Pages

Saturday, May 8, 2010

మూగ మనసు

మూగమ్మ
మూగమ్మ నా ఎదురుకుండా నుంచుని గుండేలపై రెండు చేతులు వేసుకొని కొట్టుకొంటూకళ్ళు ఇంత పెద్దవి చేసుకొని"లేదు,పోయింది" అనే అర్ధం వచ్చేలారెండుచేతులు తిప్పి"చీర-చీర అని తన చీరకుచ్చెళ్ళు,పమిటచూపిస్తోంది..మూగమ్మ పొద్దున డాబామీద బట్టలు ఉతికి ఆరేసింది.ఇప్పుడువెళ్ళి బట్టలు తెస్తే అందులో నాచీర కనపడలేదు,పోయిందని ఖంగారు పడుతోంది. నాచీరకాస్తా పోయిందా?అయ్యో కొత్తచీర "అన్నాను."అమ్మో నేతీయలేదు ఒట్టు అని నెత్తిన చెయ్యిపెట్టుకొని ప్రమాణం చేసింది..చా! నువ్వెందుకు తీస్తావు?ఉత్తినె సరదాకి అన్నాను.ఎంద బాగా వుంది, ఎక్కువసేపు ఎండలో వుంటే వెలిసిపోతుందని తెచ్చానులే! అన్నాను.అప్పుడు పళ్ళన్ని బయట పెట్టీ హాయిగా నవ్వింది.
మా అబ్బయి ఇంట్లో పని చేస్తుంది మూగమ్మ.దాని డ్యూటీ ఏమిటంటే పొద్దున్నే వాకిలి వూడ్చి,నీళ్ళు జల్లి ముగ్గు వేయడం,పాత్రలు కడగడం,బట్టలు వుతికి పై డాబా మీద ఆరెయ్యడం, సాయంత్రం వచ్చి ఆరేసిన బట్టలన్ని కిందకి తెచ్చి మడతలు పెట్టి ఎవరివి వారికి అందించడం.మీవి రెండు చీరలు,మూడు జాకెట్లు,రెండు పరికిణీలు మడత పెట్టి గదిలో పెట్టా అని సౌజ్ఞలటొ చెప్టుంది.మళ్ళీ పాత్రలు తోమి వెడుతుంది.ఎప్పుడూ ఆలస్యం చెయ్యదు,పని ఎక్కువ అనదు,తనపని తాను చేసుకుపోతుంది. మన మాటలన్ని అర్ధం అవుతాయి,వినపడదు కనుక ఎదురుగా నుంచుని మాట్లాడితె అర్ధం చేసుకొంటుంది.ఒకేసారి రెండు వరసలు వచ్చేలా ముగ్గు వేస్తుంది.వంకరలేకుండా అచ్చుగుద్దినట్లుంటుంది ముగ్గు.రోజుకొ రకం వేస్తుంది."నాకు ఇలా రెండు వరసలు ఒకేసారి వచ్చేలా ముగ్గు వెయ్యడం రాదే!అంటె నాలుక చప్పరించి చాలాతేలిక అని వేసి చూపించింది
మూగమ్మ మూగదే అయినా అందరూదాన్ని పేరుపేత్తి పిలవకుండా మూగమ్మా!అని పిలిస్తే నాకేమిటో బాధగా వుంటుంది."నీపేరేమిటే అన్నాను."తెలియదూందిసైగలతో."మీ ఇంట్లొ ఎవరున్నారే అంటె "మా అమ్మ వుందీఅన్నది పిలుచుకురా అంటే చక్కగా పిలుచుకు వచ్చింది.తల్లికి 50 ఏల్లు వుంటాయి."నీకూతురికి పేరెందుకు పెట్టలేదు?అన్నా."పెట్టానమ్మగారు.దాని పేరు"పళనీమ్మ"దానికి నొరులేక చెప్పలేదు.పుట్టినప్ప్టినుంచి చెవిటిది,మూగిది.అంది.అప్పతినుంచి నేను పళని అమ్మా!అని పిలవడం ప్రారంభించా.పళని అను అంటే పలాఎ అని అస్పష్టంగా సన్నగాంటుంది.