సత్యబాలపిన్ని
రెండు నెలలు కూడాకాలేదు శ్రీలక్ష్మి పిన్ని చనిపోయి ఇంతలోనే నిన్న సత్యబాలపిన్ని కూడా చనిపోయింది.ఒక్క సంవత్సరం లో మా పెద్ద మేనమామ,ఇద్దరుపిన్నులు వెళ్ళిపోయారు. అమ్మ పుట్టిల్లు
ఖాళీ అయిపోయి నట్లుగా అనిపించింది.ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కొక్క నవల. మనం పక్కన వుండి పరిశీలిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మా సత్యబాల పిన్ని అప్పచేల్లెల్లందరి లోకి చురుకైనది, అందకత్తె కూడాను. మంచి మాటకారి ,విమర్శకురాలు.
కోరికల పందిరి కింద కూని రాగాలు పలికే వయస్సులో అంటే ఇరవై,ఇరవైఒకటోసంవత్సరాల వయసులో మా బాబాయిగారు చనిపోయారు. రజాకార్ల మూమెంట్లో మా పిన్ని కుటుంబం సోంత ఊరువదిలి మాతాతగారి వూరు నూజివీడు వచ్చేసారు. మేము బందరులో వుండే వాళ్లము. సందుదోరికితే చాలు నూజివీడు వేల్లిపోయే వాళ్లము.అప్పటికే మా పిన్నికి నలుగురు ఆడ పిల్లలు
ఒక అబ్బాయి. పిల్లల తల్లిలా అనిపించేది కాదు.మోకాళ్ళదాకా జుట్టు. కలకత్తా జామ పండు లాటి శరీర ఛాయ.
మాతాతగారు మంచి రంగు. మా అమ్మ సత్యబాలపిన్ని ఒకే రంగులో వుండేవారు.పోలికకు దగ్గరే, ఈ పిన్నిని చూస్తె మా అమ్మను చూసినట్లే వుంటుంది. మా అమ్మ పోయాక దీనంగా వుంటే పిన్ని దగ్గరకు వెళ్లి కూర్చుని కబుర్లు చెప్పుకొని సేద తీరేదాన్ని. మా పిన్ని సంగతులన్నీ కధలు కధలుగా చెప్పేది.
రజాకర్ల మూమెంట్ లో వాళ్ళ వూళ్ళో ఎక్కడివక్కడ వదిలి పెట్టేసి వచ్చారు.ఇక్కడికి వచ్చాక
భర్త పోవడం,పిల్లలని సాకాలి నిజంగా ఆ పరిస్తితులలో మా పిన్ని ఎలా నెట్టుకు వచ్చిందా? అని ఆశ్చర్యం వేస్తుంది.మాపిన్ని ఎలెక్ట్రిక్ లైటు ,ఫ్యాను భ రించేది కాదు.సుకుమారంగా వుండేది. సుకుమారానికి నుదుటి రాతకి పోలికే వుండదు క దా! మధ్య తరగతి కుటుంబాలలో రోజులె లా గడుస్తాయా అనే తపన తప్ప ఆడవాళ్ళకి తమని గురించి ఆలోచించుకొనే తీరిక,భావనా కూడా వుండవు.
నా చిన్నప్పుడు ఒకసారి పిన్ని వాళ్ళ వూరు వెళ్ళాము. సుద్ధ పల్లెటూరు. నూనేదీపాలు వెలిగించేవారు. వంట ఇంటి తలుపుతీస్తే బారెడు దూరంలో మొక్క జోన్నపోలం వుంది. పొలానికి ఇంటికి మధ్య నేల బారుగా నుయ్యి. ఆ నూతి మీద ఒక తాటి చెట్టు సగంగా నరికి అడ్డంగా వేసారు. ఆ నూతి నీళ్ళే వాడుకోవాలి. "అమ్మో!కాలుజారి పిన్ని నూతిలో పడిపోదూ "అని భయం వేసింది. ఆ జ్ఞాపకం అలా నిలిచిపోయింది.
