అనుకోని వసంతం
చెట్లంటే నాకు పూల చెట్లే చెట్లనిపిస్తాయి.మళ్ళి కిచెన్ గార్డెన్ అంటే ఇష్టమే !
మావాడు కొత్తగా ఇల్లు మారాడు.అప్పటినుంచీ "ఇక్కడ చాలా పెద్ద పెరడువుంది .నువ్వు వస్తే బోలెడు కాలక్షేపం "అని గొడవ చేసాడు.వచ్చి చూస్తె నిజమే!పెరడు పెద్దదే!చెట్లకి నీళ్లు పోసుకోడానికి పంపు,ట్యూబ్ రెడీగా వున్నాయి.మా కోడలుఅంది "ఎదురింటి ఆవిడ గార్డెనింగ్ బాగా చేస్తుంది,పరిచయం చేస్తా"అని.ఆవిడే ఎందుకో మాఇంటికి వచ్చింది.పరిచయాలయ్యాయి.ఇద్దరి సరదాలు ఒకటయ్యాయి.ఒకరోజు ఆవిడతో కలసి నర్సరీ కి వెళ్దాము,మీకుకావలసిన మొక్కలు ఆవిడ సెలెక్ట్ చేస్తుంది,కొనుక్కువద్దాముఅంది.పెరట్లో రెండు మొక్కలు మాత్రం వున్నాయి.ఇవేమిటో తెలియదు పీకి పారేద్దాము,అంది మాకోడలు,ఎదురిన్టావిడతొ అంటే ఒకటి మందారం జాతిని,ఇంకోటి మొగలిపోదలావున్నది కూడా పూలు పూస్తుందని చెప్పింది.ఆరెండింటికి పాడు చేద్దామని అట్లకాడ పట్టుకు వెళ్లాను.వాళ్ళంతా చెమటలు పట్టింది కానీ మట్టి కాస్త కదల లేదు.రెండు రోజులు నీళ్ళుపోసి తరవాత ప్రయత్నిద్దామని వూరుకొన్నా.ఒక శుభముహూర్తాన ముగ్గురం కలసి నర్సరీ కి వెళ్ళాము.ఇద్దరం చెరో ట్రాలీ పుచ్చుకోన్నాము.మాకోడలు పెద్దగా గావుకేక పెట్టి ఒక చోట ఆగిపోయింది.ఏమిటో అని దగ్గరికి వెళ్లాను."అత్తయ్య గారూ!హంగేరీ మిర్చి ఈమొక్క చూసారా!కొనుక్కొందాము,అని ట్రాలీలో పెట్టింది.అక్కడ పెద్దపెద్ద ఆర్చీలలో
పూల మొక్కలు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాయి.ఈ దేశం వాళ్లు ఏజాతి పూలను ఆ జాతిపూల లాగా పెంచారు.రెండు మూడు రకాలు కలిపి వింత అందాలు తెస్తారు.ఒకవేపు చేమంతి బిల్లలాగా తోపురంగు పసుపురంగు కలిసిన పూలు,ఒకవేపు డార్క్ వైలెట్ గోట్టాలవంటి పూలు,
ఒకవేపు పసుపు ఆరెంజి రంగుల్లో బిళ్ళ గన్నేరుపూలు, గులాబీరంగులో సీతామ్మవారి జడలపూలు ,ఎవికోనాలి?ఏవి వదలాలీ?ఎంతయినా పరిచయం వున్నా రకాల మీదకే మనసు పోతుంది.నేను తేల్చుకోలేక ఎదురింతావిదని సలహా అడిగా.ఆవిడ ఫలానా పూలకి ఇన్ని ఘంటల ఎండా కావాలని,ఫలానా పూలమొక్కకి ఇన్ని ఘంటల నీడ కావాలనీ
ఫలానా పూలని ఇన్నిరోజుల కొకసారి ఎండలో పెట్టాలని,ఆంధ్రా కేఫ్ లో సర్వర్ ఏమి టిఫిన్స్ వున్నాయో చెప్పినట్లు గడగడా చెప్పింది.మీరు మొక్కని ఎక్కడ పెట్టదలుచుకొన్నారో ప్లాన్ చెపుతే ఏమికోనాలో చేపుతానన్నది.నేను మాకోడలు ఒకరిమోఖాలోకరు చూసుకోన్నాము.
అంత ప్లాను చేస్తేగా! వట్టి చేతులతో వెళ్ళడం ఇష్టం లేక మావాకిట్లో వున్నా
బుష్ ల చుట్టూ వరసగా పెట్టాలి,అక్కడిఎండ ఎంతసేపు వస్తుందో నీకు తెలుసుగదా?అక్కడికి పనికొచ్చేవి చెప్పు,అన్నాము.ఆరు రకాల పూలమొక్కలుకొన్నాము,నేనో టమాటో మొక్కకూడా తీసుకొచ్చా.ఇక భూమి తల్లిని తవ్వేదేట్లా?ఎదురింటి ఆపద్భాన్దవురాలు"మామూలుగా తవ్వలేవు,నాదగ్గర కరెంట్ తో పాడులుచేసేందుకు ఉపకరణం వుందితెస్తానని హామీ ఇచ్చింది.ఆమర్నాడునుంచి ఆవిడ కనపడలేదు.
మా అబ్బాయిని అడిగా కాస్త తవ్విపెడతావురా!అని,సండే చేద్దాంలే తొందరేమి వుంది అన్నాడు.రెండు రోజులు ఆమొక్కలు లోపల బయట మార్చాను.మూడో రోజున ఒక పదునైన ఆయుధంతీసుకొని మొక్కలుపాతా.రంగులు మార్చి వరసగా బుష్ లపక్కనే పూలమొక్కలు పాతా.వాకిట్లో లైట్ స్థంభం చుట్టూ తెలుపు,గులాబి రంగులవి పెట్టాను.
పెరట్లో పచ్చి మిర్చి ,తమతో పెట్టాను.తులసి విత్తనాలు ఇండియా నుంచి ఎన్నాళ్ళో అయింది అత్తయ్యగారూ!పనిలోపని అవీ ఒకుండీలో వెయ్యండి
అంది మాకోడలు.క్రిష్ణక్రిష్ణ అనుకొంటూ అవి వేసా.తెల్లవారంగానే వాటిని చూస్తేనేకానీ కళ్లు తెరిపిడి పడేవి కావు,ఇంతలొ ఒక ఉపద్రవం, "౨౦న
ఇండియా వెళ్ళిపోతున్నా ఇంకోమ్మా!త్వరగా వచ్చెయ్యి"అని రాధిక ఫోను.నెలాఖరుకి మరిదికోడుక్కి నిశ్చితార్ధం వెళ్ళాక తప్పిందికాదు.వేల్లానన్నమాటే గానీ మొక్కలేమయి పోయాయోఅని బెంగా .మొగలిపొద మధ్యలో ఘట్టికాడవచ్చి కణుపులు కనుపులుగా వచ్చాయి.మొగ్గలు,కానీ ఎరంగోతెలియలేదు,నేవేల్లెదాకా రంగు బయట పడలా ,ఇంకో మొక్కలేవో కాయలుగుండ్రంగా వచ్చాయి.నేవేల్లిన పదహారు రోజులకి మా అబ్బాయి మెయిల్ లో ఒక ఫోటో పంపించాడు.మొగలిపొద కి ఇంకా ఎన్ని కాడలు వచ్చి పొడనిండా పూలు విరగ బూసాయి.ఆపూలు పుయ్యడంకాదు,మావాడు శ్రద్ధగా ఫోటో తీసినందుకు పంపినందుకు తెగ
మురిసిపోయా.పూలుమనసుల్ని కదుపుతాయి.అయిడువారాలకి మళ్ళి ఇంటికి చేరా.వెంటనే పెరట్లోకి వెళ్లి చూస్తె ఏముంది?పచ్చిమిర్చి మూడు కాయలు కాసింది.టమాటో నేలమీద పాక్కుంటూపోయి ఒఇరవై కాయలు ఆకులకింద దాచుకొంది. తులసి కుండీనిండా అంగుళం ఎత్తున ఎదిగింది.
"ఎన్తానన్దమ్బాయెనహా,మదికెన్తానన్దమ్బాయెనహా!ఇలా అప్పుడప్పుడూ అనుకోని వసంతాలు పూసి,మదిలో మౌనరాగాలు పలికిస్తాయి.
2 comments:
మీ అనుభవం బావుందండి. నా అనుభవంతో మేమిద్దరం కలిసిమెలిసి పెంచిన మా ఇంటి వనమిది - http://picasaweb.google.com/ushaa.raani/PDZRDL?authkey=Gv1sRgCKukhcLq8o7NEA
బావుంది. నేను కూడా ఈమధ్య ఇంట్లో కుండీల్లో ఒక తులసి మొక్క, ఒక గులాబీ మొక్క, రెండు పామ్ లీవ్స్ వేశాను. రోజూ ఉదయం వాటిని చూడటమే పని. ఎలా ఉన్నాయో, ఎండ సరిపోతోందో లేదో, నీళ్లు ఎన్ని పొయ్యాలో... ఏదో పసిపాపను పెంచినట్టే ఉంది.
Post a Comment