Pages

Monday, November 25, 2013

నా తొలి రచన కీ శే జంధ్యాల

                               నా తొలి   రచన       కీ శే   జంధ్యాల
                    *^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^* 

           {శ్రీ జంధ్యాల ఉత్సాహవంతుడైన  యువ రచయిత .    ముఖ్యంగా నాటక రంగం మీద అభిమానం కల వ్యక్తి. దానికి తోడు   మంచి నటుడు కూడా! సారస్వత సేవ అంటే    ఎంతో    ప్రీతి.  "కళాభారతి"  అనే   సంస్థ  కార్యదర్సి. ఈ వర్దిష్ణువు తన తోలి రచనను  గురించి   వ్రాసిన   వ్యాసమిది.  
              ఈవ్యాసం   1971లో     భాషాకుటీరం   ప్రచురించిన "తొలకరి 
జల్లులు "  అనే సంచికనుండి తీసుకోన బడింది . 
                      షాపులో   కూర్చుని వ్రాసుకొంటున్న నేను శబ్దానికి తలెత్తి చూసాను .ఎదురుగా   నా   అభిమాన రచయిత ఆషామాషీ    రావూరు వెంకట సత్యనారాయణ గారు,గురుతుల్యులు   శ్రీ విన్నకోట   రామన్న పంతులు గారు. "నీతో చిన్న పనుండి     వచ్చామోయ్" అన్నారు. ఏమిటన్నాను ఱచనా  శక్తి గల యువ రచయితల లోని   రచనా శక్తిని   వెలికి తీసేందుకు   "తొలకరి జల్లులు  "   పేరుతొ భాషాకుటీరం తరఫున   ఒక  సావనీర్   వెస్తున్నాము     అ న్నారు.నాకు చాలా   ఆనందం   కలిగింది . జాతిని   జాగృతం చేసి   ముందుకు నడిపించగల శక్తి   రచయితల కున్నది. భారత దేశం లో   రచయితలకు    లోటు  లేదు -వారి రచనలను ముద్రించే   పత్రికలకు   లోటు లెదు.కానీ  ఏదో   వ్రాయాలన్న ఉత్సాహాన్ని   అక్షరాల్లో   నింపి  దానిని  ప్రజ    మెచ్చు కొంటుందో    లేదో నాన్న భయంతో ,మెల్లిమెల్లిగా  ధైర్యం   కూడా గట్టుకొని తమ రచనలని ముందుకు నెట్టే యువ రచయితకు   చేయూత నిచ్చి  ,వెన్ను తట్టాలన్న  తలంపు శ్రీ  రావూరు   వారికీ  కలగటం  హర్షించా తగ్గ విషయం .  ఆమాటే  అన్నాను. "నువ్వు కూడా ఓ వ్యాసం   వ్రాయాలోయ్!నాటకాలు అవీ    వ్రాయడానికి   నీకు ఇన్స్పిరేషన్  ఎలా కలిగిందో   ,ఎలా  నీ రచనా  వ్యాసంగాన్ని   ప్రారమ్భించావోవ్రాసి ఇవ్వాలి"అన్నారు.  నేను భయ పడ్డా ను .    తప్పదన్నారు.కానీ    ఇది     కేవలం  యువ రచయితలకి    మాత్రమే నిర్దేశింప  బడినదని  సరెనన్నాను. 
                                  చిన్నతనం నుంచి   నాకు   పు స్తకాలంటే   ప్రాణం. రైల్ ప్రయాణాల  లోను     అక్కడా   నేను    గొడవ చెయ్యకుండా    ఉండటానికి   నాకో పుస్తకం    కొని   పడేసే వారు  అమ్మనాన్న. అది పూర్తయ్యే వరకు     కదిలే వాడిని కాను -పక్కనుంచి పాలకోవావాడు నడిచినా, బిస్కెట్లు    పొట్లాలు కదిలినా   చదవగా చదవగా    నాలో    ఒక   కోర్కె   ఉదయించింది .నేనూ    ఎందుకు   వ్రాయకూడదూ   అని .ఈమాటే   మా   అమ్మతో    అన్నాను.   "నీ  ను   మొహం ,పైత్యం    చేసినట్లుంది ,త్వరగా భోజనం   చేసి  పడుకోమ్మని    సలహా  ఇచ్చింది . నేనూ వ్రాయాలన్న  కోరిక  నానాటికి    ఎక్కువయింది . 
                                  నేను ఫస్ట్   ఫారం చదివే  రోజుల్లో   స్కూల్ లో   వ్యాసరచన పోటీ పెట్టారు .పాల్గొన్నాను. మొదటి బహుమతి వచ్చింది . దానితో  పాటు   నేనూ     వ్రాయగాలనన్న   ధైర్యము    వచ్చిన్ది. నన్ను నేనే   మెచ్చుకొన్నాను. అలా  ప్రతి ఏడూ స్కూల్లో ను,  బయటా జరిగే పోటీల్లోను  పాల్గొని    బహుమతులు   అందుకొన్నాను . ఓసారి   గాంధీ జీ మునిసిపల్ హైస్కూల్ లో కృష్ణా జిల్లా  మొత్తానికి ఏర్పరిచిన పోటీల్లో  దాదాపు  అరవై   మందిలోనూ   నాకు ద్వితీయ బహుమతి    వచ్చింది . మర్నాడు  నాపేరు   మొదటి   సారిగా  పేపర్లో   పడింది . అప్పటి   నా  ఆనందం   వర్ణనా తీతం .తెలిసిన ప్రతి వాడికి   అదం పక్షం   రెండు సార్లయినా    చూపించాను    నా  పెరు.  ఆ  క్షణం   నుంచి నాలో  కథలు   వ్రాయాలన్న కోర్కె   మరింత   బలపడింది . నాకు   బాగాగుర్టు-మొదటి   సారి  ఒకద  వ్రాసాను. ఒరాజుకి    సకల  సంపన్ను డైన ఓకొదుకున్నాదుంఅరో   రాజుకీ    అలాంటి    కూతురే   వున్నది. తప్పదుగా మరి. ఓశుభ ముహూర్తాన ఇద్దరికీ     వివాహం   జరిగిన్ది.  ఇది కధ  . అమ్మకు వినిపించాను. కధలో   మలుపులున్దాలిరా!దీన్నె వడు   కదా అనడు అంది ఽఅ  మాటలు   నా  హృదయం లో   బలం  గా  నాటుకొన్నాయి . కానీ  ఏం లాభం?-నేను    మెలికలు   తిరిగాను తప్ప  నా  కధల్లో  మలుపులు   కుదర లేదు .కొన్నాళ్ళలా   వ్రాసి   వ్రాసి చివరికి ఆనాడు ఆంద్ర ప్రభ "బాల విహారానికి"పంపాను -అచ్చయింది . చాలా  సంబర  పడ్డాను . "మనవాడి కధ   పేపర్లో   పడింది రోయ్ "అనినా వెనకగా  తోటి    విద్యార్ధులు   అనుకోడం  విని    మురిసిపోయాను . ఆంద్ర ప్రభలో   ఓ  ఎనిమిది   కధలు  పడ్డాయ్ . 
                         స్థానిక  నటరాజ కళాసమితి     ఆధ్వర్యాన  శ్రీ   భమిడి పాటి వారి  "కీర్తి శేషులు "నాటకాన్ని మొదటి  సారిగా  చూ సాను. ఆ   నాటకం   నన్ను కదిలించింది . శ్రీ భమిడి పాటి    రాధా కృష్ణని   నా  అభిమాన రచయితగా  భావించాను . ఆయన ప్రతి రచనా   కనీసం  పదిసార్లు చదివి    మననం   చేసుకొన్నాను . నాటకం   ఎలా  వ్రాయాలో   కొంత   బోధ  పడింది . అప్పటినుంచి    నాటకాలు   వ్రాయాలన్న   కోర్కె   కలిగింది .  పి  యూ సి చదివే   రోజుల్లో   మొదటి సారి  గా  "జీవన  జ్యోతి"అనే   నాటకాన్ని   వ్రాసాను. విన్నవాళ్ళు   ఎంతో    మెచ్చుకొన్నారు . మిత్రుడు   సుబ్బరాయ శర్మ    ముందుకు   వచ్చి ప్రదర్సన    భారం   వహించాడు . చూసిన   వాళ్ళు    బాగుందన్నారు . వాళ్ళు   బాగుందని   మెచ్చుకోవడం  నాలో  ఇంకా  వ్రాయాలన్న   కోర్కెను    రెట్టింపు    చేసింది . వరుసగా  "ఆత్మాహుతి""లేత గులాబి"" డా   సదాశివం"" ఎక్ -దిన్- కా సుల్తాన్  "అనే    నాటికలను    వ్రాసాను . "మొగలి ముళ్ళు " అనే   నాటకాన్ని    వ్రాసాను . అందరూ నువ్వు నాటకాలు   బాగా వ్రాయ గలవన్నారు  -మెచ్చుకొన్నారు . 
                       శ్రీ నండూరి      సుబ్బారావు   గారి   ప్రతి నాటికా  రేడియోలో    అతి   శ్రద్ధగా  వినే   వాణ్ణి చిన్నతనం నుంచి . నాలో   రేడియో    నాటకాలు     కూడా    వ్రాయాలన్న  తలంపు   కలిగింది . వ్రాసాను . ఓఅయిదారు   ప్రసారం  అయాయి .
                                     నిజానికి    రచనా     రంగం   లో  సవ్యసాచిలా   విహరించే  సిద్ధ హస్తులైన  రచయితలలో   నేను   ఎన్నో  వంతు? వారు  వ్రాసినన్ని   నాటకాలు   నేను    చూసి    వుండను రంగంలో   రచనా రంగపు    తోలి   మెట్టుకు   పది    ఆమడల   దూరంలో  నేను నిలబడి    వున్నాను .  ఆ తోలి మెట్టును   చేరుకో గలిగితే  నా  కృషి ఫలించినట్లే!నా  జీవితం   ధన్యమైనట్లే ! 
       ఒక మనవి -మీలోని   అతి చిన్న రచయితా కంటే  అనేక  రెట్లు   చిన్న    రచయితని నేను {వయస్సులోనూ రచనలోనుకూడా}మీ  ఆశీర్వచనం కోసం  వినమ్రుడనై    నిల బడ్డాను . 
                             
                                5      

No comments: