దూది మీద పెయింటింగ్
దూది మిషన్లో తెల్లగా తయారయి మృదువుగా
బట్టలాగానే వుంటుంది. హాస్పటల్స్ లో వాడతారు. పల్చగారోల్ చేసింది మెడికల్ షాపుల్లో అమ్ముతారు. ఈ దూది మీద పెయింట్ చేస్తే ఎలావుంటుంది?అనిపించి వాటర్ కలర్స్ తో డిజైను ప్రయత్నించాను. నాకేమో బాగానే అనిపించింది.కాకపొతే కాటన్ ,వాటరు కలర్స్ అల్ప ప్రాణాలు. నీటి చుక్క తగిలితే రూపం కోల్పోయి పాడయి పోతాయి.చిత్రం తయారయిన వెంటనే ,మాసి పోక ముందే లామినేట్ చేస్తే నిలబడి ఉంటుదేమో! నేను చేయించలేదు. అద్దం పెట్టి ఫ్రేం చేయించినా బాగానే వుంటుంది.
రంగులు పల్చగా కలుపుకొని ఒకే వేపుకు కుంచె నడుపుకొంటూ షెడ్స్ తేవడానికి ప్రయత్నించాలి.దూది మీద పెయింట్ పాకి పోకుండా జాగ్రత్త పడాలి. ఒక రంగు ఆరాక మరో రంగు వెయ్యాలి.
మీరూ ప్రయత్నించండి. బాగా రాకపోతే అక్షింతలు వెయ్యండి. బాగా వస్తే మీరే చేపుతారులెండి. ఆ నమ్మకం నాకు వుంది.

No comments:
Post a Comment