Pages

Saturday, October 10, 2009

ఫాల్


ఫాల్
ఆకురాలు కాలము, శరదృతువు లను ఫాల్ అంటారు.ఆటం ,సమ్మర్ ,ఫాల్ ,వింటర్ .అమెరికా ,కెనడా దేశాలలో ఈ ఋతువులన్ని
వేటికవే ప్రత్యేకమైన ఆర్భాటాలతో నడుస్తూ వుంటాయి.ఇక్కడి మనుష్యులు జీవితాన్ని ప్రక్రుతి తో ముడివేసుకొని నడుస్తూ వుంటారు.
మన వేపు పండగలకి బంగారం అమ్మే వ్యాపారస్తులు ,బట్టల వర్తకులు
రాయితీలు ,బహుమానాలూ ప్రకటించి వస్తువులు అమ్మి సోమ్ము చేసుకొంటారు.ఇక్కడ ఎ ఋతువుకు తగ్గట్టు ఆ ఋతువుకి కావలసిన
వస్తువులు అందుబాటులో రకరకాల ధరలలో అమ్మకానికి పెట్టి "మీ సౌకర్యం కోసమే మేము వ్యాపారం చేస్తున్నామంటారు."
సమ్మర్ లో ఇక్కడ ఎన్ని రకాల పూలు పూయిస్తారో!రెండు మూడు పూల జాతుల చెట్లని కలిపి అంటుకట్టి విచిత్రంగా పూయిస్తారు.
ఆకు కనపడకుండా పూలు పూస్తాయి.చిన్న చిన్న పూల కుండిలలో మొక్కలుపెట్టి నిడుగా పూలు పూయిస్తారు.వాటికి ఏమి ఎరువులు వేస్తారోగాని విరగ బూస్తాయి.శాన్ఫ్రాన్సిస్కో లో రోడ్లకి రెండువేపులా గన్నేరులు.పూల బరువుకి నేలమీదకి ఒరిగి పోతూ వుంటాయి.మందారాలు,పొద్దు తిరుగుడుపూలు,కనిపిస్తాయిఅన్ని చోట్లా
నంది వర్ధనాలు ఎర్రగా వుంటాయి,చిలక ముక్కు పూలు నీలంగా వుంటాయి.సన్నగా నాజూకుగా వున్న యువతి నిటారుగా నిలబడి ఆకాశానికి పుష్పాంజలి అన్దిస్తోన్దా అన్నట్లుంటాయి పూల మొక్కలుఎక్కడ చూసినా పూలు.రంగు రంగు తివాచీలు పరచినట్లుగా వుంటాయి.పోష్ట్ డబ్బాకి పూలు,వాకిలి గుమ్మానికి పూలు.మల్లెలు,కరివేపాకు,తులసి ఇండియాని గుర్తు చేస్తుంటాయి.
ఇంతలొ ఫాల్ రానే వస్తుంది.గ్రీన్ ఇజ్ హీట్' అంటారు.ప్రక్రుతి అంతా ఆకుపచ్చగా కల కల లాడుతున్నది సరే!వేడి మాటేమిటి అంటారు.ఆకుపచ్చని ఆకుల లో ఎక్కడో ఒక ఆకు పసుపురంగుకు మారుతుంది.ఫాల్ వస్తోందని సంకేతం.పూలు తగ్గిపోతాయి.వాయు దేవుడు చేతులు జాచి చెట్టు చెట్టుని తాకుతూ పరుగేట్టుతాడు.చల్లనిగాలి.చెట్లు నీరస పడతాయి.ఒక్క వారంలో ఆకులు అక్కడొకటి అక్కడొకటి మారుతాయి.ఆకుపచ్చని ఆకులతో వున్న చెట్టు మధ్యలో గుట్టుగా కొన్ని ఆకులు పసుపు రంగుకు మారాయి.పచ్చని పూల గుత్తి పెట్టినట్లుంది.కొన్ని కొమ్మల చివరల ఆకులు తోపురంగుల్లో మారతాయి.ఆకుపచ్చని చెట్టుకు తోపు రంగు టోపీ పెట్టినట్లుంటుంది.
ఒకచెట్టు వడలిపోయి కలావిహినన్గా అయిపోతుంది.దాని పక్క చెట్టు ఇంకా పచ్చగావుంటే గర్వంగా చూస్తూ వుంటుంది.వదిలిన చెట్టు సిగ్గు పడుతూ వుంటుంది. మా సోకు చూడండి అని చెట్ల ఆకులు రంగులు మారి పువ్వులేమోనని భరం కల్గిస్తాయి.ఒక వూరునుంచి మరొక ఊరికి వెడుతుంటే దట్టంగా,దగ్గరగా వున్నచెట్ల రంగులు అబ్బుర పరుస్తాయి.
అసలు చెట్లని అంట క్రమ బద్ధంగా,కట్టు దిట్టంగా ,వరుసగా ఎలా పెంచుతారా?అని ఆశ్చర్యం వేస్తుంది.
మా ఇంటికి పక్కన పెద్ద లేక్ వుంది.లేక్ పక్కన ఇల్లంటే
ఇక్కడివాళ్ళకి పెద్ద క్రేజ్ ,గొప్ప,ఇష్టం,ఖరీదు కూడా ఎక్కువే!సమ్మర్ వస్తే
చెట్లనిండా ఆకులువస్తే లేక్ కనపడదని ఉసూరుమంటారు.లేక్ చుట్టూ
చెట్లున్నాయి,కొన్ని చిన్నవి వాటి వెనక పెద్దవి.చిన్న చెట్లకి కింద ఆకులు సింధూరం రంగులో మారాయి. క్రమేపీ ఆసిందూరం రంగు పైకి ఆకులపైకి ప్రాకింది.ఆకుపచ్చ సింధూరం రంగు ఆకులు ఎంత ఆకర్శణీయమ్ గావున్నాయో!తెల్ల వారంగానే లేక్ లేచి లేక్ చూస్తె
తమాషాగా వుంటుంది.ఫ్రిజ్ లోపల ఏదైనా పదార్ధం మూతలేకుండా రెండు మూడు రోజులు పెడితే దానిపై అయిస్ పోరా కడుతుంది.అలా లేక్ నిదా పొగ మంచు పరచుకొంతుంది.లేక్ నిద్ర పోతున్నట్లున్తుంది.అడుగున నీళ్ళు లేవేమో అనిపిస్తుంది.కాస్త పొద్దెక్కాక ఆమంచు ఆవిరాయి నీటి మీద మేఘాల్లా తేలి పైకి పోతుంది.
అత్తింటికి వచ్చిన కొత్త పెల్లికొడుకులా సూర్యుడు ఎప్పటికో దర్శన

మిస్తాడు, మళ్ళి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మబ్బుల్లో దూరి పోతాడు.
గాలికి రాలిపోయిన ఆకులన్ని తెట్టు కట్టినట్లు చెరువులో ఎమూలకో ప్రయాణం చేస్తున్నాయి.బాతుల గుంపులు స్వేచ్చగా నీటిపై అలల వరుసలో కవిత్వం వ్రాస్తూ విహరిస్తున్నాయి.అవి ఎప్పుడూ గుంపులు గుంపులు గానే బయలుదేరతాయి .గాలి దేవుడు పలకరించగానే వాళ్ళు గగుర్పోడిచిన చెరువు చిన్న చిన్న కెరటాలుగా ముక్కలయి ఎటో వెళ్ళిపోవాలని వెళ్లి చెరువు గట్టుకు కొట్టుకొని నిస్పృహగా వెనక్కి వస్తున్నాయి.షికారుకు తీసుకుపోయే చిన్న కారుపిల్లల కోసం ఎదురు చూస్తూ ఓమూల పసుపు పచ్చని బోటు కునికి పాట్లు పడుతూంది.గాలి దేవుడి ఈలకి వదిలిపోయిన ఆకులన్ని జలజల రాలిఎతో కొట్టుకుపోతున్నాయి.కడిగి తుడిచి నట్లుండె రోడ్లపై ఎండుటాకులు పరుగు పందాలు వేసుకొంటున్నాయి.ఏరుతువులోవున్నఅందాలు ఆ
ఋతువులో కొట్టొచ్చినట్లు కనపడుతూ మనుషుల్ని,మనసుల్ని కట్టి పడేస్తున్నాయి.ఆటంలో ఒక అందం,ఫాల్ లో మరో సోకు, వింటర్ లో
మంచు జాతర.

3 comments:

శ్రీలలిత said...

ప్రకృతి లో మారే రుతువుల అందాలను చాలా బాగా వర్ణించారండీ..

cbrao said...

"ఇంతలొ ఫాల్ రానే వస్తుంది.గ్రీన్ ఇజ్ హీట్' అంటారు." ఇది నాకు కొత్త విషయం. ఋతు వర్ణన బాగుంది.

Unknown said...

People like you should stop writing blogs and go on some temple visit. SO BORING.