక శారీరిక,మానసిక,కఫా,వాత,పైత్య,శ్లేష్మాది ప్రారబ్ధ జన్య వ్యాధులను కూడా నిర్మూలనం చేస్తాయి.
కృత యుగంలో రాదా కృష్ణులు ఒకసారి ప్రణయ కోపావేశం లో గంగాది పుణ్య నదుల పేర్లతో వున్నా గోపికలను శపించి భూలోకంలో పుట్టండి అన్నారట.వాళ్లు దీనంగా ప్రార్ధిస్తే మనుష్య లోకంలో భారత ఖండం లో మీరు మీపెర్లతో పుష్కర మహానదులై అందరిని ఉద్ధరించమని ఆశీర్వదించారు. పుష్కర నదులు పన్నెండు.
గంగ
నర్మదా
సరస్వతి
యమునా
గోదావరి
కృష్ణవేణి
కావేరి
భీమరథి
పుష్కర వాహిని
తుంగ భద్ర
సింధునది
ప్రణీత
గోదావరిని దక్షిణ గంగ అంటారు. సీతారాములు ఈ నదీ తీరంలో పంచ వాటిలో నివసించారు. లక్ష్మణుడు సూర్ఫణఖ ముక్కు, చెవులు ఇక్కడే కోసాడు.అదే నాసికా తీర్ధం అయింది.దశరథుని మరణ వార్తా విన్న రాముడు ఈ నదిలోనే స్నానం చేసాడు. ఆత్మీయుల మరణ వార్త విన్న తరువాత స్నానం చేయడం హిందువుల ఆచారం. గొహత్యా నివారణ చేయమని గౌతముడు శివుణ్ణి ప్రార్ధిస్తే శివుడు జట నొకదానిని తెచ్చి పిండగా ఆజాలం చేత గోవు జీవిస్తుంది. అందు చేత అది గౌతమ అయింది.నిస్సంతువులు స్నానం చేస్తే సంతాన వతులవుతారు .కుష్టు,రక్త పోటు ,అజీర్ణ వ్యాధులు పోతాయి.అరణ్య వాస సమయంలో ధర్మ రాజు కూడా గోదావరిని సేవించాడట.
గోదావరిని నాసికకు ఇరవై మైళ్ళ దూరంలో త్రయమ్బక గ్రామానికి చేరువగా వున్న బ్రహ్మ గిరిలో గోముఖంలోంచి ఉదయించింది. ఇదిమనకొక గొప్ప నది.పశ్చిమ సముద్ర తీరానికి యాభై మైళ్ళ దూరం లో పుట్టిన తూర్పుగా తొమ్మిది వందల మైళ్ళు ప్రవహించి బంగాళా ఖాతంలో కలుస్తుంది.గౌతమీగంగ అంటారు దీన్ని.జ్యోతిర్లిన్గామయిన త్రయంబకం రాజమండ్రి ,దాక్షారామం,భద్రాచలందీని ఒడ్డున వున్నాయి. ఇది సముద్రం లో కలిసేముందు ఏడు పాయలుగా చీలుతుంది. ఈపాయలకి సప్త ఋషుల పేర్లు పెట్టారు. సాతవాహన రాజ దాని ప్రతిష్టాన పురందీనిఒడ్డునే వుంది. రామదాసు నమ్మిన దైవం శ్రీరాముడు భద్రుడి కోరికపై స్వయంగా వెలిసాడు.ఇక్కడ సంవస్తరానికి ఒకసారి శ్రీరామనవమికి కల్యాణం జరుగుతుంది.
పుష్కర స్నాన మహిమ
జన్మ ప్రభృతి యత్సావం స్త్రియా వా పురుశేణవా
పుష్కరే స్నాన మాత్రస్య సర్వ మేవ ప్రణస్యతి
ఎందఱో మహా భక్తులు కొండల పైనా నదీ తీరాలలో గొప్ప గొప్ప తపస్సులు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది ఆరూపం లోనే భగవంతుణ్ణి అక్కడే స్థిర పాడమని ప్రార్ధించేవాళ్ళు .కనుక పుణ్య క్షేత్రాలు నదుల ఒడ్డున వెలిశాయి. నదులు కొండలనుండి అరణ్యాల నుండి ప్రవహిస్తాయి. అచ్చట ఔషధాలు వాటితో కలసి వచ్చి అందులో స్నానం చేసిన వారి దేహాలను పవిత్రం చేస్తాయి. నది అంటే శబ్దిన్చునది అని అర్ధం .
అనుశాసనిక పర్వంలో భీష్ముడు ధర్మ రాజునకు పుణ్య తీర్దాల విశేషాలు వివరిస్తూ -కనఖలనమునాను,గంగా ద్వారమునను,కుశావర్త మున్ను, బిల్వకమున సుస్నాతుడైన నరుడు పాపములు తొలగి స్వర్గ లోక విహారము కావించును అని చెప్పాడు.
గోదావరిని నన్నయ భట్టు దక్షినగంగా అని ప్రశంసించెను. సామాజికంగాయిక మత్యానికి పునాది.కన్యాకుమారిలో వున్న భారతీయుడు దక్షిణ భారతంలో వున్న గోదావరి,కృష్ణా, కావేరి మొదలగు మహా నదుల్లో స్నానం చేసి ,రామేశ్వరం లో సేతు స్నానం చెయ్యడం అలవాటు. ఇలాటి తీర్ధ యాత్రల మధ్యలో ఎన్నో పుణ్య క్షేత్రాలను ,దివ్య స్థలాలను,పీఠాలను ,మఠాలను ,మహా పురుషులనుసందర్శించి సాంస్కృతికంగా,ఆధ్యాత్మికంగా వైజ్ఞానికం గా మాత్రమేకాక దార్మికంగా నూతన చైతన్యాన్ని సంపాదిన్చుకొంతున్నారు.తీర్ధ స్నానం చేస్తే ఉన్మాదం,మనోవ్యాధి తగ్గుతాయి. నిస్సంతులకు సంతుకలుగుతుంది.దైవం,గురువు,వైద్యడు తీర్ధం మొదలైన వాటి విషయంలో మన భావన ఏప్రమాణమ్ లో వుంటుందో సిద్ది ఆప్రామాణమ్లోనే వుంటుందంటారు.భారతీయులు చాలామంది తీర్దాడులలో దైవత్వాన్ని దర్శించి సేవిస్తూ వుంటారు.వారి వారి ప్రమానాన్ననుసరిమ్చి ఫలితాలను పొందుతూ వుంటారు.తీర్ధ స్థలాలలో దాన ధర్మాలు చేస్తేపున్యం అని చేస్తూ వుంటారు.ఆకలితో వున్నవారికి ,అంగ వైకల్యులకు ,దీన జనావళికి ఇంట భుక్తి లభిస్తుంది.
రాముడు,బాల రాముడు,ధర్మ రాజు, అర్జునుడు కూడా విస్తృతంగా తీర్ధ యాత్రలు చేసారనిభారతంలో వుంది.
No comments:
Post a Comment