Pages

Saturday, February 13, 2010

వ్యర్ధ ప్రయత్నములు

వ్యర్ధ ప్రయత్నములు
ప్రేమతో నా తులసి మొక్కను
పెంచితిని గంగోదకముల
పసుపు కుంకుమ తోడ భక్తిని
పూజలోనరిస్తి!
ఉదయ సాయంకాలముల క
ర్పూర దీపం హారతిచ్చితి
హ్రదయ తాపము తీర లక్ష్మీ
స్తవ మొన్ర్చితిని ;
పక్కనే పొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో అనిఎన్ .
ప్రతిమ యొక్కటి మలచినా నది
ప్రతిఫలించిన దందమంతా,
తనివి తీరగా విగ్రహంబు న
లంకరించితిని;
మంచి నగలూ,మంచి గంధము
మంచి మంచి రకాలపువ్వులు
ప్రతిమకున్చితి,హృదిని నిల్పితి
తపము చేసితి ;
పక్కనేపొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో"అనిఎన్
కొత్త కొత్త రకాల విద్యలు
కొత్తాటలు,కొత్త పాటలు
ముద్దు తల్లికి నేర్పు చుంటిని
మొదమలరంగన్;
చిన్ని పాదము లెత్తి నాట్యము
చిన్ని పెదవులు కదిపి గీతము
చిన్ని చేతుల నెట్టి తాళము
తల్లి నేర్చినది;
పక్కనే పొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో"అనిఎన్
హృదయ భారము తీరునచును
మధుర భావము లేర్చి కూర్చితి
అడవి పువ్వులు గుచ్చి దండగ
ఆరుత దాల్చితిని ;
అనుభవించిన మాష్ట సుఖముల
అఖిలమును మధియించి,"సారము
తీసుకోనుదో రండు !రంద!ని
తిరుగ జొచ్చితిని;
పక్కనేపొంచున్న లోకపు
మానిసోక్కడు పెదవి విరిచెను ,
"ఎందుకో ఈ వ్యర్ధ యత్నము
లెందుకో!అనిఎన్ .
పక్క మానిసి పలుకులన్నీ
పడెను నా చెవులందు ;విడిచితి
సర్వ మయ్యెడ;మౌన ముద్రను
దాల్చి కూర్చుంటిన్ ,
శిరము వంచితి ,కనులు మూసితి
మౌన ముద్ర వహించి యుంటిని ,
పక్క మానిసి పలికే మళ్ళీ
ప్రస్ఫుటము గాగన్ .
'ఎందుకో ఈ మౌనమూనుట
ఎందుకో ఈ మాన్ద్యమంతా
పోయి సాంఘిక సేవ చేస్తే
పుణ్య ముండునుగా !
రచన
చింతా దీక్షితులు గారు


No comments: