లెఖ్ఖ
ఒకాయన ఫష్ట్ తారీఖు జీతం తెచ్చి భార్యని పిలిచి "ఇదుగో ఇంటి ఖర్చులకి ఇరవై వేలు ఇస్తున్నాను,లెఖ్ఖ పెట్టు ." అన్నాడట "అదేమిటండీ మీరు ఇచ్చిన డబ్బు లెఖ్ఖ పెట్టడమేమిటి?ఫరవాలేదులెండి "అని డబ్బు బీరువాలో పెట్టబోయిందిట ,ఆయన అడ్డుపడి "ముందు లెఖ్ఖపెట్తు "అన్నాదు."అబ్బ తరవాత పెడతాలెండి -అంట నమ్మకం లేకుండా వున్నానా మీమీద? అన్ది. "నమ్మకం గిమ్మకం జానతానై ,లెఖ్ఖ అంటే లెఖ్ఖే !"ఏమో నేను సరిగా లెఖ్ఖ పెట్టక పోవచ్చు తక్కువయితే నీకు నష్టం కాదూ !అందుకని నా ఎదుటే లెఖ్ఖ పెట్టు "అన్నాడు ఆవిదలేఖ్ఖపెట్టి సరిగానే వున్నాయి అన్నాక ఆయన ఊపిరి పీల్చుకొన్నాడట . ప్రతినెలా ఇదేతంటూ అన్నదావిద. ఆయన లెఖ్ఖల మాష్టారని వేరే చెప్పఖ్ఖర లెదు.
లెఖ్ఖ అనేది జీవితం లో అవుసరమే! ప్రతి పనికి లెఖ్ఖ అనేది వుంటుంది .లెఖ్ఖ మీద సామెతలు కూడా పుట్టాయి ."లెఖ్ఖ లెకుండా డబ్బు ఖర్చు పెట్టే స్తున్నాడు. లెఖ్ఖా పత్రం లేకుండా అప్పులు ఇవ్వకూడదు ,వేలెడంత వున్నాడో లెదో నాతొ లెఖ్ఖ లేకుండా మాట్లాడుతున్నాడు ,అప్పనంగా డబ్బు వస్తే లెఖ్ఖ పెట్టుకోలేక బోర్లా పడ్డాడట ,లేఖ్ఖలేనంత మంది జనం వచ్చారు.
విద్యా రంగం లో కూడా లేఖ్ఖలకి ఏంటో ప్రాధాన్యం వుంది .లెఖ్ఖలు చెయ్యడం బాగా వస్తే చదువు బాగా వచ్చినట్లే! మార్కులు బాగా వస్తాయి.
లెఖ్ఖల పేపర్లో ఒక్క బిట్ బాగా చేసినా మార్కులు పడతాయని మేష్టార్లు చెపుతూ వుంటారు .లెఖ్ఖలు బాగా చెయ్యాలంటే వేగం గా ఆలోచించ గలగాలి, వేగంగా లెఖ్ఖ చెయ్య గలగాలి. అప్పుడే విజయం .
వడ్రంగి ఒక పని చెయ్యాలంటే కొలబద్దతో అన్గులాలతో లెఖ్ఖ వేసుకొంటే గానీ పని చెయ్యలేడు .తాపీ మేస్త్రి ఇల్లు కట్టాలంటే లేఖ్ఖలేందే పని జరగదు. వ్యాపారికి చెప్పనే అఖ్ఖర లేదు ,లేఖ్ఖలలో ఇంద్ర జాలం చేసి దానం సంపాదించే తెలివి వ్యాపారస్తుడికి వెన్నతో బెట్టిన విద్య. పచారు కోటలో అప్పు పెట్టి సరుకులు తెచ్చుకొంటారు నెల అయాక ఫష్ట్ తారీకున అప్పు తీరుస్తారు.వ్యాపారి మనం తీసుకొన్న వస్తువుల ఖరీదు రోజు పద్దు వ్రాస్తాడు, కానీపడి రోజులయ్యాక ఎంత డబ్బు అయిందో చెప్పవయ్యా అంటే చెప్పదు. తొందరేమున్దండీ! ఫష్ట్ చాలా దూరం ఉందిగా అప్పుడు చెపుతా లెండి, అని దాటేస్తాడు . ఎప్పటి కప్పుడు లెఖ్ఖ చూసి ఎంతయిందో చెపుతే కొనుగోలు దారు ఖంగారు పడిపోతాడు. వస్తువులు అరువు తెచ్చుకోడానికి వెనకాడతాడు వ్యాపారికి నష్టం కదా! అందుకని లేఖ్ఖతెల్చి చెప్పడు.ఇప్పుదు క్రెడిట్ కార్డులు వచ్చాక లెఖ్ఖ అసలు తెలియదు. మాల్ కి ఒక వస్తువు కొనడానికి వెళ్ళడం ,పక్కనున్న పది వస్తువులు చూసి మోహపడి కోనేయ్యడం నెలాఖరుకి బిల్లు వస్తే తల పట్టుకు కూర్చోవడం .లెఖ్ఖలు తెలియని రైతుల్ని,కూలీలను, కూరగాయల వారిని ఎన్నో మోసాలు చేస్తూ వుంటారు ఽన్దుకనె వందదాకా అంకెలు నేర్చుకోవడం, చిన్న కూడికలు,తీసివేతలు నేర్చుకోవడం ,ఉత్తరం ముక్క వ్రాయడం నేర్చుకోవడం ప్రతి వ్యక్తికీ అత్యవసరమ్. "వెంకట్రావుని కూరలు తెచ్చిపెట్టమని డబ్బు ఇస్తే అన్నీ తెచ్చిపెట్టి అనా పైసలతో సహా లఖ్ఖ పెట్టి ఇచ్చాడు ,అని అతని నిజాయితీకి మెచ్చుకొంటాము. కొందరి డబ్బు ఇచ్చి వస్తువు తెమ్మంటే లెఖ్ఖ చెప్పారు సరికదా!చిల్లర వాళ్ళ జేబులోకి వెడుతుంది
