Pages

Tuesday, August 21, 2012

ఓక్ రిడ్జ్ ఇంటెర్ నేషనల్ ప్లే స్కూల్

                           ఓక్   రిడ్జ్   ఇంటర్       నేషనల్        ప్లే      స్కూల్


                   ప్రతి తల్లి-  తండ్రి "నా పిల్లల్ని మంచి స్కూలు లో చేర్పించి ,  బాగా చదివించాలి "అని కలలు   కంటారు.ఇంట్లో కాక పిల్లలు    స్కూలు లోనే ఎక్కువ సమయం   గడుపుతారు.   తలి-తండ్రులు   తమ ఖర్చులు ఎన్నో   మానేసి పిల్లల చదువుకోసం  ,ఆరోగ్యం కోసం ఖర్చు పెడతారు.ఈ రోజుల్లో  కుటుంబం లో ఒక్కరో  ఇద్దరో  తప్ప వుండటం లేదు. "ఒక్కళ్ళని  పెంచి ,పెద్ద చేస్తే    చాలు బాబూ" అంటున్నారు.నేటి యువత భవిష్యత్తుకు   పునాదులు   వేసుకొంటూ ముందుకు నడుస్తున్నారు. పిల్లలకి    దైపర్లు,పాల సీసాలు,బట్టలు,బొమ్మలు,  వారి ఖర్చులకి కావలసిన  వన్నీ సమ కూర్చుకోన్నాకే  పిల్లల్ని కంటున్నారు.
                  ఇక స్కూలు విషయం వాళ్లకి    చాలెంజి .పట్టణాల్లో   మంచి స్కూలు లో   సీటు దొరకడం మరీ కష్టం ప్రీపెప్ నుంచి మంచి స్కూలు లో చదివించాలని చూస్తారు. మంచి వాతావరణం,ప్రేమగా చూసుకొనే టేచర్లు,స్తాఫ్ఫ్ వుంటే తల్లి-తండ్రులు హుషారుగా   పిల్లల్ని పంపిస్తారు.చదువు సంస్కారం ఉన్నవాళ్ళ  ఆది పత్యంలో స్కూలు నడుపుతుంటే   ఇంకా   నమ్మకంగా    అని పిస్తుంది.ఈ మధ్య ఇలాటి స్కూలు చూసాను.ఓ ఐ  ఇంటర్ నేషనల్ ప్లే స్కూల్ .ఇది "ఓక్   రిడ్జ్    ఇంటర్   నేషనల్     స్కూల్   కి      అను బంధ సంస్థ.బంజారాహిల్స్  రోడ్ నం   -3    లో వుంది నాగార్జున   సర్కిల్ వద్ద.


                                                      స్కూలు చూడగానే   ఆకర్షణీ యంగా,అన్ని వసతులతో వుంది.గోడల నిండా చక్కని చిత్రాలు చిత్రించారు.టి.వి. వుంది మధ్యానం పిల్లలు విశ్రాంతి గా   పడుకునేందుకు    బుజ్జి బుజ్జి  మంచాలు వున్నాయి  ఆ ట వస్తువులు,పుస్తకాలు    బోలెడు ప్లే గ్రూప్ ,నర్సరీ ,పిపి వన్ ,పిపి   టు    వున్నాయి, శ్రీ బి.వి.పట్టాభి రామ్ గారు ,మంచు లక్ష్మిల చేతుల మీదుగా    అక్టోబర్ 16    ,2011    లో దీని    తలుపులు    తెరిచారు.నలుగురు    గృహిణులు     శ్రీమతులు     మహిమ,సరిత,మధు,పద్మజ,మీనా    కలిసి ఈ స్కూలు   ప్రారంభించారు.  వారి గృహస్థ    జీవితం లోని    దైనందిన    కార్య క్రమాలని   కుదించుకొని  ,వారి సమయం ఈ స్కూలు కోసం వినియో గిస్తున్నారు.మొన్న సమ్మర్లో   కాంప్ పెట్టి పిల్లలకి వినోదాన్ని,విజ్ఞానాన్ని అందించారు.  చిన్నారులు వేసిన బొమ్మలు ఇక్కడ పెట్టాను.పిల్లల మేధా సర్వతో ముఖం గా    విస్తరించాలని వీరి  ఆశయం. 

No comments: