Pages

Monday, October 21, 2013

రెండు ప్రైజులు

 
ఈవేళ     మా శారదా మహిళా మండలిలో     స్వీటు,హాటు    పిండివంటల    పోటీ    జరిగింది .  మా మండలి  చాలా కాలం నుంచి    నదుస్తున్నది.     హేమా  హేమీలు ,అనుభవజ్ఞులు      అందరు . సరే    నేను   పేరిచ్చాను. సెనగ పిండితో స్వీటు,    ఆలూ తో    హాటు  చేసుకు రమ్మన్నారు. మైక్రో వేవ్ లో    చెసాను. పంచదార మిక్షీలొ వేసి, డ్రై ఫ్రూట్స్   కాస్త నేతిలో వేయించి    అవి పొడిచేసుకొని    ,యాలకుల పోదికలిపి,  ఒక చెంచా బొంబాయి రవ్వవేసి    లడ్డు చెసాను.    నవ నవ   బేసిన్ లడ్డు,నవ్యమైన బేసిన్ లడ్డు అని పేరుపెట్టాను,
                          రెండవది పనీర్ ధమాకా.  పనీర్ తురిమి      చిన్న  చిన్న ఉండలు చేసి పెట్టుకొని  ,బేసిన్      గ్లాసుడు   అయితే  ఒక్క చెంచా బియ్యపుపిండి కలిపి     అడితోపుగా పెట్టి   నూనెలో వేగించాను. బాణలి లో అరగ్లాసు పంచదార వేసి    బాగా  చిక్కటి   పాకం వచ్చేదాకా   తిప్పి వేగించిన వుండాలని     నెయ్యి రాసిన  పళ్ళెం లో పెట్టి     వాటిపై     పంచదార  పాకం    పొసాను.  ఒక గంటకి అవి ఆపాకమంతా   పీల్చుకొన్నాయి.
              ఇవిరెండు   ,హాట్ రెండు డిశ్లు పట్టు కెళ్ళాను. అలంకారం చెసాను.   అస్మదీయురాలికి     సెకండ్, థర్డ్   ప్రైజులు    వచ్చాయోచ్చ్!