దీపావళి
పండగ లన్ని కాగితాల మీద పండగ చేసుకొంటున్నాయి
పిండివంటలన్నీ మిఠాయి దుకాణాల ఆదాయం పెంచుతున్నాయి
కల్తీ మందు కూరిన చిచ్చు బుడ్లు వెలుగు పూలు రాల్చలేక వెలాతెలా పోతున్నాయ్
కళ్ళ నీళ్ళతో నిలబడ్డ వరద బాధితులకు
కాలే కడుపుకు మండే గంజి దొరకడం లేదు
విద్యుద్దీపాల కాంతికి విర్రవీగే జనాన్ని చూసి
కాంతులు పంచే ప్రమిదలు చీకటి చిమ్ముతున్నాయి
పయోముఖ విష కుంభాల వంటి మనుష్యులు
ప్రేమని ,స్నేహాన్ని రేటు పెంచి దాచేశారు
తీపి భరించలేని మనుషులు
వేప చిగుళ్ళ విందు ఆరగిస్తున్నారు
నీరసంగా నడిచేమనిషిని లారీ హారనులా
పండగలు భయపెడుతున్నాయి
నూనె చాలని దీపం ,నూనె లేని పిండివంట
నెయ్యి లేని భోజనం
పండగ నాడు కొత్త చీర గడివిప్పి కట్టని ఇల్లాలు
పక్కింటి వారు కాల్చేటపాకాయలని
కళ్ళార్పకుండా చూసే బుడతడు
లక్ష్మి పూజ చేస్తే వస్తుంది ధనం
డాబుగా చేస్తారు సంబరం
లక్ష్మి పూజ చేసినా ధనం రాని కొందరు
చీకటి పడితే దీపం పెట్టాలని దిగులు పడుతున్నారు
ఇవాళ పండగా?ఇదా పండగ?
అయినా అతిధుల్ని ఆహ్వానించడం మన ఆచారం
రండి రండి దీపావళి గారూ!
కలిసొచ్చిన రెండు తిదుల్లా
కలిసొచ్చే కష్ట సుఖాలను
చేదుతీపికలిపి ,చేయి చేయి కలిపి
ఓరిమితో అడుగువేసి ,కూరిమి తో మాట కలిపి
పడిపోయే భారతీయతను పడకుండా నిలబెడదాం
రాబోయే తరాలు పండగంటే,పబ్బమంటే
డిక్ష్ణరీలు తిరగేయ్యకుండా
స్మృతి పదం లో నిలిపి పోదాం
7 comments:
మీకు, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలగాలని కోరుతూ.....దీపావళి శుభాకాంక్షలు!
మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.
మీకు, మీ కుటుంబసభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
మీకూ మీ కుటుంబ సభ్యులకూ దీపావళి శుభాకాంక్షలు !
మీ విశ్లేషణ చాలా బాగుందండి. మీకు దీపావళి శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు .
Amma namaskaramulu naa blog samanvayadrsuti.blogspot.com chadavandi, mee suchanalu, salahalu evvandi.
Post a Comment