Pages

Sunday, November 10, 2013

ఆశయా బద్ధయా లోకే

          ఆశయా   బధ్ధయా   లోకే ....... 

                       మధ్యాన్నం పదకొండున్నర    దాటింది ."అరె!   గుడితలుపులు   తీసే వున్నాయే!   ఏడుకొండల     వాడికి     ఒకసారి     దణ్ణం   పెట్టుకు వద్దామా! అంది కృష్ణ . కారు కొంచెం    దూరంగా    ఆపి    నలుగురు   స్నేహితులం   బిలబిల   దిగి   లోపలికి వెళ్ళాము .క్రితమ్ రోజు పుష్ప యాగం చేసినట్టున్నారు.  కుప్పలు,కుప్పలు   రకరకాలవి   పూలు వెంకన్నపాదాల మీద    మత్తుగా    పడివున్నాయి . దైవదర్సనం 
మూల విరాట్టుని చేసుకొని,తీర్ధ ప్రసాదాలయాక   బయటికి వచ్చాము. 
అక్కడ గట్టు మీద   ఓ నిమిషం     కూర్చుని అటు ఇటు చూస్తె   ఎదురుగా  గట్టు దగ్గర గుంపు కనిపించిన్ది.   ఏమిటో అని మేమూ    తొంగి చూసాము అక్కడ గట్టుమీద పెద్దతట్టలో      స్వామినిర్మాల్యాలు    పెట్టివున్నాయి .ఒకాయన అందరికి   పంచుతున్నారు. "మాకు పూలు ఇస్తారా? అని అదిగాము. "ఓ తప్పకుండా!  ఎన్ని కావాలంటే    అన్ని    తీసుకెళ్ళండి"అని ఆయన దోసెడు పూలు ఇయ్యబోయారు. మాదగ్గర    సంచులు లెవు. పువ్వులు చూస్తె    వదల బుద్దికాలే! కృష్ణ,రాణి కొంగులుతిప్పిపట్టుకొని 
జోలేలా  నిలబడ్డారు,ఆయన     రెండు మూడు దోసె ళ్ళ  పూలు కొంగులో   
పొసారు.    నేను జోలె పట్టాను,నాకొంగునిండా పూలు వచ్చాయి. 
                  వెళ్లి కారులో కూర్చున్నాక    కృష్ణ   సీట్ బాక్లో   బాగులు తీసి ఇచ్చిన్ది.  అందులో పొసుకొన్నామ్. ఇవి పూజ చెయ్యడానికి    పనికి రావు అంది  రాణి ."అవును!మా మేడమీద    చిన్న పాప వుంది,   దాన్ని పిలిచి జడకుడతా!    అంది కృష్ణ . 
                 మరినేనేమి చెయ్యను?   అని ప్రశ్న    వచ్చిన్ది. ఈలోపు మా    ఇల్లు   వచ్చిన్ది.   దిగి ఇంట్లోకి వచ్చి    వెంటనే   లల్లీకి     ఫోన్ చేశా "పూలు   తెచ్చాను,  వచ్చి జడ కుత్తించుకో!అని. లల్లీ   పక్కింటి అమ్మాయి. ఒకఘంటకి  వచ్చిన్ది.    ఈలోపున   నేను   చిరిచాప పరిచి   పూలన్నీ    రెండు   పళ్ళాలలో   సర్ది,    సూది దారం    తెచిచి పెట్టుకొని,  మంచిపూలన్నీ ఏరి     వేరు చేశా . లల్లీ నిచూడగానే     నాకు ఏంటో ఉషారు వచ్చిన్ది.  చాలా రోజుల తరవాత    పూల జడ కుట్టే   అవకాశం   వచ్చిందని,   పూలు  వృ దాగా    పోకుండా   ఉపయొగిస్తున్నానని. లల్లీ    వస్తూనే"చాలా  పూలుతెచ్చావే  అమ్మమ్మా!అని ఆపూలని అటు ఇటుకదిపి   ఒక చిన్న గులాబీని చేత్తో పట్టుకు చోస్తొన్ది.  లల్లీ   సవరం,జడగంటలు   ఏమన్నా ఉన్నాయా?    తెస్తావా ?ఇంట   ఆలస్యం   చేసావేమే! అన్నాను.   "నాకు   పూల జడ   వద్దులే అమ్మామ్మా!  ఈరోజుల్లో ఎవ్వరు వేసుకోటంలేదు ."పోనీలే   ఎవరికీ చూపించకు !ఎంచక్కా    ఇంతో  కూర్చో! అ'  లేదులే అమ్మమ్మా!   క్లాసుకి వెళ్ళాలి అని దానికిష్ట మైన     రంగుల్లో  గులాబీలు ఏరుకొని   పట్టుకు పొయిన్ది.   
               ఈపూలేమి చెయ్యను?  ఎదుటి   వాటా   వారి తలుపుతట్టి    ఆవిడని పిలిచి   మీకు పూలంటే ఇష్ట మెనా! అన్నాను.ఆఆ! బెసిన్ల లో నీళ్ళు పోసి    పూలు   అందులో సర్ది    వరండాలో పెడతాను,అన్ది.  పూజ చేసిన  పూలు ఇస్తాను,అలంకరించండి,  తొక్కనియ్యకండి   అని ఒక దోసెడు  పూలు ఆమె కిచ్చాను.   మాక్లీనింగ్    అసిష్టేంట్    లచ్చు జ్ఞాపకం వచ్చిన్ది. అది ఎపువ్వయినా    కొప్పు మీద ఒక సైడుకి     సోగ్గ   పెట్టుకొని    వస్తున్ది. దాన్ని పిలిచి ఇద్దామనుకొన్నా!    ఇంతలో గుర్తుకు వచ్చింది, అది మొన్ననే   షిర్డీ    వెళ్లి తలనీలాలు    సమర్పించి వచ్చిన్ది. 
                         నేను కూడా   ఎదురింటి    ఆవిడ లాగా    పూలు నీళ్ళలో వేసి అలంకరిద్దామనిపించిన్ది.    కాంత్    ఇచ్చిన  గ్లాసు బౌల్ తెచ్చి  ,నీళ్ళు పోసి    పూలు   అందంగా    సర్దాను. అటుఇటు    సర్దడం లో గులాబీలు రేకలు వూడాయి ,కొన్ని చేమంతులు    వంకర టింకరగా   పూ సాయి. వాటిని రేకలు తీసి  టీ వి    పక్క గుండ్రం గా   పరిచి   వేదు  ఇచ్చిన     సరస్వతిని   పెట్టాను .స్టీ లు  ట్రే లో చేమంతి రేకులతో   పువ్వులా    అమర్చి    మధ్య సోకై న     ప్రమిద పెట్టాను .చల్లగానె   ఉంటోంది   వాతావరణం    కనుక రెండు రోజులు   ఈ  పూల   అందాలు   చూడొచ్చు . అప్పుడు   హమ్మయ్య   అనుకోని    అన్నం తిన్నాను.   అసలు   ఇన్ని పూలు తెచ్చుకోవడం ఎందుకు?   మా అత్తగారు    చెప్పిన  సామెత గుర్తుకు   వచ్చిన్ది.  "  ఆశయా   బధ్ధయా   లోకే     కర్మణా    బహు    చింతయా'' అని. అయినా  ఆపూల చందాలు    మీకు     చూపించాలి .ఇవిగొ!

No comments: