Pages

Thursday, July 30, 2009

వరలక్ష్మి దేవి

వరలక్ష్మి దేవి

మన భారత దేశంలో పండుగలు పర్వదినాలు గొప్ప స్తానాన్నాక్రమించాయి. గానుగెద్దులా తిరుగుతున్న జీవితంలో ఈ పండుగలు ఒక చైతన్యాన్ని నింపుతాయి. సంక్రాంతి ,దీపావళి, వరలక్ష్మి వ్రతం, దేవి నవరాత్రులు

చాలా శోభాయమానంగా జరుపుకొంటాము. దేశకాల పరిస్థితులని బట్టి రోజులు శరవేగంతోదొర్లి పోతుంటే

ఈపూజలు పునస్కారాలతో దూరంగా పారిపోతున్నారు.దేముడున్నాడా? అని ప్రశ్నించే యువతరానికి

జవాబు వివరించలేకపోతున్నాము. ఇక వీటిని ఆచరించమంటే మనవంక తేరిపార చూస్తున్నారు యువత.

వీటిలోవున్న సాంఘిక మర్యాదలు, వినోదము,తృప్తి ఈతరం వారు అర్ధం చేసుకో లేకపొతున్నారు.

పండగలకి కళా పోషణకి సంబంధం ఏర్పరిచారు పెద్దలు.దసరాకో,సంక్రాంతి కో బొమ్మలు పెట్టడం ఆడపిల్లలున్న

ఇంట్లో ఆచారంగా వస్తున్నది. బొమ్మలుపెట్టడం అంటే హృదయంలో ని కళా తృష్ణని మేల్కొల్పటమే ! పూర్వపు

రోజుల్లో దశావతారాలు, గోపికా వస్త్రాపహరణం ,రామ పట్టాభిషేకం,త్రిమూర్తులు ,షావుకారు దుకాణం,కొన్ని పక్షుల

బొమ్మలు పెట్టేవారు. ఇప్పుడు ఎన్నో సంఘటనలని, నగరాలని బొమ్మలకోలువులో నిలుపుతున్నారు.

సంక్రాంతి అంటే నెలరోజుల పండగ. ఆడపిల్లల,యువతుల చేతి వ్రేల్లనించి ఎన్ని మనోహరమైన రంగ వల్లులు జాలువారుతాయో!దీపావళికి దీపాల అలంకరణ లో భావుకతని ప్రదర్శిస్తారు. వరలక్ష్మి వ్రతముఅలాగే!

లక్ష్మి దేవిని సర్వాలంకార భూషిత గా ఊహించి అలంకారం చేస్తారు.కొందరి ఇంటి ఆచారం బట్టి కొబ్బరికాయ కి పసుపురాసి బొట్టుపెట్టి రేవికలగుడ్డ మడిచి పైన పెట్టి ,బొట్టుపెట్టి వ్రతం చేసుకొంటారు.కొందరు అమ్మవారి మొఖం వెండిది పెట్టి బిందేపైన కొబ్బరికాయ పెట్టి ఆబిందేకి చీర కడతారు.కొత్త చీరగాని,పట్టు చీరగాని కడతారు. బిందె మెడకి అడ్డంగా పుల్లకట్టి చేతులలాగా రెవిక తొడిగి,గాజులు వేసి అచ్చంగా అమ్మవారు కూర్చున్నట్లే వుంటుంది.నగలు అలమ్కారంచేసి,సవరం పెట్టి పూల జడవేసి సింగారిస్తారు. జరీ అంచులున్న చీర కడితే మెరిసిపోతుంది.వరలక్ష్మి వ్రతానికి రెండు పెద్దపనులు,ఒకటి అమ్మవారిని తయారు చెయ్యడం,రెండోది తొమ్మిది పిండివంటలు చెయ్యడం.

చేతికి ఎవరు సాయం లేకుండా ఈ రెండు పనులు ఒక్కరే చేయడం కష్టము.క్రితం రోజు సాయంత్రమే అమ్మవారిని

తయారు చేసికొంటే తప్ప పూజనాడు ఖంగారు అయిపోతుంది.కొబ్బరికాయ మాత్రమె పెట్టేవాళ్ళు కొబ్బరికాయకు

పసుపు రాసి కాటుకతో కళ్లు దిద్ది,గోధుమపిండి కలిపి ముక్కు చెవులు పెట్టి కుంకుమ తడిచేసి పెదవులు దిద్దుతారు

పూజ నాడు ముత్తైదు వలని పిలిచి వాయనాలిస్తారు.వచ్చిన వాళ్లు అమ్మవారి అలంకారం చూసిపోగాడుతున్నపుడు

ఏంటో ఆనందం వస్తుంది.

మన ఇంటికి పేరంటానికి వస్తున్నారంటే మన ఇల్లు అందంగా ఆకర్షణీయంగా వుండాలని చక్కగా

దిద్దుకొంటారు.కొత్తదనం శుభ్రత కనిపించాలని కోరుకొంటాము.

No comments: