దోహదాలు
రచనలు చేసే టప్పుడు రచయితలకి [రచయిత్రులకి ] రకరకాల దోహదాలు అలవాట్లు వుంటాయి. కొందరికి సిగిరెట్టు ముట్టిస్తే కానీ కలం పుచ్చుకో బుద్ది కాదు, కొందరికి కప్పుకాఫీ ఎదురుగా లేకపోతె ఆలోచన కదలదు, కొందరికి నస్యం పీలిస్తే కానీ అక్షరాలు కదలవు ,కొందరికి కొంచెం కొంచెము గా తినేందుకు కారప్పూసో ,జంతికలో పుట్నాల పప్పో వేరుశనగ పప్పులో వుంటేకానీ ఉషారు రాదు.
ఒక రచయిత్రికి భర్త,ఇద్దరు పిల్లలు చేతినిండాపని .వ్రాసుకోవాలంటే సమయం చిక్కడమే కష్టమయిపోయేది .అందుకని ఆవిడ వ్రాసుకొనేటప్పుడు తలమీద ఒక టోపీ పెట్టుకొనేదిట, ఆవిడ టోపీ పెట్టుకొంటే ఎవరైనా వచ్చి తలు పుతట్టినా ఫోన్ వచ్చినా కదిలేది కాదుట టోపీ పెట్టుకొంటే పిల్లలు కూడా పలకరించా కూడదు ,భర్తకి అనుమతి లేదు. వ్రాయడం అయిపోగానే టోపీ తీసి వంకెకు తగిలించి మాట్లాడేదిట పిల్లలకి ఆకలి వేస్తె ఆవిడ వ్రాసుకొనే బల్ల దగ్గారికి వెళ్లి పిల్లలు టేబిల్ లైట్ ఎదురుకుండా చేతులుపెట్టి అడ్డంగా ఊపే వారుట. ఆ కాగితాల మీద నీడపడితే ఆవిడ పని పక్కకు పెట్టి లేచేదిట.
ఒక రచయితకి వ్రాసుకోనేందుకు కాగితాలు విడిగా గాని, పుస్తకాలుగా కాని తెచ్చుకోవడం ఇష్టం వుండేది కాదుట, ఆయన పత్రికల వాళ్ళు తెచ్చుకొనే తెల్ల కాగితాల రీళ్ళు తెచ్చుకొని దానిమీద వ్రాసి, పేజీలుగా కత్తిరించి ప్రెస్ కి ఇచ్చేవాడట.
ఒక రచయిత తన పెంపుడు కుక్క ఎదురుగా వుంటే కాని స్థిమితంగా వ్రాయలేక పోయే వాడట. అపరాధ పరిశోధక నవలలు వ్రాసే ఒక రచయిత చాలా గందర గోళంగా వుండే హోటళ్ళలో
కూర్చుని వ్రాసేవాడట.
1 comment:
rachaithala patlu bhagunnaiandi.
Post a Comment