Pages

Wednesday, August 31, 2011

చేతిపనులు


చేతిపనులు 




                                        చేతిపనులు 
                    అమెరికా     లో  వ్యాపారస్తులు      తాము తయారు చేసే   వస్తువులను   అమ్ముకోడానికి ఎన్నో   ఉపాయాలు  పన్ని,  అవస్థ పడుతుంటారు.   మా దగ్గర   ఈవాస్తువులున్నాయి,ఆ  వస్తువులున్నాయి, అంత  బాగుంటాయి,ఇంత బాగుంటాయి,   చచ్చు   చవకగా  ఇస్తున్నాం   అని  వివరాలతో  విన్నపాలు   ఇంటికి పోస్ట్ 
చేస్తుంటారు.కంపెని    తాహతుని  పట్టి     కాగితాలుగా పుస్తకాలుగా    ఈ కే ట లాగులు    వుంటాయి .మొన్న పోస్ట్
లో    ఇంత     కట్ట   వచ్చింది.    సాయంత్రం మాకోడలు   రాగానే    ఇచ్చాను.   వాటిని  అటు ఇటు చూసి   కావాల్సిన 
ఉత్తరాలు రెండు తీసుకొని 'మీరు   చూస్తారా?     ఇవిచూడను,      ట్రాష్ లో పడేస్తా  !అని   ఇచ్చింది. అందులో   రెండు    పుస్తకాలు   మెరుస్తూ   నునుపైన   పేపరుతో కొ ట్ట   వచ్చిన రంగులతో   వున్నాయి.ఉత్తినే వీటిని ట్రాష్ లో పడేయ్యడమా?  నాకు ఉసూరుమనిపించింది.
వీటితో ఏమైనా చేస్తే!అనిపించింది. కత్తెర.గ్లూ  సిద్ధం చేసుకు కూర్చున్నాను.  ఈరంగుల  కాగితాలతో   చాప లా అల్లితే ఎలావుంటుంది అనిపించి    ఒక్కొక్క పేపర్ని   సమాన  మైనచతురస్రాకారం  గా  చేసి  ముక్కలుగా  క త్తి రించాను.
వెడల్పు మూడు అంగుళాలు ,పొడుగు ఎనిమిది అంగుళాలు   ఉండేలా కత్తిరిన్చాను .  మూడు  అంగుళాల కాగితాన్ని సగం మడిచి గుర్తు పెట్టుకోవాలి.  ఒకవేపు సగంలో సగం   లోపలి కి మడిచి  రెండో వేపు సగం  లోపలికి  మడవాలి రెండింటిని కలిపి మధ్యలో గుర్తు  పెట్టిన  చోట  మడవాలి   అప్పుడు   ఎనమిది  అంగుళాల  పొడవు   ముప్పావు
అంగుళం  వెడల్పున్న   బద్దీలు  తయారవుతాయి.  సమానమైనముక్కలు  తీసుకొని నవ్వారు  అల్లికలా ఒకటి కిందకి ఒకటి పైకి వచ్చేలా  దగ్గరగా  కూర్చాలి.నాలుగు వేపులా   కొసలు  కనిపించకుండా నాలుగుముక్కలు          బార్దార్లా   అతికించాలి.ముక్కోనా కారంగా   ముక్కలు  కత్తిరించి  నాలుగుమూలలా   అతికించాలి.వీటికి రంగుల  కలయిక మనయిష్టం.  రెండు రంగులు వెయ్యవచ్చు,ముదురు లేత రంగులు కలపవచ్చు. దీనికి  వెనక  ముందు  వుండదు.రెండువేపులా     ఫోటోలు కాని,   చిత్రాలు   కానిపెట్టి   హాలులో   వేలాద  తీయవచ్చు.ఇలాటి ఫ్రేములు ఎక్కువగా చేసిపుట్టిన రోజులప్పుడు అలంకరించ వచ్చు.  వెనకచిన్న స్టాండ్ పెట్టిటేబిల్   మీద  పెట్టుకో  వచ్చు  నాలుగువేపులా   సన్ననివెదురు   బద్దతో  ఫ్రేం చేసి  గోడకి    తగిలించుకోవచ్చు.  ఫోన్  కింద  పెట్టుకో  వచ్చు.
మీ ఇష్టం .

3 comments:

సిరిసిరిమువ్వ said...

చాలా బాగుందండి. మంచి ఐడియా!

కొత్త పాళీ said...

చాలా బావున్నాయి. భలే ఐడియా.

Rajamouli Nidumolu said...

paatha muchatlu chuuddamani open chesaanu. oke month perutho chaala vunnayi. vaatini year/month wise cheste baguntundemo..

appati sandarbham, katha kamamishu telustaayi kada !