ప్రభ పుట్టిన రోజు
కొందరితో పరిచయం ఒక్కసారి చూడగానే ఎన్నో సార్లు చూచినట్లు అనిపిస్తుంది . ఏదో అనుబంధం ఇద్దరి మధ్య అల్లుకు పోతుంది . చాలా ఏళ్ళక్రితం డిల్లీలో ప్రభాని బాలమ్మగారింట్లో కలిసాను. ఆనాటినుంచి ఈనాటిదాకా మాఇద్దరిమధ్య కబుర్ల వంతెన నిలి చిపోయింది . వూళ్ళో వున్నా వూరు దాటినా దేశం దాటినా కబుర్లు వినిపిస్తూనే వుంటాయి.
డిల్లీ వాతావరణం లో ఒక మహత్యం వుంది .తరుచు స్నేహితులు కలుసుకొంటు వుంటారు. పరిచయాలయాక నె లకొక సారి ఒకరింట్లో సమావేశ మయ్యే వాళ్ళమ్. మనసులు విప్పి మాట్లాడుకొనే వాళ్ళమ్. సమస్యలు చర్చించుకోనేవాళ్ళం,సంతోషాలు పంచుకొనే వాళ్ళము. ప్రభ పుస్తకాలు బాగా చదివేది,కధలు చెప్పీది. ఏవో చెణుకులు విసురుతూ నవ్వించే ది.పెద్దవాళ్ళతో గౌరవం గా , పిల్లలతో సరదాగా వుండే స్వభావమ్. ఎవరేది అడిగినా ఆపని చెసిపెట్టేది. పూజలు పునస్కారాలు, ఆచారాలు,అలవాట్లు వీటిని గురించి సలహాలు అడిగి ,ఆచరించేది. ఎందుకో తన పట్ల నాకు మాతృ వాత్సల్యం ఏ ర్పడింది . ఏపని మొదలెట్టినా ముందు ప్రభ జ్ఞాపకం రావడం తనకి పనులు పురమాయిన్చేయడం నిశ్చింతగా వుండడం అలవాటయింది . డిల్లీ నుంచి మేము వచ్చేశాము. తను వచ్చేసిన్ది.
ఇక్కడికి వచ్చాక తన సేవా కార్యక్రమాల పరిధి పెరిగిన్ది. యద్దనపూడి సులోచనారాణి ప్రారంభించిన "విశ్రాంత్" ఓల్డ్ ఏజ్ హోమ్ లో అవిరళ కృషి చేసింది . ఇంకాఎవొ చేస్తూనే వున్టుంది .సమాజ సేవే ఊపిరిగా ఎదిగింది ప్రభ. నేను చెయ్యలేక పోయినా ఎవరేనా మంచి పనులు చేస్తోంటే నాకు చాలా సంతోషంగా వుంటున్ది. దేవుడు దయ తలిస్తే ఉడతా భక్తిగా ఒక చెయ్యి వెయ్యాలనిపిస్తున్ది. ఆ ఉత్సాహాన్ని అందరి మనసుల్లో రేకెత్తిస్తుంది ప్రభ.
వాళ్ళ అమ్మాయి శేషు ఫోన్ చేసి అమ్మకి అరవయ్యో పుట్టినరోజు మేరీ గోల్డ్ హొటల్ లో చేస్తున్నాం తప్పక రండి అని చెప్పిన్ది. అరె !ప్రభకి అరవై వచ్చాయా ?అని ఆశ్చర్యం వేసిన్ది. ఇలాటి వాళ్లకి ఒక్కొక్క ఏడూ అయిదేళ్ళు వుండాలి, ఎందుకంటే వీళ్ళ సేవల కోసం ఎదురు చూసే నిరుపేద ఆకలి కడుపులు, కుంచించుకు పోయిన అసహాయ వృ ద్దులు , వెలుతురూ చూడలేని చీకటి కళ్ళు ఎన్నో ఎదురు చూ స్తుంటాయి.
పార్టీ కొద్దిమంది ఆత్మీయులతో హుందాగా నడిచింది . ఏపని చెయ్యాలన్నా కుటుంబం లోని వారి సహకారం కావాలి అది భర్త ,పిల్లలు అందించాలి, వెన్నెముకలా మరో హృదయం సులోచనారాణి నిలబడింది . మా అమ్మాయి వీరి సహకారంతో ఇంకా ఎన్నో జీవితాలలో వెలుగు నింపాలని ఆశి స్తున్నా.
No comments:
Post a Comment