మాతాతగారి పెరట్లో నే కూరగాయ లన్నీ పండించేవారు. మాపిన్నిఅప్పటి కప్పుడు తుంపి కాకరకాయ వేపుడు చేసి వేడివేడిగా అన్నం పెట్టేది. సన్నపు సేగన వేపుడు వేగి స్తు న్నంత సేపూ ఏవో కబుర్లు చెప్పేది. మీము పిల్లలం పొయ్యి పక్కనే కూర్చుని కాకరకాయ ,ఉల్లిపాయ కలిసి వేగుతున్న వాసనని నాసికా పుటాల ద్వారా ఆఘ్రాణి స్తూ ఊ,ఊ అంటూ వుండే వాళ్లము.వేసవికాలమయితే పెరట్లో పూసిన మల్లెపూలతో
వారానికోకసారయనా మాకు వంకీల జడ వేసేది. అద్దాలలో జడలు చూసుకు మురిసిపోయే వాళ్లము. పూల జడ వేసుకోగానే మమ్మల్ని మేమే రాకుమార్తె లలా ఊహించుకొనే వాళ్లము. ,రాత్రయాక జడపైన పెట్టిన పూల చెండు తీసి వాకిట్లో పాక మీద పెట్టేదిపిన్ని. వెన్నెల చల్లదనానికి మర్నాటికి తాజాగా ఉండేవి పూలు.
సంక్రాంతి సంబరాలన్ని అక్కడే తీరేవి. మాపిన్ని మాసరదాలు ఓపికగా తీర్చేది.
ఆనాటి సంసారాలన్నీ ఆడవాళ్ళ రెక్కల మీదే ఆధార పడేవి. మగవాళ్ళు సంపాదించి పోసినా ఆ డబ్బు అన్నము,ఆధరువులు అయి కన్చాలలోకి రావడానికి ఆడవాళ్ళ రెక్కలు ముక్కలయ్యేవి. పెద్ద సంసారాలు, వచ్చేపోయే వాళ్ళు,పురుళ్ళు,పుణ్యాలు పెళ్ళిళ్ళు, ఒడుగులు ,మూలుగులు ముక్కులు,రోగాలు రోచ్చులు ,వానా కాలం ,ఎండాకాలం. ఇన్నిటికి అనుగుణం గా ఆడవాళ్ళు ముందుచూపుతో సరుకులు అమర్చుకొనే వారు. మా అమ్మమ్మ వంట చేసి పెట్టినా పైపై విషయాలన్నీ పిన్ని చూసుకొనేది. తాతగారు సలహాలు తీసుకొనేవారు.
మాపిన్నికినలుగురు అమ్మాయిలూ ,ఒక అబ్బాయి. వాళ్లకి పెళ్ళిళ్ళు చేసింది,,వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అన్ని చూసింది పిన్ని. పండగ వచ్చినా ,పుట్టిన రోజులు వచ్చిన "మున్డువెల్లి పిన్నికి దణ్ణం పెట్టిరావాలి"అనిపించేది.ఇక ఆభౌతిక రూపం కనిపించదు.
మా పిన్నికి కుట్లు,అల్లికలు చాలా ఇష్టం. పిల్లల దుస్తులు తనే కుట్టేది. మాకు నేర్పించేది. మేము ఏదయినా ఎంబ్రాయిడరీ చేసిచూపిస్తే"అబ్బో!ఎంతబాగా కుట్టావే!నువ్వే కుట్టవా!అని ఆశ్చర్యంతోపాటు,ఆనందం ప్రకటించేది. కొత్తవస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పటి సౌకర్యాలు చూసి వింతగా చెప్పేది.
అందరు చక్కగా ముస్తాబయి ఎప్పుడూ కళకళ లాడుతూ వుండాలని హెచ్చరించేది. ఎవరేనా బద్దకించి కనిపించిన చీర కట్టుకొని పేరంటాలకి పెళ్ళిళ్ళకి బయలు దేరితే " ఏమిటా చీర! అబ్బే!బాగాలేదు. మార్చుకొని మొన్న మీతంముడుకొన్న వంగపండు చీర కట్టుకోజరీది."అనిమార్పించిమరీ పంపేది పరిమిత మైన ఆహారం తినడము ,తిన్నాక రెండు ఘంటలు పడుకోకుండా కూర్చోడ ము, ఆతరవాత కాస్త నిద్ర..లేవగానే మొఖం కడుక్కొని,తలకి కాస్త కొబ్బరి నూనె రాసుకొని తలడువ్వుకోడ ము ,చీర మార్చుకోవడము అప్పుడు కాఫీ తాగడము. ఎవరున్నా ఎవరు వచ్చినా ఎక్కడికెళ్ళినా ఈ పనులన్నీ జరగాల్సిందే! ఆక్రమ శిక్షణ మాకు లేదు.
ఇంటి కేవరేనా వస్తే ,తలడువ్వుకొని,మంచి జరీ చీఎర కట్టుకోనిగాని బయటికి వచ్చేదికాదు.
ఉగాది నాడు మాకంటే తనే ముందు ఫోను చేసి మా అందరికి పేరుపేరునా ఆశీస్సులు చెప్పేది.
షిర్డీ బాబా భక్తురాలు. ప్రతి గురువారం బాబాప టం తుడిచి పూల దండ వేసేది. ఒకసారి ముత్యాల దండ తీసికెళ్ళి ఇస్తే బాబాకి వేసి "చాలా బాగుందే !చాలా బాగుందే !అని ముచ్చట పడింది ఈమధ్యనే మా పిన్నికి ఎనభై ఆరవ జన్మదిన వేడుకలు చేసారు. ఆఫోటో లు చూడండి
మా అమ్మకి నే నొక్క దాన్నే అయినందుకు మా పిన్నులందరూ నామీద తల్లిప్రేమ కురిపిస్తారు. మా అమ్మ పోయినప్పుడు సానుభూతితో నా దగ్గర రెండునెలలు వున్నారు. అది మర్చిపోలేను.
ఆవిడ మంగళ వారం పోయింది.బుధవారం వినాయక చవితి. తూతూ మనిపించాను చవరిగా ఒక మాట. మాపిన్ని తన పెద్దకూతుర్ని తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది.. తనదగ్గరే వుండేది పిన్ని. మాచేల్లెలు అన్నపూర్ణ సేవకి రూపంగా వుంటుంది. ఓర్పు,సేవ,మాతృభక్తి ,,కలగలిపి తల్లికి సేవ చేసి ఋణం తీర్చుకొంది .
ఈబ్లాగ్ నా మనో దర్పణం .ఆశానిరాషలు,సుఖ దుఖాలు,వింతలూ వినోదాలు ,ఆశ్చర్యాలు,అనుభూతులు,పొగడ్తలు,తెగడ్తలు అన్ని ఇందులో ఒలకబోసుకోవాలనిపిస్తుంది. ఇవి చదివి విసుక్కొంటా రేమో?!అనిపించినా చెయ్యిఆగదు .

2 comments:
chaalaa baagunnayi, mee jnapakaalu, inka rastoo undandi..maa andari kosam..
vasantham
అత్తయ్య గారి పరమపదము విషయము తెలిసిన వెంటనే ఇంత చక్కగా ఎప్పటివో విశేషాలు అందరికి తెలిశేలా వ్రాశారు. మీకు భగవంతుడు ఇదే విధమైన ఓపిక, శక్తి (ప్రగ్న ఎలాగో వుంది కనుక) ఇవ్వలని ప్రార్థిస్తూ..
ఆషాఢ పౌర్ణమి (గురుపౌర్ణమి)రోజున ౮౭ వ పుట్టిన రోజు జరుపుకున్నారు సత్యబాల అత్తయ్య గారు.
అందరి కంటే చిన్న అల్లుడు.
Post a Comment