ఆకాశమే పాలవెల్లిగా " ఆహ్వానమ "
పూలమడులే నీకు పీఠమ్ముగా
రావయా!రావయ్య!
ఓ!విఘ్న దేవతా!
ఓ!గణాధ్యక్షా !
అది,ఇది లేదని
అలుగబోకయ్య!
ఆశ రవ్వగా చేసి
భక్తీ బెల్లముచేర్చి
ఆపూపములు నీకు
అర్పింతుమయ్యా!
దీపాలు ,ధూపాలు
మంగళారతులు
ఆహ్లాదముగా జూప
అందుకోవయ్యా!
విద్యాప్రదాతా!
విజయ గణపతి
ఈర్శ్యల ,ద్వేషాల
పల్లేరుకాయలు
మాబ్రతుకు బాటలో
తొలగించు స్వామీ!
నరులజీవితాన
నీలాప నిందలు
నీకథా శ్రవణ మున
నివృత్తి చేయి
మాపిల్లపాపలకు
ఆ,ఆ లు అందించి
అక్షర సంపదలిచ్చి
ఆదర్శ మూర్తులుగా
అవనిలో నిలుపవా!
నీవు తలచినచాలు
బండలే కరుగును
కొండలే తరుగును
జలనిధులు దారిచ్చు
పావకుడు మన్నించు
అన్ని కార్యములందు
ఆసరాగానిలిచి
ముందుకు నడిపించు
మంచిగా మననివ్వు
గుంజీలే కానుకలు
దండాలేనగలు
పాటలే పట్టు
పీతాంబరాలయ్యా!
శాపాలు విదిలించు
పాపాలు తొలగించు
నినునమ్మి,నినుతలచి
బతికెదమయ్యా!
రచన -టి.జ్ఞానప్రసూన
1 comment:
చాలా బాగు౦ది..ముఖ్య౦గా ఈర్శ్య,ద్వేషాలు పల్లేరుకాయలా....
మా పసిపపలకి అ,ఆ లు అ౦ది౦చి అక్షర స౦పదలిచ్చి ఆద్శముర్తులుగా అవనిలో నిలుపువయ్య....భాషావేరు కాని నిన్న పుజలో నేను కోరుకున్న కోరికలు ఇవే..
Post a Comment