దసరా నెల
దసరాని కొంచెం అటు ఇటు తిప్పితే సరదా నెల అనికూడా అనుకోవచ్చు.దసరా మనకి పెద్ద పండగ కింద లెఖ్ఖ .ఈ పండగ తొమ్మిదిరోజులు గడుపుకొంటాము.పౌర్ణమి దాకా కొందరు అమ్మవారిని పూజిస్తారు,ఓపిక,అవకాశమూ .ఎన్నిరోజులు పూజించినా అమ్మ కాదనదు.మేము శరన్నవరాత్రులు చేయడం ౧౯౬౨ లో ప్రారంభించాము.
అప్పటినుంచి అప్రతిహతంగా నడుస్తూనే వున్నాయి.ఏదో పెద్ద అవాంతరం వస్తే ఒకటి రెండు సార్లు చేయలేదు అంతే!నవరాత్రి పూజలు
మొదలు పెట్టె వరకు అమ్మ మమ్మల్ని నీరసంలో ముంచి, పరిస్థితులు
అనానుకూలం చేసి ,ఆదాయపు దారులు మూసి ఏమిటి మీ సంగతి?
అని ప్రశ్నిస్తుంది.మానవ మాత్రులం,చేతకాని వాళ్లము, నీడయపై ఆధార పది వున్నాము, నీకన్న మాకు దిక్కెవరు తల్లీ!అని చేతులు జోడించి ప్రార్ధిస్తూ కూర్చుంటే,అమావాస్య నాడు వెన్నెల కురిపిస్తుంది.మా మనసులు నాట్యం చేసి పూజా సామగ్రి తేవడానికి పరుగెత్తుతాము.
చిత్రము తొమ్మిది రోజులు తొమ్మిది క్షణాలుగా దోర్లిపోతాయి.అంగ రంగ వైభవముగా సేవలు చేయించుకొంటుంది.కళ్ళనిండా రోజుకొక తేజో మూర్తియై మా కు పండగ చేస్తుంది. తన రూపాలుగా ఎంతో మంది ముత్తైదువలని రప్పిస్తుంది.మా నాన్నగారు నవరాత్రులు తొమ్మిది రోజులు ఏరోజు వంటకాలు,పప్పు,కూర,పచ్చడి,పులుసు, పిండివంట
ఏమి చెయ్యాలో వ్రాసి పెట్టేవారు, దానికి తగినట్టుగా రోజూ కూరలు
తెప్పించేవారు.పొద్దున్న పూజ అయాక,మహానివేదన చేసాక ఒక పద్యం వ్రాసేవారు,ఆ పద్యం అమ్మవారికి వినిపించి భోజనం చేసే వారము.నవరాత్రులలో నాగమల్లి పూలతో ,పారిజాతం పూలతో సహస్రనామాలు పూజ చేస్తే ఆ పూల పీఠము పై అమ్మవారు ఎంత సొగసుగా వుండేదో!ఇల్లంతా ఆ పరిమళాలు వ్యాపించి ఆ తల్లి నేనిక్కడే వున్నా!అని చెపుతున్న ట్లుండేది . ఆ తొమ్మిది రోజులు ఎంత
ఓపిక వచ్చేదో! విజయ దశమి నాడు అమ్మవారికి ఉద్వాసన చెపుతుంటే
కంటికి మింటికి ఏకధారగా మాకందరికీ ఆనంద భాష్పాలు దొర్లేవి.ఇల్లంతా
బోసిపోఎది,వంట్లో సత్తువంతా పోయి నీల్లుకారిపోయే వాళ్లము.అయినా
ఆ తొమ్మిదిరోజులు అమ్మకి సేవ చేసి ఆశిస్సులు మూట కట్టుకొంటే సంవత్సర మంతా బలంగా వుండేది. మా అమ్మగారింట్లో బొమ్మలు పెట్టె ఆచారం లేదు,ఒకసారి పెడితే ఏదో అనర్ధం జరిగింది.అప్పటినుంచి మాని వేసారు.బొమ్మలు కూడా పెడితే ఎంత హదావుడో! ఈతరం వాళ్ళకి పూజలు ,కొలువులు వట్టి ఖర్చుకిందా,వృధా శ్రమ కిందా అనిపిస్తున్నాయి.మన చుట్టూ వున్నా సంస్కృతిని ,కళలని విశ్వాసాలని
తామర తూల్లలా వెనక్కి నెట్టేసి దేనికో ఎక్కడికో ఈదుకుపోతున్నారు.
1 comment:
chaalaa maari poyam anipistundi..inka naa pillalu time ki uhake bhayam vestundi.
Post a Comment