నీకెంతమందిపిల్లలు అంటె ఒక్కపిల్ల అని చెప్పి అరచేతులు రెండూ దగ్గరగా పెట్టి చదువుకొంటూంది దూరంగా అని సౌజ్ఞలు చేసింది.పెళ్ళిచేసుకొన్నవాడు పలని అమ్మ నీళ్ళూపోసుకొందని తెలియగానే ఇంట్లో వున్న డబ్బంతా పోగు చేసుకొని పరారీ అయిపోయాదట. అప్పటి నుంచేతల్లి కాపాడింది.తల్లి పళని అమ్మ చాకిరీచేసి పిల్లని చదివించారు.దాని చదువు అయితే కష్టాలు గట్టెక్కుతాయని ఎదురు చూస్తున్నారు.పళని అమ్మకి కాస్తో కూస్తో లెఖ్ఖలు తెలుసు,1తారీకు నాడు జీతం తీసుకెళ్ళాలని తెలుసు.తనపని ఎంతవరకో తెలుసు.నీఫొతో తీసుకొంటానే!అంటె జుట్టూ పీచులావుంది,చీర బాగాలేదు అని ఇంటికెళ్ళీ తలదువ్వుకు మంచిచీరకట్టుకొని వచ్చింది.ఆఫొటొలూ చూడండి.దానికొరిక దాని పిల్లని చదివించడం.నిజాయితీగ జీవితం నడుపుకొంటోంది.ఎంత కష్ట పడితే ఈరొజుల్లో సంసారాలు గడుస్తున్నాయో?పిల్ల చదువుకు మరింత కష్ట పడుతోంది.మూగ మనసులో ఎన్నొ రంగు రంగుల కలల ప్రపంచం వుంది.తన బిడ్డ తనకంటే బాగా బతకాలని కాంక్ష వుంది. మదర్స్ డయ్ నాడు ఈతల్లికి జోహారులందిస్తున్నా.నిజంగా ఈహత భాగ్యులకి మనమేమి సేవ సహాయం చేయగలం? ఇలాటి వాళ్ళెంత మంది వున్నారో! మా కోడలు అంటూంది,వేరె పనివాళ్ళనెవరి నయినా మానిపిస్తానుకానీ, దీన్ని మాత్రం మాంపించను.అది పని తక్కువ చెయ్యదు, చేసిన నే సర్దుకొంటాను,కాస్తో కూస్తూ పైపైన బట్టలు తిండి అందిస్తుంటాను.దాని ఆసయము,నిజాయితీ,స్రధ్ధ నన్ను ముగ్ధురాల్ని చేస్తాయి.అంటుంది.మనచుట్టూ వున్నవారికి మనం వత్తాసు ఇవ్వగలిగినా ఎంతో మేలే! అందునా ఈ మూగ జీవికి చాలా అవుసరం. భగవంతుడు ఒక లోపం చేదానికి పరిహారంగా వెరె ఎక్కువ తెలివి ఇస్తాడు.మాట్లాడగలిగి, డబ్బుకు లోటు లేకపోయినా పిల్లలకి చదించి మహ్త్కార్యం చేసి నట్లు బుజాలేగరేస్తాం. పళని లాటి వాళ్ళని చూస్తేవాళ్ళముందు మనమెంత?అనిపిస్తుంది.భగవంతుడు ఆడదానికి ఏది లేకపోయినా మాత్రుత్వపు కాంక్ష, మమకారము,ప్రేమా నిండుగానింపి జన్మ నిస్తాడు.దానితోనె ఈప్రపంచం ఈనాడిలా పచ్చగ కళకళ లాడుతోంది..ఎన్ని బాధలున్నా తల్లి ఎప్పుడూ బిడ్డకి లోటు చెయ్యదు,విడిచి పారిపోదు. తల్లి రక్షన ప్రాణికి సంజీవి. తల్లే దైవం.

2 comments:

మాలా కుమార్ said...

మీకూ మాతృదినోత్షవ శుభాకాంక్షలు .

హను said...

happy mothersday anDi.