దేవికి ఆహ్వానం
కాత్యాయినీ!కల్యాణ ప్రదాయిని!
కరుణతో మము బ్రోవ రావేకామేశ్వరీ!
పసుపు పారాణి పెట్టీ,పన్నీరు చిలకరించి
పువ్వులు అలంకరించి పూజ చెయ మనసాయె!
ఒక్క బిగి రణమున రక్కసులు దునుమాడీ
మొక్కవోని శాంతి దిక్కుల నెలకొల్పి
భయ రహితుల చేసి ,అభయ మిచ్చిన తల్లి
జయము!జయము!నీకు జగజ్జన నీ!దేవీ!
ఆరుగురు శత్రువుల అదిమి పెట్టగ లేము ,
కొరికల గుర్రాల కదను తాళగ లేము,
గుణములు నిలువబు,గురువైన కనరాడూ?
గుండె గూటిలో నిన్నే కూర్చుండ బెట్టెదము
ఏటి కొక్కసారి ఈ తొమ్మిది దినములు
మాటిమాటికి నిన్ను మము బ్రోవమని కోర
స్థిర చిత్త మీయవే!శివుని పట్టపు రాణి!అ
స్థిరమైన జీవితము అంకిత మిచ్చెద మమ్మా !
No comments:
Post a Comment