చిల్లర శ్రీ మహాలక్ష్మి ,పైసా దాచడం నేర్చుకొంటే పది రూపాయలు వెనకెయ్యడం తెలుస్తున్ది. అంటారు సంసారాల్లో తెల్లారి లేస్తే వెయ్యి ఖర్చులు "సంచీలోంచి రూపాయ తీస్తే సారంగ ధరుడి పావురంలా ఎగిరి పోతుంది అన్నా డొకాయన ఏరోజుకారోజు లెఖ్ఖ వ్రాయడం విసుగే! కానీ అలా చెయ్యడం వలన ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది అవగత మవుతు వుంటుంది, ఖర్చు పెట్టడం లో కొంత నియంత్రణ వస్తున్ది. ఖర్చు తగ్గించుకోవాలంటే కోర్కేలకుపగ్గం వెయ్యాలి. ముగ్గులు పెట్టాలన్నా,చింత గింజల ఆట ఆడాలన్నా, వామనగుంతల ఆట ఆడాలన్నా ,గచ్చకాయలు ఆడాలన్నా లేఖ్ఖరావాల్సిందే !బడికి వెళ్లకపోయినా వీటితో లెఖ్ఖలు వచ్చెవి.
టైలరింగ్ చెయ్యాలన్నా లెఖ్ఖలు రావాలి. దుస్తులు కుట్టాలంటే కాలర్ కొలత చెతిపొడవు, అన్నీ వ్రాసుకోవాలి,లేకపోతె మర్చిపొతారు.
మా మేనత్త బట్టలు విస్త్రీ చెయ్యడానికి ఇచ్చినా లేఖ్కవివరంగా వ్రాసెది. 4ప్రింటెడ్ చీరలు,2 వేంకటగిరి జరీ చీరలు,1 ఆకాశనీలం పట్టుచీర, 1కెంపు రంగు పరికిణీ , 1 నారింజరంగు రెవిక, 1చిలకాకుపచ్చఓణీ ,3 నల్లపాంట్స్ 4 తెల్లపాంట్స్ ,4తెల్లఫుల్ హాండ్స్ షర్టులు ,4ఎమ్మిగనూర్ చెనెతగళ్ళ తువ్వాళ్ళు 1కలంకారీ దుప్పటి,ఒకరాజస్థాన్ ప్రింట్ డబల్ .బెడ్ షీట్ ఇలా వ్రాసెది. ఎందుకె అత్తా ఇంతవ్రాస్తావు? అంటే ఇన్ని బట్టలమీద ఏమి వేసావో గుర్తు ఉండొద్దూ !వ్రాసుకొంటే బట్టలు మారిపోవు,ఈమాత్రం లెఖ్ఖ వ్రాయడానికే బద్ధక మయితే ఎలానేతల్లీ!అనెది.
పెద్దవాళ్ళు లెఖ్ఖల విషయంలో జాగ్రత్తగావుంటే పిల్లలకిలేక్కా డొక్కా వ్రాయడం అలవాతవుతుంది లేఖ్ఖచూసుకొంటూ ఖర్చు పెట్టడం నేర్చుకొంటే కోరికలు వాటంతట అవే తగ్గుతాయి.
మా బంధువు ఒకాయన ఎవస్తువు కొన్న బిల్లు ఇయ్యకపోతే వూరుకొనే వాడు కాదు. తెచ్చిన వస్తువు ఏరోజుకారోజు ఖర్చులు వ్రాసెవాదు. పెళ్లి చేసాడు,ఇల్లు కట్టాడు. ఎవరేనా పెళ్లి చెయ్యడం ఇల్లుకట్టడం తలపెడితే "ఇవిగో!నాదగ్గిర అన్ని లెఖ్ఖలు వున్నాయి,దీన్నిపట్టి ప్లాన్ చేసుకోండి అని ఇచ్చెవాదు. 1980లో ప్లంబెర్ కి ఎంత ఇచ్చాడో లెఖ్ఖ వుండేది,దాన్ని పట్టి కొంత ఎక్కువ వేసి ఇప్పుడు ప్లంబెర్ తో బేరమాడతాడు.
ఆయన వట్టి లెఖ్ఖల మనిషండీ అంటారు. నిజానికి కొందరు జీతాన్ని లెఖ్ఖ ప్రకారం భాగాలు చేసి ఖర్చు పెట్టి నియమ బద్దంగా గడుపుతారు. ఆర్ధిక పరంగా భవిష్యత్తుకు ఘట్టి దారి నిర్మించుకొంటారు.

No comments:
Post a Comment