పిల్లగురువు
ఆమధ్య మాకోడలు సెమినార్ వుందని నాలుగురోజులు ప్రయాణం కట్టింది. "ఇంట్లో కూర్చుని మీరేమి చేస్తారు? మీరు కూడా రండి'.అంది.దారిలో చల్లగా చెప్పింది. నాలుగురోజులు పొద్దున్న వెడితే సాయంత్రం రావడమే? అని. మరి నేనేమి చెయ్యను?అన్నా. తెలిసిన వాళ్ళు వున్నారు, వాళ్ళ కిద్దరు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లలంటే మీకు సరదా కదా?పైగా వాళ్లకి సెలవులుకూడానూ! అయితే మాత్రం అంతంత సేపు ఎలా గడుస్తుందే! నువ్వొకఘంటో రెండుఘంట లో
వుండి వచ్చేస్తావనుకొంటున్నా? లేదండీ! అయినా మీకు బాగానే పోద్దుపోతున్దిలెండి. లేకపోతె వాళ్ళింటికి తీసుకె డ తానా ?అంది.
సగం సగం దూరాలు రెండు రోజులు ప్రయాణం చేసి వెళ్ళాము. లోపలి అడుగుపెట్టేసరికి ఓర చూపులు చూస్తూ వాళ్ళమ్మ వెనకాల ఇద్దరు ఆడపిల్లలు,నవ్వుతూ ఆవిడ స్వాగతం పలికారు. కొందరిళ్ళ కి వెళ్ళే సరికి ఆగాలి,వెల్తురు ,ఇల్లు సర్దిన తీరు ,నవ్వుతూ పలకరించే వ్యక్తులు ప్రాణానికి హాయిగా అనిపిస్తారు. ఇక్కడా అలానే అనిపించిన్దినాకు. మాకోడలు నన్ను దింపి వెళ్ళిపోయింది. నేను హాలులో సోఫాలో కూర్చున్నాను,సుజాత పిల్లల్ని పిలిచి "అమ్మమ్మగారు వచ్చారు. అమ్మమ్మకి ఏమికావాలో కనుక్కోవాలిమీరు. అమ్మమ్మ దగ్గర మంచిమంచి విషయాలు నేర్చుకోండి"అనిచెప్పింది. పెద్ద అమ్మాయి నాకు గె ష్ట్ రూం చూపించి ,మంచినీళ్ళు కావాలాని అడిగి ,ఆనుకుని కూర్చు నెందుకు కుషాన్ తెచ్చి ఎదురుగా నిలబడింది. నెమ్మదిగా మేము కబుర్లలోకి దిగాము. వాళ్ళతో మాట్లాడుతూనే హాలు,గోడలకి తగిలించిన బొమ్మలు చూస్తున్నాను. ఫామిలీ ఫోటోలు అవికాక పెద్దపెద్ద సీనరీస్ హ్యాండ్ పెయింటింగ్ చేసినవి తగిలించి వున్నాయి. కాస్త కళా పోషణ ఉన్నట్లే వుంది అనుకోని మరోవేపుచూస్తే క్రయాన్స్, పెన్సిల్స్ ,డ్రా యింగ్ షీట్స్ కనిపించాయి.
ఆనందంగా "పిల్లలూ మీరు డ్రాయింగ్ వేస్తారా? అన్నాను. చిన్నపిల్ల గబగబా వెళ్లి
తనువేసిన బొమ్మలు తెచ్చి చూపించింది. పెద్దపిల్ల తను వేసిన బొమ్మలు,తను చేసిన చేతి పనులు అన్ని చూపించింది. ఇక మేము పక్కా స్నేహితులం అయిపోయాము.
అమ్మమ్మా!జడ వేస్తావా! ఈ డ్రస్స్ మీద కి ఈ ఇయర్ రింగ్స్ పెట్టు కోమా! అంటూ ,మా సంగీతం టీచర్ ఈపాట ఇంగ్లీషులో చెప్పింది. తెలుగు మాటలు సరిగ్గా వున్నాయో లేదో చూస్తావా అమ్మమ్మా!అని కలిసి పోయి మాట్లాడారు.
మా కోడలు ఎప్పుడు వస్తోందో,ఎప్పుడు వెడు తోందో తెలియదు. పెద్దపిల్ల ఒక డ్రాయింగ్ షీట్ తెచ్చి దీని మీద బొమ్మ వేస్తావా అమ్మమ్మా!అని అడిగింది. సరే అనగానే స్టాండు,రంగులు,బ్రష్ లు నాప్కిన్ అన్నితెచ్చి రెడీ చేసింది. ఒకపూలకొమ్మ, దానిపై రెండు పిట్టలు వాటర్ కలర్స్ తో వేసాను. రెండు రోజులు పట్టింది. ఆమరునాడు వెళ్లిపోవాలి.పొద్దుపోయే దాకా వేసాను. చక్కగా వచ్చింది.చిత్రం నిండా పూలు,మొగ్గలు,ఆకులు .రంగుల కలయిక బాగా నప్పింది.పిల్లలు,తల్లి చాలా మేచ్చులోన్నారు.వాళ్ళ నాన్న రాగానే చూపించి అమ్మమ్మ వేసింది అని చెప్పారు. "మరి మీరూ అలానే వెయ్యాలి అన్నాడు వాళ్ళ నాన్న.
"మా కోడలు వచ్చి చూసి "దీన్ని జాగ్రత్తగా రోల్ చేసి కారులో పెట్టి పట్టు కె ళ్ళా లి .అంది. మనమిద్దరమేగా వెనక సీటులో పెడదాము.అన్నాను. ఒక్క క్షణం అనిపించింది.
వాళ్ళింట్లో వేసానుకదా ! వాళ్ళకే ఇస్తే బాగుంటుంది అని. మళ్ళీ అనిపించింది. అమ్మో మళ్ళీ ఇంత చిత్రం వెయ్యగలనా? కష్ట పడి వేసానుకదా ! పట్టు కెళ్ళి పోతాను అనుకొన్నాను. పిల్లలిద్దరూ వాళ్ళమ్మ ని అడుగుతున్నారు అమ్మా!ఈపెయిన్టింగ్ ఎక్కడ పెడదామే!అని. "అదేమిటే అమ్మమ్మ కష్ట పడి వేసింది, అమ్మమ్మ వాళ్ళ వూరు తీసుకేడుతుంది. "అని చెప్పింది. వాళ్ళ మొఖాలు వెల వెల బోయాయి. నేను వాళ్ళ మాటలు విన్నాను. అయినా సరే! వాళ్లకి చిత్రం ఇయ్యాలని అనిపించలేదు.
మర్నాడు పొద్దున్నే టిఫిన్ చేసిపెట్టిన్దిసుజాత తిని బయలు దేరాము. "అప్పుడే వెళ్ళిపోతున్నారు. అమ్మమ్మా ఇంకా వుండు అన్నది చిన్నపిల్ల .నువ్వు మావూరు రా! సెలవులన్నీ నాతొ వుండు.అన్నాను. చిన్నది వాళ్ళమ్మ వెనక నుంచుని "ఆ డ్రాయింగ్ మన ఇంట్లో వుంటే బాగుంటుంది" అంది సన్నగా. వెంటనే నా మనస్సు కరిగిపోయింది. ఇంత ప్రేమగా నా చిత్రాలని ఎవరు కోరుకొంటారు. చిత్రం ఎక్కడ వుంటేనేమి? నేను వేసాననే అంటారు కదా! అది నాదగ్గరే ఉండాలనే స్వార్ధం ఎందుకు? చిన్న మనసుని రంజింప చేస్తే నా కళ కి సార్ధకత రాదా? అనిపించింది. నేను పెయింటింగ్ తీసుకోకుండానే కారు ఎక్కాను. చూసావా?అమ్మమ్మ నువ్వు అడగ గానే ఎలా ఇచ్చిందో? అమ్మమ్మకి నువ్వంటే ఎంత ప్రేమో? అంది సుజాత. చిన్నది గబగబా పరుగెత్తుకు వచ్చి చెవిలో "థాంక్స్ అమ్మమ్మా!అంది. నేనేనీకు థాంక్స్ చెప్పాలి నీ కోరికతో నా స్వార్ధాన్ని తొలగించావు. నువ్వు నాకు పిల్లగురువు వి .అనుకొన్నాను మనసులో.
నిజానికి ప్రతి ప్రాణి ఒక గురువే! ఏసమయంలో ఏ ప్రాణి గురువై సలహాలిస్తుందో? ఆ సలహా అందుకోగలగాలి. అందరిలోనూ నేర్చుకోవలసినది అంతో ఇంతో వుంటుంది. అది గుర్తించి అందుకోడమే గొప్ప. బుద్ది తెలిసి నప్పటి నుంచీ నేర్చుకొంటున్నా తెలుసుకోవలసింది సముద్రమంత వుంటుంది. జ్ఞానార్జనకి అంతు ఎక్కడ? ప్రక్రుతి కూడా మనకు పెద్ద గురువు

5 comments:
నిజంగా అద్భుతమండీ. అదృష్టవంతులు, ఆ పిల్లలూ మీరూ కూడా
chakkati pillalu :)
mee painting ki photo teesumTe post cheyyamDi.
ప్రతి మనిషి నుంచీ ఏదో ఒకటి నేర్చుకొవచ్చనే సత్యాన్ని ఎంతో అందంగా అనుభవించి చెప్పారు.
ఆ పిల్లలూ, మీరూ కూడా సమయం సంతృప్తిగా గడిపినందుకు అభినందనలు..
అవును కదా. మీకు చక్కగా గురువుల దినమున (టీచర్స్ డే) ఒక పిల్ల గురువు దొరికింది. అంటే శిష్యురాలు గురువును వెతుక్కుంటూ వెళ్ళిందన్నమాట.
మీరు చెప్పింది పూర్తిగా నిజం.
మొదటిసారి అనుకుంటా మీ బ్లాగ్ కి రావడం
మనసుకి హాయిగా ఉంది చదువుతుంటే...
మిగత పోస్ట్ లు కూడా వీలున్నప్పుడల్లా చదువుతాను.
మంచి పోస్ట్ రాసారు ధన్యవాదాలు.
Post a Comment