Pages

Wednesday, June 13, 2012

నాలుగు వేలకి ఎనిమిది వేలు


         

     నాలుగు  ' వే'లకు ఎనిమిదివేలు 
అనవేమారెడ్డి కొండవీటి సీమను  పరిపాలిస్తున్న రోజులలో ఒక కవి ఆయన దర్శనం చేసి ఆయనను స్తోత్రం చేస్తూ ఈ క్రింది శ్లోకం  చెప్పాడు . 
                                   అనవేమ మహిపాల స్వస్త్యస్టు తవ బాహవే 
                                   ఆహవే రిపు దోర్దండ చంద్రమండలరాహవే 
                              'ఓ'  అనవేమమహిపాల , శత్రువుల భుజ దండమనే చంద్రమండలానికి రాహువు వంటిదైన  నీబా హువునకు  శుభం    కలుగు   గాక !,అని   శ్లోకానికి   అర్ధం .గ్రహణం   నాడు   రాహు   కేతువులు  సూర్య చంద్రుల్నికబలిస్తారనే     పురాణ   గాధ!   శత్రువుల   భుజ  మండలాన్ని    చంద్రునితోను   ,రాజు    భుజమండలాన్ని  రాహువుతొనూ పోల్చాడు   కవి.
                         రాజు   సంతోషించి    వెయ్యి   రూపాయలు   బహుమానంగా    ఇయ్య బోయాడు.కాని   తాను  రావడానికి   అయిన   ఖర్చులకు    ఆ  డబ్బు    సరిపోతున్దన్నాడు   కవి.రాజు   రెండు    వేలు   బహుమానం   గా  గ్రహించ  మన్నాడు.ఆసోమ్ము   తన   రాక  పోకలకు   సరిపోతున్దన్నాడు   కవి  .కవికి   పారితోషికం   ఇవ్వాలి   కనుక 
మరోవెయ్యి   కలిపి   మూడు  వేలు   ఇప్పించాడు   రాజు.ఈ  సారి కూడా    కవి   తృప్తి   పడక   "నేను   తమకు   నాలుగు  వెలిస్తే    మీరు   మూడు   వేలు     మాత్రమె    ఇవ్వడం    న్యాయం    కాదని "మనవి   చేసుకొన్నాడు.రాజుగారు"కవి   తనకి   నాలుగు  వేలివ్వడ మేమిటో?"అని   ఆశ్చర్య పోయాడు. కవి   ఈ   విధం  గా   
రాజుగారికి   సంశయ   నివృత్తి   చేసాడు.
                           "మహారాజా!నా శ్లోకాన్ని    మరోసారి   చిత్తగించండి .అన "వే"మ  అన్నపుడు   ఒక 'వే'యును, "బాహవే""ఆహవే"  రాహవే"  అనుచోట్ల   మూడు   వేలును తమకు   కానక   పెట్టాను.కనుక   తాము   నాలుగు"వేలు"పరిగ్రహించి   మూడిన్తినే   ఇవ్వడం    సముచితం    కాదు. 
అన వేమా రెడ్డి   కవి   చమత్కారానికి మెచ్చుకొన్నాడు.కవికి   నాలుగు   వేల  రూపాయలు ఇవ్వబోగా "మీరు   అదనంగా   ఇచ్చేదేముంది?అని ఎదురు   ప్రశ్న  వేశాడు.  కవిని   తృప్తి   పరచాలని రాజు   అయిదు   వేలు   ఇప్పించ బోయాడు,అయితే   ఈ సారి   కూడా కవి "మాకున్న దానికి   ప్రభువులు   తక్కువే   ఇస్తున్నారు.అన్నాడు.మళ్ళీ 
ఆశ్చర్య  పడటం రాజుకు తప్పలేదు."మేము   ఆరు   వేల   నియోగులం ,ప్రభువులు   అయిదు   వేలే   ఇవ్వడం",అంటూ   నీళ్ళు నమిలాడు .
రాజుగారు   కవి    బుద్ధికి  ప్రసన్నుడై   ఆరువేలూ   అనుగ్రహించాడు.అయితే   కవి   మాకున్నదే   మాకిస్తే రాజ   దర్శనం   వల్ల   ఫలితం   ఏముంటుంది   కనక ?అన్నాడు.చివరకు   రాజు ఇంత   చమత్కార   బుద్దికల   కవి ఏడు    సంఖ్యకు   కూడా వంక  పెడతాడని   ఎనిమిది  వేలిచ్చి కవిని   సంతృప్తి  పరచి   పంపి వేశాడు.
సేకరణ  జ్ఞానప్రసూన 

No comments: