Pages

Thursday, February 4, 2016

ఓటు వేసా

                                ఓటు  వేసా
       ఇంట్లొ సత్యనారాయణ  వ్రతం   జరుగుతోంది. పంతులుగారు మంత్రాలు చదువుతూ అష్ట దిక్పాలకుల్ని  ఆహ్వానిస్తున్నారు. చెవులు దిబ్బెళ్ళు పడేలా  బయట డప్పుల మోత.ఏతాంబూలం  ఏదే వతకి ఏవేపున పెట్టాలో పంతులుగారు చెప్పేన మాట ఒక్కటి  వినపడటం లేదు.ఇంతలో మరో బాజా!ఏమిటీసంబడం  అంటే  ఎలెక్షన్ల   ప్రచారం అన్నారు.
            మా వారు వూరు వెడుతున్నారు. ఏవూరువెళ్ళినా ఆ  రోజు మధ్యాన్నానికి  భోజనం, రాత్రికి రొట్టెలు ,మధ్యలో తినడానికి ఏమన్నా  డబ్బాలు కట్టి ఇస్తె కానీ గుమ్మం కదలరు.హడావుడిగా  డబ్బాలు సర్దుతున్నా ఇంతలొ తలుకొట్టారెవరో?వెళ్ళి తలుపు తీస్తె  ఎలెక్షన్లలో నిలబడే   కాండిడేటువారితో మరో నలుగురు.పాంప్లెటు చేతిలో పెట్టి "మీ ఓటు మాకేవెయ్యాలి" అంది కాండిడేటు .పక్కనున్న  పెద్ద మనిషి "మాకు ఓటు వేస్తే ఇక మీకే లోటు వుండదు.ఒకవేళ ఏదైనా లోటు కలిగినా .సమస్యలు వచ్చినా మాకు తెలియ చెయ్యండి వెంటనే తీరుస్తాం " అంటూ చిన్న ఊపన్యాసం  ఇచ్చాడు.సరేనండీ అని వాళ్ళని పంపుతుండగా"ఎవరితో ఆకబుర్లు? అని మా ఆయన కేక. ఓటు కోసం వచ్చారండీ! ఎల్లుండేగా!అన్నాను.
               ఎల్లుండే ఓటు వెయ్యాలి, ఎల్లుండే ఓటు వెయ్యాలి అని పది సార్లు వల్లించుకొన్నా!ఎండేక్కక ముందె, సంసారంలో ఈత మొదలెట్టకముందే ఓటు వేసిరావాలి అనుకొని పొద్దున్నె సగం పనులు  ముగించుకొని  కమల కూడా వస్తుందేమో నని వెళ్ళా. కమల తాపీగా  పేపర్ చదువుతూంది. ఓటు వెయ్యవా? ఎందుకెయ్యను? ఎక్కడొ ఏమిటొ  మాకింకా స్లిప్పె రాలేదు అంది. దగ్గరే పార్కు పక్కన వుందిట మా మేనకోడలు చెప్పింది. ఎప్పుడూ కళా మందిర్ లో వేస్తాముగా! ఎమో ఇది దగ్గరని పెట్టరేమో! నేను అక్కడికే వెడుతున్నా అని వచ్చేసా. వీధి గేటు  దగ్గిరికి రాగానే  మా  వాచ్ మాన్ సొమరచక్రవర్తి  సీరియస్ గా ఏవో చిట్టీలు చూస్తున్నవాడల్లా  లేచి నుల్చుని"మీకొసమే వస్తున్నా>రాత్రి ఎలెచ్క్షన్ వాళ్ళు చిట్టీలిచ్చిపొయిన్రు అని నాకు చిన్న పీలిక చేతిలో పెట్టాడు. మా ఇంటి చిరునామాయే వుంది. నా బొమ్మ  నాకె తెలియలేదు. దాన్ని పట్టుకు పార్క్ దాకా వెళ్ళాను.సందది అంతగాలేదు. పక్క సందులొ రొద్దు పక్కన ఒక బల్ల వెసివుంది. దాని చుట్టూ నలుగురు నుంచుని కాగితాలు చూస్తున్నారు. వాళ్ళదగ్గరికి వెళ్ళి నాఓటు ఇక్కడవెయ్యొచ్చా? అని అడిగాను.వాళ్ళు ఆకాగితాలన్నీ  చూసి ఇక్కద మీ నెంబరు  లేదమ్మా!అన్నారు. మరి నీనెక్కడ ఓటు వెయ్యాలి?అని సందిగ్ధం లొ పడ్డా. అక్కడున్న ఒక అయన నా చిట్టీ తీసుకొని సెల్ ఫొన్ లో  ఎవరితో నో మాట్లాడి మీఓటు కళామందిర్ లో వుందిటమ్మా! అక్కడికి వెళ్ళండి అన్నాడు.పార్క్ దగ్గరేమో సరదాగా  వాకింగ్ కి వెళ్ళినట్లు వెళ్ళి ఓటు వేసి వద్దామనుకొన్నా.మళ్ళీ కళామందిర్ కి వెళ్ళాలంటె?ఆటో తప్పదు. ఆటో అతను 40రూపాయలన్నాడు. ఇక్కడేగా 20 ఇస్తానన్నాను,ఓటు వెయ్యడానికి వెడుతున్నారామ్మా!రండి కూర్చొండి అన్నాడు ఓటు మీద గౌరవం వ్యక్త పరుస్తూ.మనసులో సంతోషించా.
                  హుషారుగా కళామందిరంలోకి వెళ్ళ బోతుంటే అక్కడున్న పోలీసాయన  నాచెతిలో చిట్టీ  తీసుకు చూసి బూత్ నెంబర్ తెలుసామ్మా!అన్నాడు,ఆసందులొ నెంబర్ వెస్తారు వేయించుకు రండమ్మా!అన్నాడు. ఆతొళొ వచ్చినా నడక తప్పలా! నెంబర్ వెయించుకు వచ్చాక లోపలికి అనుమతించారు. ఓటు హక్కు వినియోగించుకు వచ్చా!
             డప్పులు మోగించడం, రంగు రంగుల కాగితాలు అచ్చు వేయించడం,ఇల్లిల్లు తిరగదం వీటి మీదున్న శ్రధ్ధ  ఓట్రుకి ఓటు ఎక్కడవెయ్యలో ఆచోతు చెప్పడం,బూత్ నెంబెర్ చిట్తీమీద వెయ్యడం లో వుంటే ఎంత బాగుంటుంది?సీనియర్ మెంబర్లకి, వికలాంగులకి తిరగడం ఎంతకష్టం?
     


No comments: