పుస్తకాలయం
ఆదివారం మధ్యాహ్నం రెండు మెతుకులు తిని ,ఒక ఒక్క పలుకు వేసుకొని ఎన్ .టి ఆర్ స్టే డియం కి బయలుదేరా . మధ్యాహ్నం టీ టైం దాకా ఖాళీ! స్టేడియం చాలా పెద్దది. పైగా షాపులన్నీ దూరంగా పెట్టారు, కొంచెం గేటు దగ్గిరగా పెడితే బాగుండేది కదా? మరి వారి ఉద్దే శ్యమ్ ఏమిటో తెలియదు. అసలు షాపులు అన్నీ పెట్టారో లేదో తెలియదు అయినా చూసిపోదాం అనివెళ్ళా , ఎదురుగా ఒక యువతి పుస్తకాల సంచి తో వస్తోంది, చూస్తె పలకరిస్తే ఫరవాలేదనిపించింది
"షాపులు పెట్టారామ్మా! అన్నాను. మీరు లక్ష్మిగారాండీ!అంది . కాదమ్మా,అని నా పేరు చెప్పా. "నాపేరు ఫలానా ,నేను మీ బ్లాగ్ చదువుతూ వుంటా ,కామెంట్లు పెట్టడమే బధ్ధకిస్తాను మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగావుంది . యు. ఎస్ లోవుంటానండీ . షాపులు ఉన్నాయండీ ,భోజనం టైం అయిందని వెళ్తున్నా,మళ్ళీవస్తా రేపు అన్నది. మాఇం టికి రామ్మా !అని ఫోన్ నెంబర్ ఇచ్చా. నాసంచీలో "మాటల పందిరి " ఆషామాషీ" వున్నాయి. అవి చూపించా ను. నేను కొనుక్కోవచ్చా అంది .తప్పకుండా అనిపుస్తకాలిచ్చాను.డబ్బులిచ్చి వెళ్ళిపోయింది .ఇదెదొ శుభ సూచకం గా వుంది అనుకొన్నా.
64.కళ లు .కామ్ లో " సప్త పర్ణి "పుస్తకం సమీక్ష చదివాక ఆపుస్తకం కొనాలని చూస్తున్నా అది దొరికితే బాగుండును .
లోపల చాలా షాపులు తెరిచివున్నాయి. కొత్త పుస్తకాలు, బైండు చేసినవి,బంగారు అక్షరాల పేర్లతో మెరిసిపోతున్నాయి . రంగురంగుల బొమ్మలు వేసినవి రండి కొనుక్కెళ్ళన్ది అని పిలుస్తున్నట్లున్నాయి .కొన్ని షాపుల్లో పుస్తకాల బండిల్స్ తెచ్చి సర్దుతున్నారు. మనం చదివి ఎవరికో కావాలంటే ఇస్తే తిరిగిరాని పుస్తకాలు చూస్తె పాత స్నేహితుల్ని చూసినంత సంతోషం .మ ళ్ళీ కొనుక్కోవాలని ఆశ .
లైబ్రరీల గురించిన పుస్తకాలు,సైన్సు బుక్స్,ముచ్చట గొలిపే పిల్లల పుస్తకాలు, విద్యా సంబంధమైన పుస్తకాలు , విశ్వనాథ వారి "వేయిపడగలు" దగ్గరనుంచి పెద్దబాల శిక్ష నుంచివున్నాయి. చలం గారి పుస్తకాలు ఒక షాపు . తెలుగులో జత కలపండి అని స్క్రాబుల్ వచ్చింది . ఈ ఆట విజ్ఞాన దాయకం . భాషాభివృద్ది కలుగ చేస్తుంది . అన్నీ నేమ్మదిగాచూస్తూ వెడుతుంటే "మిసిమి " పత్రిక వారి షాపు కనిపించింది . సప్త పర్ణి రచయిత కాండ్రేగుల నాగేశ్వర రావు గార్ని పుస్తకం కోసం అడిగితె "ఆర్ టీ సి క్రాస్ రోడ్ లో మిసిమి ఆఫీసులో దొరుకుతున్దమ్మా అన్నారు.అక్కడికి వెళ్ళడం కుదరలేదు ఇక్కడ దొరికితే బాగుండును అనుకొన్నా ,దొరికిన్ది. కొనెసుకొన్నా. "వెదకబోయిన తీగ కాలికి దొరికిన్దంటారు "ఇదే!
చినుకు పత్రిక వారి షాపు లో .భి వి గారి పుస్తకము దొరికిన్ది. " ఒకే దెబ్బకు రెండు పిట్టలు " మహా సంతోషంగా ముందుకు నడిచా . క్రియేటివ్ లింక్స్ వారి షాపు లో పాత కొత్తల మేలు కలయిక . అక్కడ స్థానం నరసింహారావు గారిపుస్టకం ఒక సి డి తో దొరికిన్ది. కాసేపు కాసేపు వారితో మాట్లాడి బయటికి వచ్చేసరికి 4గంట లయింది .టైము చూసాక నీరసం వచ్చిన్ది. కి నిగే వారిషాపు కి వెళ్ళ నే లేదు .
మా మహిళా మండలి వాళ్లకి చెప్పాను. మీకందరికీ ఇప్పటికే దొంతర దొంతరలు చీరలు వుండే ఉంటాయ్ ,సంక్రాంతికి అందులో ఓ చీర కట్టేసుకొని సంతృప్తి పడుదురు గాని, ఇక కొత్త చీరలు కొనకుండా ఆ డబ్బులు పెట్టి పుస్తకాలయంలో పుస్తకాలు కొనుక్కోండి అని ,అంతే కాదు కనిపించిన వారికల్లా పుస్తకాలయం తప్పక చూచి పుస్తకాలు కొనండి ఆత్మానందం కలుగుతుంది అని చెపుతున్నాను. తోడూ రమ్మంటే వస్తానని చెపుతున్నా. మీరూ వెళ్ళండి .

No comments:
Post a Comment